ప్రేమజంట

14:51 - February 13, 2018

భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. హిరిప్రియ, సాయికుమార్ అనే ఇద్దరు ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. హరిప్రియ మృతి చెందగా, సాయికుమార్ పరిస్థితి విషమంగా ఉంది. వీరిని హన్మకొండ హంటర్ రోడ్డు వాస్తవ్యులుగా పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:49 - December 6, 2017

అదిలాబాద్‌ : జిల్లాలో విషాదం జరిగింది. జిల్లాలోని బట్టిసావర్గం వద్ద రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఇవాళ ఉదయం టోలర్స్‌ కాలనీకి చెందిన కల్యాణి (21), బట్టసావర్గం దుబాగుడకు చెందిన ముకేష్‌ (25)లు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. 

 

21:36 - October 11, 2017

జగిత్యాల : జిల్లాలో అమానుషం చోటుచేసుకుంది. నూకపల్లి గ్రామంలో ప్రేమ వివాహం చేసుకున్న జంటను కుల పెద్దలు బహిష్కరించారు. 2015లో గణేష్.. దళితురాలైన శ్రీలతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం ఉపాధి కోసం గణేష్‌ దుబాయ్‌ వెళ్లాడు. అయితే ఆ సమయంలో శ్రీలత తల్లిదండ్రుల వద్దే ఉంది. ఈ మధ్య గణేష్‌ దుబాయ్‌ నుంచి రావడంతో.. మళ్లీ కాపురం పెట్టారు. దీన్ని జీర్ణించుకోలేని కుల పెద్దలు దంపతులను కుల బహిష్కరణ చేశారు. దీనిపై దంపతులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకోకుండా... కులపెద్దలకే మద్దతు నిలిచారు. ఈ విషయం తెలియడంతో దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...


 

 

21:24 - July 23, 2017

నిర్మల్‌ : జిల్లాలోని కుబిర్‌ మండలం నిగ్వలో దారుణం జరిగింది. ప్రేమజంట పూజ, గోవింద్‌ను దారుణంగా హత్య చేశారు. పూజ సోదరుడు దిగంబర్‌ వారిని నరికి చంపాడు. అనంతరం మహారాష్ట్ర పోలీసుల ఎదుట దిగంబర్‌తోపాటు మరో యువకుడు లొంగిపోయాడు. మహారాష్ట్ర భోకర్‌ తాలూకా పెర్బానికి చెందిన గోవింద్‌, పూజ కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. ఇరువురి పెద్దలకు చెప్పడంతో వారు పెళ్లికి నిరాకరించారు. పూజకు తల్లిదండ్రులు మరో వ్యక్తితో పెళ్లి చేశారు. ఇష్టంలేని పెళ్లి చేయడంతో పూజ... తన ప్రియుడు గోవింద్‌తో కలిసి నిగ్వ గ్రామంలో కాపురం పెట్టింది. మరోవైపు పూజ సోదరుడు దిగంబర్‌ తన సోదరి పూజ కనిపంచడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిగ్వ గ్రామంలో ఉన్నారని తెలుసుకున్న పోలీసులు ప్రేమజంటను, దిగంబర్‌ను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కౌన్సెలింగ్‌ అనంతరం తిరుగు ప్రయాణంలో దిగంబర్‌.. అతని స్నేహితుడితో కలిసి పూజ, గోవింద్‌ను నరికి చంపాడు. పూజ, గోవింద్‌ది పరువు హత్యగా అనుమానిస్తున్నారు. 

