ప్రమాదం

17:42 - August 20, 2017

కృష్ణా : జిల్లాలో విషాదం నెలకొంది. ఈత సరదా ఓ నిండు ప్రాణం తీసింది. సన్‌డే రోజు సరదాగా ఈతకొట్టడానికి చెరువులోకి దిగిన విద్యార్థి మృత్యువాత పడ్డాడు. కృష్ణాజిల్లా అవనిగడ్డలోని పాలిటెక్నిక్‌ కాలేజీ విద్యార్థులు నలుగురు పులిగడ్డ బ్రిడ్జిదగ్గర రేవులోఈతకొట్టడానికి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో హరిప్రసాద్‌ అనే విద్యార్థి నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. స్నేహితుణ్ని కాపాడేందుకు  మిగతా విద్యార్థులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌సిబ్బంది మునిగిపోయిన విద్యార్థిని మృతదేహాన్ని బయటకు తీశారు.  ప్రకాశంజిల్లా మార్కాపురంలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 

 

20:58 - August 19, 2017

యూపీ : ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగింది. పూరి నుంచి హరిద్వార్‌ వెళ్తున్న కళింగ ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌ ముజఫర్‌నగర్‌లోని ఖతౌలీ వద్ద  రైలు పట్టాలు తప్పింది. సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు జరిగిన ఈ ఘటనలో 6 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. పోలీసులు, రైల్వే అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. 

 

11:12 - August 17, 2017

పశ్చిమగోదావరి : నిడదవోలు మండలం విజ్ఞేశ్వరం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. డెల్టా ప్రధాన కాల్వలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారు. రాజమండ్రి నుండి నిడదవోలు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు కాల్వలో ఉన్న కారును బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కారులో ఇద్దరు ఉన్నారా ? ఇంకెంత మంది ఉన్నారనేది తెలియరాలేదు. 
60 మీటర్ల లోతులో కాల్వ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదం జరగడం రెండోసారి. నెల రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం జరిగిన ప్రమాదంలో కారు నెంబర్ బట్టి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

10:25 - August 14, 2017

ఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ వాసులు మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ బస్సులపై కొండ చరియలు విరిగి పడటంతో 46 మంది సజీవ సమాధి అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5లక్షలు ప్రకటించింది.

మనాలి - కట్ర..మనాలి - చంబా ప్రాంతాలకు రెండు బస్సులు వెళుతున్నాయి. ఓ ప్రాంతంలో ఈ బస్సులు నిలిచి ఉన్నాయి. ఈ రెండు బస్సుల్లో 56 మంది ప్రయాణీకులున్నారు. ఒక్కసారిగా ఈ రెండు బస్సులపై కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రమాద విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు 48 మంది మృతి చెందగా 23 మృతదేహాలను గుర్తించారు. మృతులు నల్గొండకు చెందిన కొండల్ రెడ్డి, యాదాద్రి నివాశి , రాజారెడ్డిగా గుర్తించారు. వీరు సుషీ హైటెక్ సంస్థలో పనిచేస్తున్నారు. ఓ కాంట్రాక్టు నేపథ్యంలో వీరు హిమాచల్ కు వెళ్లి ప్రమాదంలో మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

09:52 - August 13, 2017

రంగారెడ్డి : జిల్లా హిమాయత్‌ సాగర్‌ అవుటర్‌ రింగ్‌రోడ్‌పై వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో ఎస్ఐ జలీల్‌ మృతిచెందాడు.. కారులోఉన్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.. ట్రైనింగ్‌లోఉన్న జలీల్‌ తన ఇంటికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

16:37 - August 8, 2017

నెల్లూరు : జిల్లాలోని ఆమంచర్ల వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హౌసింగ్‌ కార్పొరేషన్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ పసుపులేటి కృష్ణమూరిగా మరొకరు బీఎస్‌ఎన్‌ఎల్‌ కాంట్రాక్టర్‌ షాజాద్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

08:08 - August 4, 2017

ప్రకాశం : జిల్లా కనిరిగి మండలం కాశిరెడ్డి నగర్ లో రోడ్డుప్రమాదం జరిగింది. పెళ్లిబృందం బస్సు ఆగివున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రి తరలించారు. ఒంగోలు నుంచి వెలిగొండ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

16:05 - July 30, 2017

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిపోర్ట్ నోవాటెల్ హోటల్ వద్ద కారు ప్రమాదం జరిగింది. ఆల్టో కారు అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొంది. ఈ సంఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. తల్లిదండ్రులతో పాటు మరో చిన్నారికి గాయాలయ్యాయి. వారు ఎయిర్ పోర్ట్ నుంచి తుక్కుగూడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

12:09 - July 27, 2017

విజయనగరం : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్‌. కోట, ఆర్టీసీ కాంప్లెక్స్‌ సెంటర్‌ వద్ద టిఫిన్‌ దుకాణంలోకి కారు దూసుకెళ్లింది. దీంతో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో కార్‌ డ్రైవ్‌ చేయడం వల్లనే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కార్‌లో మద్యం బాటిల్లు, బిర్యానీ ప్యాకెట్‌లు ఉన్నాయి. నిందితులను నెల్లిమర్ల విద్యుత్ శాఖ ఉద్యోగులుగా గుర్తించారు. 

 

12:22 - July 22, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామం ప్రధాన రహదారి పక్కన ఆగి ఉన్న వ్యక్తిని టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో మందడం గ్రమానికి చెందిన రమేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన తరువాత కూడా ఆపకుండా డ్రైవర్‌ 10 కిలోమీటర్లు వెళ్లాడు. లారీని వెంబడించి డ్రైవర్‌ను పట్టుకొని సంఘటనా స్థలానికి తీసుకువచ్చి ధర్నా నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ 3 కిలోమీటర్లు నిలిచిపోయింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేశ్ అందిస్తారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - ప్రమాదం