ప్రభుత్వ కళాశాల

18:36 - September 14, 2018

భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెంలో దారుణం జరిగింది. ఓ కళాశాల ప్రిన్సిపల్ మహిళా అధ్యాపకులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మహిళా అధ్యాపకులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తరచూ వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. సెలవులు కావాలని అడిగితే తనకు లొంగాలని మహిళా అధ్యాపకులను శ్రీనివాస్ వేధింపులకు గురి చేస్తున్నాడు. మహిళలతో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో మాట్లాడుతున్నాడు. ప్రిన్సిపల్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో మహిళా అధ్యాపకులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. మహిళా అధ్యాపకులకు విద్యార్థి సంఘాలు అండగా నిలిచాయి. శ్రీనివాస్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని..లేనిఎడల ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ రేట్ కు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కు విన్నవించారు. తనతో పాటు మరో ఇద్దరు మహిళలతో ప్రిన్సిపల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని అధ్యాపకురాలు తెలిపారు. డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడుతారని వాపోయింది. శ్రీనివాస్ ను సస్పెండ్ చేసేందుకు కలెక్టర్ దర్యాప్తు చర్యలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.   

 

13:43 - September 15, 2017

మెదక్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో మాత్రమే రూపొందించే జర్నల్స్‌ను ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ కళాశాల రూపొందించింది. విశ్వవిద్యాలయాలకు మాత్రమే సాధ్యమయ్యే పనిని తామూ చేయగలమంటూ చేసి చూపింది. అంతేకాదు కార్పొరేట్‌ స్కూలు యాజమాన్యాల చేత ఔరా అనిపించింది. ఇంతకీ అది ఏకాలేజీ..? వాచ్‌ దిస్‌ ఇది జహీరాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల. విశ్వవిద్యాలయాలకు తక్కువ కాదంటూ 2014 నుండి జర్నల్స్‌ను రూపొందించి ప్రచురిస్తోంది. ఈ ఏడాది జనవరి 10న కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలోని అధ్యాపకులు పదోన్నతులు పొందడం కోసం, పీహెచ్ డీ పూర్తి చేయడానికి, యూజీసీ గుర్తింపు పొందిన జర్నల్స్‌ను కనీసం రెండు పరిశోధనా పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసమే డిగ్రీ కళాశాల అద్యాపక బృందం నాలుగేళ్ల క్రితం మంజీర జర్నల్స్‌ పేరుతో జర్నల్స్‌ను ప్రారంభించింది.

ఈ జర్నల్స్‌ ప్రతి ఆరు నెలలకు
కళాశాల ప్రారంభించిన ఈ జర్నల్స్‌ ప్రతి ఆరు నెలలకు ఒక సారి ప్రచురితం అవుతాయి. ఇందులో దేశ, విదేశాల్లోని మేధావుల, శాస్త్రవేత్తల, ఆచార్యుల, సామాజిక శాస్త్రవేత్తల పరిశోధన పత్రాలను ప్రచురితం చేస్తున్నారు. దీనికి ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు రావడం పట్ల కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాసరాజు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా మంజీరా జర్నల్స్‌ను రూపొందిస్తున్న వీరికి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని యూజీసీ గుర్తించి ఒక ప్రత్యేక నంబర్‌ను ఇచ్చింది. అంతేకాదు ఇంటర్నేషనల్‌ స్టాండెడ్‌ సీరియల్‌నంబర్‌ అనే సంస్థ కూడా ఈ జర్నల్‌ను గుర్తించింది. ఇంతటి అరుదైన గౌరవం తమ కళాశాలకు అభించడం ఆనందంగా ఉందని అధ్యాపకులు డాక్టర్‌ మల్లిఖార్జున రావు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ విశ్వవిద్యాలయాలతో సమానంగా
ఇక ఈ కళాశాలలోని విద్యార్థులు కూడా తమ కళాశాల అధ్యాపక బృందం చేస్తున్న కృషిని కొనియాడుతున్నారు. పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు చేసే పనిని మారుమూల ప్రాంత కళాశాల చేస్తున్నందుకు గర్వకారణంగా ఉందని చెబుతున్నారు.జాతీయ విశ్వవిద్యాలయాలతో సమానంగా తమ కళాశాల కూడా ముందుకు సాగుతుందని కళాశాల అధ్యపకులు గర్వపడుతున్నారు. 

Don't Miss

Subscribe to RSS - ప్రభుత్వ కళాశాల