ప్రభుత్వాలు

21:02 - May 17, 2018

ఢిల్లీ : కర్ణాటక గవర్నర్‌ తీసుకున్న నిర్ణయంతో గోవా, బిహార్‌లో ప్రభుత్వ ఏర్పాటు అంశాలను కాంగ్రెస్‌, ఆర్జేడి తెరపైకి తెచ్చాయి. గోవా, బిహార్‌లలో అతిపెద్ద పార్టీగా నిలిచిన తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌, ఆర్జేడి డిమాండ్‌ చేశాయి. దీనిపై తాము రేపు గవర్నర్‌ను కలిసి డిమాండ్‌ చేస్తామని ఆర్జేడి నేత తేజస్వి యాదవ్‌ తెలిపారు. 81 స్థానాలతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్‌ 17 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం నాలుగు స్థానాల దూరంలో నిలిచింది. 14 స్థానాలు గెలిచిన బిజెపి జిఎఫ్‌పి, ఎంజిపి, ముగ్గురు ఇండిపెండెంట్ల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గోవా గవర్నర్ మృదుల సిన్హా కూడా కర్ణాటక గవర్నర్ బాటలోనే నడవాలని గోవా కాంగ్రెస్ చీఫ్‌ చంద్రకాంత్ కవ్లేకర్ అన్నారు. మణిపూర్‌, మేఘాలయలో కూడా ఇదే పద్ధతి అనుసరించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

06:41 - May 13, 2018

హైదరాబాద్ : గుంటూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై అత్యాచారం ఘటన మరువక ముందే.. మరోసారి దాచేపల్లిలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలికపై ఓ ప్రజాప్రతినిధి అత్యాచారానికి ఒడిగట్టాడు. మరోవైపు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో 7 ఏళ్ల చిన్నారిపై 65 ఏళ్ల వృద్దుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో ట్యూషన్‌ కు వచ్చిన 12 ఏళ్ల బాలికపై ట్యూషన్ మాస్టర్‌ అత్యాచారం చేశాడు. బాలికలపై అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి.

గుంటూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన మరవక ముందే మరోసారి అలాంటి ఘోరమే వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ల బాలికపై దాచేపల్లి మండల కోఆప్షన్‌ సభ్యుడు మహబూబ్‌ వలీ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాలిక తల్లదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో 7 ఏళ్ల చిన్నారిపై 65 ఏళ్ల గురుస్వామి అనే వృద్దుడు అత్యాచార యత్నం చేశాడు. చిరుతిళ్లు ఇస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాప నానమ్మ చూసి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి గురుస్వామికి దేహశుద్ధి చేశారు. గురుస్వామిపై చిన్నారి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్‌ మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి లెనిన్‌ నగర్‌లో ట్యూషన్‌కు వచ్చిన 12 ఏళ్ల బాలికపై ట్యూషన్ మాస్టర్ అత్యాచారయత్నం చేశాడు. బాలిక అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు బాలికను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా నసూర్లాబాద్‌ మండలం దుర్కి గ్రామంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. గ్రామానికి చెందిన అహ్మద్‌ హుసేన్‌ బాలికపై అత్యాచారం చేశాడు. చేప కూర తినిపిస్తానని చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

దాచేపల్లితో పాటు నాయుడుపేటలో జరిగిన అత్యాచారాలపై పౌర సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం అత్యాచార ఘటనలపై సీరియస్‌గా చర్యలు తీసుకోకపోవడం వల్లే మరోసారి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శిస్తున్నాయి. పాలక వర్గాల ఉదాసీన వైఖరి కారణంగానే పదేపదే మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఐద్వా నేతలు విమర్శిస్తున్నారు. ఘటనలకు పాల్పడిన వారు చట్టం నుండి తప్పించుకోకుండా చూడాలని అంటున్నారు. 

