బాబ్లీ

13:39 - October 12, 2018

హైదరాబాద్ : బాబ్లీ ప్రాజెక్టు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొంత ఊరట లభించింది. బాబు వేసిన నాన్ బెయిలబుల్ రీకాల్ వారెంట్‌కు ధర్మాబాద్ కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 10వ తేదీన న్యాయవాదులతో రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. బాబు తరపున సుప్రీంకోర్టు లాయర్ లూత్రా వాదిస్తున్నారు. 
వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావడాన్ని ధర్మాబాద్ కోర్టు బాబుకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. మిగతా వారు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. శుక్రవారం దీనిపై కోర్టు విచారణ జరిపింది. గతంలో దీనిపై విచారణ జరిపిన కోర్టు అక్టోబర్ 15వ తేదీన బాబు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని గత నెల 21వ తేదీన స్పష్టం చేసింది. ఆ రోజు కూడా బాబు హాజరు కాకుండా రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టుకు హజరయ్యే విషయమై మినహయింపు కోరుతూ బాబు తరపు న్యాయవాదులు రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి కావడం వల్ల బాబు కోర్టుకు వ్యక్తిగతంగా హజరుకావడం ఇబ్బందని కోర్టుకు న్యాయవాది తెలిపారు. లీగల్ సెల్ అథార్టీలో రూ. 15వేలు చెల్లించాలని, మిగతా వారు కోర్టుకు హాజరు కావాలని కోర్టు సూచించింది. కానీ నవంబర్ 15న బాబు హాజరవుతారా ? లేక దానికి కూడా మినహాయింపు ఇస్తారా ? అనేది తెలియాల్సి ఉంది. 

07:47 - October 12, 2018

విజయవాడ : తెలుగు దేశం పార్టీని ధర్మాబాద్ కోర్ట్ టెన్షన్ వెంటాడుతోంది. చంద్రబాబు సహా 16మంది హాజరు కావాలన్న కోర్టు ఆదేశాలిచ్చింది. దీనిపై మరోసారి రీకాల్ పిటిషన్ వేయాలని చంద్రబాబు నిర్ణయించడంతో.. కోర్టు ఎలా స్పందింస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ధర్మాబాద్‌ కోర్టులో సీఎం చంద్రబాబు తరపున రీకాల్‌ పిటిషన్‌ వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబుసహా 16మంది హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూత్ర పిటిషన్‌ వేయనున్నారు. రీకాల్‌ పిటిషన్‌పై ధర్మాబాద్‌ కోర్టులో వాదనలు వినిపించనున్నారు.
2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో చంద్రబాబు సహా పలువురు నేతలు ధర్నా చేశారు. వారికి ధర్మాబాద్ కోర్టు గత నెలలో నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 21న చంద్రబాబుతో పాటు 15 మందిని కోర్టులో హాజరుపర్చాల్సిందిగా మహారాష్ట్ర పోలీసులకు ఆదేశించింది. తరువాత ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు తరపున ఎంపీ, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ హాజరై కోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సీఎం అయినా, మరెవరైనా కోర్టుకు హాజరుకావాల్సిందే అని స్పష్టం చేస్తూ ధర్మాబాద్ కోర్టు కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. బాబ్లీ కేసులో..ధర్మాబాద్‌ కోర్టుకు హాజరుకాకూడదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. కేసులో రీకాల్ పిటిషన్ వేయాలని నిశ్చయించుకున్నారు. ఈ పిటిషన్‌పై ధర్మాబాద్ కోర్టు ఏవిధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. 

