పోలింగ్

21:52 - August 29, 2017
13:08 - August 29, 2017

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం వర్షం పడడంతో మందకొడిగా పోలింగ్ ప్రారంభమైంది. కొద్దిసేపటి అనంతరం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. జగన్నాథపురంలో ఏఏస్పీ దామోదర్ ఓటింగ్..భద్రత ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. చిన్న ఘటన ఎక్కడా కూడా లేదని, క్యాడెంట్ ప్రచారం నిర్వహిస్తున్నారంటూ వివాదం నెలకొందని, ఏటిమొగలో ఎక్కడా ఎలాంటి ఘర్షణలు తలెత్తలేదన్నారు. 

12:14 - August 29, 2017

కాకినాడ : కార్పొరేషన్ తమదేనని, ఓటర్లు టిడిపికి పట్టం కడుతారని ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు. మంగళవారం కార్పొరేషన్ ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది. ప్రశాంతంగా కొనసాగుతున్నా అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులు పోలింగ్ బూత్ లను పరిశీలిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే కొండబాబుతో టెన్ టివి ముచ్చటించింది. కొంత మంది రెబల్స్ ఉంటే వారిని బరి నుండి తప్పించే ప్రయత్నం చేయడం జరిగిందని, బీజేపీ వారికి కూడా అవకాశం ఇచ్చామన్నారు. వారి గెలుపుకు ప్రయత్నించామన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:11 - August 29, 2017

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. చెదురుముదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే కొండబాబు సోదరుడు సత్యనారాయణతో వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఘర్షణ తలెత్తడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. 20వ వార్డులో ఇద్దరు అభ్యర్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు 12 శాతం పోలింగ్ నమోదైంది. 39వ వార్డులో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో భారీగా ఓట్లు గల్లంతయ్యాయి. జాబితాలో తమ పేర్లు లేవంటూ ఓటర్లు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఎన్నికల అధికారులు..నేతలను స్థానికులు నిలదీశారు. 

10:47 - August 29, 2017

కాకినాడ : కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 7గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది. ఈవీఎంలలో నోటా ఆప్షన్ లేకపోవడంపై ఓటర్లు తీవ్ర అభ్యంతరం తెలియచేస్తున్నారు. స్థానిక ఎన్నికలు కావడంతో నోటా ఆప్షన్ పెట్టలేదని అధికారులు పేర్కొన్నారు.

ఉదయం వర్షం పడుతుండడంతో మందకొడిగా పోలింగ్ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఉదయం 9గంటలకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలుతున్నారు. మున్సిపల్ స్కూల్ వద్ద ఓటర్లు బారులు తీరి నిలుచున్నారు. బూత్ నెంబర్ 36, 37లలో భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశామని టెన్ టివితో డీఎస్పీ పేర్కొన్నారు. మరోవైపు విద్యుత్ కోతతో పోలింగ్ కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వెబ్ కాస్టింగ్ కూడా నిలిచిపోయింది. 

07:15 - August 29, 2017

తూర్పుగోదావరి : మరో గంటలో కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభంకానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్లు ప్రశాంతంగా ఓటేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌... సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అయితే కాకినాడ ఓటరు ఎవరిపై కరుణ చూపుతారన్నదరి ఉత్కంఠ రేపుతోంది.

కాకినాడ నగరపాలక సంస్థలో మొత్తం 50 వార్డులు ఉన్నాయి. ఇందులో రెండు వార్డులపై వివాదాలు కొనసాగుతుండడంతో 48 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాకినాడ మేయర్‌ పీఠం కోసం టీడీపీ, బీజేపీ మిత్రపక్షం పోటీపడుతుండగా... ప్రతిపక్ష వైసీపీ కూడా దీనిపై కన్నేసింది. కాకినాడలో మొత్తం 2 లక్షల 30వేల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

48 వార్డులకుగాను 196 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ విధించారు. భద్రతా దళాలు భారీగా మోహరించాయి. కాకినాడలో 28 అత్యంత సమస్యాత్మక, మరో 52 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఆ పోలింగ్‌ కేంద్రాల దగ్గర అదనపు భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 3025మంది సిబ్బంది పాల్గొంటున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. ఇరుపార్టీల మధ్య హోరాహోరీగా పోటీ ఉండడంతో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ను నియమించారు.

