ఫెయిల్

18:18 - December 9, 2017

విశాఖ : విహారయాత్రకు వెళ్లి తిరిగివస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లి వస్తుండగా తిరుగుప్రయాణంలో యారాడ కొండ దిగుతుండగా అనకాపల్లి సిటీ పబ్లిక్ స్కూల్ బస్ కు బ్రేక్ లు ఫెయిల్ అయ్యాయి. దీంతో స్కూల్ బస్సు మరో రెండు స్కూల్ బస్సులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో 40 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. గాయపడిన విద్యార్థులను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. విశాఖలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 120 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, అనకాపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ విచారం వ్యక్తం చేశారు. అయితే ప్రమాదంపై స్కూల్ యాజమాన్యం నుంచి ఎలాంటి ప్రకటన వెలుడలేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:25 - September 26, 2017

హైదరాబాద్ : నగరంలోని కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ చెందిన కృష్ణ మూర్తి హార్ట్ సర్జరీ కోసం కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే హార్ట్ సర్జరీ ఫెయిలై కృష్ణ మూర్తి మృతి చెందాడు. డాక్టర్లు సర్జరీ చేసిన తరువాత బాగానే ఉన్నారని మృతిని బంధులు తెలిపారు. స్టంట్స్ ఫెయిల్ అవ్వడంతోనే చనిపోయడాని వారు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి ప్రధాన గేట్ వద్ద మృతదేహంతో ఆందోళన చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

14:04 - August 6, 2016

విశాఖ : ఎన్నో ప్రమాదాలు జరగకుండా కాపు కాసింది...నడి సంద్రంలో నావలకు మార్గం చూపింది...మత్స్యకారులకు పెద్ద దిక్కుగా నిలిచింది. మొత్తానికి విశాఖ నగరానికి వెన్నుముకగా ఉంది..అంతటి విశిష్టత కలిగిన నావిగేషన్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ నేడు అవసాన దశలో ఉంది.

బ్రిటీష్‌ కాలంలో ఏర్పాటు చేసి నావిగేషన్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ..
బ్రిటీష్‌ వారి హయాంలో నావిగేషన్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థను విశాఖపట్నం భీమిలీలో ఏర్పాటు చేశారు. తర్వాత కాలంలో ఇది మత్స్యకారులకు వరప్రదాయినిగా మారింది. అయితే మన పాలకుల అధికారంలో ఆ సిగ్నల్‌ వ్యవస్థ పూర్తిగా నాశనమైంది.

బ్రిటీష్‌ వారి వ్యాపార లావాదేవీలకు ఉపయోగపడిన సిగ్నల్‌ వ్యవస్థ..
ఎప్పటికప్పుడు తుఫాన్‌ హెచ్చరికలు జారీ ..నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునే వ్యాపారులు..బ్రిటీష్‌వారు ఓడల ద్వారా సరుకులు ఎగుమతులు, దిగుమతులు చేసేవారు. దీంతో ఇక్కడ లైట్ హౌస్, పోర్టు షిప్పింగ్ కార్యాలయంతో పాటు తుఫాన్‌లు వచ్చే సమయాల్లో హెచ్చరికలు జారీ చేసేందుకు 1840లో సిగ్నలింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. తుఫాను వచ్చే ముందు ఇక్కడ ఉన్న ఫ్లాగ్ పోస్టుకి దాని తీవ్రతను తెలియపరిచే నెంబరు బుట్టను, జెండాను ఎగురవేసేవారు. దీంతో ఇది మత్స్యకారులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేది.

భారత స్వతంత్ర్యం అనంతరం మూతబడిన పోర్టు..
అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత పోర్టు మూతబడిపోయింది. తర్వాత ఇక్కడి పోర్టు కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. అక్కడ బుట్టలు, జెండాలతో పాటు ఇతర సామాగ్రి పూర్తిగా శిథిలమయ్యాయి. అయితే ఇది లేకపోవడం వల్ల తిమ్మాపురం నుంచి అన్నవరం వరకూ సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్యకారులకు సమస్యగా మారింది. ఎప్పటికప్పుడు తుఫాను హెచ్చరికలు జారీ అవ్వడంతో వేటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండేవారు. ప్రస్తుతం తుఫాన్‌ పరిస్థితి తెలియక ఇబ్బందులు పడుతున్నారు.

తుఫానుకు ధ్వంసం అయిన సామగ్రి..
అలాగే విశాఖలో సంభవించిన హుద్‌హుద్‌ తుఫాన్‌కు ఇక్కడ సామాగ్రి మొత్తం ధ్వంసమయ్యాయి. దీంతో సిగ్నలింగ్‌ వ్యవస్థ పూర్తిగా మూలన పడింది. దీనిని పట్టించుకునేవారే కరువయ్యారని..ఈ సిగ్నలింగ్‌ వ్యవస్థను పునరుద్ధరించాలని పాలకులను కోరుతున్నామని స్థానికులు చెబుతున్నారు.

చరిత్ర ఆనవాళ్ళను కాపాడుకోవాల్సి అవసరం వుంది..
ఏది ఏమైనా చరిత్రకు ఆనవాలుగా నిలిచిన ఇటువంటి వ్వవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

06:37 - December 14, 2015

ఆగ్రా : మీరు చదువుతున్నది నిజమే. పరీక్ష రాసింది 12 వేల మంది అయితే పాసైంది 20 వేల మంది. ఎంతమంది పరీక్ష రాస్తారో అంత మంది పాస్ లేదా అందులో కొంతమంది ఫెయిల్ కావాలి అని అంటారు కదా..దీని గురించి తెలుసుకోవాలంటే ఇది చదవండి..

బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ...
ఆగ్రాలోని బీఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ. పెచ్చులూడి.. చెత్తగా కనిపిస్తున్న ఈ యూనివర్సిటీ అంతే చెత్త రికార్డును మూటకట్టుకుంది. బీఈడీ పరీక్షల ఫలితాలను ప్రకటించడానికి ఉపక్రమించిన అధికారులు తమ చేతిలో ఉన్న గణాంకాలను చూసి షాక్ కు గురయ్యారు. ఈ యూనివర్సిటీ తరపున మొత్తం పరీక్ష రాసిన విద్యార్థులు 12,800 మంది ఉన్నట్లు తొలుత తెలిపిన అధికారులు తీరా ఫలితాలను ప్రకటించే సమయానికి 20,089 మంది పాసైనట్లు గుర్తించారు. విద్యార్థుల సంఖ్యకంటే ఎక్కువమంది పాస్‌ కావడం అందరినీ షాక్‌కు గురిచేసింది.

విచారణకు ఆదేశాలు...
దీనిపై యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ మహమ్మద్ ముజమ్ముల్ విచారణకు ఆదేశించి, చివరి నిమిషంలో ఫలితాలను వాయిదా వేశారు. యూనివర్సిటీ బీఈడీ పరీక్షల ఫలితాల లిస్టును తయారు చేయడానికి ఓ ప్రైవేట్ ఏజెన్సీని నియమించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ కళాశాలలు నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ మంది విద్యార్థులను పరీక్షలు రాయడానికి అనుమతించడం వల్లనే ఈ గందరగోళం ఏర్పడిందని భావిస్తున్నారు. పరీక్షలు మొదలయ్యే రోజున కూడా కొన్ని కాలేజీలు విద్యార్థులను చేర్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు కళాశాలలు తమకు కేటాయించిన సీట్లకు మించి విద్యార్థులను చేర్చుకున్నట్లు గుర్తించిన అధికారులు.. కళాశాలల యాజమాన్యాన్ని విద్యార్థుల లిస్టును తీసుకురావాల్సిందిగా ఆదేశించారు. మొత్తానికి రికార్డుల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యకంటే ఎక్కువ రిజల్ట్‌ సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పారు. అక్రమార్కులను గుర్తించి చర్యలు తీసుకుంటారో లేక సర్లే అంటూ సర్దుకుపోతారో వేచి చూడాలి.

15:39 - September 22, 2015

అమెరికా : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..ఎక్కువగా విదేశాల్లో పర్యటించడానికి ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఆయా దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు, ఇతరులతో ఆయన సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఏ దేశంలో వెళ్లినా మోడీకి బ్రహ్మరథం పడుతున్నారని, ప్రపంచంలోనే నెంబర్ గా దేశం ముందుకు వెళుతోందని మోడీ భజన రాయుళ్లు పేర్కొంటుంటారు. కానీ పరిస్థితి ఒక్కసారిగా తిరగబడింది. అమెరికాలో కొందరు ఎన్నారైలు 'మోడీ ఫెయిల్ డాట్ కాం' పేరిట కొత్త వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈనెల 26వ తేదీ నుండి 'మోడీ' లో అమెరికాలో పర్యటించనున్న సందర్భంలో ఈ వెబ్ సైట్ ప్రారంభం కావడం గమనార్హం. దీనికి ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలు కూడా తోడు కావడంతో వెబ్ సైట్ వీక్షకుల సంఖ్య విపరీతంగా అధికమౌతోంది. మోడీ అధికారంలోకి వచ్చాక మైనార్టీలు..దళితులు..మహిళలు..పై దాడులు పెరిగిపోయాని వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు. పౌర హక్కులను మోడీ కాలరాస్తున్నారని, సాంస్కృతిక సంస్థల్లో మత ఛాందస రాజకీయాలు చొచ్చుకుపోతున్నాయని వారు పేర్కొంటున్నారు. దీనిపై బీజేపీ నేతలు ఏమంటారో ? 
watch the website : http://modifail.com/

12:38 - September 9, 2015

హైదరాబాద్ : అనంతపురంలోని ఓ ప్రయివేటు కళాశాలలో బీటెక్‌ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. శివకుమార్‌ అనే విద్యార్ధి సబ్జెక్టులు ఫెయిల్‌ కావడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయేముందు సబ్జెక్టులు ఫెయిలైనందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టాడు. 

18:42 - August 6, 2015

హైదరాబాద్: వరంగల్‌ రీజినల్‌ కంటి ఆస్పత్రిలో బుధవారం జరిగిన ఆపరేషన్లలో ఏడుగురికి ఫెయిలైనట్లు తెలుస్తోంది. వారిని హైదరాబాద్‌ సరోజినిదేవి కంటి ఆస్పత్రికి పంపించి చికిత్స చేయిస్తున్నారు. దీనికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ మెమోలు కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆస్పత్రి సూపరిండెంట్‌ ఈ వార్తలను ఖండిస్తున్నారు. తాము ఆపరేషన్లు చేసినవారిలో ఏడుగురికి రియాక్షన్‌ వచ్చిందని.. వారిని తామే ముందు జాగ్రత్తగా హైదరాబాద్‌ సరోజినిదేవి కంటి ఆస్పత్రికి పంపామంటున్నారు. వారందరూ ఇప్పుడు క్షేమంగానే ఉన్నారని కూడా స్పష్టం చేస్తున్నారు. సిబ్బందికి ఎలాంటి మెమోలు ఇవ్వలేదని.. కేవలం మెసేజ్‌లు పెట్టామని ఆయన వివరణ ఇస్తున్నారు. మెమోలు ఇచ్చారని.. తాము నిలదీశాకే వెనక్కు తీసుకున్నారని.. జరిగిన ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం ఆస్పత్రి అధికారులు చేస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. 

Don't Miss

Subscribe to RSS - ఫెయిల్