ప్రియురాలు

10:27 - August 22, 2018

హైదరాబాద్ : పాతబస్తీలో దారుణం జరిగింది. పరువు హత్యకు పాల్పడ్డారు. ప్రియురాలి కుటుంబ సభ్యులు ప్రియుడిపై దాడి చేయడంతో అతను మృతి చెందారు. గౌలిపురకు చెందిన యువతిని రాజేష్ ప్రేమిస్తున్నాడు. అయితే మాట్లాడుకుందామని రాజేష్ ను పిలిచి యువతి కుటుంబ సభ్యులు అతనిపై దాడి చేశారు. తమ కూతురుని ప్రేమిస్తున్నాడంటూ రాజేష్ పై యువతి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఛాతీలో తీవ్ర నొప్పి రావడంతో రాజేష్ ను అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ రాజేష్ మృతి చెందారు. యువతి తల్లిదండ్రులు, సోదరులపై మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

13:58 - August 21, 2018

ప.గో : ప్రేమించి పెళ్ళికి నిరాకరించిన ప్రియుడిపై ప్రియురాలు దాడి చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం.. ఏనుగువాని లంకలో  జరిగింది.  ఏడేళ్ళుగా ప్రేమిస్తున్నానంటూ నమ్మించిన మురళీ కృష్ణ మరో అమ్మాయితో పెళ్ళికి సిద్ధపడ్డాడు దీంతో.. గత పదిరోజులుగా మేరీమాత  తన ప్రియుడి ఇంటిముందు దీక్షకు దిగింది. బాధితురాలికి కుటుంబ సభ్యులతోపాటు.. మహిళా సంఘాలు, గ్రామస్థులు అండగా నిలిచారు. ఎట్టకేలకు మేరీమాత బంధువులు.. మురళీ కృష్ణను అంతర్వేది లాడ్జీలో  పట్టుకున్నారు. మేరీమాతతోపాటు.. మహిళా సంఘాల వారు మురళీకృష్ణను పట్టుకుని చితక్కొట్టారు. మురళీకృష్ణను శిక్షించి తనకు న్యాయం చేయాలనికోరుతోంది.

21:57 - August 19, 2018

నిజామాబాద్‌ : ప్రియుడి కోసం దేశాలు దాటొచ్చిన ఓ ప్రియురాలు జైలు పాలైన ఘటన.. నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. సౌదీ నుంచి మన దేశానికి వచ్చి ప్రేమవివాహం చేసుకున్న యువతిని.. అక్రమంగా దేశంలోకి వచ్చిన కేసులో నిజామాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. సౌదీ దేశానికి  చెందిన అల్‌హరబీ రజా నసీర్‌ అనే యువతి తమ ఇంట్లో డ్రైవర్‌గా పనిచేసిన.. నిజామాబాద్‌కు చెందిన అజీముద్దీన్‌తో ప్రేమలో పడింది. అతన్నే పెళ్ళి చేసుకోవాలనుకున్న నసీర్‌.. సందర్శక వీజాపై ఈ ఏడాది ఏప్రిల్‌ 26న భారత్‌ చేరుకుంది. అనంతరం అజీముద్దీన్‌ను పెళ్ళి చేసుకుని.. ఎల్లమ్మగుట్టలో నివాసం ఉంటోంది. కాగా..  మన దేశంలోకి  అక్రమంగా చొరబడిన కేసులో పోలీసులు ఈ నెల 7న నసీర్‌ను రిమాండుకి తరలించారు. ఆమె జైలు నుంచి బయటికి రాగానే  తిరిగి సౌదీకి పంపనున్నారు. 

 

17:55 - July 10, 2018

యాదాద్రి భువనగిరి : చందుపట్లకు చెందిన ఓ యువతి.. వలిగొండలో ప్రియుడు భాస్కర్‌ ఇంటి ముందు ఆందోళనకు దిగింది. భాస్కర్‌ తనను ప్రేమించానని చెప్పి.. మరో యువతిని వివాహం చేసుకునేందుకు సిద్దం కావడంతో జ్యోతి ఆందోళనకు దిగింది. రెండు నెలలుగా తప్పించుకున్న తిరుగుతున్న భాస్కర్‌పై.. జ్యోతి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడం... భాస్కర్‌ వేరే యువతితో పెళ్లికి సిద్దం కావడంతో... ఆమె ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తోంది. 

14:42 - May 21, 2018

కరీంనగర్ : ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఎదురించి..వారిని ఒప్పించే విధంగా చేయాల్సిన ఓ ప్రేమ జంట తనువు చాలించు కోవాలని అనుకున్నారు. విషం తాగారు. ఈ ఘటనలో ప్రియురాలు మృతి చెందగా ప్రియుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మైలారంకు చెందిన అంజలి, లోహిత్ లు ప్రేమించుకున్నారు.