08:08 - April 29, 2018

ఏపీకి ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన అంశాలు కల్పించడంలో ఏపీ రాష్ట్రంపై కేంద్రం నిర్లక్ష్యం చేసిందని..మోసం చేసిందని ఏపీ ప్రభుత్వం పేర్కొంటోంది. అందులో భాగంగా పలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో భాగంగా తిరుపతి కేంద్రంగా కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని బాబు భావిస్తున్నారు. సోమవారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ అంశాలపై విజయవాడ టెన్ టివి స్టూడియోలో జరిగిన చర్చా వేదికలో పట్టాభిరామ్ (టిడిపి), బాబురావు (సీపీఎం), మల్లాది విష్ణు (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

20:55 - April 13, 2018

ఏ పార్టీ అధికారంలో వున్నా గత 25 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు జపం పట్టిస్తున్నాయి. ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణ పదాలు ఏదైనా, రూపం ఏదైనా సామాన్యులే అన్నింటికీ బలయ్యేది. సామాన్యుల జీవితాలే చిద్రమయ్యేది. కానీ మధ్య తరగతి జీవన ప్రమాణాలు పెరిగాయనీ, దేశీయ స్థూల జాతీయోత్పత్తి నేది మెరుగైందనేది ప్రభుత్వాల వాదన. ఇది ఎంత వరకూ వాస్తవం? అసలు సంస్కరణలంటే ఏమిటి? దీనిలో వున్న మతలబు ఏమిటి? సంస్కరణ పేరుతో సాగిన వాస్తవిక పరిస్థితులు ఎలా వున్నాయి? సీపీఎం 25వ జాతీయ మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన బీవీ రాఘవులు గారితో సంస్కరణ సాధించిందేమిటి? అనే అంశంపై చర్చ..సంస్కరణలే సర్వరోగ నివారిణి అంటున్నాయి ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చేవి నిజమైన సంస్కరణలేనా? లేదీ సామాన్యులపై ప్రభుత్వాలు చేసే రణమా? అనే అంశాలను సీపీఎం 25వ జాతీయ మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన బీవీ రాఘవులు గారి విశ్లేషణలో చూద్దాం..

11:29 - January 13, 2018

ప్రభుత్వాల కంటే కోర్టులే ఎక్కువగా యాక్టివ్ గా ఉన్నాయని అన్నారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకులు వినయ్ కుమార్, టీఆర్ ఎస్ నేత సత్యనారాయణ పాల్గొని, మాట్లాడారు. కోర్టుల వల్ల న్యాయం అందరికీ సమన్యాయం చేకూరుతుందని తెలిపారు. రాజకీయం వలన అధికారంలో ఉన్న వారికి మాత్రమే న్యాయం లభిస్తుందన్నారు. కోర్టులపై ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

13:27 - December 13, 2017

కడప : కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రాయలసీమపై త్రీవ వివక్షచూపుతున్నాయని ఎమ్మెల్సీ డా.గేయానంద్ అన్నారు. కడపలో జరిగిన సీపీఎం బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రాయలసీమకు అనేక రకాలుగా అన్యాయం జరిగిందన్నారు. రాయలసీమ అంటే అంత నిర్లక్ష్యమా అన్నారు. కర్నూలులో త్రిపుల్ అటీ ఏర్పాటు చేస్తామని చెప్పి., ఇప్పటివరకు చేయలేదన్నారు. ఉక్కు పరిశ్రమ నిర్మిస్తాని చెప్పారు కానీ అమలుకు నోచుకోలేదన్నారు. కర్నూలులో సెంట్రల్ యూనిర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు...కానీ ఇంతవరకు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టలేదన్నారు. మన్నవరం ప్రాజెక్టు వస్తే వేలాది మంది ఉద్యగాలు వస్తాయన్నారు. రాయలసమీ సుభిక్షంగా ఉండాలంటే 4 వందల టీఎంసీల నీరు కావాలని చెప్పారు. రాయలసీమ జిల్లాలకు జరుగుతున్న అన్యాయాన్ని అన్ని పార్టీలు ప్రశ్నించాలన్నారు. 

