ఫెర్రీ

13:27 - December 9, 2017

విజయవాడ : టీడీపీ - బీజేపీలకు సపోర్ట్‌ చేసినందుకు తాను బాధపడుతున్నానని జనసేన అధ్యక్షుడు పవన్‌ అన్నారు. ఒంగోలులో పడవ ప్రమాద బాధితులను పలకరించిన ఆయన.. పడవ ప్రమాదంలో చనిపోయిన మృతుల ఆత్మలకు శాంతికలగాలని కోరుకుంటున్నట్టు పవన్‌ అన్నారు. టీడీపీకి సపోర్టు చేసి అధికారంలోకి రావడానికి కారణం అయిన తాను.. ప్రభుత్వ తప్పిదానికి నైతిక బాధ్యతగా మృతుల కుటుంబాలకు సభా ముఖంగా సారీ చెప్పారు. బాధ్యతను గుర్తు చేయడానికి మాత్రమే తాను ఇక్కడకు రావడం జరిగిందన్నారు. లోపాలున్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..తదితర కార్యాచరణ తీసుకోవాల్సి ఉండేదన్నారు. పడవ ప్రమాదంలో బాధ్యత లేదా ? అని లండన్ లో ఉన్న ఓ బాలుడు తనను ప్రశ్నించాడని, దీనితో తాను ఆలోచించి ఇక్కడకు రావడం జరిగిందన్నారు. మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు పవన్ వెల్లడించారు. 

13:26 - December 9, 2017

గుంటూరు : ఫెర్రీ పడవ ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాల సభ్యులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరు..అనంతరం జరిగిన పరిణామాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. జనసేన అధినేత ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. అయినవారిని కోల్పోయి దుఖంలో ఉంటే ప్రభుత్వం నుంచి కనీస సానుభూతి లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి....

19:08 - November 15, 2017

విజయవాడ : ఫెర్రీ ప్రమాద ఘటనలో 22 మంది మృతికి కారకులైన వారిని పోలీసులు అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ప్రధాన నిందితుడు కొండల్ రావుతో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసి విచారించారు. కొండలరావు, నీలం శేషగిరి రావు, మాచవరపు మనోజ్ కుమార్, యంజమూరి విజయ సారథి, గేదెల శ్రీను, బోటు నడిపిన భైరవ స్వామి, గేదెల లక్ష్మీలను అరెస్టు చేశారు. విహార యాత్రకు పనికొచ్చిన బోటు కాదని..చేపలు పట్టడానికి ఉపయోగించే బోటుకు మరమ్మత్తులు చేపట్టి నదిలో ఉపయోగిస్తున్నారు.

అనధికారికంగా బోటును తిప్పేందుకు..ఇతరత్రా వ్యవహారాల్లో ముగ్గురు మంత్రులు హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. టూరిజం శాఖ..జలవనరుల శాఖ అధికారులు..కొంత మంది పెద్దల కనుసన్నలలో బోట్లు నడుస్తున్నాయని సీఎం బాబుకు సమాచారం అందిందని తెలుస్తోంది. 

20:37 - November 14, 2017

జల సమాధి జవాబు ఏదీ ?

పవిత్ర సంగమంలో బోల్తాకొట్టిన పడవ ఎవరిది? ఏ రాజకీయ నాయకుల హస్తం ఉంది? అనుమతులు లేకుండా తిరుగుతుంటే ఏపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందా? లేక నేతలు కుమ్మక్కయ్యారా? అసలు ఓ ఆధ్యాత్మిక ఉత్సవంలో, ఓ టూరిస్టు ప్రాంతంలో సామాన్యులే ఎందుకు చనిపోతారు? సామాన్యులే ఎందుకు గాయపడతారు? దీనిపై ప్రత్యేక కథనం..గోదావరి పుష్కరాల్లో 30 మందిని బలిగొన్న ఘటన ఇంకా కళ్లముందు నుంచి చెరిగిపోలేదు. దానిపై విచారణ ఇప్పటికీ అతీగతీ లేదు. ఇక కార్తీక మాసంలో పవిత్ర సంగమం వద్ద జనం పోటెత్తుతారని తెలిసినా అప్రమత్తం కాని తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రైవేటు పర్యాటకానికి ఓ రేంజ్ లో ప్రచారం కల్పిస్తూ కనీస సదుపాయాలు కూడా కల్పించకుండా, భద్రతా ఏర్పాట్లు లేకుండా, ప్రభుత్వ నియంత్రణ లేకుండా గాలికి వదిలేయంటం చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం కాదా అని బాధితులు మండిపడుతున్నారు..

