ప్రకాశం

21:26 - February 18, 2018

ప్రకాశం : ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సవాల్‌పై వైసీపీ అధ్యక్షుడు జగన్‌ సానుకూలంగా స్పందించారు. ప్రకాశం జిల్లా కందుకూరు ప్రజా సంకల్ప యాత్ర సభలో అవిశ్వాసానికి సిద్ధమన్నారు. టీడీపీ అవిశ్వాసం పెట్టినా మద్దతు ఇస్తామన్నారు. చంద్రబాబును ఒప్పించాలని పవన్‌ను జగన్‌ కోరారు. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్‌ 6న వైసీపీ ఎంపీలు రాజీనాలు చేస్తారని చెప్పిన జగన్‌.. ఇందుకు టీడీపీ కూడా సిద్ధంగా ఉందా.. అని ప్రశ్నించారు. ఏపీకి కేంద్రం ఇచ్చింది ఎంత.. రాష్ట్రం తీసుకున్నదెంత అనే అంశంపై నిజానిజాలను నిగ్గు తేల్చే ఉద్దేశంలో పవన్‌ కల్యాణ్‌ ఏర్పాటు చేసిన సంయుక్త నిజనిర్ధారణ కమిటీ కోడిగుడ్డుపై ఈకలు పీకే చందంగా ఉందని జగన్‌ వ్యాఖ్యానించారుప్రత్యేక హోదా ఇస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందన్న వాస్తవాన్ని అందరూ గ్రహించాలని జగన్‌ కోరారు. 

17:02 - February 18, 2018

ప్రకాశం : అవిశ్వాసం పెట్టడానికి మేం సిద్ధమని వైసీపీ అధినేత జగన్ మోహన్ స్పష్టం చేశారు.  4 ఏళ్ల పాటు బీజేపీతో చంద్రబాబు నడుస్తున్నా కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని జగన్ ఆరోపించారు. అయినా చంద్రబాబు కేంద్రాన్ని పొగుడుతారని జగన్ విమర్శించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:47 - February 17, 2018

ప్రకాశం : పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డిని కలిశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్‌ జగన్‌ వలేటివారి పాలెం మండలం పొలినేనిపాలెంకు చేరుకున్నారు. దీంతో అక్కడి పొగాకు రైతులు జగన్‌ను కలిశారు. ఎకరాకు 70 వేలకు మించి ఖర్చవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతు కష్టాల నుండి గట్టెక్కాలంటే ఉద్యమాలు తప్పవన్నారు జగన్‌. ప్రభుత్వం దిగివచ్చేవరకు పొగాకు గోడౌన్ల వద్ద రైతులు ధర్నాలు చేయాలని జగన్‌ సూచించారు. 

 

18:41 - February 15, 2018

ప్రకాశం : 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వైసీపీ అధినేత జగన్‌ ఇప్పుడు రాజీనామాలంటూ మాయమాటలు చెబుతున్నారని ఆరోపించారు ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులు దామచర్ల జనార్దనరావు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై పార్టీలకతీతంగా పోరాడదామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు.

20:07 - February 1, 2018

ప్రకాశం : కష్టపడి తల్లిదండ్రులు చదివించిన దానికి ఉద్యోగం సాధించినప్పుడే నిజమైన సార్ధకతని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ అన్నారు. ప్రకాశం జిల్లా చీరాల సెయింట్‌ ఆన్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏపీ స్టేట్‌ స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పోరేషన్‌ ఆధ్వర్యంలో మోగా జాబ్‌ మేళాను ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ ప్రారంభించారు. ఈ మేళాలో 1100కు పైగా ఉద్యోగాలు కల్పించడానికి.. 18కార్పోరేట్‌ సంస్థలు పాల్గొన్నాయి. దాదాపు 2వేల నాలుగువందల మంది  జాబ్‌ మేళాకి హాజరైనారు.

 

19:30 - January 30, 2018

ప్రకాశం : కాల్‌మనీ మరోసారి బుసలుకొట్టింది. ప్రకాశం జిల్లా కందుకూరులోని వడ్డీ వ్యాపారికి ఇళ్లు తనఖా పెట్టి 7 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. రెండేళ్లుగా రోజుకు 7 వందలు చొప్పున చెల్లిస్తున్నారు. ఐతే ఎంతకూ అప్పు తీరక పోవడంతో.... ఆ ఇంటిని బ్యాంకులో తనఖా  పెట్టి ఋణం తీసుకుని మొత్తం చెల్లిస్తామన్నారు. తనఖా పెట్టుకున్న కాల్‌మనీ కేటుగాడు బ్యాంకు నుంచి వచ్చిన రుణం మొత్తాన్ని కూడా దిగ మింగాడు. ఇదేంటని బాధితులు ప్రశ్నిస్తే  ...తాము టీడీపీకి చెందిన వారమని బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను ఆశ్రయించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

07:35 - January 20, 2018

ప్రకాశం/నెల్లూరు : ప్రకాశం జిల్లా కందుకూరు మండలం కంచరగుంట గ్రామ పంచాయితీలో అగ్రవర్ణాలు దళితులను గ్రామంలోకి అడుగుపెట్టనివ్వడంలేదు.గ్రామంలో బొడ్డురాయిని ఏర్పాటు చేసినందుకు తమను గ్రామంలోకి అనుమతించడంలేదని దళితులంటున్నారు. స్కూలుకు కూడా వెళ్లకనీయకుండా పిల్లలను అగ్రవర్ణాల వాళ్లు అడ్డుకుంటున్నారని చెప్పారు. అటు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తీపనూరులో కుల వివక్ష రాజుకుంది. దళితులపై అగ్రవర్ణాల ఆధిపత్యం చెలాయిస్తుండటంతో దళితులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తీపనూరులో 25 దళిత కుటుంబాలు, 150 అగ్ర వర్ణాల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే దళితులను ఆలయంలోకి రానివ్వకుండా అగ్రకులస్తులు అడ్డుపడ్డారు. ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన దళితులపై దాడి చేశారు. దీంతో దళితులు ఏఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈనెల 30న ఆలయ ప్రవేశం కల్పిస్తామని ఏఎస్పీ హామీ ఇచ్చినట్లు సమాచారం. 

19:19 - January 19, 2018
12:28 - January 19, 2018

ప్రకాశం : కందుకూరు మండలం కంచరగుంట గ్రామ పంచాయతీలో దళితులపై వివక్షపై అగ్రవర్ణాలు స్పందించాయి. టెన్ టివితో వారు మాట్లాడారు. గ్రామంలో 10-11 మంది చనిపోయారని దీనితో సిద్ధాంతిని సంప్రదిస్తే గ్రామంలో బొడ్డు రాయి ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగిందన్నారు. తాము బొడ్డు రాయి ఏర్పాటు చేసుకుని దళితుల కోసం ఒక రోడ్డు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మంచి జరిగితే..ఇటువైపు ప్రయాణించవచ్చని..చెడు జరిగితే మరోవైపు గుండా వెళ్లాలని పేర్కొనడం జరిగిందన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:46 - January 17, 2018

ప్రకాశం : జిల్లాలోని కొత్తపట్నంలో ఎడ్ల పందాలు ఘనంగా జరిగాయి. మూడేళ్లుగా సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుండి నాటుబండి లాగుడు పోటీలకు మొత్తం 15 ఎడ్లజతలు వచ్చాయి. ఎడ్ల బల ప్రదర్శనను తిలకించేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

Pages

Don't Miss

Subscribe to RSS - ప్రకాశం