అంజలికి వివాహం చేయాలని పెద్దలు సంబంధాలు వెతుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న లోహిత్, అంజలిలు ఇంటి నుండి బయటకు వెళ్లిపోయారు. అనంతరం ఓ గుడి దగ్గర విషం సేవించారు. స్నేహితులు విషయం తెలుసుకుని ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ అంజలి మృతి చెందగా ప్రియుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. దీనితో అంజలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

19:55 - May 8, 2018

పెద్దపల్లి : జిల్లాలోని గోదావరిఖని మార్కండేయ కాలనీలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు భైఠాయించింది. 'ప్రేమించానని నీతోనే జీవితాంతం ఉంటానని చెప్పి నన్ను సింగారపు సృజన్ పెళ్లి చేసుకుని.. ఇప్పుడు ఇంట్లోలో నుంచి వెళ్లి పోమన్నాడని' బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. 'నీది తక్కువ కులమనే పేరుతో ఇంట్లో వాళ్లు తిడుతున్నారని..నువ్వు నాకు వద్దంటూ ఇంట్లో నుంచి బయటకి పంపాడని' ఆరోపించింది. 'మూడు సంవత్సరాల క్రితం నిన్ను ప్రేమించానని..నీతో కలిసి ఉంటానని చెప్పి ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నాడని' బాధితురాలు తెలిపారు. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు భైఠాయించడంతో ప్రియుడు సృజన్ కుటుంబ సభ్యులతో సహా పారిపోయాడు.

 

20:55 - March 6, 2018

యాదాద్రి : జిల్లాలోని మోత్కూరు మండలం బుజిలాపురం గ్రామంలో దారుణం వెలుగుచూసింది. ప్రేమించినట్టు నటించి పెళ్ళి చేసుకో అడగ్గానే ప్రియురాలు భార్గవిని.. ప్రియుడు నరేశ్ దారుణంగా హత్య చేసి చంపేశాడు. అనంతరం..తమ వ్యవసాయ బావి వద్ద పూడ్చి పెట్టాడు. భార్గవిని హత్య చేసిన తర్వాతిరోజే నిందితుడు.. మరో యువతిని వివాహం చేసుకున్నాడు.  

 

15:11 - January 11, 2018

నేరాల సంఖ్య పెరుగుతోంది. దీనికి అనేక కారణాలున్నా ఆర్థిక కారణాలతో నేరాలు జరుగుతున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ప్రియుడుతో కలిసి భర్తలను చంపిన భార్యల వార్తలు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్నాయి. పక్కా ప్రణాళికతో చేస్తున్నారా ? లేక ఆవేశంతో చేస్తున్నారా ? అనేది పక్కన పెడితే వీటికి మూల కారణాలు ఏంటీ ? ఇంతటి భయంకరమైన పరిస్థితులకు అసలు కారణాలు ఏంటీ ? వివాహేతర సంబంధాల కేసుల్లో మహిళలను నిందితురాలిగా చేయాలన్న అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలనకు తీసుకోవడం యాదృచ్చకమైనా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు భర్తల హత్యలు హల్ చల్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత మూడు నెలల కాలంలో పది హత్యలు జరిగినట్లుగా తెలుస్తోంది. నేరం ఎవరు చేసిన మహిళలు చేసిన నేరంపై ఎందుకు పెద్దగా మాట్లాడుకోవాల్సి వస్తోంది ? వారి పిల్లల భవిష్యత్ ఏంటీ ? తదితర అంశాలపై టెన్ టివి ఫోకస్ ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో దేవి (సామాజిక కార్యకర్త) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

22:28 - January 5, 2018
07:08 - December 29, 2017

రాజన్నసిరిసిల్ల : జిల్లాలోని ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి గ్రామ శివారులో దారుణం జరిగింది. ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతారం గ్రామానికి చెందిన మధు, సుస్మిత గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సుస్మిత బీఈడీ చదువుతుండగా.. మధు ఓ బేకరిలో పనిచేస్తున్నాడు. వీరి ప్రేమను పెద్దలు కాదనడంతో.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. కోళ్ల ఫారంలో కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాగాలనుకున్నారు. దాన్ని విరమించుకున్నారు. సుస్మిత ఒంటిపైన గాయాలు ఉండటంతో.. ఆమె మీద దాడి చేసి చంపిన అనంతరం మధు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - ప్రియురాలు