ఎలాంటి అనుమతులు లేవు..ఏ దారిలో వెళ్లాలో బోట్ నడిపేవాడికి తెలియదు.. దీనివెనుక ఎవరెవరు కుమ్మక్కయ్యారో అంతా గప్ చుప్.. ఎక్స్ గ్రేషియా ఇస్తాం.. కమిటీ వేస్తాం.. విచారణ జరుపుతాం.. ఆ విధంగా ముందుకెళతాం.. జాతరకెళితే ఇంటికి సేఫ్ గా రాగలరా? ఏదైనా దేవాలయ ఉత్సవానికెళితే సరైన రక్షణ ఉంటుందా? ఏ మాత్రం లేదని చరిత్ర చెప్తోంది. మన దేశంలో ఇలాంటి ప్రమాదాలు ఇప్పటివి కాదు. అనేక ఘటనలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. వాటిలో మొన్నటి పుష్కరాల ఘటన మొదటి కాదు.. నేటి పడవ ప్రమాదం ఆఖరికాకపోవచ్చు.. ప్రభుత్వాల నిర్లక్షం ఆ రేంజ్ లో కనిపిస్తోంది.

ఈ ప్రమాదాల చిట్టా చూస్తే అర్ధమయ్యేది ఒక్కటే..సామాన్య ప్రజలంటే పాలకులకు ఎంత చిన్నచూపో తెలిసిపోతుంది. హడావుడి చేసి, రండి రండి అంటూ పర్యాటకులను, భక్తులను ప్రచారార్భాటంతో ఆకర్షించటం తప్ప , హడావుడిగా ఉత్సవాలు నిర్వహించటం తప్ప అందులో ఎలాంటి చిత్తశుద్ధి కనిపించని పరిస్థితి. గాల్లో దీపంలా ప్రజారక్షణను వదిలేసే పాలకులదే నూటికి నూరుపాళ్లూ ఈ పాపం.. అసలీ బోటింగ్ సంస్థ వెనుక ఏపీ మంత్రి హస్తం కూడా ఉందనే వార్తలో నిజమెంత?

పవిత్ర సంగమంలో భక్తులు మరణించారంటే దానికి కారణం నూటికి నూరుపాళ్లూ ఏలికల నిర్లక్ష్యమే. ప్రచారం చేసుకున్నంత ఉత్సాహంగా ఏర్పాట్లు కూడా చేసి ఉంటే, ఇలాంటి విషాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి. ప్రజల ప్రాణాలకు వీసమెత్తు విలువివ్వకుండా, పర్యాటక ప్రాంతాల్లో పుణ్య క్షేత్రాల్లో ప్రభుత్వాలు కనబరుస్తున్న నిర్లక్ష్యంలో మార్పు రావలసిన అవసరం ఉంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:40 - November 14, 2017

గుంటూరు : కృష్ణా నదిలో ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఒంగోలు బీజేపీ నేతలు ఆరోపించారు. ప్రమాదంలో మృతి చెందిన ఒంగోలు వాసుల కుటుంబీకులను నేతలు పరామర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు మాటలు చెప్పడానికి మాత్రమే పరిమితమయ్యారని నేతలు ఆగ్రహించారు. కేవలం బైక్‌కి లైసెన్స్‌ లేకపోతేనే చలానా రాస్తున్న పరిస్థితిలో 38 మంది ప్రయాణించే బోటును ఆపలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు.

18:36 - November 14, 2017

విజయవాడ : ఫెర్రీ ఘాట్‌ పడవ ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరింది. ఏడేళ్ల చిన్నారి అశ్విత మృతదేహాన్ని రెస్క్యూ బృందం వెలికి తీసింది. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అశ్విత అమ్మ నాన్నమ్మ కూడా ప్రమాదంలో మృతిచెందడం కుటంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నదిలో గల్లంతైన ఒంగోలుకు చెందిన మరో మహిళ సుజన కోసం గాలింపు కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:20 - November 14, 2017

విజయవాడ : కృష్ణా నదిలో విజయవాడ ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 22 మంది చనిపోయారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బాధ్యులపై చర్యలు చేపట్టింది. ఏపీ అసెంబ్లీలో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు బాధ్యులైన వారికి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందుకు ఒక కమిటీ వేసి 24గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు.

