ప్రీ రిలీజ్

12:13 - July 29, 2017

సెన్సేషనల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన 'సుకుమార్' నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తనలో ఉన్న నిర్మాణ ప్రతిభను 'దర్శకుడు' సినిమా ద్వారా చూపించబోతున్నాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. బిఎస్సిఎస్సి విజయ్ కుమార్, థామస్ రెడ్డి, రవిచంద్ర సత్తిలు సినిమాను నిర్మిస్తుండగా దర్శకుడిగా హరిప్రసాద్ జక్కా వ్యవహరిస్తున్నారు. అశోక్, ఈషా హీరో, హీరోయిన్లుగా నటించారు.

సినిమా ప్రచార కార్యక్రమాలను సుకుమార్ విభిన్నంగా నిర్వహిస్తున్నారు. టాలీవుడ్ లోని అగ్ర హీరోలతో ఈ ప్రచారం నిర్వహస్తున్నారు. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా 'దర్శకుడు' ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రానున్నారు. బంజారా హిల్స్ లోని తాజ్ ద‌క్క‌న్ లో ఈ వేడుక‌లు సాయంత్రం 6.30 కి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగ‌స్ట్ లో విడుద‌ల కానుంది. 

13:26 - March 26, 2017

ప్రపంచ వ్యాప్తంగా 'బాహుబలి 2’ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్ర టీజర్ ఇటీవలే విడుదలై సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున్న ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహిష్మతి సెట్ వేదికగా అట్టహాసంగా ఫంక్షన్ ను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 500 మందికి పైగా నిపుణులైన కార్మికులు శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. చిత్ర దర్శకుడు రాజమౌళి స్వయంగా ప్రీ రిలీజ్ వేడుక సెట్ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మహిష్మతి సామ్రాజ్యం కనిపించేలా ఎత్తైన భవంతులు, జలపాతాన్ని తీర్చిదిద్దారు. భల్లాలదేవుని బంగారు విగ్రహాన్ని ప్రతిష్టించిన ప్రాంతం ముందు ఈ వేడుక జరగనుంది. అతిథులు కూర్చొనేందుకు సింహాసన ఆకృతిలో ఉన్న కుర్చీలు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ముంబై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన డ్యాన్సర్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.

08:02 - March 20, 2017

తాజా చిత్రం 'కాటమరాయుడు' చిత్రంలో పవర్ స్టార్ 'పవన కళ్యాణ్' పై విధంగా డైలాగ్స్ పలికారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. పవన్ మరింతగా గ్లామర్ గా కనిపిస్తుండడం అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. "అమ్మాయిలు చాలా డేంజర్ రోయ్ .. చాలా చాలా డేంజర్ రోయ్" అనే డైలాగ్..."కోపాన్ని .. ఆయుధాన్ని ఎక్కడ వాడాలో తెలుసుకో" అంటూ పవన్ చెప్పిన డైలాగ్ బాగా ఆకట్టుకొంటోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాను ఏప్రిల్ 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. సినిమాకు సంబంధించిన సాంగ్స్ యూ ట్యూబ్ లో రెండు రోజుల కొకసారి విడుదల చేసిన సంగతి తెలిసిందే. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌మరార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు. శివ బాలాజీ, అజయ్‌, కమల్‌ కామరాజు, అలీ తదితరులు చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

06:29 - January 8, 2017

గుంటూరు : ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ వేడుకలో మెగా బ్రదర్ నాగబాబు ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌, దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై విరుచుకుపడ్డాడు. వెంటనే నాగబాబు వ్యాఖ్యలపై వర్మ, యండమూరి తీవ్రంగా స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్‌ 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ హాట్‌ కామెంట్లతో వేడెక్కింది. నాగేంద్రబాబు యండమూరి, వర్మపై చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రీమేక్ సినిమాలు తీస్తే తప్పేంటని, రీమేక్‌లు చేయడంలో తప్పులేదని వర్మపై కామెంట్‌ చేశాడు. అతనో అక్కుపక్షి...పిచ్చికూతలు కూస్తాడు అంటూ రామ్‌గోపాల్ వర్మపై నాగబాబు ఫైరయ్యాడు. సరిగా సినిమా తీయడం కూడా రాదు...ముందు ఆయన మంచి సినిమాలు తీయడంపై దృష్టి పెడితే బాగుంటుందన్నారు. సినిమాలు తీయడం చేతకానప్పుడు ఏదో ఒకటి వాగి ఫేమ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడన్నారు. యండమూరిని తప్పుపడుతూ.. 'ఆయన ఒక రచనా వ్యాసంగ నిపుణుడు... కనిపిస్తే కాళ్లకు దండం పెడతాను. అయితే అతనొక మూర్ఖుడు. పైగా వ్యక్తిత్వ వికాసం కోర్సు చెబుతున్నాడు..సొంత వ్యక్తిత్వం లేనివారు ఇతరులకు చెబుతారు' అంటూ విరుచుకుపడ్డారు.

