బంగాళాఖాతం

09:21 - April 16, 2017

విశాఖపట్టణం : బంగాళాఖాతంలో 'మారుత' తుపాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. తీవ్ర వాయుగుండంగా తుపాన్ మారింది. ప్రస్తుతం మాయాబందర్ కు 340 కి.మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తరాంధ్రలో ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

14:11 - December 12, 2016

వర్ద...అంటే ఏమిటీ ? ఈ పేరు ఎందుకు పెట్టారు..ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. చెన్నైలో 'వార్దా' తుపాన్ బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వర్దా తీవ్ర తుపాను చెన్నై తీరాన్ని దాటింది. దీనితో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు తుపాన్ లు ఏర్పడిన సమయంలో కొన్ని పేర్లు పెడుతుంటారు. రౌనా, హుద్ హుద్, లైలా, పైలిన్, లెెహెర్, హెలిన్, నీలం వంటి పేర్లు పెట్టారు. తాజాగా 'వర్ద' పేరు పెట్టారు. వర్ద అంటే ఏమిటీ ? వర్ద అంటే అరబిక్, ఉర్దూ భాషల్లో గులాబీ అని అర్ధం. ఈ పేరును పాకిస్తాన్ సూచించింది.
గాలి వేగం గంటకు 39 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే పేర్లు పెట్టేవారు. కరేబియన్ దీవుల్లోని ప్రజలు రోమన్ కేథలిక్ క్యాలెండర్ ప్రకారం ఏ రోజు హరికేన్ లేదా తుపాను ప్రారంభమవుతుందో ఆ రోజు పేరును ఆ తుపానుకు పెట్టేవారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని తుపాన్లకు పేరు పెట్టడం 2000లో ప్రారంభమై 2004లో ఆచరణలోకి వచ్చింది. 
బంగాళాఖాతం, అరేబియా సముద్రం పరిధిలోని దేశాలైన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, శ్రీలంక, థాయ్ లాండ్ లు తుపాన్లకు పేరు నిర్ణయిస్తాయి. ఈ ఎనిమిది దేశాలు కలసి 64 పేర్లతో ఒక జాబితాను రూపొందించింది. ఈ జాబితా ప్రకారం న్యూఢిల్లీలోని ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రం తుపానుకు పేరు నిర్ణయిస్తుంది.
హిందూ మహా సముద్రంలో వచ్చే తుపానులకు భారత దేశం అగ్ని, ఆకాశ్‌, బిజిలి, లాల్‌, లహర్‌, మేఘ్‌, సాగర్‌, వాయు అనే పేర్లు ఇచ్చింది. లైలా పేరును పాకిస్థాన్‌ పెట్టింది. థానే పేరును మయన్మార్‌ పెట్టింది. ఆయా దేశాల సామాన్యులు సులువుగా గుర్తు పెట్టుకునేందుకు, తుపానుల ప్రభావాన్ని చారిత్రకంగా నమోదు చేయడానికి తుపానులకు పేర్లు పెడతారు.1953లో అట్లాంటిక్ మహాసముద్రంలో తుఫానులు వచ్చినపుడు హరికేన్స్, ట్రోపికల్ పేరుతో పిలిచారు. మనదగ్గర నీలం, హెలిన్, లెహెర్, ఫైలిన్, హూద్ హుద్, రౌనా వంటి తుపాన్ లు అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే.
 

తుఫానులకు పేర్లు పెట్టటం ద్వారా ప్రజలను అప్రమత్తం చేయటం తేలిక అవుతుందని నిపుణుల అంచనా. అందుకే పేర్లు పెడతారు. ఇప్పుడు వర్ద తుపాన్ ఎం చేస్తుందో చూడాలి. 

10:32 - December 9, 2016

విశాఖ : బంగాళాఖాతంలో కొనసాగుతున్న వార్ధా తుపాను..24 గంటల్లో పెను తుపానుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈనెల 12న కాకినాడ, నెల్లూరు మధ్య తీరం దాటనుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి కోస్తాంధ్రపై తుపాను తీవ్ర ప్రభావం చూపనుంది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో పాటు.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.  

