ప్లీనరీ

19:37 - October 22, 2017

హైదరాబాద్ : కొన్ని రోజులుగా సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న నటుడు పవన్ కళ్యాణ్ తాను స్థాపించిన 'జనసేన' పార్టీపై ఫోకస్ సారించారు. శనివారం ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో పవన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ జరిగిన సమావేశంలో వచ్చే 6నెలల్లో పార్టీ పరంగా చేపట్టబోయే ముఖ్య కార్యక్రమాలపై జనసేన నేతలతో పవన్ చర్చించారు. పార్టీ సభ్యత్వ నమోదు, ప్లీనరీ సమావేశాలు, పవన్ జిల్లాల పర్యటనపై నిర్ణయాలు తీసుకున్నారు. ప్లీనరీ ఎక్కడ నిర్వహించాలనే అంశంపై పవన్‌కు పార్టీ నేతలు.. పలు ప్రతిపాదనలు చేశారు.

మొదటిసారి జనసేన పార్టీకి సంబంధించి పవన్ ఈ కీలక సమావేశం నిర్వహించినట్లు చెప్పవచ్చు. త్వరలోనే తాను తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తానని పవన్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ చివరి వారంలో విధి విధానాలు ఖరారు చేస్తామని.. అనంతరం ప్రజల ముందుకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటానని పవన్ పేర్కొన్నారు. అనంతరం ఒక్కోక్కటిగా పనులు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే మూడు విభాగాలుగా జనసేన సైనికులను ఎంపిక చేశారు. మరి రానున్న రోజుల్లో పవన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి. 

15:18 - July 18, 2017

హైదరాబాద్ : చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి మండిప‌డ్డారు. వైసీప్లీ ప్లీనరీలో ప్రకటించిన నవ పథకాలతో సీఎం బాబు నవనాడులు చిట్లిపోయాయంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. హైద‌రాబాద్‌లోని వైసీపీ కార్యాల‌యంలో మీడియా స‌మావేశంలో మాట్లాడిన రోజా.. 2014 జూన్‌లోనే రాష్ట్రంలో బెల్టు షాపులు తొలగిస్తామని చంద్రబాబు సంత‌కం పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఇన్నేళ్లయినా బెల్ట్‌ షాపులను అరిక‌ట్టలేకపోయారని ధ్వజమెత్తారు. చంద్రబాబుని ఫాద‌ర్ ఆఫ్ బెల్ట్ షాప్ అని అంతా అంటున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో మ‌హిళ‌లు పోరాటం చేస్తున్నందుకు ఇప్పుడు నెల‌రోజుల్లో బెల్టు షాపుల‌ను అరిక‌డ‌తామ‌ని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ ప్లీనరీతోనే బాబు ప్రభుత్వంలో కదలికలొచ్చాయన్నారు.

08:25 - July 10, 2017

గుంటూరులో జరిగిన ప్లీనరీ వేదికగా వైసీపీ అధినేత జగన్‌ చంద్రబాబు పాలనపై సమరశంఖం పూరించారు. టిడిపి దుష్టపాలన గురించి ప్రజలకు వివరించేందుకు పాదయాత్ర చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్‌ 27న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే చేపట్టే తొమ్మిది కీలక కార్యక్రమాలను జగన్‌ ప్రకటించారు. ఈ అంశంపై విజయవాడ టెన్ టివి స్టూడియోలో జరిగిన చర్చా వేదికలో గౌతమ్ రెడ్డి (వైసీపీ), దుర్గాప్రసాద్ (వైసీపీ), బాబురావు (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

17:40 - July 9, 2017

గుంటూరు : వైసీపీలో అప్పుడే ఎన్నికల వాతవరణం నెలకొంది. రెండు రోజులుగా జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో ఆ పార్టీ అధ్యక్షడు జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల హామీలు ప్రకటించారు. ఆయన 9 హామీలను ప్లీనరీ వేదికగా వెల్లడించారు. రైతులకు కోసం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం,ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు చదువుకోవడం కోసం అమ్మ ఒడి పథకం, కిడ్నీ లాంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు పెన్షన్ పథకం, డ్వాక్రా పొదుపు సంఘాలకు సున్నా వడ్డీకే రుణాల పథకం, పొదుపు సంఘాలకు ఆసరా పథకం తీసుకొస్తామని జగన్ ప్రకటించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

16:36 - July 9, 2017

గుంటూరు :  జిల్లాలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ లో జగన్ రాబోయే తమ పార్టీ ఎన్నికల హామీలను ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 9 పథకాలు ప్రారంభిస్తామని జగన్ తెలిపారు. ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులందరీకి రూ.50వేలు ఇస్తామని, ప్రతి ఏటా మే నెలలో రూ.12,500 ఇస్తామని పేర్కొన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఈ డబ్బు చెల్లిస్తామని అన్నారు. ఆ డబ్బు ఎలా ఖర్చు చేయాలో రైతు ఇష్టమని తెలిపారు. రైతులకు సున్నా వడ్డీ, పావలా వడ్డీ రుణాలు ఇస్తామని, రూ.3వేల కోట్లతో రైతు స్థీరికరణ నిధి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి రైతుకు గిట్టు బాటు ధర హామీ ఇస్తామని జగన్ ప్రకటించారు. రూ.2వేల కోట్లతో కెలామెటీ రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి పల్లవాడు బడికి వెళ్లి చదువుకోవడానికి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు నెలకు రూ.500, 5వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు నెలకు రూ.750, ఇంటర్ కు నెలకు రూ.1000 ఇస్తామని జగన్ ప్రకటించారు. మహిళ సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు ఇస్తామని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు కోసం వీడియో చూడండి.