ఘాటుగా స్పందించిన వర్మ..
నాగబాబు కామెంట్లపై వర్మ ఘాటుగా స్పందించారు. అంతకు ముందు సారీ చెప్పినట్లుగా ఉన్న ట్వీట్లు తాను చేయలేదని స్పష్టం చేశారు. తన ట్విట్టర్‌ అకౌంట్‌ను ఎవడో ఇడియట్‌ హ్యాక్‌ చేశాడని వర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. నేను ఎప్పుడూ తెలుగులో ట్వీట్‌ చేయలేదన్న వర్మ ఇంతకు ముందు చేసిన ట్వీట్లు తనవి కావన్నారు. ఇంగ్లీషులో తాను చేసే ట్వీట్లు అర్ధం చేసుకోలేకపోతే తెలుగులోకి అనువాదం చేసుకునేందుకు ఒక అనువాదకుడిని పెట్టుకోవాలని వర్మ నాగబాబుకు సూచించారు. తనకు సలహా ఇచ్చేముందు ఆలోచించుకోవాలని వర్మ నాగబాబుకు చురక అంటించారు.

స్పందించిన యండమూరి..
నాగబాబు వ్యాఖ్యలపై ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ స్పందించారు. తాను ఆరేడేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు నాగబాబు సరైన వేదికను ఎంచుకోలేదన్నారు. చరణ్ గురించి తాను తప్పుగా మాట్లాడలేదన్నారు. చరణ్ తండ్రి చిరంజీవి, దేవీశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి ఇద్దరూ తనకు మంచి స్నేహితులని యండమూరి గుర్తు చేశారు. మొత్తమ్మీద వర్మ, యండమూరిపై నాగబాబు చేసిన వ్యాఖ్యలపై జనాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. 'ఖైదీ నంబర్' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ వేదికగా మొదలైన ఈ వివాదం ఎంత వరకు దారి తీస్తుందో వేచి చూడాలి.

22:05 - January 6, 2017

గుంటూరు : మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం... ఖైదీ నెంబర్ 150 మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రేపు గుంటూరు జిల్లాలోని హాయ్‌ లాండ్‌లో జరగనుంది. ఈ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెగా స్టార్ కుటుంబసభ్యులంతా తరలివస్తున్న ఈ స్టార్‌ షోనూ వీక్షించేందుకు అభిమానులు కూడా భారీగా తరలిరానున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఇక వేడుకలో దేవీశ్రీ ప్రసాద్ మ్యుజికల్‌ షోలో మెగా కుటుంబసభ్యులు కనువిందు చేయనున్నారు. 

14:28 - December 27, 2016

మెగా స్టార్ 'చిరంజీవి' చిత్రం 'ఖైదీ నెంబర్ 150' సినిమా ప్రీ రిలీజ్ వేడుక కొద్ది రోజుల్లోనే జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లును చిత్ర యూనిట్ చేస్తోందని తెలుస్తోంది. విజయవాడలో జనవరి 4వ తేదీన ఈవెంట్ జరగనుంది. కొన్ని సంవత్సరాల అనంతరం 'చిరంజీవి' నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమాను 'కత్తి' రీమెక్ తో ఈ చిత్రం రూపొందుతోంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో 'చిరు' పక్కన 'కాజల్' హీరోయిన్ గా నటిస్తోంది. 'చిరంజీవి' కి 150వ చిత్రం కావడంతో అభిమానులు..ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్స్ వెరైటీగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సినిమా సాంగ్స్ ను యూ ట్యూబ్ లో విడుదల చేస్తున్నారు. డైరెక్ట్ గా మార్కెట్ లోకి ఆడియో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ పేర్కొనడంతో అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారంట. అభిమానులును తృప్తిపరిచేందుకు ప్రీ రిలీజ్ వేడుక చేయాలని భావించారు. ఈవెంట్ లో హోస్ట్ లు గా ఎవరు ? అనేది ప్రస్తుతం చర్చ జరుగుతోంది. టాలీవుడ్ కండల వీరుడు 'రానా, హీరో..కమ్ క్యారెక్టర్ పాత్రలు పోషిస్తున్న 'నవదీప్' లు హోస్ట్ లని టాక్ వినిపిస్తోంది. మరి ఇది నిజమా ? కాదా? అనేది తెలియాలంటే జనవరి 4 వరకు వెయిట్ చేయాల్సిందే.

