ప్రివ్యూ

13:41 - July 7, 2017

‘నాని'..టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరు. వరుసగా విజయవంతమై చిత్రాల్లో నటిస్తూ ముందుకు దూసుకెళుతున్నాడు. ‘నాని'తో సినిమా తీస్తే మినిమం వసూళ్లు వచ్చి పడుతాయనే ముద్ర పడిపోయింది. దీనితో ఆయనతో సినిమాలు తీయాలని దర్శక..నిర్మాతలు ముందుకొస్తున్నారు. నేచురల్ స్టార్ గా ముద్ర పడిన 'నాని' తాజాగా 'నిన్ను కోరి' తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శివ నిర్వాణ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ డివివి దానయ్య నిర్మించిన 'నిన్నుకోరి’ ప్రేక్షకులను అలరించిందా ?
ఈ సినిమాలో 'నాని' సరసన 'నివేదా థామస్' నటించగా 'ఆది పినిశెట్టి' ప్రత్యేక పాత్ర పోషించాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా గురించి భిన్నమైన టాక్ వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా నిర్మించారని సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ప్రేమ కథల్లా కాకుండా ఇది పెళ్లి తరువాత జరుగుతుందని, వివాహ వార్షికోత్సవంతో సినిమా మొదలవుతుందని సమాచారం.
ఎప్పటిలాగానే ఈ సినిమాలో కూడా 'నాని' పాత్రలో ఒదిగిపోయి నటించాడని, నివేదా థామస్..ఆది..లు వారి పాత్రల్లో ఒదిగిపోయి నటించారని టాక్. స్ర్కీన్ ప్లే కాస్త స్లోగా సాగిందని పలు సైట్లు రివ్యూల్లో పేర్కొంటున్నాయి. ‘నాని' గత సినిమాల స్థాయిలో అంతగా కామెడీ లేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది ? పర్ ఫెక్ట్ రివ్యూ గురించి సాయంత్రం టెన్ టివిలో చూడండి.

15:43 - April 28, 2017

'బాహుబలి -2’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ‘బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడన్న ఉత్కంఠ తొలగింపోయింది. ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం 'బాహుబలి -2’ సినిమా విడుదలైంది. ఈ చిత్రంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంపై టెన్ టివిలో స్పెషల్ రివ్యూ నిర్వహించారు. టెన్ టివి అసొసియేట్ ఎడిటర్ శ్రీధర్ బాబు విశ్లేషణ అందించారు. సినిమాలోని కొన్ని పాత్రలపై ఇంకా శ్రద్ధ తీసుకుంటే బాగుండేదనని తెలిపారు. 'శివగామి' పాత్ర నిరుత్సాహ పరిచిందని, మొదటి పార్ట్ లో అత్యద్భుతంగా నటించిందని కితాబిచ్చారు. పిల్లల విషయంలో ఎవరి మాట నమ్మాలి ? ఎవరి మాట నమ్మకూడదన్న అంశంలో క్యారెక్టర్ రాజమాతకు కుట్రలు తెలుసుకొనే అవకాశం ఉంటుందని, అనుష్క ప్రశ్నలు కూడా ఆమె పాత్ర ఫెయిల్యూర్ కనిపిస్తోందన్నారు. ‘శివగామి' పేరిట ఒక బుక్ వచ్చిందని కానీ సినిమాలో అంత లేదన్నారు. పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి.

