ప్రావిన్స్

15:23 - April 21, 2017

దక్షిణాఫ్రికా : ఓ చిన్నారిని సజీవంగా పూడ్చిపెట్టినా ప్రాణాలతో బయటపడిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని ప్రావిన్స్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...క్వాజులు - నాటల్ ప్రావిన్స్ లో ఓ 25 ఏళ్ల మహిళ టింబర్ డిపోలో పనిచేస్తోంది. ఇటీవలే పండటి మగబిడ్డ జన్మించాడు. కానీ ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలియవద్దని ఆ పసికందును పనిచేస్తున్న చోటే పూడ్చేసింది. కానీ మూడు రోజులకు ఆ చిన్నారి ఏడుపులు అక్కడి వారికి వినిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. వెంటనే పోలీసులు శిశువును కాపాడారు. ప్రస్తుతం పోర్ట్ పెష్ స్టోన్ రీజనల్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. వెంటనే తల్లిపై పోలీసులకు కేసు నమోదు చేశారు.

10:54 - December 18, 2016

ఢిల్లీ : ఇండోనేషియాలో విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వైమానికదళానికి చెందిన ఓ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు పైలెట్లు కాగా మిగతా వారందరూ సైనికులే. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. తక్కువ కెపాసిటీ గల ఈ విమానంలో ఆహార పదార్థాలు..ఇతరత్రా తరలిస్తుంటారు. ఇలాగే ఆహార పదార్థాలు తీసుకెళుతుండగా పపువాలోని ప్రావిన్స్ కొండల మధ్య విమానం కూలిపోయింది. భద్రత విషయంలో సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 2015 లో ఇదే తరహాలో ప్రమాదం జరిగింది. 130 మంది మృత్యువాత పడ్డారు. కొండ ప్రాంతంలో కూలిపోవడంతో సహాయక చర్యలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. బ్లాక్ బాక్స్ దొరికిన అనంతరం ఇతర వివరాలు తెలిసే అవకాశం ఉంది.

19:25 - July 12, 2016

రష్యా : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు రష్యా పర్యటనలో బిజీబిజీ ఉన్నారు. నాలుగో రోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు చెలబిన్స్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ బోరిస్‌తో సమావేశమయ్యారు. ఇరు ప్రాంతాల పక్షాన ఐదుగురు సభ్యులతో త్వరలో వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఏపీ ఐటీ సాంకేతిక పరిజ్ఞానాన్ని చెలబిన్స్‌ ప్రావిన్స్‌కు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం మాస్కో నగరపాలక సంస్థ విజ్ఞాన, పారిశ్రామిక విధాన విభాగాధిపతి ఒలెగ్‌ బొచరోవ్‌తో చంద్రబాబు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. నూతన రాజధానిని ప్రపంచ స్థాయిలో నిర్మించడానికి తమ వంతు పూర్తి సహాకారం అందిస్తామని ఈ సందర్భంగా ఒలెగ్‌ చంద్రబాబుకు తెలిపారు. 

Don't Miss

Subscribe to RSS - ప్రావిన్స్