ఫేస్ బుక్

20:47 - March 22, 2018

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌ బుక్‌ కు సంబంధించి యూజర్ల డేటా చోరీ ‌వ్యవహారం ప్రకంపాలు సృష్టిస్తోంది. ఫేస్‌బుక్‌ నుంచి యూజర్ల డేటా దొంగలించి… పలు దేశాల్లో రాజకీయ పార్టీలకు ఉపయోగపడిన కేంబ్రిడ్జ్‌ అనలిటికా అనే సంస్థతో కాంగ్రెస్ కు లింక్‌ ఉందని కేంద్ర ఐటి, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ ఆరోపించడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. రవిశంకర్‌ ప్రసాద్‌ ఆరోపణలకు కాంగ్రెస్‌ కౌంటర్‌ ఇచ్చింది. కేంబ్రిడ్జ్‌ అనలిటికా గాని, దేశంలో దాని అనుబంధ సంస్థ అయిన ఓవ్లెనో సంస్థ సేవలను గాని తమ పార్టీ వినియోగించుకోలేదని స్పష్టం చేసింది. దీనిపై టెన్ టివి ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో టెక్నాలజీ పాలసీ రీసెర్చ్ నిపుణులు కొడాలి శ్రీనివాస్ పాల్గొని విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:22 - January 26, 2018

తెలంగాణ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్చకు కాలం చెల్లినట్లైనా ? విమర్శకులు నోటికి తాళాలు వేసుకుని సైగలతో కాలం గడిపేయాలా ? ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్వర్వులు చూస్తే నిజమనిపిస్తోంది. కోపంలో దురుసుగా..కఠిన పదాలు వాడారో కేసు పెట్టేస్తారు....దూషణలు విచారించదగిన నేరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తోంది. సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. పరుష పదజాలంతో తిట్టినా, కించపరిచినా ఇక నేరంగా భావిస్తారు. ఐపీసీలోని 506, 507 సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టింగులూ పెట్టినా శిక్షార్హమైనదిగా నిర్ణయించారు. నిందితులుగా నిర్ధారించి వారిని జైలుకే పంపేలా చట్ట సవరణలు చేస్తోంది. అరెస్టుకు కోర్టు అనుమతి అవసరం లేకుండా సవరణలు చేశారు. 

13:29 - January 6, 2018

విశాఖ : ఫేస్‌బుక్‌లో పరిచయంతో ఇద్దరూ సహజీవనం చేశారు. 3నెలలు కలిసి తిరిగారు. తీరా పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ప్రియుడు కాస్తా జంపయ్యాడు. ఢిల్లీకి చెందిన కిరణ్‌సింగ్‌, రాజస్థాన్‌కు చెందిన కిషన్‌పాల్‌సింగ్‌ ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యారు. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ప్రియుడు కిషన్‌ విశాఖస్టీల్‌ ప్లాంట్‌లో ట్రయినింగ్‌ కోసం వచ్చాడు. తనవద్దకు రావాలని ప్రియురాలు కిరణ్‌సింగ్‌ను కూడా పిలిచాడు. విశాఖకు వస్తే పెళ్లిచేసుకుంటానని మాట ఇచ్చాడు. మూడునెలల తర్వాత ఇద్దరూ కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ప్రియురాలిని వదిలేసిన కిషన్‌సింగ్‌ కనబడకుండా వెళ్లిపోయాడు. దిక్కుతోచని బాధితురాలు మళ్లీ విశాఖకు వచ్చి కిషన్‌సింగ్‌ గురించి ఆరాతీసింది. కిషన్‌సింగ్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకుని రాజస్థాన్‌కు వెళ్లిపోయాడని తెలయడంతో కిరణ్‌సింగ్‌ స్టీల్‌ప్లాంట్‌లోని మహిళా పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పారిపోయిన ప్రియుడు కోసం వెదుకుతున్నారు.

14:57 - December 28, 2017

'సాంకేతిక రంగం'....సరికొత్త ఉత్పత్తులకు వినూత్న ఆవిష్కరణలకు వేడుక. ఈ సాంకేతిక రంగం ప్రపంచాన్ని శాసిస్తోంది. కొత్త కొత్త ఆవిష్కరణలతో..ఆధునిక ప్రపంచ పోకడలను తనలో అనుసంధానం చేసుకుని మానవ అవసరాలకు చిరునామాగా మారింది. అంతటి శక్తివంతమైన సాంకేతిక రంగంలో మహిళలు అత్యున్నతస్థాయిలో రాణిస్తున్నారు. సోషల్ మీడియాలో మహిళల పాత్ర అంశంపై టెన్ టివి మానవిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. కార్యక్రమ పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:08 - October 9, 2017

