పోరాటం

14:45 - October 11, 2018

శాంట్రోనీ : జంతు ప్రేమికుల పోరాటం చివరకు ఊబకాయులకు పెద్ద కష్టాన్నే మిగిల్చింది. గత కొన్నేళ్లుగా గాడిదలను టూరిస్టులు వినియోగించడం వల్ల వాటి వెన్నుముక దెబ్బతిని అనారోగ్యం పాలైతున్నాయని జంతు ప్రేమికులు గ్రీకు దేశంలోని శాంట్రోనీ దీవిలో ఆందోళన చేపట్టారు. ఇది కాస్తా అంతర్జాతీయ మీడియా దృష్టికి రావండంతో ఆ దీవిలో ప్రస్తుతం ఆంక్షలు విధించారు. దీవికి వచ్చే పర్యాటకులు 220 పౌండ్లు అంటే 99 కిలోల బరువు కంటే ఎక్కువ ఉంటే స్థానిక గాడిదల మీద ఎక్కించరాదని అక్కడి ప్రభుత్వం హూకూం జారీచేసింది. 

“The holiday season on islands is now a lot longer than it used to be, meaning that the donkeys are pretty much working the whole year round."నిత్యం వందల సంఖ్యలో ఊబకాయ పర్యాటకులు ప్రఖ్యాత క్రూయిజ్ ఓడను ఎక్కేందుకు ఎత్తైన కొండలు ఎక్కి వెళ్లడానికి నడవడం ఇష్టం లేక గాడిదలను ఆశ్రయిస్తున్నారు.

Over 1,000 tourists a day flood Santorini during the peak vacation season between May and October.ఈ నేపథ్యంలో జంతు ప్రేమికులు ఈ ఏడాది జులైలో గాడిదలను అధిరోహించే పర్యాటకులకు వారి బరువుపై ఆంక్షలు విధించాలని ఆందోళన చేపట్టారు. అధికబరువు ఉన్న ఊబకాయులను మోయడం ద్వారా గాడిదల వెన్నుముక విరిగి గాయాలపాలవుతున్నాయని ఆందోళన చేశారు. 
హాలిడే సీజన్ కారణంగా అధిక సంఖ్యలో పర్యాటకులు దీవికి చేరుకోవడం దీనికితోడు ఏ కాలంలోనైనా పర్యాటకులను వారి గమ్యస్థానాలు చేర్చటంలో గాడిదలు ప్రముఖంగా ఉపయోగపడటంతో వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది.  కాబట్టి ఇకపై గ్రీకు దీవులకు వెళ్లే పర్యాటకులు తమ బరువు ఒకసారి చెక్ చేసుకొని ప్రయాణానికి సిధ్దం కావల్సిఉంటుందన్నమాట..!

15:21 - September 26, 2018

తమిళనాడు : కళ్లముందే కట్టుకున్నవాడిని నడిబజారులో కత్తులతో నరికేస్తే? కనని పెంచినవారే తన జీవితాన్ని భుగ్గి చేస్తే? కుల దురహంకారంపై ఢమరుకనాధం వినిపించి గెలుపు గుర్రం ఎక్కి సవారి చేసిన కులదురహంకారాని సవాలు విసిన వీరనారి ఆమె. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని గుండె దిటువు చేసుకుని డప్పు పట్టింది. కులోన్మాదానికి వ్యతిరేకంగా వీధుల్లో తిరుగుతూ డప్పు మోగించింది. ఇప్పుడు కులాంతర వివాహాలు చేసుకునేవారికి బాసటగా నిలుస్తోంది. ఇటీవల ‘పరువు’కు బలైన అమృతవర్షిణిని కలిసి, ఆమెలో స్థయిర్యాన్ని నింపిన ఉద్యమకారిణి తమిళనాడుకు చెందినకౌసల్యా శంకర్‌ జీవితంలో ఎన్నో మలుపులు..గెలుపులు..
 
