ప్రజాప్రతినిధులు

12:32 - August 10, 2018

శ్రీకాకుళం : సిక్కోలు రిమ్స్ ఆసుపత్రికి మాయరోగం ఆవహించింది. కోట్లాది రూపాయలు నిధులు ఖర్చుపెడుతున్నా.. బాధ్యతాయుతమైన సేవలు కరువవుతున్నాయి. వైద్యుల ఇష్టారాజ్యం.. సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల అలసత్వంతో ... సిక్కోలు పెద్దాసుపత్రికి నిర్లక్ష్యపు జబ్బు పడుతోంది. ఇటీవల ఇంజక్షన్ వికటించి ముగ్గురు మృతిచెందగా.. మరో పదిహేడు మంది పరిస్థితి విషమంగా మారడం ఈ పరిస్థితులకు అద్దం పడుతోంది.
నిధులు ఫుల్...సేవలు నిల్
శ్రీకాకుళంలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్ ఆసుపత్రి ఇది.. దాదాపు జిల్లాలోని ముప్పై ఎనిమిది మండలాల్లోని రోగులకు పెద్ద దిక్కుగా మారిన ఈ ఆసుపత్రికి నిలువునా నిర్లక్ష్యపు జబ్బు చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఇంజక్షన్ వికటించి ముగ్గురు మృతి చెందడంతో పాటు, మరో పదిహేడు మంది ప్రాణాల మీదకు రావడానికి కారణం వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమేనన్న ఆరోపణలున్నాయి. 
రిమ్స్ కు వందల కోట్ల బడ్జెట్ కేటాయింపులు 
వందలాది మంది వైద్యులు, సిబ్బంది విధులు నిర్వర్తించే రిమ్స్ ఆసుపత్రికి వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారు. ఆసుపత్రి భవనాలు సైతం కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. అయినప్పటికీ.. జిల్లాలో ఉన్న ఏకైక ఈ ధర్మాసుపత్రిలో బాధ్యతాయుత సేవలు కరువుతున్నాయి. ఆసుపత్రిలో చేరుతున్న రోగులకు సరైన సేవలు అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వైద్య పరీక్షలు, స్కానింగ్ లు, ఇతర రిపోర్టులు అవసరమైనప్పుడు బయట ప్రయివేటు లేబొరేటరీలపై ఆధారపడాల్సివస్తోందని బాధితులు వాపోతున్నారు. వీటికి తోడు.. వైద్యులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదని రోగులు చెబుతున్నారు. నర్సుల పరిస్థితీ అంతే.  రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణం అంతా అపరిశుభ్రంగా తయారవుతున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యాడని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
నీరుగారిపోతోన్న రిమ్స్ లక్ష్యం  
అయితే లక్షలాదిమంది జిల్లా వాసులకు పెద్ద దిక్కుగా ఉన్న ఈ ఆసుపత్రి మరింత భరోసా కల్పించేలా రోగులకు సేవలందించాలని స్థానికులు కోరుతున్నారు. రిమ్స్ లక్ష్యం ఇలాంటి పరిణామాలతో నీరుగారిపోతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపట్ల  ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

 

16:38 - June 8, 2018

కొమురం భీం : సోనాపూర్‌లో ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి ఉనికిని ప్రమాదంలోకి నెడుతుంది సింగరేణి సంస్థ. నష్ట పరిహారం ఇవ్వకుండా ఆదివాసీల భూములను ప్రజాప్రతినిధులు, అధికారులు సింగరేణి సంస్థకు దౌర్జన్యంగా కట్టబెట్టారు. ఆదివాసీలకు వచ్చిన నష్టపరిహారాన్ని తమ బ్యాంక్ అకౌంట్లలో వేసుకున్న ప్రజాప్రతినిధులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందని ఎవ్వరి దగ్గరికి వెళ్ళిన పట్టించుకోవటం లేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

10:13 - January 21, 2018

విజయవాడ : ఒక సంవత్సరంలో ఎన్నికలు..దీనితో అన్ని పార్టీలు అధికారంలోకి రావాలని వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అందులో భాగంగా పలు హామీలు గుప్పిస్తున్నారు. ఇక అధికార పలు వరాలు గుప్పిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు పార్టీ అధిష్టానం దిశా నిర్దేశం చేస్తోంది. ఏపీలో టిడిపి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. పార్టీ పటిష్టం..ప్రభుత్వానికి చెందిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని టిడిపి భావిస్తోంది. అందులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు నివాసం పక్కనే ఉన్న గ్రీవెన్స్ సెల్స్ లో ఆదివారం టిడిపి వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పల్లె పల్లెకు టిడిపి..ఇలాంటి నిర్వహించిన కార్యక్రమాలపై బాబు వివరించే అవకాశం ఉంది. ఇందులో ప్రజాప్రతినిధులకు గ్రేడింగ్ ఇస్తారని తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

