ప్రసంగం

19:16 - November 20, 2018

కామారెడ్డి : రైతు బంధు పథకం దేశానికే ఆదర్శమని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ ముందంజలో ఉందని పేర్కొన్నారు. ధనిక రైతులు తెలంగాణలో ఉన్నారన్న పేరు రావాలన్నారు. ఐకేపీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పారు. కోరుకున్న తెలంగాణ కావాలంటే టీఆర్ఎస్‌ను గెలిపించాలన్నారు. ఎల్లారెడ్డి టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. 
తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చాం..
తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చామని తెలిపారు. రైతు పండించిన పంటకు గిట్టుబాట ధర రావాలన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధితోపాటు రైతలు అభివృద్ది అయినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఆహార శుద్ధి కేంద్రాలు రావాలన్నారు. రేషన్ షాపుల నుంచి కల్తీ లేని సరుకులను పంపిణీ చేస్తామని చెప్పారు. టీఆర్ఎస్‌ హయాంలో అవినీతి, కుంభకోణాలు లేవని స్పష్టం చేశారు. 
మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి తాగునీరు..
మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి తాగునీరు వస్తోందన్నారు. ఇతర రాష్ట్రాల వారు మిషన్ భగీరథ గురించి తెలుసుకుంటున్నారని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఎకరానికి రూ.10 వేలు ఇస్తామన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలను పకడ్బందవీగా అమలు చేస్తున్నామన్నారు. ఎల్లారెడ్డిలో 457 చెరువులు పునరుద్ధరించామని తెలిపారు. ఎల్లారెడ్డికి 10 టీఎంసీల నీళ్లు రాబోతున్నాయని తెలిపారు. ధర్మారావుపేట, మోతెలో డ్యాంలు నిర్మిస్తున్నామని చెప్పారు. రైతాంగం తృప్తిగా ఉండటమే తాను కోరుకునేదన్నారు.
రవీందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి..  
బంగారు తెలంగాణ రావాలంటే టీఆర్ఎస్‌ను గెలిపించాలన్నారు. రవీందర్ రెడ్డిని భారీ మెజార్టీలో గెలిపించాలని కోరారు. లక్ష ఓట్ల మెజార్టీతో రవీందర్ రెడ్డిని గెలిపించాలని పిలుపు ఇచ్చారు. వివాదంలో ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

 

16:21 - November 20, 2018

సిద్ధిపేట : దేశంలో తెలంగాణను నెంబర్ వన్‌గా చేస్తామని అపద్ధర్మ సీఎం కేసీఆర్ అన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సమస్య పోయిందని తెలిపారు. సిద్ధిపేటలో నిర్వహించిన టీఆర్ఎస్ ప్రచార సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. క్రాప్ కాలనీలుగా విభజించుకోవాలన్నారు. రైతులకు ఉచితంగా 24 గంటలు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామని..అధికారంలోకి వస్తే కొనసాగిస్తామని చెప్పారు. రైతు సమస్యలు తనకు తెలుసునని చెప్పారు. రైతు బిడ్డను కాబట్టే..రైతు కష్టాలు తనకు తెలుసునని తెలిపారు. తాను ఈరోజుకు కూడా వ్యవసాయం చేస్తున్నానని తెలిపారు. రాబోయే ఏడాది నుంచి రూ.10 వేలు రైతులకు ఇస్తామని చెప్పారు. వచ్చే ఏడాది లోపు ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రాబోయే ఏడాది నాటికి సాగు నీరు అందిస్తామని చెప్పారు. సిద్ధిపేటలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడి ఎమ్మెల్యేలు మంచి హుషారుగా ఉన్నారని తెలిపారు. హరీష్, రామలింగారెడ్డిలు జోడు గుర్రాల్లా పని చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని తెలిపారు.

 

15:30 - November 20, 2018

సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించిన కేసీఆర్ సిద్దిపేటపై వరాల జల్లు కురిపించారు. రెండేళ్లలో సిద్దిపేటకు రైలు తీసుకొస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు రైతులకు 24 గంటల ఉచిత్ విద్యుత్ అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ప్రాజెక్టులన్నీ పూర్తవుతున్నాయని, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు ఇకపై ఎలాంటి నీటి కొరత ఉండదని చెప్పారు. రైతులు, ఐకేపీ మహిళలు, రేషన్ డీలర్లకు లబ్ధి చేకూర్చేవిధంగా సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు సమన్వయ సంఘం సభ్యులకు గౌరవ వేతనం అందిస్తామని చెప్పారు. 
‘సిద్దిపేట జిల్లా కావాలనుకున్నాం.. బ్రహ్మాండంగా చేసుకున్నాం. సిద్దిపేటకు మెడికల్ కాలేజీ కావాలనుకున్నాం.. చేసుకున్నాం. ఇదే గడ్డలో మీ చేతుల్లోనే పెరిగి, మీరు అందించిన బలంతో రాష్ట్ర సాధన కోసం బయలుదేరా.. తెలంగాణ సాధించుకున్నాం.. సాధించుకున్న రాష్ట్రంలో ఎన్నో అపోహలు. కరెంట్ ఉండదని, నీళ్లు రావని ప్రచారం చేశారు. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాం’ అని కేసీఆర్ అన్నారు. 

 

21:10 - November 11, 2018

హైదరాబాద్ : హైదరాబాద్ మినీ భారత్ అని తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. నగరంలోని లలితాకళాతోరణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. మరాఠీలు, గుజరాతీలు, బెంగాలీలు అన్ని రాష్ట్రాలవాళ్లు హైదరాబాద్‌లో నివసిస్తున్నారని తెలిపారు. 

