బండ్ల గణేష్

11:20 - September 14, 2018

ఢిల్లీ : తనకు సినిమా అంటే ప్రాణం...కానీ ప్రస్తుతం ప్రజలకు సేవ చేయాలని అనిపించిందని..అందుకని కాంగ్రెస్ లో చేరానని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల్లో వలసలు...చేరికలు జరుగుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య వలసలు జోరందుకుంటున్నాయి. పలువురు టికెట్ లు ఆశిస్తూ ఆయా పార్టీలో చేరుతున్నారు. తాజాగా సిని నిర్మాత బండ్ల గణేష్, ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలు పార్టీ కండువాలు కప్పుకున్నారు. 

శుక్రవారం ఢిల్లీకి వచ్చిన బండ్ల గణేష్, ఇతర నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్  సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. అనంతరం బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అంటే త్యాగాల పార్టీ అని అభివర్ణించారు. తాను ఎప్పటి నుండో పార్టీ అభిమానినని పేర్కొన్నారు. సినిమాల్లో నటించడం...నిర్మించడం తాను చేయడం జరిగిందని, ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నారు. అందుకని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. పవన్ తండ్రిలాంటి వారని..గురువు..కానీ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానమని పేర్కొన్నారు. జూబ్లిహిల్ నియోజకవర్గం నుండి టికెట్ పోటీ చేయనున్నారా ? అని మీడియా ప్రశ్నించగా పార్టీ ఎక్కడి నుండి పోటా చేయాలని ఆదేశిస్తే అక్కడి నుండి పోటీ చేస్తానని చెప్పారు. 

15:36 - November 24, 2017

హైదరాబాద్ : సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌ కోర్టు 6నెలల జైలుశిక్ష విధించింది. దాంతోపాటు మరో 15లక్షల 86వేల 550 రూపాయల జరిమానా కూడా విధించింది. రచయిత,దర్శకుడు వక్కంతం వంశీ దాఖలు చేసిన పటిషన్‌పై కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. టెంపర్‌ మూవీకి స్టోరీ అందించింనందుకు గాను తనకు నిర్మాత నుంచి రావాల్సిన డబ్బు అందలేదని వంశీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఎర్రమంజిల్‌ కోర్టు ఈ తీర్పునిచ్చింది. కాగా బండ్ల గణేశ్ అభ్యర్థన మేరకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది న్యాయస్థానం. 

09:52 - March 5, 2017

నిర్మాతలు అన్న తరువాత కధని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి సినిమా అయిన తియ్యాలి. కథ నచ్చిన తరువాత హీరో డేట్స్ కోసం ప్రయత్నించే నిర్మాతలు ఇండస్ట్రీ లో ఉన్నారు. అలాంటి వాళ్ళకి భిన్నంగా వెళ్తున్నాడు ఈ నిర్మాత. ఆల్రెడీ కొంతమంది పెద్ద హీరోలతో చేసి కొంచం గ్యాప్ తీసుకున్న ఈ నిర్మాత రీ ఎంట్రీ గురించి ఏమన్నాడో చూడండి. ఫిలిం వాల్యూస్ అనే మాట కొంచం పక్కన పెట్టి ప్రాఫిట్ మోటో గా సినిమాలు నిర్మిస్తున్నారు కొందరు ప్రొడ్యూసర్స్. కానీ వారికి భిన్నంగా సినిమా రంగంలో ప్రొడ్యూసర్ అంటేనే డబ్బులు, డబ్బులు అంటేనే ప్రొడ్యూసర్ అనే విజన్ మారిపోయింది. స్టోరీ లో కొత్తదనం కోసం తాపత్రయపడుతూ, స్క్రీన్ మీద కొత్తగా ఏదో చూపించాలి అనే ఆలోచనలతో ఉన్న ప్రొడ్యూసర్స్ వస్తున్న రోజులివి. లాభాలు, నష్టాలు అనే ప్లానింగ్ లేకుండా ప్రొడ్యూసింగ్ లోకి ఎంటర్అవ్వరు. ఎంత ప్లానింగ్ ఉన్నా కొన్ని సార్లు ఆడియన్స్ జడ్జిమెంట్ కి తలవంచాల్సిందే. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గ నటించి ప్రొడ్యూసర్ గా మారిన బండ్ల గణేష్ రీసెంట్ టైం లో మంచి హిట్స్ ఇచ్చాడు.

