ప్రధాని

15:16 - June 17, 2018

ఢిల్లీ : నీతి ఆయోగ్‌ పాలక మండలి భేటీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రసంగంలో అసత్యాలు వల్లెవేశారని బీజేపీ ఎంపీ జీవీల్‌ నరసింహారావు విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై రెండు నెలులుగా ఓ ఒక్క అధికారి కానీ, మంత్రికానీ అడగకపోవడాన్ని జీవీఎల్‌ తప్పుపట్టారు. కనీసం లేఖలు కూడా రాకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర సమస్యల పరిష్కారాన్ని గాలికొదిలేసి.. కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని జీవీఎల్‌ నరసింహారావు మండిపడ్డారు. 

15:06 - June 17, 2018

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరుగుతున్న నీతి ఆయోగ్‌ పాలకమండలి భేటీలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడ్డారు. అక్షరక్రమంలో ముందుగా ప్రసంగించిన చంద్రబాబు... విభజన సమస్యలతో సతమతమవుతున్న ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. ఏకపక్షంగా రాష్ట్ర విభజన జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా కావాలని పార్లమెంటు సాక్షిగా బీజేపీ కోరిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు నిధులు ఇవ్వాలన్నారు. ఏపీ ఎదుర్కొంటున్న రెవన్యూలోటు భర్తీకి ఇచ్చిన హామీని విస్మరించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నీతి ఆయోగ్‌ పాలకమండలి వేదికగా ఎండగట్టారు. జీఎస్టీ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని విమర్శించారు. జీఎస్టీతో స్థానికంగా పన్నులు విధించే వెసులుబాటు లేకండా పోయిన అంశాన్ని నీతి ఆయోగ్‌ పాలకమండలి దృష్టికి తెచ్చారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరత సమస్యలను కేంద్ర పరిష్కరించలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నీతి ఆయోగ్‌ పాలక మండలి భేటీకి సమన్వయకర్తంగా వ్యవహరిస్తున్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌.. ఏపీ సీఎం బాబు ప్రసంగం ఏడో నిమిషంలోనే అడ్డుకున్నారు. కేటాయించిన సమయం అయిపోందని రాజ్‌నాథ్‌ గుర్తు చేశారు. దీనిపై బాబు స్పందిస్తూ.. ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితల నేపథ్యంలో ఎక్కువ సమయం కావాలని కోరిన చంద్రబాబు... దాదాపు 20 నిమిషాల పాటు ప్రసంగించారు. 

21:21 - June 16, 2018

ఢిల్లీ : రేపు ఉదయం నీతి అయోగ్ 4వ పాలక మండలి సమావేశం జరగనుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. గతేడాది చేసిన అభివృద్ధి, భవిష్యత్‌లో చేపట్టాల్సిన అభివృద్ధిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు 15వ ఆర్ధిక సంఘం సిఫార్సులు, జీఎస్టీతో రాష్ట్రాలకు కలుగుతున్న ఇబ్బందులపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీకి జరిగిన అన్యాయంపై నీతి అయోగ్‌ సమావేశంలో ప్రస్తావించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. మోదీ ముగింపు ఉపన్యాసాన్ని బహిష్కరించే అంశంపై పలు రాష్ట్రాల సీఎంలతో చర్చించిన అనంతరం బాబు నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత నీతి అయోగ్‌ సమావేశం
ఆదివారం ఉదయం 10గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత నీతి అయోగ్‌ సమావేశం కానుంది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు, సీనియర్‌ అధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో గతేడాది చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్‌లో చేపట్టవలసిన అభివృద్ధిపై చర్చించనున్నారు. ఇక రైతుల రెట్టింపు ఆదాయం, ఆయుష్మాన్‌ భారత్‌, నేషనల్‌ న్యూట్రిషన్‌ మిషన్‌ పధకాలు.. 150వ మహాత్మాగాంధీ జయంతి సంబరాలలాంటి మొత్తం ఆరు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఢిల్లీకి చేరుకున్న పలు రాష్ట్రాల సీఎంలు..
ఇదిలావుంటే.. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. 15వ ఆర్ధిక సంఘం సిఫార్సులు, జీఎస్టీ వల్ల ఎదురైన ఇబ్బందులను ఈ సమావేశంలో ప్రస్తావించాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోచిస్తున్నారు.

ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించే యోచనలో చంద్రబాబు
ఇక ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత మోదీ, చంద్రబాబులు తొలిసారి ఈ సమావేశంలో ఎదురుపడనున్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు.. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మాట్లాడే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా, విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు కేంద్రం అమలు చేయకపోవడం, వివిధ అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తిచూపే అవకాశం ఉంది. చంద్రబాబు 20 పేజీల నివేదిక సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నీతి అయోగ్‌ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై చంద్రబాబు టీడీపీ ఎంపీలతో చర్చించారు. అలాగే... బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ చంద్రబాబు చర్చించారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు పశ్చిమబెంగాల్‌, కర్నాటక, కేరళ సీఎంలతో భేటీ అయ్యారు. అధికారాల కోసం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నివాసంలో ధర్నా చేస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఇప్పటికే అండగా ఉంటానని హామీ ఇచ్చిన చంద్రబాబు... పలువురు సీఎంలతో పాటు వెళ్లి మద్దతు తెలిపారు.

నీతి అయోగ్ సమావేశంపై ఉత్కంఠ..
ఇక ఈ సమావేశంలో 15వ ఆర్ధిక సంఘం సిఫార్సులు, జీఎస్టీ వల్ల ఎదురయ్యే ఇబ్బందులను ప్రస్తావించి.. అవసరమైతే ప్రధాని మోదీ ముగింపు ఉపన్యాసాన్ని చంద్రబాబు, బీజేపీయేతర రాష్ట్రాలు బహిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఆదివారం జరిగే నీతి అయోగ్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది. 

18:07 - June 16, 2018

అమరావతి : ఏసీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు. రేపు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర సమస్యలపై 24 పేజీల నివేదికను చంద్రబాబు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే నీతి ఆయోగ్‌ సమావేశం గురించి ఆయన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి బీజేపీ ఏతర సీఎంలను చంద్రబాబు కలవనున్నారు. అలాగే గవర్నర్ నివాసంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు చంద్రబాబు సంఘీభావం తెలపనున్నారు. జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు జరుగుతోన్న అన్యాయంపై కూడా నిలదీయాలని చంద్రబాబు భావిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘ విధి విధానాల సవరణలపై ఆయన అభ్యంతరాలు తెలపనున్నారు. ఒకవేళ ఈ సమావేశంలో రాష్ట్ర సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే నిరసన తెలపాలని ఆయన భావిస్తున్నారు.

19:19 - June 15, 2018

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షత నీతి అయోగ్ సమావేశం 17వ తేదీన జరుగనుంది. తెలుగు రాష్ట్రాలకు నిధుల విడుదల విషయంలో కేంద్రం అవలంభిస్తున్న తీరుపై తెలుగు రాష్ట్రాల సీఎంలు అసహనం వ్యక్తంచేస్తున్నాయి. ఈ క్రమంలో నీతి అయోగ్ సమావేశంలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, కర్ణాటక సీఎం కుమారస్వామిలతో మాట్లాడారు. కాగా ఈ సమావేశాన్ని కొందరు సీఎంలు బహిష్కరించాలనే యోచనలో వున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో నీతి అయోగ్ సమావేశం ఎలా జరగనుంది? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. 'న్యూ ఇండియా 2022' అనే ప్రధాన ఎజెండాతో ఈ నీతి అయోగ్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో నీతి అయోగ్ సమావేశం ఎలా జరగనుంది? దీనిపై రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా స్పందించనున్నారు? అనే అంశాలపై చర్చ. ఈచర్చలో సీపీఎం రాష్ట్రకమిటీ సభ్యులు నంద్యాల నర్శింహారెడ్డి,టీఆర్ఎస్ నేత శేఖర్ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిథి ప్రకాశ్ రెడ్డి, టీడీపీ నేత మాల్యాద్రి పాల్గొన్నారు. 

15:10 - June 15, 2018

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం కేసీఆన్ సమావేశం సుమారు గంట సమయం పాటు ఈ సమావేశం కొనసాగింది. రాష్ర్టానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రధానికి కేసీఆర్ కోరారు. అలాగే రాష్ట్రంలో తాము ప్రవేశపెట్టిన..అమలు చేస్తున్న సంక్షేమపథాకాల గురించి ప్రధానికి వివరించారు. అలాగే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధానిని సీఎం కోరారు. కొత్త జోనల్ వ్యవస్థ, రిజర్వేషన్ల పెంపునకు ఆమోదం తెలపాలని..ఏపీ భవన్ ను తెలంగాణకు ఇవ్వాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా పథకం వంటి పలు సంక్షేమ పథకాల గురించి కేసీఆర్ ప్రధాని మోదీకి వివరించారు. 