పెద్దలను ఎదిరించి కులాలకు అతీతంగా ప్రేమించినవాడి చేయిపట్టుకుని నడిచిన  జంటపై కొడవళ్లు, గొడ్డళ్లలతో పట్టపగలు దాడి చేసి తాను ప్రేమించి వివాహం చేసుకున్న శంకర్‌ను అందరూ చూస్తుండగానే, నిర్దాక్షిణ్యంగా నరికేశారు. ఆ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తర్వాత ప్రపంచమంతా ప్రసారమయ్యాయి.  శంకర్‌ ప్రాణం గాలిలో కలిసిపోయింది. కౌసల్య కూలిపోయింది. కుదేలైపోయింది. ప్రేమించిన సహచరుడు క్షణాల్లో తన ఎదుటే రక్తం ముద్దగా జీవం లేకుండా పడి ఉన్న దృశ్యం కౌసల్యను పిచ్చిదాన్ని చేసేసాయి. సత్యం జీర్ణించుకోలేకపోయింది. దానికి కారణం కన్నతల్లిదండ్రులేనని తెలిసి తల్లడిల్లిపోయింది. ఆత్మహత్యా ప్రయత్నం చేసి బతికిబైటపడ్డ కౌసల్య న్యాయ పోరాటం చేసి వారికి శిక్ష పడేట్టు చేయడంలో విజయం సాధించింది.తన లాంటి స్థితి మరొకరికి రాకూడదనుకుంది. కులాంతర వివాహాలు చేసుకునే యువతీయువకులకు బాసటగా నిలవాలనే నిర్ణయంతో ‘యాక్టివిజాన్ని’ ఆయుధంగా చేసుకుంది. దళితుల సంప్రదాయ డప్పు ‘పరై’ వాద్యాన్ని నేర్చుకుని, పరువు హత్యలను నిరసిస్తూ దాన్ని మోగించింది. అలుపెరుగని పోరాటం మొదలెట్టింది. ఇటీవల మిర్యాలగూడలో జరిగిన అమృత భర్త ప్రణయ్‌ పరువుహత్యను తీవ్రంగా ఖండించింది. అమృతది, తనది ఒకేలాంటి ఘటనలని, ఆమెకు అండగా ఉంటానని అమృతను స్వయంగా కలిసి గుండె ధైర్యాన్నిచ్చింది. అమృతకే కాదు అలాంటి ఎన్నో జంటలకు కౌసల్య ఇప్పుడు దళిత ‘పరై’. 

21:43 - August 18, 2018

ఢిల్లీ : కేంద్రం చేసిన అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తామని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి అన్నారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతల సమావేశంలో రాహుల్‌గాంధీ భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించారని.. క్షేత్రస్థాయిలో పర్యటించి బీజేపీ అవినీతిని ప్రజలకు వివరిస్తామన్నారు. 

08:23 - August 8, 2018

 ప్రకాశం : రాష్ట్రాన్ని మోసం చేసిన ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం  చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే వరకు రాజీలేని పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. కేసుల మాఫీ కోసం బీజేపీకి కొమ్ము కాస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న వైసీపీని ప్రజలు ఎక్కడికక్కడ ఎండగట్టాలని ప్రకాశం జిల్లా చీరాలలో చంద్రబాబు పిలుపు ఇచ్చారు. 
ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటించారు. చీరాలలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్నారు. చేనేత ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించారు. మగ్గంపై కూర్చుని వస్త్రాలు నేశారు. చేనేత కార్మికుల కోసం ఆధునిక వర్క్‌ షెడ్లను ప్రారంభించారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చేనేత  వస్త్రాల తయారీలో నైపుణ్యం ప్రదర్శించిన కార్మికులను చంద్రబాబు అవార్డులు అందచేశారు. 
కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డ చంద్రబాబు 
చీరాలలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ సభలో ప్రసంగించిన చంద్రబాబు... కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. విభజనతో నష్టపోయిన ఏపీని అన్ని విధాల ఆదుకుంటారన్న నమ్మకంతో గత ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తే... చివరికి మొండిచేయి చూపించారని విమర్శించారు. ప్రజల కోసం కేంద్రంతో చేస్తున్న ధర్మ పోరాటంలో అంతిమ విజయం తమదేనని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 
దూబగంటలో ట్రిపుల్‌ ఐటీ నిర్మాణానికి శంకుస్థాపన 
అంతకు ముందుకు కనిగిరి నియోజకవర్గ పరిధిలోని పామూరు మండలం దూబగంటలో ట్రిపుల్‌ ఐటీ నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కడప కేంద్రంగా పనిచేస్తున్న రాజీవ్‌గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుంబంధంగా ఈ ట్రిపుల్‌ ఐటీ పని చేస్తుంది. పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన గ్రామీణ విద్యార్థులకు ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు కేటాయిస్తారు. 
రాష్ట్రాన్ని విజ్ఞాన ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దుతాం : చంద్రబాబు 
దూబగంట ట్రిపుల్‌ ఐటీకి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తూ... రాష్ట్రాన్ని విజ్ఞాన ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దుతామని చెప్పారు. చంద్రబాబు ప్రకాశం జిల్లా పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 

13:06 - August 7, 2018

ఢిల్లీ : విశాఖ రైల్వే జోన్‌ సాధించేవరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు టీడీపీ ఎంపీ తోట నరసింహం. ఈ మేరకు టీడీపీ ఎంపీలు, శాసన సభ, మండలిసభ్యులు, మంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్‌ కోరుతూ ఇవాళ కేంద్ర రైల్వే మంత్రి పియూశ్‌ గోయల్‌ను కలవనున్నారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన 350 కోట్లు త్వరగా విడుదల చేయాలని ఆర్థిక శాఖ కార్యదర్శిని కోరనున్నారు. 