8 సినిమాలు..
నటుడిగా రాణించాలని ఎప్పుడో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వచ్చి కొన్ని సినిమాల్లో కమెడియన్ గా, హీరో ఫ్రెండ్ గా చిన్న, పెద్ద పాత్రల్లో మెప్పించిన నటుడు బండ్ల గణేష్. ప్రొడ్యూసర్ గా మారి 8 సినిమాలు తీసి అందులో మూడు సినిమాలు సూపర్ హిట్స్ అందించాడు. ఆల్మోస్ట్ మెగా ఫామిలీని తన సినిమాలతో కవర్ చేసి హిట్ సినిమాలతో టాప్ డైరెక్టర్ లిస్ట్ లో జాయిన్ అయ్యాడు ఈ యాక్టర్ కం ప్రొడ్యూసర్. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ది బెస్ట్ కలక్షన్స్ రికార్డ్స్ తో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో బండ్ల గణేష్ సినిమాలు ఒక రేంజ్ లో ఉంటాయి అనే హైప్ క్రియేట్ చేసుకున్నాడు.

హీరోలు ఎవరో ?
ఇలా ఒక దశలో విరామం లేకుండా సినిమాలు తీస్తూ దూసుకెళ్లిన బండ్ల గణేష్ ఈ మధ్య స్లో అయ్యాడు. దాదాపు రెండేళ్లుగా అతడి నుంచి సినిమానే రాలేదు. ‘టెంపర్’ హిట్టు తర్వాత కూడా అతను ఇంత గ్యాప్ తీసుకోవడం ఫిలిం వరల్డ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే బండ్ల గణేష్ మాత్రం ఈ విషయం అసలు పట్టించుకునే టైం లేదు అంటున్నాడంట. ఒకేసారి ఐదు సినిమాలకు తాను సన్నాహాలు చేస్తున్నట్లుగా బండ్ల గణేష్ చెప్తున్నాడు. చిన్న సినిమాలు తియ్యడానికి రెడీ గా లేను అని పెద్ద సినిమాల మీదే ఫోకస్ పెట్టానని చెప్తున్నాడు ఈ ఫేమస్ ప్రొడ్యూసర్. సినిమాలు తియ్యడానికి డబ్బులు అవసరం లేదు పెద్ద హీరోల డేట్స్ ఉంటె చాలు అని చెప్తున్నాడు బండ్ల గణేష్. మరి ఇతను నిర్మాతగా చెయ్యబోయే ఆ ఐదు సినిమాలు ఏంటో అందులో హీరోలు ఎవరో తెలుసుకోవడానికి మాత్రం వెయిట్ చెయ్యాల్సిందే.

09:35 - February 12, 2016

దిలీప్‌, మమతా మోహన్‌దాస్‌ జంటగా మలయాళంలో సంచలన విజయం సాధించిన 'టూ కంట్రీస్‌' చిత్రం తెలుగు హక్కుల్ని నిర్మాత బండ్ల గణేష్‌ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్‌ మాట్లాడుతూ,''టూ కంట్రీస్‌' చిత్రం మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా 50 కోట్లని కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది. ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం తెలుగు హక్కుల కోసం భారీ పోటీ ఉన్నప్పటికీ ఫ్యాన్సీ ఆఫర్‌తో నేను దక్కించుకోవడం ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలన్ని ఉన్న ఈ చిత్రాన్ని భారీ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నాను. ఈ చిత్రంలో నటించేందుకు ప్రముఖ టాప్‌ స్టార్స్‌ మరింత ఆసక్తిగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ చిత్రంలో నటించే నటీనటులు, పనిచేసే సాంకేతిక నిపుణుల వివరాల్ని తెలియజేస్తాను. గతంలో మా పరమేశ్వర ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో నిర్మితమైన 'తీన్‌మార్‌', 'గబ్బర్‌సింగ్‌', 'బాద్‌షా', 'ఇద్దరమ్మాయిలతో, 'గోవిందుడు అందరి వాడేలే', 'టెంపర్‌'వంటి భారీ చిత్రాల స్థాయిలోనే ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం' అని చెప్పారు.

Don't Miss

Subscribe to RSS - బండ్ల గణేష్