బహుజనులు

20:09 - August 8, 2018

కొన్ని వందల సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉండి ఈ రాజ్యంలో ఈ ప్రాంతంలో ఈ దేశంలో అంటరాని బతుకు బతుకుతున్న బహుజనులు రాజ్యాధికారం మాది...ఈ దేశం..ఈ రాష్ట్రం మాది...రాష్ట్రంలో ఉన్న సంపద మాది...అని చెప్పి బైలెలుతున్నరు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఆత్మగౌరవ యాత్ర పేరిట 80 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ప్రారంభం కొనసాగుతోంది. ఈ యాత్రను తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఆయనతో 'మల్లన్న' ముచ్చటించారు. వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

21:13 - June 30, 2018

హైదరాబాద్ : కేసీఆర్‌ పాలనలో తెలంగాణ ప్రజలెవరూ సంతోషంగా లేరని, ప్రజాస్వామ్య హక్కులను కేసీఆర్‌ కాలరాస్తున్నారని బీఎల్ఎఫ్ నేతలు ఆరోపించారు. మోదీ, కేసీఆర్‌లు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను ఉదృతం చేస్తామన్నారు. సర్వేలో తమ దృష్టికి వచ్చిన సమస్యలపై స్థానికంగా పోరాడతామన్నారు. ఎన్నికల విధానంలో సంస్కరణలు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేసిన నేతలు, బహుజనుల ప్రభుత్వం కోసం ఓటు పాత్రపై చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.

బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కమిటీ సమీక్షా సమావేశం హైదరాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగింది. బీఎల్ఎఫ్ ఛైర్మన్‌ నల్లా సూర్యప్రకాశ్‌, కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం సమావేశానికి హాజరైన పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గ కన్వీనర్లకు దిశా నిర్దేశం చేశారు. గత నెల రోజుల కార్యక్రమాలను సమీక్షించి, రాబోయే కాలంలో నిర్వహించే పోరాట కార్యక్రమాలపై చర్చించారు. గతనెల 27వ తేదీన నిర్వహించిన చలో కలెక్టరేట్ కార్యక్రమానికి ప్రభుత్వ నిర్భందాన్ని సైతం ఎదిరించి వచ్చిన ప్రజలకు నేతలు ధన్యవాదాలు తెలిపారు. కేసిఆర్ పాలన పట్ల ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహానికి, నిరసనకు మహాధర్నాలు అద్దంపట్టాయన్నారు.

జూలై, ఆగస్టు నెలల్లో టీమాస్‌తో కలిసి ఎన్నికల సంస్కరణలపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తామని BLF ఛైర్మన్‌ సూర్యప్రకాశ్‌ అన్నారు. బహుజన ప్రభుత్వ ఏర్పాటుకు ఓటు ఎంత కీలకమో అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సమావేశం తీర్మానించిందన్నారు. అన్ని స్థాయిల్లోకి ఎన్నికల సంస్కరణలు, బహుజన ప్రభుత్వ ఏర్పాటు అంశాన్ని తీసుకెళ్లాలని సమావేశం నిర్ణయం తీసుకుందని.. స్థానిక సమస్యలపై ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోరాటాలను మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు కృషిచేస్తామని నేతలన్నారు.

బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పడ్డ తర్వాత జరిగిన తొలి ఆందోళనా కార్యక్రమం నేతల అంచనాలను మించి సక్సెస్ కావడంతో ఫ్రంట్ లీడర్స్ లో కొత్త జోష్ నింపింది. దాని కొనసాగింపుగా మరింత దూకుడుగా వెళ్లేందుకు ప్రతీ గ్రామంలో బీఎల్ఎఫ్ కమిటీని ఏర్పాటు చేసే లక్ష్యంతో ముందుకు వెళ్లడానికి నిర్ణయించారు. ఇందుకోసం కొందరు కీలక వ్యక్తులను, సంస్థలను ఫ్రంట్ లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

06:34 - June 11, 2018

విశాఖపట్టణం : రాజ్యాధికారం కోసం బహుజనులంతా ఏకం కావాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, బీఎల్‌ఎఫ్‌ కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఐక్యతతోనే బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందన్న విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. రాజ్యాధికారం ఎప్పుడూ ఏదో ఒక అగ్రకులానికే పరిమితం కారాదని విశాఖలో జరిగిన దళిత, ఆదివాసీ సమతా జాతర జాతీయ సదస్సులో చెప్పారు. విశాఖలో రెండో రోజు దళిత, ఆదివాసీల సమతా జాతర జాతీయ సదస్సు ఘనంగా జరిగింది. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు సామాజికవేత్త, రామన్‌ మెగసేసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్‌, సామాజిక చిత్రాల దర్శకుడు, సినీనటుడు ఆర్‌.నారాయణమూర్తి, ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు తదితరులు హాజరయ్యారు.