12:01 - December 25, 2016

మెగా అభిమానుల ఎదురు చూస్తున్న వేళ రానే వస్తోంది. 'చిరంజీవి' నటిస్తున్న 'ఖైదీ నెంబర్ 150' చిత్రం కోసం మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత 'చిరు' మేకప్ వేసుకుంటున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమా 'కత్తి' రీమెక్ తో 'చిరు' 'ఖైదీ నెంబర్ 150' గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు..టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. వి.వి.వినాయక్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో 'చిరు'కు జోడిగా 'కాజల్' నటిస్తోంది. సినిమా ఆడియో వేడుక కోసం ఎదురు చూసిన అభిమానులకు చిత్ర యూనిట్ షాక్ ఇచ్చింది. డైరెక్ట్ గా ఆడియోను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో 'ఖైదీ'కి సంబంధించిన పాటలు రెండిటిని ఇటీవలే విడుదల చేశారు కూడా. అభిమానుల నిరుత్సాహ పరచకుండా చిత్ర యూనిట్ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. జనవరి మొదటి వారంలో ప్రీ రిలీజ్ వేడక నిర్వహించనున్నట్లు 'రామ్ చరణ్' స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈవెంట్ కి సంబంధించి తేది, వేదికని ఫైనల్ చేసి అఫీషియల్ గా ప్రకటించింది మూవీ యూనిట్. జ‌న‌వ‌రి 4న విజ‌య‌వాడలో 'ఖైదీ నంబ‌ర్ 150' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ని ఇటు అభిమానులు, అటు సినీప్ర‌ముఖుల మ‌ధ్య‌ గ్రాండ్‌గా జ‌ర‌పనున్నారని టీం ప్రకటించింది. 2017 మోస్ట్ ఎవైటింగ్ మూవీగా వస్తోన్న 'ఖైదీ నంబ‌ర్ 150' చిత్రం కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ పై నిర్మించబడుతోంది. బాలీవుడ్ న‌టుడు 'త‌రుణ్ అరోరా' విల‌న్ పాత్ర‌లో నటిస్తున్నాడు.

09:42 - December 2, 2016

మెగా కుటుంబం నుండి పరిచయమైన హీరోల సినిమాలపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటుంటారు. ప్రధానంగా మెగాస్టార్ 'చిరంజీవి' తనయుడు 'రామ్ చరణ్ తేజ' చిత్రాల గురించి ఆసక్తి ఎదురు చూస్తుంటారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలు కొన్ని డిజాస్టర్ గా మిగలడంతో 'రామ్ చరణ్' ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన 'తనీ ఒరువన్' తెలుగు రీమెక్ 'ధృవ'. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్‌, ఎన్‌.వి.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'మ‌గ‌ధీర' వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత రాంచ‌ర‌ణ్‌, గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ కాంబినేష‌న్‌లో 'ధృవ' వస్తోంది. ఇటీవలే చిత్ర ఫస్ట్ లుక్..పోస్టర్..టీజర్..థియేట్రికల్ ట్రైలర్ విడుదలయ్యాయి. ఇదిలా ఉంటే 'ధృవ' చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించింది. అందులో భాగంగా డిసెంబర్ 4వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 'రామ్ చరణ్' పోలీసు ఆఫీసర్ గా నటిస్తుండడంతో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను పోలీస్ స్టేషన్ లో నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించిందని టాక్. యూసుఫ్ గూడ పోలీస్ లైన్ లో ఈ ఫంక్షన్ ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. 'రామ్ చరణ్' సరసన 'రకూల్ ప్రీత్ సింగ్' నటించగా అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు నటించారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి. 

Don't Miss

Subscribe to RSS - ప్రీ రిలీజ్