17:27 - September 21, 2018

హైదరాబాద్ : బాబ్లీ కేసు విషయంలో టిడిపి, ప్రతిపక్షం వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీనిపై వైసీపీ నేత బోత్స సత్యానారాయణ పలు విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ....రాజకీయ లభ్ది కోసమే బాబ్లీ కేసును ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. వ్యవస్థను మేనేజ్ చేయడంలో బాబు దిట్ట అని, ఆయనకు ఢిల్లీ వరకు చుట్టాలే ఉన్నారని విమర్శించారు. బాబ్లీ కేసులో నోటీసులు వచ్చిన సమయంలో ఎవరైనా హాజరు కావాల్సిందేనని, చట్టం దృష్టిలో అందరూ సమానమనే విషయాన్ని గుర్తుం పెట్టుకోవాలని హితవు పలికారు. రాజకీయ లబ్ది పొందేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడుతుందని బోత్స సత్యనారాయణ స్పష్టం 

11:27 - September 17, 2018

విజయవాడ :  బాబ్లీ ప్రాజెక్టు వారంట్లను తెలుగు రాష్ట్రాల ప్రజలను నిరసించారని, ఒకవైపు పాత కేసులు తవ్వితోడుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. మరోవైపు తప్పుడు సర్వేలు చేయిస్తున్నారని, ఇంకోవైపు శాంతిభద్రతలను దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. కొందరిని రెచ్చగొట్టి అశాంతి సృష్టించాలని చూస్తున్నారని, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
అసెంబ్లీ వ్యూహ కమిటీ బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్్స నిర్వహించారు. ఇంకా మూడు రోజులు మాత్రమే సమావేశాలున్నాయని, అర్థవంతమైన చర్చతో ప్రజలను ఆకట్టుకోవాలని ఈ విరామంలో ‘జలసిరికి హారతి’ నిర్వహించడం జరిగిందన్నారు. రైతుల నుండి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. జలసంరక్షణపై ప్రజలను చైతన్యపరచడం జరిగిందని పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ వెబ్ సైట్ కు స్పందన బాగుందని చెప్పుకొచ్చారు.

12:20 - September 14, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్ ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. 2010లో బాబ్లీ ప్రాజెక్టు సందర్శన..అక్కడ ఆందోళనలు చేసిన నేపథ్యంలో 2018లో కోర్టు వారెంట్ జారీ చేయడంపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుట్రలో భాగంగానే బీజేపీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. 

చంద్రబాబు తిరుమలలో ఉండగానే వారెంట్ పై బాబు సమాచారం అందుకున్నారు. కోర్టుకు హాజరయ్యే విషయంపై బాబు సమాలోచనలు జరుపుతున్నారు. ఐపీసీ సెక్షన్లు 353, 324, 332, 336, 337, 323, 504, 506, 109  కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే అత్యవసరంగా టీటీడీపీ నేతలు భేటీ అయ్యరు. కోర్టుకు హాజరయితే తెలంగాణ పార్టీకి సానుకూలత వచ్చే అవకాశం ఉందని..కానీ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు వారెంట్ జారీ చేయడం ఏంటీ ? అని నిలదీస్తున్నారు. మరి ఆయన కోర్టుకు హాజరవుతారా ? లేదా ? అనేది చూడాలి. 

16:25 - July 1, 2018

మహారాష్ట్ర : బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు అధికారులు తెరిచారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జలవనరుల సంఘాల ఒప్పందం ప్రకారం నేటి నుంచి అక్టోబర్‌ 28 వరకు గేట్లు తెరుచుకొని ఉంటాయి. మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు జూన్‌ 11న బాబ్లీ ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తడంతో ఎస్‌.ఆర్‌.ఎస్‌పీ లోకి 4టీఎంసీల నీరు చేరింది. ప్రస్తుతం ఆర్‌.ఎస్‌.పీలో 90 టీఎంసీలకు 10 టీ.ఎం.సీల నీరు నిల్వఉంది. 14 గేట్ల ద్వారా నీరు దిగువకు పరవళ్లు తొక్కుతుండడంతో గోదావరి తీర ప్రాంత ప్రజలను అధికారులను అప్రమత్తం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