 

13:57 - May 7, 2017

కడప : జిల్లాలో ప్రేమ జంటపై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. కడప నగరం ఆకుల వీధికి చెందిన ఓ బాలిక, అశోక్‌ నగర్‌కు చెందిన ఓ బాలుడు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అబ్బాయి తండ్రి, బంధువులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించారు. దీంతో పోలీసులు వెంటనే ప్రేమజంటను స్టేషన్‌కు పిలిపించారు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ మైనర్లు కావడంతో.. కౌన్సెలింగ్‌ చేయాల్సి ఉంది. కానీ సీఐ రామకృష్ణ బాలికను చితకబాదాడని.. అమ్మాయి బంధువులు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. దెబ్బలకు సొమ్మసిల్లిపడిపోయిన బాలికను హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలని ప్రాధేయపడినా.. పోలీసులు స్పందించలేదని ఆరోపించారు. పైగా తమ మీద కేసులు నమోదు చేస్తామని.. బెదిరిస్తూ దాడికి దిగబోయాడని బాధితులు వాపోయారు. 108కి సమాచారం ఇచ్చినా.. పోలీసులు వాహనాన్ని తిప్పి పంపేశారు. అయితే తాము ఎవరి పట్లా దురుసుగా ప్రవర్తించలేదని సీఐ తెలిపారు. మైనర్లు కావడంతో కౌన్సెలింగ్‌కు పిలిచామని అన్నారు. 

 

18:09 - March 18, 2017

నెల్లూరు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విజయమహల్‌ గేటు సెంటర్‌ వద్ద రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. యువకుడు కొండాపురం మండలం తూర్పుయర్రబల్లికి చెందిన వినయ్‌గా గుర్తించారు. ఆత్మహత్యకు చేసుకునే ముందు వీరిద్దరు రైల్వేట్రాక్‌ సమీపంలో కొద్దిసేపు మాట్లాడుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

21:23 - March 3, 2017

హైదరాబాద్ : నగరంలో  ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈఘటనలో ప్రియురాలు మృతి చెందారు. మెదక్ జిల్లాకు చెందిన అభిలాష్, సంయుక్త అనే ప్రేమికులు ముషీరాబాద్ రిసాలగడ్డలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకున్నారు. ప్రియురాలు సంయక్త మృతి చెందింది. ప్రియుడు అభిలాష్ పరిస్థితి విమషంగా ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

18:08 - November 29, 2016

యాదాద్రి : భువనగిరిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఆలేరు మండలానికి చెందిన భాస్కర్, నీలావేణి ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన వీరు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో అక్కడున్న స్థానికులు వారిని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. 

12:25 - November 17, 2016

కడప : జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యాయత్వానికి పాల్పడ్డారు. యువతి మృతి చెంది. జిల్లాలోని బద్వేల్‌ మండలం అగ్రహారంలో ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈఘటనలో యువతి మృతి చెందింది. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు.

17:00 - October 20, 2016

కరీంనగర్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని ఓ దేవాలయంలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకునేందుకు వచ్చిన మౌనిక అనిల్ అనే ప్రేమజంటపై వివాహం చేసుకునేందుకు దేవాలయానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న మౌనిక బంధువులు దాదాపు 15మందికి పైగా దేవాలయానికి చేరుకుని అనిల్ పై ఒక్కసారిగా కత్తులతో దాడిచేసి గొంతుకోసి దారుణంగా హత్య చేసారు. ఈ ఘటలో అనిల్ అక్కడి కక్కడే మృతి చెందాడు. అనిల్ తండ్రి ఎల్లయ్యను కూడా తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటానాస్థలికి చేరుకున్న సీఐ కేసు నమోదు చేసుకుని విచారణచేపట్టారు. అనిల్ విజయపురి కాలనీ వాసిగా పోలీసులు గుర్తించారు. పరారీలో వున్న నిందితుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. కాగా గతంలోనే వీరిద్దరూ వివాహానికి సిద్ధపడ్డారు. దీంతో మౌనిక బంధువులు మౌనిక మైనర్ అని వివాహం చేసుకోవటానిక వీల్లేదని పీఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసుల కౌన్సెలింగ్ తో గొడవ సద్దుమణిగింది. కాగా ఇటీవల మౌనిక మేజర్ కావటంతో వివాహానికి ఇద్దరూ తిమ్మాపూర్ దేవాలయంలో వివాహం చేసుకునేందుకు యత్నించటంతో ఈ దారుణహత్య చోటుచేసుకుంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - ప్రేమజంట