బాలకృష్ణ

12:45 - June 10, 2017

ఢిల్లీ : టాలీవుడ్‌ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో బాలకృష్ణ అభిమానులు, టీడీపీ నేతలు కేక్‌ కట్‌ చేశారు. అనంతరం అనేక స్వచ్చంద కార్యక్రమాల్లో అభిమానులు పాల్గొన్నారు. 

 

11:05 - June 8, 2017

నందమూరి బాలకృష్ణ జోరు మీదున్నాడు. 100వ చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఘన విజయం అనంతరం 101 సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. తన తదుపరి చిత్రాలపై కూడా 'బాలయ్య' ఇప్పటినుండే ఫోకస్ పెట్టాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 101 సినిమా తెరకెక్కుతోంది. ఇందులో 'శ్రియ' హీరోయిన్ గా మరోసారి కనిపించబోతోంది. ప్రస్తుతం పోర్చుగల్ లో సినిమా షూటింగ్ జరుపుకొంటోంది. ‘బాలకృష్ణ'కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన టైటిళ్ల విషయంలో చిత్ర యూనిట్ తర్జనభర్జనలు పడుతున్నట్లు టాక్. ఈనెల 10వ తేదీన 'బాలకృష్ణ' పుట్టిన రోజు కావడంతో ఆ రోజున ఫస్ట్ లుక్ విడుదల చేయాలని, టైటిల్ లేకుండా ఫస్ట్ లుక్ విడుదల చేస్తే బాగుండదని చిత్ర యూనిట్ యోచిస్తున్నట్లు సమాచారం. ‘జై బాలయ్య'...’ఉస్తాద్'..’తేడా సింగ్'..’పైసా వసూల్'..ఇలా నాలుగు టైటిళ్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ విడుదల చేయాలా ? లేదంటై టైటిల్ కోసం మరికొన్ని రోజులు ఆగాలా ? అని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఆయన మొదటి లుక్ ఎలా ఉంటుంది ? చిత్ర టైటిల్ ఏంటీ అనేది తెలుసుకోవాలంటే ఈనెల 10వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

11:27 - June 4, 2017

నందమూరి బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఘన విజయం అనంతరం నెక్ట్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన 101వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య సరసన మరోసారి 'శ్రియ' ఆడి పాడనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ లుక్ సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండదనుందని తెలుస్తోంది. ఇటీవలే పోర్చుగల్ లో చిత్ర షూటింగ్ జరిగింది. ఇక 'బాలయ్య' ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించనున్నాడని టాక్. మాఫియా డాన్ గా పవర్ పుల్ రోల్ పాత్ర ఒకటి..ట్యాక్సీ డ్రైవర్ గా మరో పాత్రలో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా రిలీజైన ఫొటో చూస్తే ఇది నిజమనిపిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

10:57 - May 30, 2017

నందమూరి బాలికాకయ్యకు హిందూపురం జనం ఉసురు తాకెతట్టే గొడ్తున్నది.. సీన్మల సీన్లు జెప్పినట్టనుకున్నడో ఏమో.. అప్పుడెప్పుడో ఎన్కట ఒకపారి హిందూపురానికి వొయ్యి ఓట్లేశిన జనానికి ఎన్నో ఒట్లు వెట్టిండు.. మీకు ఇది జేస్తా అది జేస్త.. ఆడకట్టు ఆడకట్టుకు మంచినీళ్లు తాపిస్తాని.. ఇప్పుడు పత్తాకే లేకుంట ఏడు చెర్వుల నీళ్లు దాపిస్తున్నడట కాకయ్య..మరి పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

10:31 - May 12, 2017

ప్రముఖ హీరోలు తమ తమ సినిమాల్లోనే పాటలు పాడడమే కాకుండా ఇతరుల సినిమాలకు తమ గొంతును వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా 'బాలకృష్ణ' కూడా ఈ జాబితాలో చేరిపోయారు. తన తాజ చిత్రంలో ఓ పాట పాడారు. 100వ సినిమా 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఘన విజయం సాధించిన అనంతరం తదుపరి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 101వ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో 'బాలయ్య' నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనందప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం కోసం బాలకృష్ణ సింగర్‌గా మారారు. ఆ విశేషాలను దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెలియచేశారు. ఈ చిత్రంలో 'మావా ఏక్‌ పెగ్‌ లావో.. ' అనే పాట పాడటం చాలా ఆనందంగా ఉందని తెలియచేశారు. అత్యంత తక్కువ సమయంలో అంత గొప్పగా పాడటాన్ని చూసి యూనిట్‌ ఆశ్చర్యపోయిందని, స్వతహాగా బాలకృష్ణకు సంగీతం పట్ల మంచి అభిరుచి ఉందన్నారు. ఆడియో విడుదలైన తర్వాత పాట విన్న ప్రతి ఒక్కరూ ఆయన స్వరాన్ని విని ఆనందిస్తారు. అభినందిస్తారని తెలిపారు. ఇప్పటికే షూటింగ్‌ కొంత భాగం పూర్తయ్యిందని, గురువారం సాయంత్రం యూనిట్‌ పోర్చుగల్‌కు ప్రయాణమైందన్నారు. దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.

