పోలీసుల

20:18 - August 12, 2017

మెదక్ : అమరుల స్ఫూర్తి యాత్రకు వరుసగా రెండోరోజు పోలీసులు అడ్డు తగిలారు. హైదరాబాద్‌ నుంచి యాత్రకు బయలుదేరిన తెలంగాణ జేఏసీ నేతల్ని తుప్రాన్‌ మండలం అల్లాపూర్‌దగ్గర పోలీసులు ఆపేశారు.. టోల్‌గేట్‌ దగ్గర కోదండరాం టీంను అరెస్ట్ చేసి పలు పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు.. కోదండరాంను కౌడిపల్లి పీఎస్‌కు పంపారు.. అరెస్ట్ విషయం తెలుసుకున్న జేఏసీ కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌ముందు ఆందోళనకు దిగారు.స్ఫూర్తియాత్రకు ముందు... కోదండరాం.. నిజమాబాద్ జిల్లా పరిస్థితులపై మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి మార్గాన్ని అన్వేషించడం కోసమే అమరుల స్ఫూర్తి యాత్ర చేపట్టామని తెలిపారు. యాత్ర ద్వారా ప్రజలను చైతన్యం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. అమరుల స్ఫూర్తి యత్రకు పోలీసులు అనుమతించలేదని.. అందుకే హాల్ మీటింగ్ నిర్వహించాలని తీర్మానించామని ప్రకటించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశామని చెప్పారు.తెలంగాణ ప్రజల్లో చైతన్యం పెంచేందుకు జేఏసీ స్ఫూర్తియాత్ర చేపట్టాలని రెండురోజులుగా ప్రయత్నిస్తోంది. శుక్రవారం కామారెడ్డి జిల్లాకు బయలుదేరిన జేఏసీ నేతల్ని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆపేశారు.. ఆ తర్వాత అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌కు పంపారు.. అరెస్టులకు భయపడమన్న జేఏసీ నేతలు... శనివారం మళ్లీ యాత్రకు వెళతామని ప్రకటించారు. ఈ సమాచారంతో శనివారం నిజామాబాద్‌కు వెళ్లే ప్రతి మార్గంలో తనిఖీలుచేసిన పోలీసులు... మళ్లీ జేఏసీ నేతల్ని అదుపులోకి తీసుకొని.. మళ్లీ హైదరాబాద్ తిప్పిపంపారు.

18:09 - August 12, 2017

గద్వాల : గద్వాల పట్టణంలో అపార్ట్‌మెంట్‌లో బెట్టింగ్‌ ఆడుతున్న స్థావరాలపై పోలీసులు దాడి చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మూడు రాష్ట్రాలకు చెందిన ఏజెంట్‌ల గురించిన సమాచారాన్ని నిందితుల నుండి రాబట్టినట్టు పోలీసులు తెలిపారు. బెట్టింగ్‌ కు పాల్పడుతున్న వారందరినీ త్వరలో అరెస్ట్‌ చేస్తామని పోలీసులు తెలిపారు. వీరి నుండి 11వేల నగదు, 26 సెల్‌ఫోన్‌లు, 50 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

18:59 - August 11, 2017

హైదరాబాద్ : నిరుద్యోగ యువత ఆదుకునేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణ సిటీ పోలీసు యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా జాబ్ కనెక్ట్ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారు. నార్త్ జోన్, సౌత్ జోన్, సెంట్రల్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ ఐదు జోన్లలోని అన్ని పీఎస్‌ల పరిధిలో ఓ ప్రణాళిక ప్రకారం జాబ్ కనెక్ట్ వాహనం సంచరిస్తుంది. నిరుద్యోగ యువతకు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ జాబ్ కనెక్ట్ వాహనం ముఖ్య ఉద్దేశం. పదవ తరగతి పాసైనా కాకపోయిన, ఇంటర్, డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్, ఎంబిఎ, ఎంసీఏ, ఐటి సెక్టార్స్, ఫైనాన్సియల్ గ్రాడ్యుయేషన్, బిజినెస్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ సెక్టార్లలో విద్యను అభ్యసించి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు జాబ్ కనెక్ట్ వాహనం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. ఇంటివద్దకు వచ్చే జాబ్ కనెక్ట్ వాహనం ప్రైవేటు సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను వారికి అందిస్తూ అనుసంధానం చేస్తుంది. ఇంటర్వ్యూలో ఒకవేళ జాబ్ రాకపోయినా ఏ కారణాల వల్ల ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారో.. ఆ అంశంపై ఉచితంగా శిక్షణను కూడా ఇస్తుంది.

