బడి

21:59 - December 15, 2017

హైదరాబాద్ : తెలంగాణ అద్భుతమైన సాహిత్యాన్ని పండించిన మాగాణమని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. సిద్దిపేట అద్భుతమైన సాహితీ క్షేత్రమన్నారు. ఎంతోమంది సాహితీ కుసుమాలు వికసించిన నేల సిద్దిపేట అని కొనియాడారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతోమంది సాహితీవేత్తలు తెలంగాణలో ఉన్నారన్నారు. వందల కొద్దీ కవులు చక్కటి తెలుగులో.. తెలంగాణ భాష, యాసతో అనేక రచనలు చేశారన్నారు.సభలో ప్రసంగించిన కేసీఆర్‌... అనేక కవితలను చదివి వినిపించారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని ఆయన కొనియాడారు. 

20:35 - August 11, 2017

మన నిజాంబాదు పోలీసోళ్లు ఎంత తెల్వికల్లోళ్లమ్మా..? అడ్డంబడెటోన్ని ఇడ్సిపెట్టి.. ఆపదలున్నోన్ని అరెస్టు జేశిండ్రంటే.. వాళ్ల ప్రతిభా పాఠవాలు మామూల్యేంగాదు.. తెలంగాణ జేఏసోళ్లు స్పూర్తి యాత్ర పేరు మీద నిజాంబాదుకు వోతుంటే.. టీఆర్ఎస్ కార్యకర్తలు నడ్మిట్ల అడ్డం బడి ఆగమాగం జేయవోయిండ్రు.. మరి ఆడనే ఉన్న పోలీసోళ్లు ఏం జెయ్యాలే.. అడ్డంబడెటోన్ని అరెస్టు జేయాల్నా..? జేఏసోళ్లను అరెస్టు జెయ్యాల్నా మీరే జెప్పుండ్రి..

ఆ నంద్యాల ఉపఎన్నికలళ్ల గెల్చెటోళ్లు ఎవ్వలో పొయ్యెటోళ్లు ఎవ్వలోగని.. రామచంద్రా.. తెల్గుదేశమోళ్లు అట్లనే మోపైండ్రు.. అటు జగన్ పార్టోళ్లు అట్లనే మోపైండ్రు.. ఎల్లిమీద మల్లి మల్లి మీద ఎల్లి.. వీళ్లు వాళ్లను తిట్ట వాళ్లు వీళ్లను తిట్ట.. నంద్యాల ఓటర్లే నోరెళ్ల వెట్టె పరిస్థితొచ్చింది.. అటు ఎన్నికల సంఘమోళ్లు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు దీస్కుంటున్నరు..

సిరిసిల్ల జిల్లా నేరెళ్ల పంచాదిల కొండను దొవ్వి ఎల్కను వట్టిండ్రుగదా ప్రభుత్వమోళ్లు.. మోకాళ్లు వల్గెతట్టు.. సంసారానికి పన్కిరానట్టు దళితులను గొట్టిన కేసుల తప్పంత ఎస్ఐ రవీందరుదేనటనుల్లా.. ఆ ఒక్కడు గొడ్తెనే ఎన్మిది మంది ఎందుకు పన్కిరాకుంటైండ్రట.. మరి అంత ధమ్మున్న ఎస్ఐని ఇండియా పాకిస్తాన్ బార్డర్ పొంట నిలవడ్తె ఒక్కడన్న బత్కుతడా పాకిస్తాన్ ఉగ్రవాది..? ఏం తమాషనో పోండ్రి..

హురక మనం చాల మిస్సైపోయినయ్ నిన్నటి శ్రీరాంసాగర్ నీళ్ల సభకాడి ముచ్చట్లు.. అంటే ఇవ్వి సర్కారు కెమేరాల గనిపియ్యయ్ గదా..? ఏదో ప్రైవేటు కెమేరాలకే దొర్కుతయ్ గావట్టి ఆల్చంగొస్తున్నట్టున్నయ్.. అయితే నిన్న ఓదిక్కు ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే.. సభ సంతోషంగున్నదనుకున్నంగని.. లోపటతం గంద్రగోళమే అయ్యిందట.. సూడుండ్రి..

ఓ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారూ.. ఎంత మందున్నరు మీ కులపోళ్లు తెలంగాణల..? అంత తింపికొడ్తె.. అరశాతానికి ఎక్వలేరు.. మీరు గంత మంది ఎమ్మెల్యేలా..? గజ్వెల్లి కెళ్లి మొదలు వెడ్తె.. సిద్దిపేట మీరేనాయే.. సిరిసిల్ల మీరేనాయే.. వేములవాడ మీరేనాయే.. కోరుట్ల మీరేనాయే.? ఏంది తమాష మరి మా బీసీలంత ఎటువోవాలె అంటున్నడు అంబర్ పేట అన్మంతన్న... ఏందో మళ్లొకపారి జెప్పు..?