నిజామాబాద్ : సీఎం కేసీఆర్ వ్యతిరేకంగా ఫేస్ బుక్, వాట్సాప్ లో కామెంట్ పెట్టిన ఓ ఆర్టీసీ కండక్టర్ పై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. కేసీఆర్ పై ఫేస్ బుక్, వాట్సాప్ లో కామెంట్ పెట్టిన కండక్టర్ సంజీవ్ పై ఆర్టీసీ అధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సంజీవ్ ప్రస్తుతం నిజామాబాద్ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

20:57 - September 26, 2017

హైదరాబాద్ : రామ్‌గోపాల్‌ వర్మ నూతన చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ పోస్టర్‌ను ఆయన తన ఫేస్‌బుక్‌ అకౌంట్లో విడుదల చేశారు. దివంగత సీఎం ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా లక్ష్మీపార్వతికి అనుకూలంగా ఉంటుందేమోనని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ మూవీ కూడా కాంట్రవర్సీ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

20:41 - September 12, 2017

సోషల్ నెట్ వర్క్... ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్లపై ఇవాళ్టి మల్లన్నముచ్చట్లు. ఆవు నిరసన, రైలు పట్టాలపై పడుకున్న కుక్క, పిల్లగాని ఆలనాపాలన చూస్తున్న రామచిలుక, బీరు తాగిన కోతి, ఈతగొట్టిన ఏనుగు, ప్రత్యేక మిషన్ తో నీటిలోకెళ్లిన రష్యా అధ్యక్షుడు పుతిన్, కల్లు తాగిన విదేశీ మహిళ, సౌదీలో తెలుగు బిడ్డల గోస.. వంటి సంఘటనలు సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేశాయి. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

 

06:39 - August 12, 2017

విజయవాడ : ఏపీలో పొలిటికల్‌వార్‌ పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. సోషల్‌మీడియా వేదికగా అధికార, విపక్ష పార్టీలు హీట్‌ పెంచుతున్నాయి. ఈ విషయంలో వైసీపీ ఓ అడుగు ముందే ఉంది. వరుసగా పోస్టింగ్‌లతో అధికారపార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వైసీపీ పొలిటికల్‌ అడ్వయిజర్‌ ప్రశాంత్‌కిషోర్‌ వ్యూహంలో భాగంగా నడుస్తున్న సోషల్‌ మీడియా వార్‌ ఇపుడు హాట్‌టాపిక్‌గా మారింది. సాధారణంగా టెక్నాలజీలో తనకంటే ఘనులు లేరని చెప్పుకునే చంద్రబాబునే ఉక్కిరిబిక్కిరి చేసేలెవల్లో వైసీపీ అభిమానులు పోస్టింగులు పెడుతున్నారు. ప్రశాంత్ కిషోర్‌ వ్యూహంలో భాగంగా సోషల్‌ మీడియాలో వార్‌ మొదలు పెట్టినట్టు సమాచరం. దీనికోసం స్పెషల్‌ టీంను ఏర్పాటు చేసినట్టు చెప్పుకుంటున్నారు. ప్రశాంత్‌కిషోర్‌ వ్యూహంలో భాగంగానే వైసీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా మారినట్టు తెలుస్తోంది. టెక్నాలజీలో ముందుండే చంద్రబాబును అదే టెక్నాలజీతో దెబ్బకొట్టాలన్న ప్లాన్‌ ను వైసీపీ చక్కగా అమలు చేస్తోంది.

జగన్ యాక్టివ్..
మరోవైపు జగన్‌ కూడా ఎన్నడూ లేని విధంగా ట్విటర్‌, ఫేస్‌బుక్‌లలో కామెంట్లతో యాక్టివ్‌గా ఉంటున్నారు. వాస్తవానికి జగన్‌ 2009నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీగా మారినా.. సోషల్‌ మీడియాను అంతగా పట్టించుకోలేదు. తాజాగా ప్రతి అంశంలోనూ తన అభిప్రాయాలను కార్యకర్తలతో పంచుకుంటున్నారు. ఇదంతా ప్రశాంతకిషోర్‌ వ్యూహంలతో భాగంగానే జరుగుతున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.