 

21:43 - July 21, 2018

ఢిల్లీ : ప్రత్యేక హోదాపై పోరాటం చేసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. కేంద్రంపై తాము పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినా... తమ సమస్యలు దేశం దృష్టికి తీసుకువచ్చామని టీడీపీ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు పార్లమెంట్‌ వెలుపలా, లోపలా పోరాటాలు ఉధృతం చేయాలని చంద్రబాబు ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చమని డిమాండ్‌ చేస్తే... తనపైనే విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అని చంద్రబాబు ప్రశ్నించారు. 

కేంద్రంపై తాము పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చిన పార్టీలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్‌లో మోదీ సర్కార్‌కు సంఖ్యాబలం ఉందని తెలిసినా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు విస్మరించడంతో అవిశ్వాస తీర్మానం పెట్టామని ఢిల్లీలో చంద్రబాబు తెలిపారు. అవిశ్వాస తీర్మానం సందర్బంగా మద్దతిచ్చిన పార్టీలు.. భవిష్యత్‌లోనూ ప్రజలకు న్యాయం చేసేందుకు సహకరిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 15 ఏళ్ల తర్వాత కేంద్రంపై తామే అవిశ్వాస తీర్మానం పెట్టామన్నారు. మెజారిటీకి, నైతికతకు మధ్య పోరాటం జరుగుతుందని... ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన కేంద్రం... ఆ పని చేయలేకపోయిందని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. 

రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నాలుగేళ్లుగా ప్రధాని మోదీని కలిసి విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ఓపిక నశించాకే మంత్రివర్గం నుంచి తప్పుకున్నామని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్ధికసంఘం చెప్పిందనడం అవాస్తవమని... ఆర్ధికసంఘం సభ్యుడు టి.గోవిందరావు అలాంటి సిఫార్సు చేయలేదన్నారు. 

రాష్ట్ర విభజనతో నష్టపోయామని.. ఆదుకోమని అడిగితే తమ పైనే విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఎవరికీ ప్రత్యేక హోదా లేదని చెబుతున్న కేంద్రం.. ఇప్పటికీ 11 రాష్ట్రాలకు రాయితీలు ఇస్తున్నారన్నారు. తాను యూ టర్న్‌ తీసుకున్నానని.. వైసీపీ ట్రాప్‌లో పడ్డారని మోదీ అనడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. విభజన తర్వాత రాష్ట్ర సమస్యలు పరిష్కరించడంతో కేసీఆర్‌ పరిణితితో వ్యవహరించిందని నన్ను విమర్శించడం ప్రధాని స్థాయికి తగదన్నారు. తాను ఇప్పుడున్న వారికంటే ముందుగానే సీఎం అయ్యానని... రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే.. విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అని చంద్రబాబు ప్రశ్నించారు. 

ప్రధాని మోదీ ఇచ్చిన సమాధానంపై టీడీపీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర సమస్యలపై టీడీపీ అవిశ్వాసం పెడితే... ఆ అంశాలపై చర్చించకుండా రాజకీయాలు మాట్లాడారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పక్కదారి పట్టించారంటున్నారు. తమ హక్కులను సాధించుకోవడం పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎంపీలు అన్నారు. 

కేంద్రంపై తాము పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో టీడీపీ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించింది. ఢిల్లీలో ఎంపీలతో భేటీ అయిన చంద్రబాబు పార్లమెంట్‌లో ఏ విధంగా పోరాటం చేయాలో దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్‌ ఆవరణలో ప్లకార్డులతో ఆందోళనలు చేపట్టాలని సూచించారు. కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోరాటం చేయాలని చంద్రబాబు సూచించారని ఎంపీలంటున్నారు. తాము రాజీనామా చేయబోమని... సభలోనే ఉండి రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతామంటున్నారు. మొత్తానికి ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు ప్రత్యక్ష కార్యాచరణకు దిగబోతున్నారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన మోసాన్ని ఎండగడుతూ పార్లమెంట్‌ లోపల, వెలుపల ఆందోళన చేయనున్నారు. 