07:34 - January 5, 2018

ఇసుక తరలింపును అడ్డుకున్నందుకు ఓ వీఆర్ఏను కిరాతకంగా హతమార్చారు. పిట్లం మండలం కంబాపూర్ శివారులోని కాకివాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న వీఆర్ఏ సాయిలు రాత్రి సమయంలో అక్కడకు చేరుకున్నాడు. సాయిలు అక్కడే నిలబడి ఇసుక మాఫియా ముఠాని అడ్డుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సాయిలుపై కోపంతో ఊగిపోయిన మాఫియా అతడిని ట్రాకర్ట్‌తో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీఆర్‌ఏ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ అంశంపై టెన్ టివి చర్చలో వీరయ్య (విశ్లేషకులు), సత్యనారాయణగుప్త (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:21 - December 15, 2017
14:49 - November 30, 2017

మహిళల పట్ల కొందరు నాయకులు..కొందరు ప్రజాప్రతినిధులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సాధారణంగా మారిపోయాయి. ఇప్పుడు మరింత నిస్సిగ్గుగా మహిళలపై అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరు ప్రజాప్రతినిధులా ? రాజ్యాంగపరంగా పాలన చేసే వారా ? నాయకులేనా ? ప్రశ్నించకోక తప్పదు. సమాజంలో సగభాగం ఉండడమే కాకుండా అన్ని రంగాల్లో పురుషుల కంటే ఎక్కువ ప్రతిభ కనబరుస్తున్న మహిళలను చులకగనా..అవమానకరంగా...మాట్లాడడం ఎలా చూడాలి ?

దిగజారుడు వ్యాఖ్యలతో మహిళా లోకాన్ని అవమానపరుస్తున్న నాయకులు..నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? ఈ అంశాలపై టెన్ టివి మానవి 'వేదిక' చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఇందిరా శోభన్ (టి.కాంగ్రెస్), అనురాధ (ఐఎఫ్ టియు స్టేట్ జాయింట్ సెక్రటరీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:12 - November 25, 2017

హైదరాబాద్ : భాగ్యనగరంలో ఈ నెల 29 నుండి అందుబాటులోకి రానున్న మెట్రో రైలుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 28 న ప్రధానమంత్రి మోదీ లాంఛనంగా మెట్రోను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ప్రారంభమైన మరుసటి రోజు నుండే ఉదయం 6 గంటల నుండి రాత్రి పది గంటల వరకు మెట్రో అందుబాటులో ఉండనుందన్నారు మంత్రి కేటీఆర్‌. నాగోల్‌ నుండి మియాపూర్‌ వరకు 30 కిలోమీటర్ల మేర మెట్రో అందుబాటులోకి రానుంది. ప్రధాని మెట్రో ప్రారంభోత్సవం చేయనున్నందున ఇవాళ ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు మెట్రో పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మెట్రో స్మార్ట్‌ కార్డ్‌ను ప్రారంభించారు. ఈ కార్డ్‌ ప్రస్తుతానికి మెట్రోలో మాత్రమే అందుబాటులో ఉండనుందని, భవిష్యత్‌లో అన్ని వాహనాలకు అనుసంధానం చేస్తామని తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌
ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ను ఎల్‌ అండ్ టీ కంపెనీకి మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేట్‌ అండ్‌ పబ్లిక్‌ పార్టనర్‌ షిప్‌ మోడ్‌లో అతిపెద్ద ప్రాజెక్టుగా మెట్రో రైల్‌ నిలిచిందన్నారు. మెట్రో ప్రారంభోత్సవానికి కావలసిన అన్ని పనులు పూర్తి చేశామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కార్మికుల కఠోరశ్రమకు ఫలితంగా హైదరాబాద్‌ మెట్రో సగర్వంగా ప్రస్థానం ప్రారంభించబోతోందన్నారు. మెట్రోను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు మంత్రి. ప్రజల భాగస్వామ్యంతో ప్రజల మద్దతుతో మెట్రోను ప్రారంభిస్తున్నామన్నారు. ప్రస్తుతం 57 రైళ్లు కొరియన్‌ కంపెనీ నుండి ఈ రైళ్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఒక్కో రైళ్లో 1000 మంది వరకు ప్రయాణించవచ్చన్నారు. గ్రేటర్‌లో మొత్తం 24 స్టేషన్లు ప్రారంభించామన్నారు. మెట్రో కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న గ్రేటర్‌ వాసుల కల ఇంకో మూడు రోజుల్లో నెరవేరనుంది. 