09:05 - April 28, 2017

టాలీవుడ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' న్యూ చిత్రం 'సాహో' చిత్ర టీజర్ వచ్చేసింది. 'ఆ రక్తం చూస్తేనే అర్థమౌతోంది..రా..వాడిని చచ్చేలా కొట్టారని..సార్ అది వాడి రక్తం కాదు..మనవాళ్లది..ఇట్స్ షో టైమ్' అనే డైలాగ్స్ ఉన్నాయి. ఈ టీజర్ ను 'బాహుబలి -2’ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ లలో ప్రదర్శించనున్నారు. ‘బాహుబలి'..’బాహుబలి-2’ సినిమా కోసం కొన్ని ఏళ్లు కష్టపడిన 'ప్రభాస్' ఆ సమయంలో ఏ చిత్రాన్ని ఒప్పుకోలేదన్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి 2’ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తయిన అనంతరం 'సుజీత్' దర్శకత్వంలో రూపొందబోయే చిత్రానికి 'ప్రభాస్' కమిట్ అయ్యాడు. మొదటగానే టీజర్ ను రిలీజ్ చేసి ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచేశారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా చిత్రం రూపొందనుందని చిత్ర టీజర్ చూస్తే అర్థమౌతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై చిత్రం రూపొందనుంది. మే 2వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

13:52 - April 27, 2017

ప్రపంచ వ్యాప్తంగా 'బాహుబలి--2’ మేనియా పట్టుకుంది. శుక్రవారం విడుదలయ్యే ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి' సినిమాలో ఎన్నో ప్రశ్నలు మిగిలిపోయాయి. ‘బాహుబలి-2’ సినిమా ద్వారా ఆ ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరెకెక్కించిన సినిమా రికార్డుల సొంతం చేసుకుంటుందని టాక్. వేయి కోట్ల క్లబ్ లో చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే సినిమా మొదటి రివ్యూ వచ్చేసిందని సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. దుబాయ్ లో సినిమా చూసిన యూఏఈ, యూకే సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ప్రశంసల జల్లు కురిపించారు. ఏకంగా 5/5 రేటింగ్ ఇవ్వడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోతోంది.
ఈ సినిమా హాలీవుడ్ సినిమాల సరసన నిలుస్తుందని, అద్భుతంగా తెరకెక్కించారని, ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్', ‘హారీపోటర్'లతో సినిమాను పోల్చడం విశేషం. సినిమాలో బలమైన కథ..మహిష్మతి నగరం..జలపాతం..ఎత్తైన శిఖరాలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయని పేర్కొన్నారు. అందరూ పోటీ పడి నటించారని, ప్రభాస్ తన జీవితంలోనే అత్యద్భుతమైన నటనను కనబరచారని, భల్లాలదేవ పాత్రలో 'రాణా' తప్ప వేరే వ్యక్తిని ఊహించుకోలేమని పేర్కొన్నారు. భారతీయ సినీ దర్శకుల్లో 'రాజమౌళి' అద్భుతమైన వ్యక్తి అని, కథను తెరకెక్కించే విధానంలో ఆయన ఎవరూ సాటిరారని ఆయన అభిప్రాయపడ్డారు. మరి ఇది నిజమా ? కాదా ? అనేది తెలుసుకోవాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

15:24 - April 24, 2017

హైదరాబాద్ : బాహుబలి-2 సినిమా నిర్మాతలు ఈరోజు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కలిశారు. తెలంగాణాలో సినిమా ప్రదర్శనకు సంబంధించి ఆయనతో చర్చించారు. బాహుబలి-2 సినిమా ప్రమోషన్‌ గురించి తెలంగాణ ప్రభుత్వం తగిన సహకారం అందిస్తాదని మంత్రి తలసాని అన్నారు. వారంరోజుల పాటు ఐదు షో లు వేసుకుంటామని వారు అడిగారని దానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పామని ఆయన అన్నారు.

18:41 - February 24, 2017

టుడే అవర్ రీసెంట్ రిలీజ్  "విన్నర్ ’'. 'సాయి ధరమ్ తేజ్'  హీరోగా నటించిన ‘విన్నర్ ’ సినిమా ఇవాళ్టి మన నేడే విడుదల రివ్యూ టైం లో ఉంది. 'పిల్ల నీవు లేని జీవితం' సినిమాతో తన ఫిలిం కెరీర్ ని స్టార్ట్ చేసిన మెగా ఫామిలీ హీరో 'సాయి ధరమ్ తేజ్'.  యాక్షన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ తో 'విన్నర్' గా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మెగా ఫామిలీలో చాల స్పీడ్ గా సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తూ మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ కి దగ్గరైన హీరో 'సాయి ధరమ్ తేజ్'. 'విన్నర్' సినిమాలో తన ప్రేమను గెలిపించుకునే ప్రేమికుడిగా యాక్ట్ చేసాడు.