18:32 - June 13, 2018

ఢిల్లీ : మహాకూటమిని నేతలే కాదు... ప్రజలు కూడా కోరుకుంటున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, ప్రధాని నరేంద్ర మోదీ ఎదుర్కొనేందుకు మహా కూటమే సరైనదని ప్రజలు భావిస్తున్నట్లు రాహుల్‌ తెలిపారు. ప్రధాని మోది, బిజెపి రాజ్యాంగ సంస్థలపై దాడులు చేస్తోందని ఆయన విమర్శించారు. వీటిని ఎలా ఆపాలని ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పారు. మోది ప్రభుత్వం పేదలకు వ్యతిరేకమని, కొంతమంది పెద్దల కోసం పనిచేస్తోందని రాహుల్‌ ఆరోపించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను జిఎస్‌టి పరిధిలోకి తెచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు.

20:02 - June 11, 2018

దేశంలో మోదీ మాయాజాలానికి తిరుగులేదని భావిస్తున్న బీజేపీకి...గడ్డు కాలం రానుంది. దేశంలో విజయ ఢంకా మోగించిన బీజేపీకి 152 చోట్ల వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.. ఇదేదో ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం కాదు... సాక్ష్యాత్తూ బీజేపీ జరిపిన అంతర్గత సర్వేలో వెల్లడైన పచ్చినిజం. ఈ సర్వే ఫలితాలతో కమలనాథుల్లో గుబులు పుట్టిస్తోంది. బీజేపీలో మూడో స్థాయి నాయకత్వం అభివృద్ధిపై పార్టీ అధిష్ఠానంతోపాటు.. సంఘ్‌ పరివార్‌ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇటీవల ఉజ్జయినిలో సమావేశమైన అమిత్‌ షా, మోహన్‌ భగవత్‌, భయ్యాజీ జోషి చర్చించినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. టికెట్ల కేటాయింపుతో పాటు.. 75 ఏళ్లు పైబడినవారి విషయంలోనూ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై చర్చ. ఈ చర్చలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నంద్యాల నరసింహారెడ్డి బీజేపీ అధికార ప్రతినిథి కుమార్, కాంగ్రెస్ అధికార ప్రతినిథి మహేశ్ పాల్గొన్నారు.

18:00 - May 30, 2018

ఇండోనేషియా : భారత్‌-ఇండోనేషియా దేశాల మధ్య 15 అంశాలపై ఒప్పందం కుదిరింది. రక్షణ, సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లో పరస్పర సహకారం, తదితర అంశాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విదోదోను కలుసుకున్న మోది- సముద్రమార్గం, టూరిజం, పెట్టుబడులు తదితర ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారి. అనంతరం ఇరుదేశాల నేతలు సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇండోనేషియాలో ఉగ్రదాడిని ఖండించిన మోది- ఉగ్రవాదంపై పోరుకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వ్యాపారాన్ని 2025 నాటికి ద్విగుణీకృతం చేయనున్నట్లు మోది పేర్కొన్నారు అంతకుముందు ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఇండోనేషియా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదికి మరడెకా ప్యాలెస్‌లో ఘనస్వాగతం లభించింది. ఇండోనేషియాలో స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు మోది శ్రద్ధాంజలి ఘటించారు. 

21:37 - May 12, 2018

అమరావతి : టీడీపీపై బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను మంత్రి సోమిరెడ్డి ఖండించారు. ఎన్నికల్లో ఇచ్చిన 90శాతం హామీలను టీడీపీ పూర్తి చేసిందని... కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్విస్‌ బ్యాంకులోని నల్లధనాన్ని తీసుకువస్తానన్న మోదీ హామీ ఏమైందో చెప్పాలన్నారు. పార్లమెంట్‌లో సభనే నడపలేని మోదీ దేశాన్ని ఏం పాలిస్తారన్నారు సోమిరెడ్డి. 

Pages

Don't Miss

Subscribe to RSS - ప్రధాని