07:52 - August 18, 2017

నిజామాబాద్ : వర్షాలు ముఖం చాటేశాయి. ప్రవాహం లేక నదులు వెలవెలబోతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి చుక్కనీరు రాక ఉత్తరతెలంగాణ వరదాయని శ్రీరాంసాగర్‌ వట్టిపోతోంది. ఉత్తరతెలంగాణ జిల్లాల కల్పతరవు శ్రీరాంసాగర్‌ ఎండిపోతోంది. గోదావరిలో జలసిరులు కరువైపోవడంతో ప్రాజెక్టులోకి చుక్కనీరు రాని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రాజెక్టులో ఉన్ననీరుకూడా క్రమంగా తరిగిపోతుండటంతో ఆయకట్టు రైతాంగంలో ఆందోళన మొదలయింది. వర్షాల సీజన్‌ ప్రారంభమై రెండున్నర నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు ప్రాజెక్టులోకి వచ్చిన నీరు కేవలం 1.64 టీంసీలేనని ఇరిగేషన్‌ అధికారులు అంటున్నారు. 90టీఎంసీల సామర్థ్యం కలిగిన శ్రీరాంసాగర్‌లో ప్రస్తుతం 9టీఎంసీలు నీరుమాత్రమే ఉంది. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు కింది ఈసారి పంటల సాగు ప్రశ్నార్ధకంగా మారింది.

2400 క్యూసెక్కుల నీరు మాత్రమే
సాధారణంగా జూలై నుంచి అక్టోబర్‌ చివరి వరకు శ్రీరాంసాగర్‌లోకి వరదనీరు వస్తుంది. దీని ఆధారంగానే జూలై 1నుంచి అక్టోబర్‌ 28 వరకు బాబ్లీప్రాజెక్టు గేట్లు ఎత్తివేసే ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం బాబ్లీగేట్లు ఎత్తివేసినా శ్రీరాంసాగర్‌లోకి 2400 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చింది. ఎగువప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా గోదావరిలో ప్రవాహాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. మరోవైపు జలాశయంలో ఉన్ననీరుకూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. శ్రీరాంసాగర్‌ డెడ్‌స్టోరేజీ 5 టీంఎసీలు పోగా ఇక మిగిలేది 4 టీఎంసీలు మాత్రమే. దీంతో ప్రాజెక్ట్‌ అధికారుల్లో ఆందోళన మొదలయింది. కనీసం ఉత్తర తెలంగాణ జిల్లాలకు తాగునీరు కూడా అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఎడారిగా మారే ప్రమాదం...
ఎస్సారెస్పీ ఆధారంగా దాదాపు 16లక్షల ఎకారాల ఆయకట్టు సాగవుతోంది. కాకతీయ, సరస్వతి, లక్ష్మీ ప్రధాన కాలువలతోపాటు పలు ఎత్తిపోత పథకాల ద్వారా మొత్తం 18లక్షల 66వేల 765 ఎకరాలకు ఈసారి నీరందించాలని ఇరిగేషన్‌ అధికారులు నిర్దేశించుకున్నారు. అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో చుక్కనీరు కూడా రాకపోవడంతో ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఒక్క కాలువలో కూడా నీటి విడుదల కొనసాగడం లేదు. ఇప్పటికే వర్షాకాలం దాదాపు సగం కాలం తుడిచిపెట్టుకు పోయింది. మిగిలిన మరో నెలన్నరలోపు వర్షాలు పడితే సరే.. లేకుంటే ఈసారి కరువుతప్పదని ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులు ఆందోళన పడుతున్నారు. వర్షాల కోసం ఆకాశంవంక ఆశగా చూస్తున్నారు. 

18:16 - July 1, 2016

మహారాష్ట్ర : తెలంగాణ- మహారాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం మేరకు నేడు బాబ్లీ గేట్లను అధికారులు ఎత్తారు. నిజామాబాద్‌ జిల్లా శ్రీరాంసాగర్ నుంచి వచ్చిన ముగ్గురు అధికారులు నీటిని దిగువకు విడుదల చేసారు. నీటి విడుదలను త్రిసభ్య కమిటీ పర్యవేక్షిస్తోంది. జులై 1 నుంచి- అక్టోబర్‌ 28 వరకు బాబ్లీ గేట్లను ఎత్తాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్ట్‌ వద్ద 0.6 టీఎంసీలతో 1097 అడుగుల నీరు ఉంది. బాబ్లీ నుంచి శ్రీరామ్‌సాగర్‌కు నీరు చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. ఈ నీటి కోసం ఆయకట్టు పరిధిలోని నిజామాబాదు, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన రైతులు ఆశగా ఎదురు చూస్తునారు. 

Don't Miss

Subscribe to RSS - బాబ్లీ