09:53 - August 28, 2017

హైదరాబాద్: నాలుగు రాష్ట్రాలను వణికించిన డేరా బాబ కు అత్యాచారం కేసులో నేడు శిక్షను కోర్టు ఖరారు చేయనుంది. బాబాలకు రాజకీయ పార్టీల అండదండలు వుండటం, బిజెపి ఎంపి సాక్షి మహారాజ్ డేరా బాబాకు మద్దతు తెలిపారు. ఈ సంస్కృతిని ఎలా అర్థం చేసుకోవాలి. నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. నంద్యాల ఎన్నికల ఫలితం రాష్ట్ర రాజకీయాలను తీవ్ర ప్రభావం చేయనున్నాయా? ఈ అంశాలపై 'న్యూస్ మార్నింగ్' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో టిడిపి అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్, వైసిపి నేత మదన్ మోహన్ రెడ్డి, బిజెపి నేత వేణుగోపాల్, సీనియర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి

08:48 - June 26, 2017

హైదరాబాద్: 60 గంటల పాటు నిర్విరామంగా చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. బోరుబావిలోంచి చిన్నారి బతికొస్తుందనుకున్న ఆ కన్నతల్లికి కన్నీళ్లే మిగిలాయి. కన్నతల్లి పేగు బంధాన్ని శాశ్వతంగా తెంచుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అమ్మా అని నోరారా పిలిచే ఆ చిట్టితల్లి చిట్టిపొట్టి మాటలు ఇప్పుడు వినిపించవు. నవమాసాలు మోసి కనిపెంచిన ఆ కన్నతల్లికి ఇప్పుడు మిగిలింది కడుపుకోతే. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నటుడు రవితేజ సోదరుడు భరత్ మృతి చెందాడు. రోడ్డు ప్రమాదాలు తాగడం వల్లే జరుగుతున్నాయా? అతివేగమే కారణమా? దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇలాంటి అంశాలపై 'న్యూస్ మార్నింగ్ ' షో లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీపీఎం నేత నంద్యాల నరసింహారెడ్డి, దుర్గా ప్రసాద్ టిడిపి, సత్యనారాయణ టిఆర్ ఎస్,లక్ష్మీనారాయణ బిజెపి నేత పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి....

08:40 - June 6, 2017

హైదరాబాద్: ఇరు రాష్ట్రాలో భూ మాఫియా కట్టలు తెంచుకుంటున్నాయి. ఇదే అంశం పై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో టి.కాంగ్రెస్ నేత రఘుమోహన్ , వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి, టిడిపి దినకర్ పాల్గొన్నారు. పూర్తి వివరా లకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

21:26 - May 19, 2017

హైదరాబాద్: మోదీ, కేసీఆర్‌ ప్రభుత్వాలపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ ఫైర్‌ అయ్యారు. కేంద్రం రైతువ్యతిరేక విధానాలు అవవలంబిస్తోందన్నారు. రైతుల సమస్యలపై కేంద్రం నిర్లక్ష్యపూరింతంగా వ్యవహరించడం వల్లే .. దేశవ్యాప్తంగా అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణలో మిర్చిరైతులు, ఉపాధిహామీ కూలీల సమస్యలపై బృందాకరత్‌ గళమెత్తారు. ఉపాధి హామీకూలీల పట్ల కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిర్దయగా ప్రవర్తిస్తున్నాయని ఆమె మండిపడ్డారు. జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు తెలంగాణలో 36శాతం మంది ఉపాధి హామీ కూలీలకు డబ్బులివ్వలేదని బృందాకరత్‌ అన్నారు. ఓవైపు తమ రాష్ట్రంలో 98శాతం ఆధార్‌కార్డులు ఇచ్చేశామని కేసీఆర్‌ ప్రభుత్వం చెప్పుకుంటోంది. కాని.. కేవలం ఆధార్‌కార్డు లేదన్న సాకుతో నిరుపేదల కడుపులు కొడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Pages

Don't Miss

Subscribe to RSS - ప్రభుత్వాలు