10:23 - May 11, 2017

టాలీవుడ్ ప్రముఖ నటుల్లో ఒకరైన 'బాలకృష్ణ' అటు రాజకీయ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. తన 100వ సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఘన విజయం సాధించిన అనంతరం ఇతర చిత్రాలపై దృష్టి సారించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 101 సినిమాకు ఒకే చెప్పిన బాలయ్య తాజాగా 102వ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించనున్న చిత్రాన్ని సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మించనున్నారు. బాలకృష్ణ కెరీర్ లో ఈ చిత్రం నిలిచిపోతుందని, జూన్ నెలాఖరున మొదలు కానుందని సి.కళ్యాణ్ పేర్కొన్నారు. భారీ హంగులతో కె.ఎస్.రవికుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు, ఎం.రత్నం కథ..మాటలు సిద్ధం చేశారని వెల్లడించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు త్వరలో తెలియనున్నాయి.

20:07 - April 20, 2017

హైదరాబాద్: గొర్రులు మేకల నడుమ బాబుగారి జయంతి...అంగరంగ వైభవంగా అన్న పుట్టినరోజు, కోతకు రాని పంట కోసిన హరీష్ రావు...ఇట్లమ్మినా మద్దతు ధర కూడా రావు, హిందూపురంలో విపరీతమైన నీళ్ల పంచాయతీ...బాలికాక మీద కాక మీదున్న జనాలు, పక్కపొంటే ప్రాజెక్టు ఉన్నా తాగునీళ్లకు కరువు..నిజామాబాద్ దిక్కు పోతున్నది సర్కార్ పొరువు, అర్థకి పావుసేరు ధరకొచ్చిన మిర్చి పంట..పట్టించుకోని ప్రభుత్వాల మీద రైతన్నల మంట, చెరువు కింద బయటపడ్డ మరొక చెరువు..ఇప్పటికన్నా తీరాలే ఏలూరు కరువు ఇలాంటి అంశాలతో ఈ రోజు మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మన ముందుకు వచ్చాడు. పూర్తి వివరాలు చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

20:06 - April 17, 2017

హైదరాబాద్: రిజర్వేషన్ల మీద అఖిల పక్షాల డ్రామా.. అసెంబ్లీ సాక్షిగా అవమానిస్తున్న పార్టీలు, కూలి పనులకు జమైతోన్న కోట్ల పైకం...చెమట ఎల్లకుండనే చేరిపోతున్న లక్షలు, లోకశాన్ని ముద్దపప్పు అనుడు బంద్...చర్యలు తీసుకునే ఆలోచనలో చంద్రాలు, లోపల కుర్చీలు ఇరగ్గొట్టిన తెలుగు తమ్ముడు...బయట చెప్పుతోని కొట్టుకున్న ఫ్యాన్ గుర్తన్న, ఫేస్ బుక్ ప్రేమలో పడి బుక్కయిన పోరడు...మారు ఫోటోలతోని మాయ చేసిన కిలాడీ, హిందూపురం కాడా విపరీతమైన దూప..బాలికాక రాకకోసం జనం చూపు.. ఇత్యాది అంశాలతో మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న హాట్ హాట్ అంశాలతో మన ముందుకు వచ్చారు. మరి మీరు కూడా వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

21:46 - April 9, 2017

హైదరాబాద్ : బసవతారకం కేన్సర్‌ ఆస్పిటల్‌ ట్రస్ట్‌ ద్వారా లక్షలాది మంది పేదలకు వైద్యసహాయం అందుతోందని ట్రస్ట్‌ చైర్మన్‌  బాలకృష్ణ అన్నారు. ఆస్పత్రిలో కొత్తగా డార్మెటరీ భవనాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. భవిష్యత్తులో ఆస్పత్రిలో రోబోటిక్‌ సర్జరీ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్టు బాలకృష్ణ తెలిపారు. సంపాదనలో కొంత సర్వీసు కోసం ఖర్చుపెట్టాలని దాతలకు పిలుపు నిచ్చారు బాబు. 

 

08:53 - April 6, 2017

త్రిష...'గౌతమీపుత్ర శాతకర్ణీ' లో పర్ ఫెక్ట్ నటనకు ఆమెపై ప్రశంసలు కురిశాయి. ఇద్దరు పిల్లలకు తల్లిగా కనిపిస్తూనే, కావాల్సినంత గ్రేస్ తో సినిమాకి ఎసెట్ లా నిలిచిందనే టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. బాలయ్య సరసన గత చిత్రాల్లో కూడా 'త్రిష' నటించింది. తాజాగా మరోసారి బాలయ్యతో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణ 101వ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వి.ఆనంద్ ప్ర‌సాద్ నిర్మాత‌గా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఒక కథానాయికగా ముస్కాన్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండో హీరోయిన్ గా 'త్రిష'ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు టాలీవుడ్ సమాచారం. ఇక మూడో కథానాయికగా 'ఛార్మీ'ని సెలక్ట్ చేస్తారని టాక్. కానీ ఈ సినిమాలో 'ఛార్మీ'తో ఐటమ్ సాంగ్ చేయిస్తారని మరో ప్రచారం జరుగుతోంది. దీనిపై మరింత క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వేయిట్ చేయక తప్పదు.

Pages

Don't Miss

Subscribe to RSS - బాలకృష్ణ