16:44 - August 26, 2017

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు.. రాష్ట్రంలో భూసర్వే, రైతు సమాఖ్య ఏర్పాటుపై చర్చించారు.. క్షేత్ర స్థాయిలో భూసర్వే అమలుపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు.. సర్వేలో ప్రత్యక్షంగా పాల్గొని ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూసర్వే చేయాలని సర్కారు తీర్మానించింది.. ఈ ఏర్పాట్లు, సర్వే వివరాలను కేసీఆర్‌ నేతలకు వివరించారు..

08:45 - August 20, 2017

గుంటూరు : ఏపీ పాలన హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలివచ్చి ఏడాది అవుతోంది. తాత్కాలికంగా సచివాలయం, అసెంబ్లీ భవనాలు నిర్మించారు. విజయవాడ, గుంటూరుల్లో విభాగాధిపతుల కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అమరావతికి తరలివచ్చినా వసతి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టిన ప్రభుత్వం... ఇప్పుడు వీరందరికి ఫ్లాట్ల నిర్మాణం కోసం టెండర్లు ఆహ్వానించింది.

కోట్లాది రూపాయలు ఖర్చు
మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల బసకోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. శాశ్వత నిర్మాణాలు చేపడితే ఈ ఖర్చును తగ్గించుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఈ దిశగా ముందడుగు వేసింది. ఫ్లాట్ల నిర్మాణ పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి, సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులకు అపార్ట్‌మెంట్లు నిర్మిస్తారు. జీ ప్లస్‌ 12 పద్ధతిలో వీటి నిర్మాణం చేపడతారు. హోదాను బట్టి ఫ్లాట్లు కేటాయిస్తారు. ఈనెల 25 నుంచి వచ్చే నెల 16 వరకు బిడ్లు స్వీకరిస్తారు. సెప్టెంబర్‌ 30న విజయదశమి నాడు నిర్మాణ పనులు ప్రారంభించాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన పాలనా నగరంలోనే వీటిని నిర్మిస్తారు.

12 టవర్లలో ఫ్లాట్లు నిర్మిణం
పరిపాలనా నగరంలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి నివాసం సమీపంలోనే ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులకు అపార్ట్‌మెంట్లు నిర్మాణం చేపట్టనున్నారు. ప్రజా ప్రతినిధులకు ఒక్కో ఫ్లాటు 3,550 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే విధంగా 12 టవర్లలో ఫ్లాట్లు నిర్మిస్తారు. ఇందు కోసం 386 కోట్లు వ్యయం చేస్తారు. అఖిల భారత సర్వీసు అధికారుల కోసం ఒక్కో ఫ్లాటు 3,550 అడుగుల విస్తీర్ణం ఉండేలా ఆరు టవర్లు నిర్మిస్తారు. ఇందు కోసం 167 కోట్లు ఖర్చు చేస్తారు. ప్రజా ప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారులకు ఒక్కో అంతస్థులో రెండే ఫ్లాట్లు ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. టైప్‌ వన్‌ గెజిటెడ్‌ అధికారులకు 1800 అడుగులు, టైప్‌ టూ గెజిటెడ్‌ అధికారులకు 1500 చదరపు అడుగులు, ఉద్యోగులకు 1200 చదరపు అడుగుల విస్తీర్ణయంలో ఫ్లాట్లు నిర్మిస్తారు. ఈ మూడు కేటగిరీలకు ఒక్కో టవర్‌లో ఆరు అంతస్థులు ఉండే విధంగా 27 టవర్లు కడతారు. నాల్గవ తరగతి ఉద్యోగులకు 900 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక్కో టవర్‌లో ఎనిమిది అంతస్థులు ఉండే విధంగా ఆరు టవర్లు నిర్మిస్తారు. అమరావతిలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల ఫ్లాట్ల నిర్మాణం కోసం టెంటర్లు పిలవడంతో వీరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి
మరోవైపు అమరావతిలో స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి కూడా సీఆర్‌డీఏ టెండర్లు ఆహ్వానించింది. ఏడు ఎకరాల్లో ఎనిమిది హోటళ్లు నిర్మిస్తారు. ఫైవ్‌ స్టార్‌, ఫోర్‌ స్టార్‌ హోటళ్లు రెండేసి వంతున, నాలుగు త్రీ స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. ఈనెల 22 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు బిడ్లు స్వీకరిస్తారు. కొత్త నిర్మాణాలతో రాజధాని అమరావతికి ఒక స్వరూపం తీసుకురాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 

10:24 - July 20, 2017

ప్రజా స్వామ్యమా ? ధన స్వామ్యమా ?
మాకు జీతాలు పెంచాలి...ఇచ్చే జీతాలు సరిపోవడం లేదు...వెంటనే పెంచేయాలి..ఏమంటారు ? చాలా కష్టపడుతున్నాం..అర్థం చేసుకోండి.. మేమేం అడుక్కోవడం లేదు..అందరూ జీతాలు పెంచాలని అడుగుతున్నప్పుడు మేము కూడా అడుగుతాం..ఇదంతా...ప్రజల ఓట్లతో గెలుపొందిన ప్రజాప్రతినిధుల డిమాండ్....జీతాల పెంపును మాత్రం వామపక్ష ప్రజాప్రతినిధులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు..