వేల సంఖ్యలో ఖాతాలు..
వైసీపీ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ ప్లాన్‌లో భాగంగా ట్విటర్‌, ఫేస్‌బుక్‌లో వేల సంఖ్యలో ఖాతాలు ఓపెన్‌ చేశారు. అయితే ఆ అకౌంట్లన్నీ నార్త్ ఇండియా పేర్లతోనే ఉండటంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. ప్రశాంత్‌ కిషోర్‌ టీం మెంబర్లే ఇలా వైసీపీ కార్యకర్తల్లా పోస్టింగులు పెడుతున్నారని టీడీపీ అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కూడా ప్రశాంత్ కిషోర్‌ టీమ్‌ ఇవే పేర్లతో సోషల్‌మీడియాలో కామెంట్లుపెడుతూ తాము వ్యూహకర్తులుగా ఉన్న పార్టీలకు సహకరించినట్టు తెలుస్తోంది. సోషల్‌మీడియా వేదికగా నడుస్తున్న వైసీపీ పొలిటికల్‌ ప్రచారం అంతా బూటకమని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. దీని వెనుక ప్రశాంత్‌కిషోర్‌ టీమ్‌ ఉందంటున్నారు. టీడీపీని, చంద్రబాబును టార్గెట్‌ చేస్తున్న సోషల్‌ మీడియా అకౌంట్లన్నీ నార్త్ ఇండియా పేర్లతో ఉండటమే దీనికి రుజువు అంటున్నారు. మొత్తానికి సోషల్‌ మీడియా వేదికగా టీడీపీ-వైసీపీ మాటల యుద్ధం రాజకీయ వేడిని పీక్‌స్టేజ్‌కి తీసుకెళ్లింది. భవిష్యత్తులో ఈ టెక్నికల్‌ వార్‌ ఏపీ పొలిటిక్స్‌ను ఎటు తీసుకెళతాయో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 

10:23 - July 19, 2017

మీ పిల్లాడు ఏం చేస్తున్నాడు సార్..అంటే..ఇంటర్ మీడియట్..బీటెక్..ఏదో ఒకటి చెబుతారు కదా..కానీ మీ పిల్లాడు సెల్ ఫోన్ లో ఏం చేస్తున్నాడు ? ఎవరితో ఛాటింగ్ చేస్తున్నాడు ? స్కూల్..కాలేజీకని చెప్పి ఎక్కడకు వెళుతున్నాడు ? చూస్తున్నారా ? అంటే సమాధానం కొంతమందిలో రాదు. మీ పిల్లలు..స్కూల్ కు..కాలేజీలకు వెళుతున్నారా ? అయితే ఓ వారిపట్ల ఓ కంట కనిపెట్టండి. వారు ఏం చేస్తున్నారు ?..ఎక్కడకు వెళుతున్నారు ? తదితర విషయాలపై దృష్టి సారించండి.

పిల్లలపై దృష్టి ఎక్కడ ?
తమ పిల్లలను డాక్టర్..ఇంజినీర్..సాఫ్ట్ వేర్..చేయాలని ప్రతొక్క తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. అందుకని కష్టపడి పని చేస్తూ పైస..పైస కూడబెట్టుకుంటుంటారు. వారు ఏది అడిగితే అది ఇప్పిస్తూ వారి మనస్సును నొప్పియ్యకుండా జాగ్రత్త పడుతుంటారు. తమ దోస్త్ ఖరీదైన సెల్ ఫోన్ తీసుకున్నాడని...బైక్ కొన్నాడని..తమకు ఇప్పియ్యాలని అడగడం ఆలస్యం..వెంటనే లోన్లు..అప్పులు చేసి ఆయా సౌకర్యాలు కల్పిస్తుంటారు. ప్రతి నెలా పాకెట్ మనీ అంటూ డబ్బులు కూడా ఇస్తుంటారు. ఖరీదైన ఫోన్లు..బైక్ లు..పాకెట్ మనీ ఇవ్వడం తప్పు కాదు. కానీ వాటితో పిల్లలు ఏం చేస్తున్నారనే దానిపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. చేసే పనితో..చదువుతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటుటో ఉందంటే అది 'అంతర్జాలం'. పిల్లలు ఏం చేస్తున్నారు ? వాళ్ల స్నేహాలు ఎలాంటివి ? అనే ఆలోచించే తీరిక తల్లిదండ్రులకు ఉండడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిణామాలు అలా చేయిస్తున్నాయి. అందరూ కష్టపడితే గాని కుటుంబం సక్రమంగా నడవని పరిస్థితి నెలకొంది. కానీ ఇలా అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రస్తుతం జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తే అర్థమౌతుంది.