దేశంలో దళితులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చించారు. రాజ్యాధికారంతోనే దళితులు, ఆదివాసీలు, ఇతర బహుజనుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఇందుకోసం దళిత-ఆదివాసీ వర్గాలు ఐక్యం కావాలని తమ్మినేని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడుల వెనుక పాలకులు, అధికార పార్టీ నేతల హస్తం ఉందని సామాజికవేత్త, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్‌ మండిపడ్డారు.

సరళీకృత ఆర్థిక విధానాల అమలు తర్వాత దేశంలో పేదల బతుకులు ఛిద్రమైపోతున్నాయని సామాజిక చిత్రాల దర్శకుడు, నటుడు ఆర్‌.నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. భాష, సంస్కృతిపై పాశ్యాత్య దేశాల దాడి పెరిగిందని ఆవేదన వెలిబుచ్చారు. సదస్సుకు హాజరైన ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు సామాజిక సమస్యలపై పాడిన పాటలు అందర్నీ ఆకట్టుకొన్నాయి. సదస్సుకు భారీగా దళితులు, ఆదివాసీలు తరలివచ్చారు. ప్రజలను కులాలు, మతాలవారీగా విభజించి పాలిస్తున్న పాలకుల చర్యలను తిప్పికొట్టేందుకు బహుజనులంతా సమాయత్తం కావాలని సదస్సులో తీర్మానించారు. 

21:19 - June 3, 2018

హైదరాబాద్ : నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఏ ఒక్క హమీ కూడా నెరవేర్చలేదని... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. బహుజనులకు రాజ్యాధికారం సాధించే దిశగా బీఎల్‌ఎఫ్‌ కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఇందుకోసం నేటి నుండి ఈ నెల 20వ తేదీ వరకు పల్లెకు పోదాం కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ ఎస్వీకేలో బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో తెలంగాణలో బహుజన రాజకీయాధికారం అనే అంశంపై మేధావులతో సమాలోచన నిర్వహించారు. 

10:51 - April 23, 2018

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌కు అధికారమిస్తే కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీల కంటే మెరుగైన పాలన అందిస్తుందని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రత్యామ్నాయ విధానాలతో బీఎల్‌ఎఫ్‌ ఏర్పాటైందన్నారు. సీపీఎం 22వ జాతీయ మహాభల సందర్భంగా సరూర్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో తమ్మినేని మాట్లాడారు. హైదరాబాద్‌లో 5 రోజుల పాటు జరిగిన సీపీఎం 22వ జాతీయ మహాసభలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సీపీఎం అనుసరించే విధానాలను పార్టీ కార్యదర్శి తమ్మినేని ప్రకటించారు. గత ప్రభుత్వాలు, ప్రస్తుతం ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. తెలంగాణలో మారాల్సింది పార్టీలు ప్రభుత్వాలు కాదని, పరిపాలన విధానం అన్నారు. దీనికోసం సీపీఎం మరో 28 పార్టీలతో కలిసి బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేశామన్నారు.

బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోని 119 అసెంబ్లీ, 17 పార్లమెంట్‌ స్థానాలకు పోటీ చేస్తుందని తమ్మినేని వీరభద్రం చెప్పారు. జనాభ ప్రతిపాదికన BC, SC, ST, OBC లకు సీట్లు కేటాయింపు ఉంటదన్నారు. సామాజిక న్యాయం అంటే ప్రతికులం వారు కలెక్టర్లు, ఎమ్మెల్యేలు మంత్రులు కావడమే అన్నారు. అభివృద్ధి అంటే జీడీపీ, ద్రవ్యోల్బణ లెక్కలు కావని, అభివృద్ధి అంటే ప్రజల చెంతకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు చేర్చడం అన్నారు తమ్మినేని వీరభద్రం. తెలంగాణ రాక ముందు నుంచి ఉన్న రైతుల ఆత్మహత్యలు తెలంగాణ వచ్చాక కూడా కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలకు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఇప్పటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల విధానాలే కారణం అన్నారు. తెలంగాణలో ఎర్రజెండా ఉన్నంతకాలం కాషాయం పార్టీకి చోటే లేదని తమ్మినేని తేల్చి చెప్పారు. తెలంగాణలో సీపీఎంను అధికారంలోకి తెచ్చి, పుచ్చలపల్లి సుందరయ్యగారికి నివాలర్పిస్తామని తమ్మినేని వీరభద్రం అన్నారు.