కాకినాడ ఎన్నికల ఫలితాలు సెప్టెంబర్‌ 1న వెలువడనున్నాయి. గెలుపుపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గెలుపు తమదంటే తమదేనని తేల్చి చెబుతున్నాయి. మరి కాకినాడ ఓటరు ఎవరిపై కరుణ చూపుతాడో వేచి చూడాలంటే సెప్టెంబర్‌ 1 వరకు వేచి చూడాలి. కాకినాడ కార్పేషన్‌ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో పోలింగ్‌ కూడా ప్రారంభంకానుంది. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

21:42 - August 24, 2017

కర్నూలు : ఉప ఎన్నిక పూర్తయినా ఇంకా నంద్యాలలో పొలిటికల్‌ వార్‌ కొనసాగుతూనే ఉంది.. నంద్యాలలోని సూర‌జ్‌గ్రాండ్ స‌మీపంలోని టీడీపీ, వైసీపీ వర్గాలమధ్య ఘర్షణ స్థానికుల్ని హడలెత్తించింది.. గురువారం వైసీపీ కార్యకర్త బాషా కుటుంబాన్ని పరామర్శించేందుకు శిల్పా చక్రపాణి రెడ్డి వారి ఇంటికి వెళ్లారు.. తిరిగి వస్తుండగా.. టీడీపీ నేత అభిరుచి మధు వాహనం ఎదురుపడింది.. ఇరుకు రోడ్డు కావడంతో రెండు వాహనాలు ఆగిపోయాయి.వెనక్కితీసేందుకు ఒప్పుకోని ఇద్దరు నేతలు.. పరస్పరం వాగ్వాదానికి దిగారు.. దీంతో ఆగ్రహించిన శిల్పా అనుచరులు... మధు కారుపై దాడి చేశారు.. రాళ్లు రువ్వి, కారు అద్దాలు ధ్వంసం చేశారు.. వాహనంలోనుంచి మధును బయటకు లాక్కువచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మధును కాపాడేందుకు ఆయన గన్‌మెన్‌ వెంటనే గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు.. ఇదే సమయంలో ప్రాణరక్షణ కోసం మధు అక్కడే ఉన్న కొబ్బరి బోండాల దుకాణంలోనుంచి ఓ కత్తి తీసుకునిప్రత్యర్థులపై దూసుకు వెళ్లాడు. ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుతున్న సమయంలో పోలీసులు రంగప్రవేశం చేశారు.. రెండు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

చక్రపాణిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
తర్వాత నంద్యాల రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన మధు... శిల్పా చక్రపాణి రెడ్డి, ఆయన అనుచరులు తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు.. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు శిల్పా చక్రపాణి రెడ్డితోపాటు మరో ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు..శిల్పా చక్రపాణి రెడ్డి పక్కా ప్లాన్‌తో తనపై ఎటాక్ చేయించారని మధు ఆరోపించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పారు..మధు ఆరోపణలపై వైసీపీ నేత వైసీపీ నేత శ్రీకాంత్‌ రెడ్డి సీరియస్‌గా స్పందించారు... ఎన్నికల కోడ్ వచ్చాక.. లైసెన్స్‌ ఉన్న తుపాకులన్నీ పోలీస్‌ స్టేషన్‌లో డిపాజిట్‌ చేయాలన్న ఆదేశాలుంటే.. మధు వర్గీయుల దగ్గర గన్‌ ఎలా వచ్చిందని ప్రశ్నించారు.. పైగా 4 వాహనాల్లో కత్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. నంద్యాల ఉపఎన్నికలో టీడీపీ తరపున భూమా బ్రహ్మానంద రెడ్డి, వైసీపీ నుంచి శిల్పా మోహన్‌ రెడ్డి పోటీ చేశారు.. ఈ నెల 28న ఈ ఎన్నిక ఫలితం తేలనుంది.. తాజా ఘటన నేపథ్యంలో.. కౌంటింగ్‌ తర్వాత.. ఇరు వర్గాల మధ్య ఘర్షణాత్మక వైఖరి మరే స్థాయిలో ఉంటుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ఇరు వర్గాలను గట్టిగా నియంత్రించాలని కోరుతున్నారు. 