 

17:23 - November 10, 2018

సిరిసిల్ల :  చేనేత కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉందని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈమేరకు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. నేతన్నల ఆత్మహత్యలను నివారించగలిగామని తెలిపారు. బతుకమ్మ చీరలను నేతన్నలతోనే తయారు చేయించామని చెప్పారు. సిరిసిల్ల బ్రాండ్ దేశ వ్యాప్తం కావాలని ఆకాంక్షించారు. సిరిసిల్ల..ఒక సిరిపూర్ కావాలన్నారు. భారతదేశంలో కాటన్‌కు తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందన్నారు. దేశంలోనే అత్యుతమ కాటన్ తెలంగాణ రాష్ట్రంలో ఉందని తెలిపారు. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని..చేతల ప్రభుత్వమన్నారు. టీసర్కార్ నికరంగా పని చేసింది 3 ఏండ్ల 3 నెలలు అని చెప్పారు. 

 

20:46 - September 21, 2018

అమరావతి : ఏసీ సీఎం చంద్రబాబు నాయుడికి ఐక్యరాజ్యసమితి అరుదైన గౌరవాన్ని అందించింది. ఐక్యరాజ్యసమితిలో ప్రసగించాల్సిందిగా చంద్రబాబును కోరుతు ఐక్యరాజ్యసమితి ఆహ్వానంపంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 22న అమెరికా పర్యటనకు బయల్దేరుతున్నారు. 28వ తేదీ వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. 24వ తేదీన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రసంగించనున్నారు. 'సుస్థిర వ్యవసాయాభివృద్ధిలో ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లు-ఏపీలో సహజ వ్యవసాయాభివృద్ధి విధానాలు' అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. 
అనంతరం 25న వరల్డ్ ఎకనామిక్ ఫోరం-ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. 26న కొలంబియా యూనిర్శిటీలో 'గవర్నెన్స్ ఇన్ ది ఏజ్ ఆఫ్ టెక్నాలజీ అనే అంశంపై ప్రసంగిస్తారు. అమెరికాకు చంద్రబాబుతో పాటు మంత్రి యనమల, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, మరో ఆరుగురు అధికారులు కూడా వెళ్తున్నారు.

 

17:32 - September 14, 2018

కర్నూలు : స్మార్ట్ వాటర్ గ్రిడ్ కు శ్రీకారం చుట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. జిల్లాలో నిర్వహించిన ’జలసిరికి హారతి’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం భావితరాలకు సంబంధించినదన్నారు. నీరు ఉంటే బంగారం పండించే అవకాశం ఉంటుందని తెలిపారు. నీరు ఉంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తయన్నారు. గోదావరి నదికి అఖండ హారతి ఇచ్చామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు నదులు కలిపామని చెప్పారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశామన్నారు. కృష్ణమ్మ తల్లికి జల హారతి ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు జల హారతికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. అనంతపురంకు నీటిని తీసుకెళ్లడానికి లిఫ్టు ద్వారా తప్ప వేరే మార్గంలేదని చెప్పారు. కుప్పం వరకు నీరును తీసుకెళ్తామన్నారు.

వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాలని సూచించారు. కర్నూలు జిల్లాలో 45 గొలుసు కట్టు చెరువులను పునరుద్ధరించామని తెలిపారు. దేశంలో వ్యవసాయరంగంలో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందని చెప్పారు. వేరుశనగ పంట ఎండిపోయి నష్టపోయిన రైతులను పూర్తిగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ’మన భవిష్యత్ మన చేతిలోనే ఉంది’ అని పేర్కొన్నారు. ప్రజల్లలో చైతన్యం తీసుకరావాలన్నారు. నీటి పరిశుభ్రతను కాపాడాలని సూచించారు. 

 

20:23 - September 2, 2018
16:19 - August 25, 2018

కడప : మన పూర్వీకులు చెట్లు నాటి, అడవులు కాపాడటం వల్లే ఈ మాత్రమైనా పర్యావరణం ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కడపలో వనం మనం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు సీఎం. కొందరు స్వార్థపరులు పర్యావరణాన్ని దుర్వినియోగం చేశారన్నారు.. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్లనే కడపలో అనావృష్టి, కేరళలో అతివృష్టి నెలకొందన్నారు. వాతావరణాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోకుంటే చాలా సమస్యలు తలెత్తుతాయని సీఎం అన్నారు.

 

08:46 - August 24, 2018

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ జర్మనీలోని హాంబర్గ్‌లో చేసిన ప్రసంగంపై బిజెపి మండిపడింది. 23 దేశాల ప్రతినిధుల ముందు రాహుల్‌ దేశాన్ని చులకన చేసి మాట్లాడారని బిజెపి అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర విమర్శించారు. ఎన్డీయే పాలనలో భారత్‌లో నిరుద్యోగం, అసమానతలు, మూక హత్యలు, దళితులపై దాడులు అధికమవుతున్నాయని రాహుల్‌ ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల వల్లే ఐఎస్‌ఐఎస్‌ వంటివి ఏర్పడుతాయని చెప్పారు. మైనారిటీలకు ఉద్యోగాలు రాకపోతే ఐఎస్‌ఐఎస్‌ వైపు మళ్లుతారని చెప్పడం ద్వారా రాహుల్‌  భయోత్పాతం సృష్టిస్తున్నారని ... ఉగ్రవాదానికి ఊతమిచ్చే ఈ ప్రకటనపై రాహుల్‌ సమాధానం చెప్పాలని సంబిత్‌పాత్ర డిమాండ్ చేశారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - ప్రసంగం