సిటీవాసులు హర్షంజాబ్ కనెక్ట్ వాహనంలో యువత ఇచ్చే బయోడేటాలను సేకరించడంతో పాటు.. పూర్తి సమాచారం డాటాబేస్‌లో నిక్షిప్తం చేసేందుకు టెక్నికల్ టీంతో పాటు.. సిస్టమ్ అనాలసిస్ టీం సభ్యులు అందుబాటులో ఉంటారు. ఇప్పటికే వేల సంఖ్యలో నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. జాబ్ కనెక్ట్ వాహనం ఏ విధంగా పనిచేస్తుందనే పూర్తి వివరాలను కూడా హ్యాక్ ఐ యాప్‌ ద్వారా అందరికి అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ సిటీ పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల సిటీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు మంచి భవిష్యత్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. 

15:20 - August 8, 2017

హైదరాబాద్ : తనపై తను కాల్పులు జరిపించుకున్న విక్రమ్ గౌడ్ ను విచారించడానికి కోర్టు అంగీకరించింది. కోర్టు విక్రమ్ గౌడ్ ఒక్ రోజు పోలీసు కస్టడీ అనుమతి ఇచ్చింది. పోలీసులు విక్రమ్ తో పాటు మరో ముగ్గురు నిందితులను విచారించనుంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12:24 - August 3, 2017

హైదరాబాద్ : ప్రగతి భవన్ ముందు తమ డిమాండ్ల సాధనకు ఆందోళనకు దిగిన ఈయూ హెల్త్ ఎంప్లాయిస్ వార్తాను కవర్ చేయడానికి వెళ్లిన టెన్ టివి ప్రతినిధి రాధికతో ఏసీపీ వెంకటేశ్వర్లు దురుసుగా ప్రవర్తించాడు. మహిళ ప్రతినిధి అని చూడకుండా ప్రక్కకు నెట్టాడు. ఎవడైనా ఆడపిల్లను ఎడిపిస్తే లాగులో ఉచ్చపోసుకోవాలే అన్నా సీఎం కేసీఆర్ పోలీసులే మహిళతలో దురుసుగా ప్రవర్తించడంపై ఏ సమాధానం చెబుతారో చూడాలి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

11:18 - August 3, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంలో రోజురోజుకి పోలీసుల దౌర్జన్యకాండ పెరుగుతోంది. మొన్న నేరెళ్ల బాధితులను మూడు రోజులు అన్యాయంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి వారిని పనిచేయడానికి వీలులేని విధంగా కొట్టిన సంఘటన మరిచిపోక ముందే తాజాగా ప్రగతి భవన్ ముందు మహిళలపై మగ పోలీసులు దౌర్జన్యంగా మహిళలను ఇష్టమోచ్చిన చోట పట్టుకుని వ్యాన్ లోకి ఎక్కించారు. 