మహాత్మా జ్యోతి బాపూలే బడుల పొంట సద్వుతున్న పోరగాళ్లు సద్వుళ్ల సారం నేర్చుకోని ఎట్ల బత్కాలె అని నేర్చుకునుడు కంటే.. మన్షి అనెటోడు ఏ విధంగ బత్కొద్దు అనేదే నేర్చుకుంటున్నట్టున్నరు ఎక్వ.. ఎందుకంటె హాస్టళ్లు గట్టిండ్రు పయ్యాకన బాతురూములు మర్శిండ్రు.. రూములు నిర్మించిండ్రు.. కిటికీలు మర్శిండ్రు.. ఇన్ని అవస్థల నడ్మ వాడు వ్యవస్థ మీద ఏడపట్టుసాధిస్తడు చెప్పుండ్రి..

ట్రాఫిక్ పోలీసాయిన పని ఏందయ్యా..? ఏడ ట్రాఫిక్ జాంగాకుంట జూస్కోవాలె.. ఎవ్వలన్న వీఐపీలొస్తె ట్రాఫిక్ క్లీయర్ జెయ్యాలే..? రోజు సక్కగ డ్యూటీ జేశి ఇంటికి వోవాలె అంతేనా..? మరి తొవ్వొంట వొయ్యెటోళ్లను అమ్మని అక్కని అని తిడ్తె ఎన్కటి కాలమేనా ఇది..? జనం అంత ఒక్కటై.. ట్రాఫిక్ కానిస్టేబుల్ గాని తోలు దీశిండ్రు సూడుండ్రి..

కాలే ధన్ వాపస్ లాయెంగే.. యా నహి లాయెంగే... చేతులు ఇంత పొడ్గువెట్టి చెప్పిండు అప్పటి అభ్యర్థి.. ఇప్పటి ప్రధానమంత్రి మోడీ.. నల్లధనం వాపసు దెస్తాన్న మొనగాడు.. ఉన్నధనం విదేశాల పాలు జేశే పనిజేస్తున్నడట.. ఇన్నొద్దులు సర్కారు చేతులున్న రైల్వే సంస్థ.. ఇప్పుడు విదేశాలోళ్లకు అప్పజెప్పె కుట్రలు జేస్తున్నడట.. ఇగ రైల్వే కార్మికులు.. కండ్లెర్ర జేయవట్టిరి..

 

13:53 - June 16, 2017

హైదరాబాద్ : ప్రైవేట్‌విద్యా సంస్థల బస్సులు ఏదో ఒక చోట నిత్యం ప్రమాదానికి గురికావడం.. విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం లేదా గాయాలపాలవడం ప్రతి ఏడాది జరుగుతూనే ఉంది. ఫీజుల వసూలుపై శ్రద్ధచూపే ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల భద్రతను మాత్రం విస్మరిస్తున్నాయి. ఫిట్‌నెస్ లేని, కాలం చెల్లిన బస్సులను నడుపుతూ పిల్లల భవిష్యత్‌తో చెలగాటమాడుతున్నాయి.

బస్సు డ్రైవర్‌పైనే ఆధారపడి ఉంటుంది
విద్యార్థులు క్షేమంగా స్కూల్‌కు వెళ్లాలన్నా.. తిరిగి ఇంటికి రావాలన్నా బస్సు డ్రైవర్‌పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే డ్రైవర్‌కు ఐదేళ్ల అనుభవం ఉండాలన్న నిబంధన ఉంది. బస్సులో ఏపార్టు సరిగా లేకున్నా ప్రమాదం పొంచివున్నట్లే. అందుకే ప్రతి ఏడాది స్కూళ్లు ప్రారంభానికి నెలరోజుల ముందుగానే రవాణాశాఖ అధికారులు బస్సులను తనిఖీచేసి ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇస్తారు. ఇక విద్యార్థులు చేతులు బయటపెట్టకుండా బడిబస్సులకు గ్రిల్స్ తప్పనిసరి. మేడ్చల్ జిల్లాలో 4,342 బస్సులకు గానూ 3,900ల బస్సులు మాత్రమే ఫిట్ నెస్ సర్టిఫికెట్‌ పొందాయి. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 4,350 స్కూల్‌ బస్సుల్లో.. 3,300ల బస్సులకు ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్‌లో 2,059 పాఠశాల బస్సులకు.. వెయ్యి బస్సులు మాత్రమే ఫిట్ నెస్ పరీక్షలు చేయించారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. గత యేడాది రాష్ట్రవ్యాప్తంగా 19వేల 717 బస్సులు రవాణాశాఖ కార్యాలయాల్లో రిజిష్టర్ చేసుకున్నాయి. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో 62...రంగారెడ్డి జిల్లాలో 32, మేడ్చల్ జిల్లాలో 10 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు.