ఫోన్లు..అశ్లీలత..
సమాజంలో విశృంఖలంగా పెరిగిపోయిన అశ్లీలత..చదువుతో సంబంధం లేని ఫోన్లు..వాటిలో ఇంటర్ నెట్ వినియోగంపై తల్లిదండ్రుల నియంత్రణ లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. పిల్లల జీవితాలు నాశనం అవుతున్నా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. పిల్లల నడవడికపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలతో తల్లిదండ్రులు కనీస సమయాన్ని కూడా వెచ్చించడం లేదని సర్వేలు స్పష్టం చేస్తున్నారు. దీనితో తమకు ఎదురైన అనుభవాలను ఇంట్లో పిల్లలు స్వేచ్ఛగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాల్సి ఉంది. మంచి, చెడులు గురించి తల్లిదండ్రులు తెలియజేయాలి.

స్కూళ్లు..కాలేజీలు..
కొంతమంది ఉపాధ్యాయులకు పాఠశాలల మీద మమకారం..విద్యార్థుల మీద ప్రేమాభిమానాలు.. వృత్తి పై అంకిత భావం..సామాజిక బాధ్యత గతంలో ఉండేవి. అయితే ప్రస్తుతం విద్య విపరీత లాభాలను ఆర్జించే వ్యాపారమయింది. గతంలో ఉన్న అనుబంధాలు ప్రస్తుతం లేవని పలువురు పేర్కొంటుంటారు. అంతేగాకుండా స్కూళ్లు..కాలేజీల్లో టీచర్లు కేవలం పాఠాలకు మాత్రమే పరిమితమౌతున్నారు. స్కూల్ కు వచ్చిన విద్యార్థులు ఎలా ప్రవర్తిస్తున్నారు..వారి నడవడిక ఎలా ఉందనే దానిపై టీచర్లు దృష్టి కేంద్రీకరించడం లేదు. కేవలం మార్కులు బాగా రావాలని..బాగా చదవాలంటూ కొంతమంది టీచర్లు చెబుతూ వారిపై మరింత వత్తిడి తెస్తున్నారు. విద్యార్థులకు ప్రేమ..స్నేహ స్వభావాలను...సుగుణాలను పంచాలి. పిల్లలు వారిని దగ్గరకు చేర్చాలి. బోధన అంటే కేవలం పాఠాలు చెప్పడం కాదు. పిల్లలను అర్థం చేసుకొని వారితో కలిసి జీవించడం. పాఠశాలను, జీవితాన్ని విద్యార్థుల దృష్టితో చూడాలని పలువురు పేర్కొంటున్నారు.

పిల్లల్లో వచ్చే మార్పులను గమనించాలి..
నైతిక విలువల గురించి పిల్లలకు శిక్షణ ఇప్పించాలి. ఏదో మంచి..ఏది చెడు అన్న విషయాలను తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచి తెలియజేయాలి. సెల్‌ఫోన్‌లు సాధ్యమైనంతవరకు ఇవ్వకూడదు. టీవీలు,  సినిమాలు చూసిన తర్వాత పిల్లల్లో వచ్చే మార్పులను గమనించాలని నిపుణులు తెలియచేస్తున్నారు.

16:47 - July 16, 2017

విశాఖపట్టణం : సోషల్ మీడియా నేరాల్లో కొత్త కోణం వెలుగు చూసింది. నకిలీ ఫేస్ బుక్ ఖాతా ద్వారా పరిచయమైన కొంతమందితో స్వలింగ సంపర్కం చేసి వారిని బ్లాక్ మెయిలింగ్ చేస్తూ డబ్బులు లాగుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. నకిలీ ఫేస్ బుక్ ఖాతాల ద్వారా 'గే' గ్రూపుల ద్వారా పరిచయమైన ఐదుగురు యువకులు..నగరానికి చెందిన ఓ యువకుడితో స్వలింగ సంపర్కం చేశారు. ఈ వ్యవహరాన్ని అంతా రహస్యంగా చిత్రీకరించారు. అనంతరం వారు డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. రూ. 2 లక్షలు ఇవ్వకుంటే వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామని ఆ వ్యక్తిని బెదిరించారు. రూ. 2లక్షలు ఇచ్చిన ఇంకా డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బ్లాక్ మెయిల్ చేసే ఐదుగురు యువకులను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. రూ. 1.36 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

అప్రమత్తండా ఉండాలన్న పోలీస్ కమిషనర్..
ఫేస్ బుక్ లపై అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు కమిషనర్ నాగేంద్ర కుమార్ వెల్లడించారు. ప్రధాన నిందితుడు ముక్కాల ఆనంద్ ఉన్నాడని..మరో నలుగురు ఈ కేసులో ఉన్నారని పేర్కొన్నారు. విశాఖ జిల్లా కేంద్రంగా నడుస్తున్న 'గే' గ్రూపులో 2,335 మంది సభ్యులుగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వేధింపులకు గురవుతున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

Pages

Don't Miss

Subscribe to RSS - ఫేస్ బుక్