 

15:51 - July 8, 2017

గుంటూరు : వైయస్ రాజశేఖర్‌ రెడ్డి ప్రజలకోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని... YCP అధినేత జగన్‌ గుర్తుచేసుకున్నారు.. ప్రతి పేదవాడికి అండగా నిలిచారని చెప్పారు.. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ప్లీనరీలో చర్చ జరుగుతుందని చెప్పారు.. సీఎం బాబు పాలన ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని జగన్‌ చెప్పుకొచ్చారు.

22:06 - July 7, 2017
15:23 - July 6, 2017

గుంటూరు : వేదికగా జాతీయ స్ధాయి ప్లీనరీ సమావేశాలకు సిద్ధం అవుతోంది వైసిపి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఓపెన్ గ్రౌండ్‌లో ఈనెల 8,9 తేదీల్లో జరగనున్న ప్లీనరీ సమావేశాలకు ఏపీ, తెలంగాణ నుంచి 30 వేలమంది 
నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. వైసిపి అధినేత జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్లీనరీని విజయవంతం చేయడానికి తీవ్ర కసరత్తు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఏపీ, తెలంగాణకు సంబంధించి 18 తీర్మానాలతో ఈ సమావేశాలు జరగనున్నాయి. 
చివరి దశకు చేరుకున్న ఏర్పాట్లు
ఈ నెల 8, 9 తేదీల్లో గుంటూరులో జాతీయ స్థాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా 12 ఎకరాల స్థలంలో ప్లీనరీకి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ప్లీనరీకి ఏపీ, తెలంగాణ నుంచి సుమారు 30 వేల మంది నేతలు, కార్యకర్తలు వస్తారని అంచనా పార్టీ అధిష్టానం వేస్తోంది. 
నాలుగు కేటగిరీల్లో పాస్‌లు
వైసిపి ప్లీనరీకి జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి కమిటీలు, అనుబంధ సంస్థల ప్రతినిధులకు ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు. అయితే వచ్చే అతిధులకు నాలుగు కేటగిరీల్లో పాస్‌లు ఇవ్వనున్నారు. వివిఐపి, విఐపి, స్పెషల్, డెలిగేషన్ పాస్‌లుగా విభజించారు. వీరి కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్లీనరీని విజయవంతం చేయడం కోసం మొత్తం 18 కమిటీలను ఏర్పాటు చేశారు. భోజన కమిటీ, తీర్మానాల కమిటీ, సభ నిర్వహణ కమిటీ, వేదిక కమిటీ, పార్టీ అధ్యక్ష ఎన్నిక కమిటీ ఇలా ఏర్పడిన కమిటీలు ఆయా పనుల్లో నిమగ్నమయ్యాయి. ఇక ప్లీనరీలో కీలకమైన 18 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ఈ తీర్మానాల్లో 16 ఏపికి, రెండు తెలంగాణకు రెండు సంబంధించినవి ఉంటాయని సమాచారం. 
పార్టీ బలోపేతంపై చర్చ
ఇక ప్లీనరీలో ప్రధాన ఎజెండాగా పార్టీ బలోపేతంపై చర్చ జరగనుంది. వైసీపీ ప్లీనరీలో ప్రభుత్వ వైఫల్యాలను సైతం ఎండగట్టనున్నారు. ప్రజా సమస్యలపై పోరాటాల విషయంలో భవిష్యత్ కార్యాచరణను ప్లీనరీలో ప్రకటించనున్నారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపుపై ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనే దానిపై చర్చ జరగనుంది. ఇక 9వ తేదీన వైసిపి కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు. ఎన్నిక ప్రక్రియ లాంఛనం కావడంతో వైఎస్.జగన్ మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికకానున్నారు. 

 

15:59 - July 1, 2017

గుంటూరు : వైసీపీ జాతీయ ప్లీనరీకి సిద్ధమవుతోంది. ప్లీనరీ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను మొదలు పెట్టింది. ఈనెల 8,9 తేదీల్లో రెండు రోజులపాటు గుంటూరులోని ఎన్టీరంగా యూనివర్సిటీ సమీపంలోని ఓపెన్‌ గ్రౌండ్‌లో ఈ సమావేశాలు జరుగనున్నాయి. ప్లీనరీ కోసం దాదాపు 12 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైసీపీ ప్లీనరీ విజయవంతం కోసం మొత్తంగా 18 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలన్నీ ఏర్పాట్లలో మునిగిపోయాయి. ఇక వైసీపీ ప్లీనరీలో ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపైనే ప్రధానంగా చర్చించే అవకాశముంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంతోపాటు భవిష్యత్‌ కార్యక్రమాలను ప్లీనరీలో రూపొందించనున్నారు. నియోజకవర్గాల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫోకస్‌ పెట్టనున్నారు. పార్టీ బలోపేతంపైనా ప్లీనరీలో చర్చించనున్నారు. పలు ప్రజా సమస్యలపై ప్లీనరీ తీర్మానాలను ఆమోదించనుంది. ఈ ప్లీనరీలోనే పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఇందుకోసం 8వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. 9వ తేదీన నూతన అధ్యక్షుడిని ప్రకటిస్తారు. అయితే జగనే మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికకానున్నారు. 

21:20 - June 19, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - ప్లీనరీ