మంగళవారం బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబుకు కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రాథమిక నివేదిక అందించారు. 25 మంది సామర్థ్యం ఉంటే 45 మందిని ఎక్కించారని, సదస్సులో తిప్పే బోటును కృష్ణా నదిలో తిప్పడానికి అనుమతి లేదని, రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్ సంస్థకు పెద్ద బోట్లు నడిపే అనుమతి లేదని నివేదికలో కలెక్టర్ పేర్కొన్నారు. గతేడాది వరకు కాకినాడలో ఉన్న బోటును విజయవాడ తెచ్చి మరమ్మత్తులు చేశారని తెలిపారు. ఇదిలా ఉంటే రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్ సంస్థ యజమానిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.

బోటు ప్రమాద ఘటనపై చర్యలు...
బోటు ప్రమాదానికి కారణంగా భావించిన పర్యాటక శాఖ కాంట్రాక్టు ఉద్యోగి గేదెల శ్రీనుపై వేటు పడింది. బోటు ప్రమాదం ఘటనలో మరో 8 మందిపై ప్రభుత్వం వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టూరిజం, జలవనరుల శాఖ మంత్రులు..అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. విజిలెన్స్ నివేదికను బుట్టదాఖలు చేయడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన నిబంధనలు అమలు చేయకపోవడంపై బాబు వివరణ కోరినట్లు సమాచారం. 

13:43 - November 13, 2017

విజయవాడ : పవిత్ర సంగమానికి వచ్చి 20 చనిపోవడం బాధాకరమని, స్వార్థం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఫెర్రీ ఘాట్ దగ్గర పవిత్ర సంగమంలో బోటు బోల్తా కొట్టిన ప్రమాదంపై ఏపీ శాసనసభలో ఆయన ప్రకటన చేశారు. ఆసుపత్రిలో నలుగురు చికిత్స పొందుతున్నారని, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.

ఇప్పటి వరకు 20 మృతదేహాలను వెలికి తీయడం జరిగిందని, మరికొంత మంది ఆచూకి తెలియరావాల్సి ఉందన్నారు. ఫెర్రీఘాట్ లో ఉన్న ఒకతను వెంటనే స్పందించి ప్రాణాలకు తెగించిన పిచ్చయ్య..కన్నా శివయ్యలు 9మందిని కాపాడారని, వీరిని అభినందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ బృందం..అత్యాధునిక సామాగ్రీతో అక్కడకు చేరుకోవడం జరిగిందన్నారు. విషయం తెలుసుకున్న మంత్రులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడం జరిగిందని, ఇందుకు తగిన ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్న 17 మంది వారి స్వగ్రామాలకు చేరుకోవడం జరిగిందన్నారు. ఘటనకు సంబంధించి కేసు బుక్ చేయడం జరిగిందని, కొండల్ రావు, శేషగిరి రావు, విజయ సారథి, శ్రీను, చిట్టిలపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

టూరిజం డిపార్ట్ మెంట్ తో ఒక ఎంవోయూ చేసుకుందని..పర్మిషన్ తీసుకొనే సమయంలో పలు నిబంధనలు పెట్టడం జరిగిందన్నారు. కానీ ఇతనికి పర్మిషన్ లేదని..సాయంత్రం సమయంలో ఎవరికీ ఎక్కించుకోలేమని టూరిజం సిబ్బంది పేర్కొనడం జరిగిందన్నారు. కానీ డబ్బుల ఆశతో వారిని బోటులో ఎక్కించుకున్నారని పేర్కొన్నారు. అనుభవం లేని డ్రైవర్..ఉన్నాడని..రూట్ కూడా అతడికి తెలియదన్నారు. ఒకే కుటుంబానికి చెందిన..ఇద్దరు..ముగ్గురు చనిపోయిన వారిలో ఉన్నారని..సీపీఐ నారాయణ కుటుంబానికి చెందిన వారు కూడా మృతి చెందిన వారిలో ఉన్నారని తెలిపారు.

ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని తెలిపారు. అంతర్జాతీయం..దేశీయంగా ఉండే నిపుణులను సంప్రదించి మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకొంటామని హామీనిచ్చారు. ఇందుకు సంబంధించి ఒక సంతాప తీర్మానం ప్రవేశ పెట్టి సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. 

13:19 - November 13, 2017

విజయవాడ : కృష్ణానదిలో విజయవాడ ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. బోటు బోల్తా పడిన ఘటనలో 16 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. కానీ గాలింపులు చేపడుతున్న సహాయక సిబ్బందికి మృతదేహాలు లభ్యమౌతున్నాయి. ఉదయం నుండి నాలుగు మృతదేహాలు సోమవారం ఉదయం లభ్యమైంది. దీనితో మృతుల సంఖ్య 20కి చేరుకుంది. గల్లంతైన వారికోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. మొత్తంగా 42 మంది బోటులో ప్రయాణిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:51 - November 13, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - ఫెర్రీ