ఫైర్

19:13 - June 21, 2017

విశాఖ : అవినీతిపై మాట్లాడే హక్కు వైసీపీ అధినేత జగన్‌కు లేదని మంత్రి అయ్యన్నపాత్రులు అన్నారు. ప్రతిపక్షనేత జగన్‌ కుటుంబం మొత్తానిది అవినీతి చరిత్రేనని ఆరోపించారు. 2009 నుంచే విశాఖలో భూకుంభకోణాలు మొదలయ్యాయని చెప్పారు.

19:36 - June 12, 2017

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు నిప్పులు చెరిగారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ఘరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రులో బలవంతపు భూసేకరణను అడ్డుకుంటామని హెచ్చరించారు. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో జరిగే రైతు ఉద్యమాలకు మద్దతుగా ఏపీలోనూ ఉమ్మడి ఐక్య కమిటీలుగా ఏర్పడి పోరాటాలు చేస్తామన్నారు.

21:20 - June 2, 2017
16:58 - May 28, 2017

విశాఖ : మహానాడును వెన్నుపోటు మహానాడు అంటూ రోజా వ్యాఖ్యానించడంపై టిడిపి మహిళా లీడర్లు మండిపడ్డారు. ప్రెస్ మీట్‌ పెట్టి మరీ కడిగి పారేశారు. వెన్నుపోటు రాజకీయాల గురించి రోజాకు మాట్లాడే హక్కు లేదని.. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని మరీ రాజకీయాలు చేసిన ఘనత ఎవ్వరిదని ప్రశ్నించారు ఎమ్మెల్యే అనిత. మహానాడులో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనడం వాస్తవం కాదన్నారు టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. వైసిపి వల్ల జీవితనం నాశనం చేసుకున్న ఐఏఎస్ అధికారిణికి మీరేం చేశారని ఆమె రోజాను ప్రశ్నించారు. తను చేసే షోల చూసి మహిళలు ఎంత అసహ్యించుకుంటున్నారో రోజా ఒకసారి ఆలోచించుకోవాలని.. నైతికత గురించి మాట్లాడే హక్కు రోజాకు లేదని టిడిపి మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి విమర్శించారు. 

17:19 - May 26, 2017

హైదరాబాద్ : కేసీఆర్‌ అవినీతే.... తెలంగాణ ప్రగతికి అడ్డంకిగా మారిందని బీజేపీ నేత నాగం జనార్దర్‌రెడ్డి ఆరోపించారు. ఒక్క పాలమూరు - రంగారెడ్డి పంప్‌హౌస్‌లోనే 2400 కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఈ అవినీతిపై ఆధారాలతో కేసీఆర్‌కు ఓ లేఖరాశానన్నారు. ఆరోపణల్లో వాస్తవంలేకుంటే తనపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. తెలంగాణ అభివృద్ధిలో కాదు... అవినీతిలో నంబర్‌వన్‌ అని అభివర్ణించారు.

19:12 - May 25, 2017

హైదరాబాద్ : అమిత్ షాపై కేసీఆర్ మాటల యుద్ధాన్ని డ్రామాగా అభివర్ణించారు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి. కేసీఆర్ మోడీతో రహస్య స్నేహాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి మద్దతు ఇవ్వబోమని ప్రకటించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తామని జైపాల్ రెడ్డి చెప్పారు. 

21:27 - May 20, 2017

కడప : కేంద్ర ప్రభుత్వతీరుపై ఫైర్ అయ్యారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి.. విభజన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.. కడప జిల్లాలో లాభనష్టాలతో ప్రమేయంలేకుండా స్టీల్‌ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టాలన్నారు.. దుగరాజపట్నం ఓడరేవును నిర్మిస్తామని హామీ ఇచ్చిన కేంద్రం.. ఎందుకు వెనక్కి తగ్గిందని ప్రశ్నించారు.. రాష్ట్రం విడిపోయేటప్పుడు 16వేల 500కోట్ల లోటుబడ్జెట్‌ ఉంటే ఇప్పటివరకూ కేవలం 2వేల 300కోట్లు మాత్రమే ఇచ్చారని సోమిరెడ్డి మండిపడ్డారు.... కడపలో నిర్వహించిన టిడిపి మిని మహానాడులో సోమిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు..

21:26 - May 19, 2017

హైదరాబాద్: మోదీ, కేసీఆర్‌ ప్రభుత్వాలపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ ఫైర్‌ అయ్యారు. కేంద్రం రైతువ్యతిరేక విధానాలు అవవలంబిస్తోందన్నారు. రైతుల సమస్యలపై కేంద్రం నిర్లక్ష్యపూరింతంగా వ్యవహరించడం వల్లే .. దేశవ్యాప్తంగా అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణలో మిర్చిరైతులు, ఉపాధిహామీ కూలీల సమస్యలపై బృందాకరత్‌ గళమెత్తారు. ఉపాధి హామీకూలీల పట్ల కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిర్దయగా ప్రవర్తిస్తున్నాయని ఆమె మండిపడ్డారు. జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు తెలంగాణలో 36శాతం మంది ఉపాధి హామీ కూలీలకు డబ్బులివ్వలేదని బృందాకరత్‌ అన్నారు. ఓవైపు తమ రాష్ట్రంలో 98శాతం ఆధార్‌కార్డులు ఇచ్చేశామని కేసీఆర్‌ ప్రభుత్వం చెప్పుకుంటోంది. కాని.. కేవలం ఆధార్‌కార్డు లేదన్న సాకుతో నిరుపేదల కడుపులు కొడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

17:48 - May 13, 2017

ఖమ్మం : టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి. మంత్రి హరీశ్‌ రావు ఐదున్నర లక్షలకు ఐస్‌ క్రీం అమ్ముతారని... రైతులకు పదివేల రూపాయల మద్దతు ధరమాత్రం ఇవ్వలేరని విమర్శించారు. ప్లీనరీ పేరు మీద వెయ్యికోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. రైతులకు మద్దతుధర ఇచ్చి పంట కొనలేని సన్నాసి సీఎం కేసీఆర్ అని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.. ఖమ్మంలో మిర్చి రైతులను ఆదుకోవాలంటూ కలెక్టరేట్ ముందు టీటీడీపీ రైతు పోరు దీక్ష నిర్వహించింది.. ఈ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డితో పాటు, పెద్దిరెడ్డి, సండ్ర, వేం నరేందేర్‌రెడ్డి, సీతక్క పాల్గొన్నారు. మిర్చి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

19:25 - May 8, 2017

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబుపై వైసిపి తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మంత్రి సోమిరెడ్డి. పెట్టుబడుల కోసం చంద్రబాబు అమెరికా వెళ్తే పార్టీ నిధులు సేకరించడానికి వెళ్లాడని.. ఆయనను అరెస్ట్ చేయమని అమెరికా పోలీసులకు వైసిపి నేతలు మెయిల్స్ పెట్టారని సోమిరెడ్డి ఆరోపించారు. వైసిపి పెట్టిన మెయిల్స్ కారణంగా చంద్రబాబుకు సెక్యూరిటీ పెంచారని, మెయిల్స్ పెట్టిన వారి వివరాలను అమెరికన్ పోలీసులు సేకరిస్తున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు పర్యటన నుంచి వచ్చాక ప్రభుత్వం తరపున మెయిల్స్ పంపిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని సోమిరెడ్డి చెప్పారు.

Pages

Don't Miss

Subscribe to RSS - ఫైర్