18:58 - July 21, 2018

ఢిల్లీ : అవిశ్వాస తీర్మానంపై మోదీ సమాధానాన్ని నిరసిస్తూ టీడీపీ పోరాటానికి సిద్ధమైంది. టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ఢిల్లీలో ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు.. భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించారు. ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు. పార్లమెంట్‌ లోపల, వెలుపల పోరాటం చేయాలని నిర్ణయించారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. కేంద్రాన్ని ప్రశ్నించాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. 

 

21:27 - July 7, 2018

విశాఖ : వచ్చే ఎన్నికల్లో తాను అధికారంలోకి రాకపోయినా... టీడీపీ దోపిడీపై పోరాడుతానని స్పష్టం చేశారు జనసేనాని. ఉత్తరాంధ్ర పోరాటయాత్ర ముగింపు సందర్భంగా టీడీపీ పాలనపై విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని గాలికొదిలేసిన సర్కార్‌... గిరిజన, దళితుల భూములను విచ్చలవిడిగా లాక్కుంటుందన్నారు. టీడీపీ దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి కార్యకర్తలంతా పోరాడాలని జనసేనాని పిలుపునిచ్చారు. 

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పోరాటయాత్ర ముగింపు సందర్బంగా విశాఖ ఆర్కే బీచ్‌లో నిరసన కవాతు నిర్వహించారు. ఈ కవాతులో అభిమానులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఈ కవాతు కొనసాగింది. ప్రజా సమస్యలపై గళమెత్తడంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు పవన్‌కల్యాణ్‌. రాష్ట్రంలో టీడీపీ దోపిడీ పెరిగిపోయిందన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రం అభివృద్ది చెందాలంటే అనుభవం ఉన్న నేత కావాలని చంద్రబాబుకు మద్దతిస్తే.. అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఎలాంటి ప్రయోజనం లేకపోతే చంద్రబాబు ఏ పని చేయరని పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. తమ ప్రయోజనాల కోసం ఉత్తరాంధ్ర అడ్డంగా దోచేస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి తన మద్దతు ఎంత ఉపయోగపడిందో... వచ్చే ఎన్నికల్లో అంతే బలమైన ప్రత్యర్ధిని అని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. 

విశాఖ రైల్వే జోన్‌ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. నలుగురు తలుచుకుంటే... విశాఖ రైల్వేజోన్‌ సాధ్యమన్నారు. చంద్రబాబు, లోకేశ్‌, జగన్‌తో కలిసి రైళ్లను స్తంభింపజేసేందుకు తాను సిద్ధమని.. వాళ్లు సిద్దమా ? అని సవాల్‌ విసిరారు. చంద్రబాబుకు ప్రధాని మోదీ అంటే భయమని.. అందుకే ప్రత్యేకహోదాపై గట్టిగా పోరాటం చేయడం లేదన్నారు. 

తనకు డబ్బుపై ఆశలేదని... స్వచ్చమైన రాజకీయాలు చేసేందుకు సిద్దంగా ఉన్నానన్నారు పవన్‌కల్యాణ్‌. ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూశానని.. ఎన్నికల్లో గెలవకపోయినా... ప్రభుత్వ దోపిడీలపై పోరాడుతానన్నారు. చంద్రబాబు దళిత తేజం అని చెప్పి.. దళితుల భూములనే లాక్కుంటున్నారన్నారు. టీడీపీ నేతల అవినీతి, అక్రమాలపై జనసేన సైనికుల్లా పోరాడుతుందన్నారు జనసేనాని.  ఉత్తరాంధ్ర పర్యటనలో టీడీపీపై విమర్శలు చేస్తున్న పవన్‌కల్యాణ్‌... పోరాటయాత్ర ముగింపు యాత్రలో స్వరం పెంచారు. టీడీపీ దోపిడీకి ప్రజలంతా అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. 

10:32 - June 29, 2018

కడప : జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలంటూ కోసం అఖిలపక్షాలు పోరాటాన్ని ఉధృతం చేశాయి. ఇందులో  భాగంగా ఇవాళ కడపజిల్లా బంద్‌కు పిలుపునిచ్చాయి. తెల్లవారుజాము నుంచే కార్యకర్తలు  రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ముందు ఆందోళనకారుల  బైఠాయించారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ బంద్‌కు సీపీఎం, సీపీఐ, జనసేన, వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీలు మద్దతు పలికాయి.  

09:01 - June 24, 2018

Pages

Don't Miss

Subscribe to RSS - పోరాటం