డైరెక్టర్ గోపిచంద్..
యాక్షన్ లో లవ్ మిక్స్ చేసి మాస్ ని అట్రాక్ట్ చెయ్యగల డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఇతని  డైరెక్షన్ లో వచ్చిన విన్నర్ వరల్డ్ వైడ్ గా ఇవాళ  రిలీజ్ అయింది. ఎనర్జిటిక్ హీరో సాయిధరమ్ తేజ్, బ్యూటీ టాలెంటెడ్ రకుల్ ప్రీత్ సింగ్, ట్రెండీ విలన్ జగపతిబాబు   నటించిన ఈ సినిమాకి నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మాతలు. ఈ సినిమా కి  థమన్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే జనాల్లోకి వెళ్ళింది. ఒక క్యూట్ లవ్ స్టోరీకి హార్స్ రేస్ ని కనెక్ట్ చేసి ఆడియన్స్ని కట్టిపడేసే ప్రయత్నం చేసాడు డైరెక్టర్.

మంచి రెస్పాన్స్..
ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లోనే పవర్ఫుల్ డైలాగ్స్ ని చూపించిన 'సాయి ధరమ్ తేజ్' మంచి మాస్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. 'రకుల్ ప్రీత్ సింగ్' అథ్లెట్ గా నటించిన ఈ సినిమాలో స్క్రీన్ మీద గ్లామర్ ని స్ప్రెడ్ చేసింది. ఈ సినిమాలో జగపతిబాబుతో పాటు అనూప్ ఠాకూర్ మరో విలన్ గా నటించారు. మరి ఈ ‘విన్నర్ ’ సినిమా తెలుగు ఆడియన్స్ ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసింది ? ఎంత వరకు రీచింగ్ అయ్యింది ? టెన్ టివి రేటింగ్ ఎంతో వీడియో క్లిక్ చేయండి.

16:13 - December 23, 2016

కమెడియన్ గా మంచి పొజిషన్ లో ఉన్న సప్తగిరి తొలిసారిగా హీరోగా ఎంట్రి ఇచ్చిన కామెడీ మూవీ సప్తగిరి ఎక్స్ ప్రెస్. తమిళ్ సినిమా తిరుడన్ పోలీస్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా జనాన్ని మెప్పించిందా..? నవ్వులతో ముంచెత్తిందా ? తెలియాలంటే .. రివ్యూ లోకి వెళ్లాల్సిందే. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ఒన్ ఆఫ్ ది బెస్ట్ కమెడియన్స్ గా ప్రూవ్ చేసుకున్న సప్తగిరిని ప్రధాన పాత్రగా కామెడీ ని పండించి క్యాష్ చేసుకున్నాయి బోలెడన్ని సినిమాలు. అయితే సప్తగిరి కూడా అందరి కమెడియన్స్ లాగానే హీరోగా వస్తాడని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. హీరో అవ్వాలని తన సొంత డెసిషనో లేక బలవంతం మీద వచ్చాడా అనే విషయాలు పక్కన పెడితే సప్తగిరిని హీరోగా జనం చూస్తారు ఫర్వాలేదు అనిపించుకున్నాడు ఈ సినిమాతో. అయితే ఈ సినిమా అందరూ ఊహిస్తున్నట్టు పక్కా కామెడీ మూవీయే కాకుండా ఎమోషన్ ను కూడా బాగానే క్యారీ చేసారు. సీరియస్ కథతో వచ్చిన తమిళ్ సినిమా తిరుడన్ పోలీస్ కు రీమేక్ గా తెరకెక్కిన చిత్రం సప్తగిరి ఎక్స్ ప్రెస్. తమిళ్ సినిమా నుంచి మంచి కాన్సెప్ట్ ను మాత్రమే తీసుకొని దానికి కామెడీ తో కలరింగిచ్చి బాగానే తెరకెక్కించారు. అయితే అనవసరమైన కామెడీ సీన్స్ తో మంచి కథను స్పాయిల్ చేస్తున్నారేమో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది కొన్ని కొన్ని సీన్స్ లో అయితే ఎమెషనల్ సీన్స్, కామెడీ సీక్వెన్సెస్ జనాన్ని బాగానే కూర్చోబెడతాయి. అయితే సినిమా బిగినింగ్ లో వచ్చే నాటకం సీన్, తండ్రి దగ్గర చెప్పే దానవీర శూరకర్ణ డైలాగ్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి.