10:34 - April 14, 2018

హైదరాబాద్ : బలహీన వర్గాలకు మోడీ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు. లిబర్టి వద్దనున్న ట్యాంక్ బండ్ విగ్రహానికి సీపీఎం నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాఘవులు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంలు మీడియాతో మాట్లాడారు. దేశంలో దళితులు, మైనార్టీలు, మహిళలు వారి ఆత్మగౌరవాన్ని కోరుకొనే వారు మతోన్మాద సంఘ్ పరివార్ శక్తులతో పోరాడాల్సినవసరం ఉందని తెలిపారు. బహుజనులకు రాజ్యాధికారం సాధిస్తే అప్పుడే అంబేద్కర్ కు అసలైన నివాళి అని తమ్మినేని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు రాజ్యాధికారం సాధించేందుకు బిఎల్ఎఫ్ కృషి చేస్తోందన్నారు. 

13:18 - April 8, 2018

హైదరాబాద్ : బహుజనులకు రాజ్యాధికారం రావడమే లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజికన్యాయం చట్ట పరంగా, రాజ్యాంగపరమైన హక్కు కావాలన్నారు. బహుజనులు కలెక్టర్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు కావాలని ఆకాంక్షించారు. గోల్కొండ హోటల్ లో ఏర్పాటు చేసిన ఎడిటర్స్ మీట్ లో ఆయన మాట్లాడారు. అంబేద్కరిస్టులను, కమ్యూనిస్టులను ఐక్యం చేయాలని మహాజన పాదయాత్ర ముగింపు సభలో సీతారాం ఏచూరి చెప్పారని.. అఖిల భారత మహాసభల డైరెక్షన్ తో లాల్, నీల్ శక్తుల ఐక్యత కోసం కృష్టి చేస్తున్నామని తెలిపారు. గతంలో అగ్రకులాలు రాజ్యాధికారంలో ఉన్నాయని...ఇప్పుడు బహజనులు రాజ్యాధికారంలోకి రావాలన్నారు. తమ పార్టీ చిన్నదే.. కానీ ఎజెండా బలమైందన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం నినాదాలతో సీపీఎం మహాజన పాదయాత్ర చేపట్టిన తర్వాత.. అన్ని పార్టీల ఎజెండా సామాజిక న్యాయం అయిందన్నారు. అందరూ సామాజిక న్యాయం కావాలంటున్నారని తెలిపారు. సామాజిక న్యాయం మాటల్లో కాదని... చేతల్లో చూపాలన్నారు. టిక్కెట్లు ఇచ్చేటప్పుడు సామాజిక న్యాయాన్ని పాటించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎంబీసీ, సామాజికంగా, ఆర్థికంగా అణచివేయడిన వారందరూ బహుజనులే అన్నారు. అగ్రకులాలు, బ్రాహ్మహణులలో కూడా పేదవారు, అణచివేతకు గురయ్యేవారున్నారని వారూ కూడా బహుజనుల కిందికి వస్తారని అన్నారు. రాష్ట్రంలో 98 శాతంగా ఉన్న ప్రజలు బహుజనులేనని అన్నారు. గొర్రెలు, బర్రెల పంపిణీ ద్వారా సామాజిక న్యాయం రాదన్నారు. పెళ్లిళ్లు, పేరంటాలకు బహుజనులను అగ్రకులాలు పిలవాలని, వారితో సమాన హోదా ఇవ్వాలన్నారు. రోటీన్ రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు. ప్రజల ప్రయోజనాల కోసమే గతంలో ఇతర పార్టీలతో కలిశామని, అనేక ప్రయోగాలు చేశామని తెలిపారు. ఇతర పార్టీలతో కయికల వల్ల తమ పార్టీ బలం తగ్గిందన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కోల్పోయామన్నారు.  ఇప్పుడు ప్రజలతో కలవాలనుకుంటున్నామని తెలిపారు. దూరమైన ప్రజలను దగ్గరికి తీసుకోవడం ముఖ్యం అన్నారు. 
18 నుంచి 22 వరకు జాతీయ మహాసభలు 
18 నుంచి 22 వరకు సీపీఎం జాతీయ మహాసభలు హైదరాబాద్ లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరుగుతాయన్నారు. సభలకు దేశవ్యాప్తంగా 850 ప్రతినిధుల హాజరవుతారని తెలిపారు. కేరళ సీఎం, బెంగాల్, త్రిపుర మాజీ సీఎంలు,  అగ్రనాయకులు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కరత్, బృందాకరత్, బివి.రాఘవులుతోపాటు 16 మంది పొలిట్ బ్యూరో సభ్యులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. సభ మొదటిరోజు సీపీఐ జాతీయ కార్యదర్శి సురవం సుధాకర్ రెడ్డితోపాటు వామపక్ష నేతలు సౌహార్ధ సందేశాలు ఇస్తారని పేర్కొన్నారు. చివరిరోజు బహిరంగ సభ ఉంటుందని..జాతీయ నేతలు మాట్లాడుతారని..  25 వేల మందితో రెడ్ షర్ట్ కవాతు ఉంటుందన్నారు. 
హైదరాబాద్ ఫెస్ట్... 
13 నుంచి 22 వరకు నడుస్తుందని హైదరాబాద్ ఫెస్ట్ ఉంటుందని... చుక్కా రామయ్య అధ్యక్షులుగా ఉన్నారని తెలిపారు. ఫెస్ట్ కు సినీ రంగ ప్రముఖులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఫెస్ట్ లో బుక్ ఫెయిర్, సైన్స్ ఎగ్జిబిషన్, తెలంగాణ కల్చర్ వంటి పలు అంశాలు ఉంటాయన్నారు.