 

జీతాలు పెంచాలన్న ఎంపీ...
పార్లమెంట్ సభ్యుల జీతాలు పెంచాలని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ చేసిన డిమాండ్ తో ప్రజాప్రతినిధుల జీతాలపై చర్చ ప్రారంభమైంది. వారికేం తక్కువ...అన్ని సౌకర్యాలుండగా ఇంకా జీతాలు పెంచడం ఎందుకు ? అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. ఇదిలా ఉండగానే కరవు కోరల్లో చిక్కుకున్న తమిళనాడులో ప్రజాప్రతినిధుల జీతాలు పెంపుపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు జీవితాలే సమస్యగా మారితే మీకు జీతాలు సమస్యగా మారాయా ? అంటూ కామన్ మెన్ గుస్సా చేస్తున్నాడు. ఇది ఓటు స్వామ్యమా ? లేక నోటు స్వామ్యమా ? అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రజా సమస్యలు పట్టవు..
అయ్యా..బాబు..మాకు ఓటు వేయండి..మీ సమస్యలు పరిష్కరిస్తాం...అని చెప్పిన ప్రజాప్రతినిధుల్లో కొంతమంది ప్రజా సమస్యలపై మాట్లాడడం లేదు. ఓటు వేసిన అనంతరం ప్రజలను పట్టించుకోని ప్రజాప్రతినిధులు ఎంతో మంది. ఓటు వేశాక మమ్మల్ని పట్టించుకోని మీకు ఇంతింత జీతాలు అవసరమా అని జనాలు కడిగిపారేస్తున్నారు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారిలో కొంతమంది తమ ఆస్తులను కూడబెట్టుకోవడంలో ముందుంటారన్న విమర్శలున్నాయి. వారు..వారి బంధువులు..మిత్రుల్లో భారీ మార్పులు చూస్తుంటాం. కానీ సదరు నాయకులను ఎన్నుకున్న ప్రజానీకంలో మాత్రం ఎటువంటి మార్పులు ఉండవు.

రోడ్డెక్కుతున్న రైతులు..కార్మికులు..
ప్రస్తుతం దేశంలో ఎలాంటి పరిస్థితి నెలకొందో అందిరికీ తెలిసిందే. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వివిధ రంగాలకు చెందిన వారు రోడ్డెక్కుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని..రుణమాఫీ చేయాలని..నష్టపరిహారం ఇప్పించాలంటూ రైతులు రోడ్డెక్కుతున్నారు. ప్రకృతి ప్రకోపంతో రైతన్న వెన్ను విరిగిపోతుంటే ప్రభుత్వం గానీ, మంత్రులుగానీ, ఎమ్మెల్యేలు గానీ.. మీనమేషాలు లెక్కించారే గానీ... వారిని ఆదుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కార్మికులు..ఉద్యోగులు..ఇలా ఎంతో మంది వివిధ రంగాల్లో ఉన్న వారు తమ జీతాల సమస్యలపై ఎన్నో సంవత్సరాల నుండి పోరాటం చేస్తూనే ఉన్నారు. వివిధ వర్గాలకు జీతాలు పెంచినా అవి ఇవ్వడంలో మాత్రం పాలకులు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఇతరులపై విమర్శలు చేసుకునే ప్రజాప్రతినిధులు తమ జీతభత్యాల పెంపు విషయంలో మాత్రంలో ఏకమవుతారు.

ఇక్కడ ఓ విషయం చెప్పాలి..కొంతమంది ప్రజాప్రతినిధులు జీతం తీసుకోకుండా పాలన చేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీతం వద్దని చెప్పారు. కానీ రాజ్యాంగ బద్ధంగా తప్పనిసరిగా జీతం తీసుకోవాలి కాబట్టి కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నారు. ప్రస్తుత త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ జీతం తీసుకుంటారు. కానీ ఆ జీతాన్ని పేదల కోసం ఖర్చు చేస్తారు. రాష్ట్రానికి సారథ్యం వహిస్తున్న ఆయనకు సొంత ఇల్లు..వాహనం లేదు.

Pages

Don't Miss

Subscribe to RSS - ప్రజాప్రతినిధులు