కథ..
సినిమా నటుడౌదామని నాటకాలతోనూ, చిల్లర వేషాలతోనూ కాలక్షేపం చేస్తుంటాడు సప్తగిరి. అతడి తండ్రి సిన్సియర్ హెడ్ కానిస్టేబుల్. తన లాగే తన కొడుకును కూడా పోలీస్ ను చేసి మురిసిపోదామనుకుంటాడు. కానీ సప్తగిరి చేష్టలు ఆయన్ను బాగా బాధపెడతాయి. ఇదిలా ఉండగా కొన్ని అనూహ్యపరిస్థితుల్లో సప్తగిరి తండ్రి మరణిస్తాడు. తండ్రి ఉద్యోగం కొడుక్కి ఇస్తారు. కానిస్టేబుల్ గా డ్యూటీ లో చేరతాడు. అప్పుడు ఆ ఉద్యోగంలో తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. ఈ క్రమంలో ఆయనది సహజ మరణం కాదని, తన తండ్రిని ఎవరో మర్డర్ చేసారని దానికి కారకులు కూడా ఎవరో తెలుసుకుంటాడు. తండ్రి గొప్పతనం తెలుసుకున్న సప్తగిరి చివరికి రివెంజ్ ఎలా తీర్చుకున్నాడన్నదే మిగతా కథ. తమిళ్ సినిమాను యాజిటీజ్ గా తీసుకున్నా సరే తమిళ్ లో ఉన్న ఎమోషన్ ఈ సినిమాలో మిస్ అయినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో ఎన్ని కష్టాలున్నాయో హీరో తెలుసుకునే క్రమంలో వచ్చే సీన్స్ అంత ఎఫెక్టివ్ గా లేవనిపిస్తుంది. కొత్త దర్శకుడు అరుణ్ పవార్ అనుభవరాహిత్యం ఆ సీన్స్ లోనే తెలుస్తుంది. మొత్తం మీద సెకండాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ ప్రేక్షకుల్ని హిలేరియస్ గా నవ్విస్తాయి.

పాత్రల తీరుతెన్నులు...
కానిస్టేబుల్ సప్తగిరిగా సప్తగిరి బాగానే నటించాడు. అయితే అతి లేకుండా, హీరో బిల్డప్పుల్లేమీ లేకుండా మామూలు హీరోగానే నటించడం వల్ల పర్వాలేదనిపిస్తుంది. హీరోయిన్ సంగతి అయితే చెప్పుకోడానికి ఏమీలేదు. అసలు ఆమె హీరోయిన్ మెటీరియలే కాదనిపిస్తుంది. అంతేకాదు, ఆమె పాత్రను ఈ సినిమాలో లైట్ తీసుకున్నారనిపిస్తుంది. ఇక ఇల్లీగల్ బిజినెస్ లు చేయించే సి.ఐ గా కన్నింగ్ విలన్ గా పోసాని కృష్ణమురళి పర్వాలేదనిపిస్తాడు. అజయ్ ఘోష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదనిపిస్తుంది. అసలు ఆయన్ను దర్శకుడు ఏమాత్రం ఉపయోగించుకోలేక పోయాడనిపిస్తుంది. హీరో తండ్రి పాత్రలో డా.శివప్రసాద్ బాగా నటించారు. ఇక హీరో ఫ్రెండ్ గా మరో కానిస్టేబుల్ పాత్రలో షకలక శంకర్ ఈ సినిమాకు ఎంతో రిలీఫ్ గా అనిపిస్తాడు. అతడు పండించిన కామెడీ జనాన్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక గేస్ గా నటించిన జబర్దస్త్ కమెడియన్స్ గ్యాంగ్ చేసే కామెడీ కూడా బాగానే నవ్విస్తుంది. టోటల్ గా ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ నే హిలేరియస్ గా పేలాయి. అయితే తమిళ్ సినిమా చూసిన వాళ్ళు ఈ సినిమాను అంతగా ఎంజాయ్ చేయలేరు. కానీ బి, సి సెంటర్స్ జనం మాత్రం ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. మొత్తం మీద హీరోగా సప్తగిరి ఓకె అనిపించుకున్నాడు.