21:36 - August 23, 2017

కర్నూలు : నంద్యాల ఉపఎన్నికకు పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. నంద్యాల నియోజక వర్గంలో మొత్తం 2 లక్షల 19 వేల 108 మంది ఓటర్లున్నారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌తో కలిపి మొత్తంగా 15మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. పోలింగ్‌ కోసం ఎన్నికల కమిషన్‌ 255 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. సాయంత్రం 5 గంటల వరకు 77.66 శాతం పోలింగ్ నమోదైంది.

పోలింగ్ కేంద్రాల ముందు బారులు
ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల ముందు బారులుతీరారు. మరోవైపు ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌క్యాస్టింగ్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో మూడు డ్రోన్‌ కెమెరాల ద్వారా అధికారులు ఓటింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. నంద్యాలలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. 72 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్ పోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షించాయి.వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి నంద్యాలోని సంజీవనగర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటువేశారు. శిల్పాతోపాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా కలిసివచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు.

అఖిలప్రియ సోదరి నాగమౌనిక పోలింగ్‌ బూత్‌లో హల్‌చల్
ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరి నాగమౌనిక పోలింగ్‌ బూత్‌లో హల్‌చల్‌ చేశారు. పోలింగ్‌ ఏజెంట్ల ఓటరు కార్డులు తీసుకుని వివరాలు చెప్పాలని అడిగారు... దీంతో వైసీపీ కార్యకర్తలు నాగ మౌనికపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మకూరు బస్టాండ్‌ దగ్గర భూమా, శిల్ప కుటుంబాలు గొడవపడ్డాయి.. రెండువర్గాలమధ్య వాగ్వాదం జరిగింది..నంద్యాల బైపోల్‌లో అక్కడక్కడా ఘర్షణలు చెలరేగాయి. గాంధీనగర్‌లోని ఓ పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నేతలు డబ్బులు పంచుతున్నారని వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ నిరసనను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.. పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు..ఎన్నికల విధుల్లో గుండెపోటుతో మృతిచెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి ఈసీ పదిలక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది..ఓటింగ్‌ మొత్తం పూర్తయ్యాక ఈవీఎం యంత్రాలను అధికారులు జాగ్రత్తగా ప్యాక్‌ చేశారు.. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలో వీటిని జాగ్రత్తగా భద్రపరిచారు.. ఈ నెల 28న కౌంటింగ్‌ జరగనుంది.

19:43 - August 23, 2017

నంద్యాల ఉపఎన్నిక ఒక ప్రత్యేక సందర్బాంలో జరిగిందని, ఈ ఎన్నికలకు బీజేపీ, జనసేన దురంగా ఉందని, రాయలసీమలలో టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి ఎలా ఉందో అనే అంశంతో ఈ ఎన్నిక జరిగనట్టు తెలుస్తోందని విశ్లేషకులు లక్ష్మీనారాయణ అన్నారు. 1952 తర్వాత అత్యధికంగా పోలింగ్ నమోద అయిందని, 13వేళ ఇల్లు, 30 సంవత్సరాల ట్రాఫిక్ ను సులభంగా చేశామని, అలాగే శిల్పామోషన్ రెడ్డి పై వ్యతిరేకతతో ఓటింగ్ ఇంత పెరగడానికి కారమణమని టీడీపీ నేత దినకర్ అన్నారు. ఎన్నికల్లో ఆశవాహుల్లో ఉంటారని, తమ నాయకుడు లక్ష యాభై వేల మందని మ్యాన్ టూ మ్యాన్ కలిశారని, టీడీపీ మూడున్నర సంవత్సరాల్లో చేసిన పనిని ప్రజలకు వివరించామని వైసీపీ నేత రాఘవరెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

18:37 - August 23, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - పోలింగ్