19:08 - July 30, 2017

గుంటూరు :  పట్టాపురంలోని నార్త్‌ క్లబ్‌పై అర్బన్‌ ఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.. ఈ సోదాల్లో పేకాట ఆడుతున్న 38మందిని అరెస్ట్ చేశారు.. వీరిదగ్గరనుంచి మూడు లక్షల యాభైరెండువేల రూపాయల్ని స్వాధీనం చేసుకున్నారు.. చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

06:56 - July 24, 2017

శ్రీకాకుళం : నిత్యం పెరిగిపోతున్న క్రైంరేట్‌తో శాంతిభద్రతల నిర్వహణ పోలీస్‌లకు సవాల్‌గా మారింది. క్షణం తీరిక లేకుండా ఏదో ఒక కేసుపనిలో హడావిడి పడే పోలీసన్నలకు శ్రీకాకుళం పోలీస్‌పెద్దలు ఉపశమనం కల్పించారు. వీక్లీఆఫ్‌లు ఇస్తూ.. కొత్త పద్ధతిని విజయవంతంగా అమలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పెరిగిపోతున్న క్రైంరేట్‌ను తగ్గించడానికి జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మ వినూత్న పంథాను అనుసరించారు. పోలీసుల సేవలు ప్రజలకు మరింత చేరువేయ్యేలా పలు కార్యక్రమాలను రూపొందించారు. దీన్లో భాగంగా విపరీతమైన పని ఒత్తిడి ఎదుర్కొంటున్న జిల్లా పోలీసులకు ఉపశమనం కలిగించే విధంగా వీక్లీ ఆఫ్ లను ఇస్తూ .. కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మొదటగా ఆర్మడ్ రిజర్వ్ పోలీసులకు ఈ వారాంతపు సెలవులు వర్తింపజేస్తున్నారు. తరువాత క్రమంగా అన్ని విభాగాల పోలీసులకు ఈ విధానాన్ని వర్తింపజేయనున్నారు. ప్రతీ పోలీసు నెలలో నాలుగు రోజులు సెలవులు వినియోగించుకునేలా అవకాశం కల్పిస్తున్నామని, వారి వ్యక్తిగత జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ఎస్పి అంటున్నారు.

పని భారాన్ని తగ్గించేవిధంగా
మరోవైపు పోలీసుల పై పని భారాన్ని తగ్గించేవిధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. మొబైల్ యాప్ ద్వారా ప్రజలు పోలీసుశాఖతో మమేకమయ్యే నూతన విధానాన్ని ఎస్పి ప్రారంభించారు. ఇటీవల జిల్లాలో పెరిగిపోతున్న దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త యాప్‌ను ఉపయోగిస్తున్నారు. యాప్ లో రిజిస్టర్ చేసుకున్న ప్రజలు.. ఇంటిని వదలి బయట ప్రాంతాలకు వెళ్ళే సమయం లో ఈ యాప్ లో ఆ వివరాలు ఉంచితే కెమెరాలతో వారి ఇళ్లపై నిఘా పెట్టె విధంగా ఏర్పాటు చేశారు. మొత్తానికి జిల్లా పోలీస్ బాస్ తీసుకున్న నిర్ణయాలు.. అటు జిల్లా పోలీస్ సిబ్బంది లోనూ.. ప్రజలలోనూ ఆనందం నింపుతున్నాయి. ఈ నూతన విధానాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే.. జిల్లాలో క్రైం రేట్ కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు.  

09:13 - July 20, 2017

పశ్చిమ గోదావరి : జిల్లా తుందుర్రులో పోలీసులను భారీగా మోహరించారు. పోలీసులను ఆక్వాఫుడ్ పార్క్ పోరాట సమితి నాయకులను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఆరేటి వాసు, సత్యవతి, సత్యనారాయణ ఉన్నారు. ఆక్వాఫుడ్ పార్క్ కు మిషనరీ తరలించేందుకే అరెస్ట్ చేస్తున్నారంటూ స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంసాలల బేతపూడి, జొన్నల గురువు, తుందుర్రులో గ్రామస్థులు ఆందోళనలు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

20:13 - July 10, 2017

మహబూబ్ నగర్ : పోలీసు శాఖపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి. పోలీసులకు కొత్త వాహనాలు ఇస్తే ఆఫీసర్లు కొట్టేస్తారని.. అందుకే పోలీసు వాహనాలపై స్టేషన్‌ పేర్లతో స్టిక్కర్లు అతికించి పంపించామన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో అదనపు ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవంలో నాయిని ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - పోలీసుల