ప్లస్ పాయింట్స్
కామెడీ
సప్తగిరి నటన
మైనస్ పాయింట్స్
ల్యాగ్ సీన్స్
హీరో్యిన్
సంగీతం
రేటింగ్ : 2 / 5...

18:40 - November 11, 2016

'ప్రేమమ్' తో బ్లాక్ బస్టర్ హిట్టు ఖాతాలో వేసుకున్న 'అక్కినేని నాగచైతన్య' లేటెస్ట్ గా మూవీ 'సాహసం శ్వాసగా సాగిపో'తో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమా శుక్రవారం నుంచి థియేటర్స్ లో సందడిచేస్తోంది. 'ఏ మాయ చేశావె' లాంటి క్యూట్ లవ్ స్టోరీని తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ మీనన్, నాగచైతన్యతో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నాడు. 'ప్రేమమ్' విజయం తర్వాత 'నాగచైతన్య' నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై హైప్ బాగా పెరిగిపోయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ? ప్రేక్షకుల అభిప్రాయాలు..సినిమా రివ్యూ తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

16:19 - September 1, 2016

యంగ్ టైగర్ 'యన్టీఆర్' నటించిన లేటెస్ట్ మూవీ 'జనతా గ్యారేజ్'. 'మిర్చి', 'శ్రీమంతుడు' సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన 'కొరటాల శివ' మలిచిన మరో సందేశాత్మక చిత్రం ఇది. మరి ఈ సినిమాతో 'యన్టీఆర్' 'కొరటాల' సందేశాన్ని ఎంతవరకు క్యారీ చేసాడో తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చూడాల్సిందే.

లేని పంచ్ డైలాగ్స్..
సందేశాన్ని సినిమాగా చెప్పాలంటే వినోదం అవసరం లేదని 'కొరటాల శివ' సినిమాలు చెబుతుంటాయి. అయితే స్టార్ హీరోల్ని దృష్టిలో పెట్టుకొని కథలు అల్లుకొనేటప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ తప్పకుండా ఉండాలి కాబట్టి సందేశాన్ని, మాస్ ఎలిమెంట్స్ ను రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమా నడపాలి. 'జనతా గ్యారేజ్' ను కూడా 'కొరటాల' అదే రూట్లో ట్రావెల్ చేయించాడు. చక్కటి పాయింట్ ను అతి చక్కని ప్రజెంటేషన్ తో అదరగొట్టాడు. కాకపోతే ఇందులో 'యన్టీఆర్' రెగ్యులర్ సినిమాల మాదిరిగా పంచ్ డైలాగ్స్ ఉండవు, ఆవేశపు డైలాగ్స్ అసలుండవు. కేవలం కథకు అవసరమయ్యే మంచి డైలాగులు మాత్రమే వినిపిస్తాయి. కాకపోతే కథ పాతదే అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన చెత్త సినిమాల వల్ల వచ్చిన పొల్యూషన్ అంతా 'జనతా గ్యారేజ్' తో కొట్టుకుపోతుందని చెప్పుకోవచ్చు. టోటల్ గా 'జనతా గ్యారేజ్' ఓ క్లాసికల్ మాస్ మూవీ అని చెప్పాలి. కథ ఎక్కడా డీవియేట్ అవకుండా అనుకున్న పాయింట్ ను అనుకున్నట్టుగా తెరకెక్కించాడు 'కొరటాల శివ'.