ఎన్నో నిబంధనలు
బడిబస్సులో పిల్లలు ఎక్కేందుకు మెట్లు కిందివరకు ఉండాలి. క్లీనర్ ఉండడంవల్ల పిల్లలను నిరంతరం పరిశీలించే అవకాశం ఉంటుంది. ప్రతి బడి బస్సుకు స్టీరింగ్‌, బ్రేకులు కండిషన్‌ పక్కాగా ఉండాలి. ప్రతి వాహనంలో ఒక అత్యవసర ద్వారం ఏర్పాటు చేయాలి. దానిపై స్పష్టంగా కనిపించేలా అత్యవసరం డోర్ అని రాసుండాలి. రవాణా శాఖ ఇచ్చిన సర్టిఫికెట్ పర్మిట్‌, దానిపై బస్‌ కండీషన్ వివరాలు ఉండాలి. డ్రైవర్‌ ఆరోగ్యంతో పాటు మూడు నెలలకొసారి అతనికి కంటి పరీక్షలు నిర్వహించాలి. పాఠశాలల బస్సులు తరచూ ప్రమాదాలకు గురవడంతో ప్రభుత్వం నిబంధనలకు కఠినతరం చేసింది. అయినప్పటికీ నిబంధనలకు తుంగలో తొక్కి విద్యార్థులను తరలించేందుకు బస్సులను ఉపయోగిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమవడంతో...నిజామాబాద్‌ జిల్లాలో ఆర్టీవో అధికారులు ప్రైవేట్‌ పాఠశాలల వాహనాలను విస్తృతంగా తనిఖీ

అధికారుల దృష్టి...
జిల్లా వ్యాప్తంగా మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 867 స్కూల్ బస్సులు ఉన్నాయి. నిబంధనలు ప్రకారం పాఠశాలల ప్రారంభానికి ముందే ప్రతి బస్సు ఫిట్‌నెస్‌ చేయించుకోవాలి కానీ ఇప్పటి వరకు 495 బస్సులను మాత్రమే ఫిట్‌నెస్‌ చేయించినట్టు సోదాల్లో తేలింది. మిగతా వాటికి సామర్థ్య పరీక్షలు నిర్వాహించాల్సి ఉంది. రూల్స్‌ పాటించకపోతే...ఇక జరిమానాలు రాసేది లేదని నేరుగా కోర్టుకు పంపిస్తామని ఇంచార్జ్‌ డీటీసీ హెచ్చరించారు. అదేవిధంగా 60 సంవత్సరాలకు పైబడిన డ్రైవర్లను నియమించకూడదని ఆయన సూచించారు. అలాగే పాఠశాలల బస్సులపై ఆ సంస్థ పేరు, ఫోన్ నెంబర్‌తో సహా పూర్తి చిరునామాను రాయాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రమాదాల నివారణకు ఫిట్‌నెస్‌ బస్సులనే నడిపేలా స్కూళ్ల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. దాంతో పాటు పాఠశాల ప్రారంభసమయంలోనే కాకుండా ఆర్టీఏ అధికారుల నిరంతర తనిఖీలు కొనసాగాలని పేరెంట్స్ కోరుతున్నారు.

 

12:46 - October 7, 2016

పశ్చిమగోదావరి : జిల్లాలోని పెదవేగి మండలం రామసింగవరంలో దారుణం జరిగింది. బడికెళ్లలేదని కూతుర్ని కన్న తండ్రే చితకబాదడంతో చిన్నారి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత నెల 22న బడికి వెళ్లలేదని ఆరో తరగతి చదువుతున్న 12ఏళ్ల కుమార్తెను తండ్రి చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన బాలిక మృతి చెందింది. దీంతో గుట్టు చప్పుడు కాకుండా కుమార్తె మృతదేహాన్ని పొలంలో పాతిపెట్టాడు తండ్రి. ఆతర్వాత బాలిక బంధువుల ఇంటికి వెళ్లిందని గ్రామస్తులకు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు నీలదీయడంతో విషయం బయటకు వచ్చింది. బాలిక తల్లి స్వరూపారాణిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా జరిగిన దారుణాన్ని బయటపెట్టింది. మృతికి కారుకుడైన తండ్రి రాజారత్నం పరారీలో ఉండటంతో పోలీసులు గాలిస్తున్నారు.

 

Don't Miss

Subscribe to RSS - బడి