21:21 - December 8, 2016

విశాఖ : బంగాళాఖాతంలో పెను తుఫాను ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటల్లో ఉత్తరంగా కదిలి తుపానుగా మారింది. రేపటిలోగా పెను తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతవరణశాఖ అంచనా వేస్తున్నారు. ఈ తుపానుకు వార్దా అని పేరుపెట్టారు. ప్రస్తుతం వార్దా తుపాను బంగాళాఖాతంలో విశాఖకు ఆగ్నేయంగా 1060 కి.లో మీటర్ల దూరంలో,..మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 1150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వార్ధా తుపాన్ ప్రభావంపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:39 - December 7, 2016

విశాఖ : బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరో 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు అంచనావేస్తున్నారు. ప్రస్తుతానికి 1180 కిలోమీటర్లు దూరంలో విశాఖకు దక్షిణ ఆగ్నేయంగాను.. గోపాల్ పూర్‌కు 1280కిలోమీటర్ల దూరంలోనూ.. అండమాన్‌కు 250 కిలో మీటర్లు దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందన్నారు. వాయుగుండం గంటకు 14 కిలోమీటర్లు వేగంతో పయనిస్తుందని తెలిపారు. వాయుగుండం తుపాన్ గా మారితే పాకిస్థాన్ సూచించిన వరదగా నామకరణం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

18:44 - November 29, 2016

హైదరాబాద్ : భూమధ్య రేఖ సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరో మూడు రోజుల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. దీని ప్రభావం తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని తెలిపింది. తెలంగాణకు వర్షసూచన లేదు కానీ రాత్రి చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. 

07:15 - October 1, 2016

విజయవాడ : హైదరాబాద్‌లో నిన్న రాత్రి కుండపోత వర్షం కురిసింది. దాదాపు మూడుగంటలపాటు ఎడతెరిపి లేకుండా పడిన వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉత్తర కోస్తాకు ఆనుకుని బంగాళాఖాతంలో శుక్రవారం మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికితోడు విశాఖపట్నం మీదుగా పశ్చిమ, తూర్పుగా ద్రోణి వుంది. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాలో విస్తారంగా, తెలంగాణలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. అక్టోబర్‌ రెండు నుంచి తెలంగాణలో వర్షాలు పెరుగుతాయని, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

10:32 - September 23, 2016

హైదరాబాద్ : బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. దీని ప్రభవాంతో తెలుగురాష్ట్రాల్లో కుండపోతగా వానలు పడనున్నాయి. మరో రెండు రోజులు బారీ నుంచి అతిభారీ వర్షాలు పడతయని  వాతావరణ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఇవాళ తక్కువసమయంలోనే హెవీరెయిన్‌ పడే అవకాశం ఉందంటున్నారు. గంటల వ్యవధిలోనే 7నుంచి 11 సెంటీమీటర్ల వర్షం పడే అవకాశం ఉందని వాతారణశాఖ  అంచనావేస్తోంది. వాతావరణశాఖ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అలర్టైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. వరద ముంపు ఉన్న ప్రాంతాల్లో సహాయకచర్యలకోసం ఆర్మీతోపాటు ఎన్ డీఆర్ఎఫ్ దళాల సహాయం తీసుకోనున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు.  ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావొద్దని సూచిస్తున్నారు. 

 

09:42 - September 22, 2016

హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని కుత్బుల్లాపుర్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లితోపాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. 500 అపార్ట్‌మెంట్ల సెల్లార్లలో నాలుగడుగుల నీరు చేరింది. బయటకు రాలేక అపార్టుమెంట్‌వాసులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. నిచ్చెనలతో కిందికొచ్చి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. ఆరు వేలకుపైగా ఇళ్లలోకి నడుం లోతు వరద నీరు చేరింది. పలు కాలనీలు, బస్తీలు చెరువులయ్యాయి. రేకుల ఇల్లు.. అపార్ట్‌మెంట్‌ అని తేడా లేకుండా అన్నీ నీట మునిగాయి. నాలాలు ఉగ్ర గోదారులయ్యాయి. చెరువులు, కుంటలు పొంగి పొర్లాయి. హైదరాబాద్‌ చరిత్రలోనే అత్యధిక వర్షపాతాలు నమోదవుతున్నాయి. మరో రెండురోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.  

 

07:23 - September 15, 2016

హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో మరో రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురవనున్నాయని.. ఇవాళ హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

Pages

Don't Miss

Subscribe to RSS - బంగాళాఖాతం