కథ..
ఊళ్ళో జనానికి ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్ కి వెళతారు. కానీ పోలీస్ స్టేషన్ లో లభించే న్యాయం కన్నా 'జనతా గ్యారేజ్' హెడ్ సత్యం చేసే న్యాయానికే ఎక్కువ విలువనిచ్చి అతడ్ని దేవుడిలా భావిస్తారు ఊరి జనం. దాని వల్ల తన సొంత తమ్ముడు, అతడి భార్యని కోల్పోతాడు. ఫలితంగా సత్యం తమ్ముడి కొడుకుని, అతడి మేనమామ సత్యానికి దూరంగా తీసుకెళ్లిపోతాడు. మొక్కలంటే ప్రాణం పెట్టే ఆనంద్ కొన్ని పరిస్థితుల వల్ల సత్యమే తన పెదనాన్న అని తెలియకుండానే 'జనతా గ్యారేజ్' లోకి అడుగుపెడతాడు. ఆ తరువాత జరిగే ఆసక్తికరమైన మలుపులతో 'జనతా గ్యారేజ్' ప్రేక్షకుల్ని ఎమోషన్స్ తో కట్టి పడేస్తుంది. ముఖ్యంగా 'యన్టీఆర్', 'మోహన్ లాల్' పాత్రలు ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్. ఫస్టాఫ్ అంతా సరదా సరదాగా నడిచిపోతుంది. ఇంటర్వెల్ దగ్గర దిమ్మతిరిగే బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్ దగ్గరనుంచి సినిమా జనాన్ని కుర్చీలకు కట్టేస్తుంది.

పాత్రల తీరు తెన్నులు...
'మోహన్ లాల్' ను కంప్లీట్ యాక్టర్ అని ఎందుకంటారో ఈ సినిమా చూస్తే అర్ధమౌతుంది. డైలాగ్స్ ఏమీ లేకపోయినా కొన్ని కొన్ని సీన్స్ లో ఆయనిచ్చే ఎక్స్ ప్రెషన్స్ ఎక్స్ ట్రార్డినరీ. ఓన్ వాయిస్ వినిపించలేదని మనకి ఒకటే లోటుగా అనిపిస్తుంది తప్పితే ఆయన పెర్ఫార్మెన్స్ కు ఎవరూ పేరు పెట్టలేరు. అంతేకాదు 'యన్టీఆర్' కూడా ఈ సినిమాతో కంప్లీట్ యాక్టర్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా గ్యారేజ్ లోకి యన్టీఆర్ ఎంటర్ అయిన దగ్గరనుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ కు వెళుతుంది. కాకపోతే విలన్ తో 'జనతా గ్యారేజ్' కు ఉన్న కాన్ ఫ్లిక్ట్ అంత బలంగా అనిపించదు. విలన్ గా నటించిన 'సచిన్ కేడ్కర్' పాత్ర చివరికి తేలిపోయినట్టు అనిపిస్తుంది. 'మోహన్ లాల్' కొడుకుగా నటించిన 'ఉన్ని ముకుందన్' పాత్ర కూడా ఏమంత గొప్పగా అనిపించదు. అయితే ఇందులో కొన్ని ఎమోషన్ సీన్స్ తో జనం బాగా కనెక్ట్ అయిపోతారు. ముఖ్యంగా 'జనతా గ్యారేజ్' కోసం 'సమంతా' మీద ఉన్న ప్రేమను త్యాగం చేసే సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిపోతుంది. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ లో 'యన్టీఆర్' 'మోహన్ లాల్' దగ్గరకి వచ్చి కొడుకు గురించి చెప్పేసీన్ కూడా బాగా పండింది. 'రాజీవ్ కనకాల' ఆఫీస్ కి 'యన్టీఆర్' వచ్చే సీన్ అయితే అదిరిపోతుంది. ఇక క్లైమాక్స్ సీన్ లో ఎమోషన్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాని మాస్ జనం, ముఖ్యంగా 'యన్టీఆర్' ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే డౌట్. ఎనీహౌ 'జనతా గ్యారేజ్' ఈజ్ ఎ క్లాసిక్ ఎంటర్ టైనర్ .