 

 

17:07 - March 24, 2018

రంగారెడ్డి : తెలంగాణలో బహుజనులకు రాజ్యాధికారమే భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అందుకోసమే బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఆవిర్భవించిందన్నారు. 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఎల్‌ఎఫ్‌ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఏప్రిల్‌ 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో సీపీఎం అఖిలభారత 22వ మహాసభలు జరుగనున్న నేపథ్యంలో భువనగిరిలో ఆయన బస్సు ప్రచార జాతాను ప్రారంభించారు. కేంద్రంలో మోదీ గద్దెనెక్కినప్పటి నుంచి దేశంలో మతవిద్వేశాలు పెరిగిపోయాయన్నారు. భారతదేశంలో లౌకికతత్వాన్ని కాపాడేందుకు సీపీఎం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమేనన్నారు. బీజేపీ సర్కార్‌... రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కాషాయీకరణ చేస్తోందని మండిపడ్డారు. అంతకుముందు భువనగిరిలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములు, పోతినేని సుదర్శన్‌, రాష్ట్ర కమిటీ సభ్యుడు జాన్‌వెస్లీతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

20:40 - March 23, 2018

కాంగ్రెస్ పార్టీ మళ్లొక బహుజనుడిని బలిపశువును జేశింది.. నేను జెప్పలే మొన్న నాగం జనార్దన్ రెడ్డి సారు పార్టీ మారవోతున్నడు మారవోతున్నడు అని.. గవర్నర్ నర్సింహన్ సారును అడ్డగోల్గ తిట్టిండుగదా..? పొన్నం ప్రభాకర్..నిండు అసెంబ్లీలనేమో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం జెప్తున్నడు.. కేసీఆర్ అసొంటి తీస్మార్కాండ్లను మస్తుగ జూశిండ్రు ఈ తెలంగాణ ప్రజలు..రాచకొండ పోలీసు కమీషనర్ సారు.. నీకు హ్యాట్సాఫ్.. పోలీసులు అంటే.. నేరాలు గాకుంట.. ఓ పల్లె టూర్లె గాలిమోటర్ దిగితె ఎట్లుంటది..? ఎన్నడు గాలి మోటర్ను దగ్గరికెళ్లి సూడని జనం ఎంత పని ఉన్నా ఇడ్సిపెట్టి..ప్రజాలారా ఈ ముచ్చట మీరు బాగ ఇనాలే.. సిరిసిల్ల కాడ ఒకామెకు ముగ్గురు ఆడోల్లు గల్చిండ్రట.. సర్కారు దావఖాన ఏడున్నదని అడ్గిండ్రట..గిసొంటి ముచ్చట జూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

07:29 - March 21, 2018

కరీంనగర్ : బహుజనులకు రాజ్యాధికారం అందించేందుకు బీఎల్‌ఎఫ్‌ పోరాడుతుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు తమ్మినేనితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. కేసీఆర్‌ ప్రజలను, రైతాంగాన్ని మోసం చేస్తున్నారని... బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకి వస్తే మెరుగైన వైద్యం, నాణ్యమైన విద్య, రైతులకు మద్దతు ధర ఇస్తామంటున్నారు. వచ్చే ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - బహుజనులు