ప్లస్ పాయింట్స్ :
మోహన్ లాల్, యన్టీఆర్ నటన
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఎమోషన్స్
సెంకడాఫ్ కథ
ఫోటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :
విలన్ కేరెక్టర్
ఎన్టీఆర్ లక్షణాన్ని సెకండాఫ్ నుంచి వదిలి పెట్టడం.
ఇద్దరు హీరోయిన్స్.

రేటింగ్ : 2.75/5

09:37 - September 1, 2016

జూనియర్ ఎన్టీఆర్..కొరటాల శివ కాంబినేషన్ లో నిత్యా మీనన్, సమంత, మోహన్ లాల్ నటించిన 'జనతా గ్యారేజ్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై అటు చిత్ర యూనిట్, ఇటు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నాయి. చిత్రం విజయం సాధిస్తుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. 'టెంపర్'..'నాన్నకు ప్రేమతో' వంటి సినిమాలతో 'ఎన్టీఆర్' మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. 'శ్రీమంతుడు' చిత్రం ద్వారా తానేమిటో 'కొరటాల' నిరూపించారు. జాతీయ స్థాయి ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న 'మోహన్ లాల్' ఈ చిత్రంలో నటించడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అసలు చిత్ర కథ ఏంటీ ? అనేది తెలుసుకోవాలంటే చదవండి...

కథ...
హైదరాబాద్ లో 'జనతా గ్యారేజ్' (ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడుతాయి) పేరిట ఓ గ్యారేజ్ ఉంటుంది. దీనిని సత్యం (మోహన్ లాల్), తమ్ముడు (రెహమాన్) నడుపుతుంటారు. తమ్ముడు (రెహమాన్) కొడుకు ఆనంద్ (ఎన్టీఆర్) ను 'జనతా గ్యారేజ్' కి దూరంగా పెంచడానికి మేనమామ (సురేష్)కి ఇచ్చి ముంబై పంపించేస్తాడు. ఎందుకంటే గ్యారేజ్ లో సమస్య అంటూ ఎవరొచ్చినా దానికి పరిష్కారం చూపిస్తుంటారు. దీనితో శత్రువులు పెరుగుతారు. ఆనంద్ కు హైదరాబాద్ లో ఓ కుటుంబం ఉందనే విషయం తెలియకుండా (సురేష్) పెంచుతాడు. ఇక ఆనంద్ (ఎన్టీఆర్) విషయానికి వస్తే ఇతనికి మొక్కలంటే పిచ్చి ప్రేమ. మొక్కకు హానీ జరిగితే ఊరుకోడు. దీనితో ఇతనికి కూడా ముంబైలో శత్రువులు పెరుగుతారు. ఓసారి హైదరాబాద్ కు ఆనంద్ (ఎన్టీఆర్) వస్తాడు. ఇక్కడకు వచ్చాక సత్యం (మోహన్ లాల్) ను కలుస్తాడు. సత్యం (మోహన్ లాల్) తన పెదనాన్న అని ఆనంద్ (ఎన్టీఆర్) కు తెలిసిందా ? అసలు జనతా గ్యారేజ్ ఎందుకు వచ్చాడు ? అలాంటి అవసరం ఏమొచ్చింది ? అనేది కథ. ఈ చిత్రంలో మోహన్ లాల్ పాత్ర కీలకం. ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ తో కనిపించాడు. మరి ప్రేక్షకుల అభిమానం పొందిందా ? లేదా ? అనేది తెలుసుకోవాలంటే టెన్ టివి ఫర్ట్ ఫెక్ట్ రివ్యూలో చూడండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - ప్రివ్యూ