బాలయ్య

20:33 - April 21, 2018

నువ్వు మన్షివా బాలకిష్ణవా అని జనం నిన్ను ఎంతకు తీస్కపోయి తిట్టుకుంటున్నరో సూశ్నవా బాలయ్యా...అవ్వలో ఈ తెలంగాణ గ్రూప్ టూ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారు అపాయింట్ మెంట్ గావాల్నంట.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారంట తెల్లారి మొఖం గడ్కకముందుకు సుర్వు జేస్తె.. రాత్రి నిద్రమత్తులకు వొయ్యెదాక అవద్దాలే మాట్లాడ్తడట.. చంద్రబాబు ఇంటి దంద హెరిటెజ్ సూపర్ మార్కెట్ల కిలో ఉల్లిగడ్డ ధర ఎంతనో తెల్సా..? పదమూడు రూపాల నర.. ఎద్గ తెలంగాణ రాష్ట్రమొచ్చినంక.. అండ్ల ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యినంక అన్యాయమైపోయిండ్రు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు..పోలీసోళ్లు ప్రజలను సార్ అని పిలిస్తె మనం గూడ పోలీసోళ్లను సార్ అనే పిల్వాలే.. ఇయ్యాళ రేపు బ్యాంకులళ్ల పైకం దాస్కుంటె మిత్తి దేవుడెరుగు గని..గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:33 - April 1, 2018

అనంతపురం : రాయలసీమను రతనాల సీమగా మారుస్తామన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. లేపాక్షి ఉత్సవాలను ప్రారంభించిన సీఎం.. లేపాక్షిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. అట్టహాసంగా ప్రారంభమైన ఉత్సవాల్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతోపాటు.. పలువురు ప్రముఖులు, కళాకారులు హాజరయ్యారు. ఏపీ సీఎం చేతులమీదుగా ప్రారంభమైన లేపాక్షి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.. మరో రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి... హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వారంతా అనంతపురం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్నచర్యలపై వివరించారు. శ్రీకృష్ణదేవరాయల వేషధారణలో వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ వేదికమీద సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. లేపాక్షిబసవన్న, వీరభద్రస్వామి దేవాలయం మనందరికీ గర్వకారణమన్నారు సీఎం చద్రబాబు.. లేపాక్షిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అలాగే అనంతపురం జిల్లాలోని ప్రతి చెరువును నీటితో నింపుతామన్నారు. ఎన్టీఆర్‌కు ఇష్టమైన హిందూపురం ప్రాంతానికి.. బాలకృష్ణ ప్రాచుర్యం తెచ్చారని సీఎం చెప్పారు.. భవిష్యత్తులోరాయలసీమను అభివృద్ధి చేసితీరతామన్నారు. రాయలసీమ రాళ్ళసీమకాదు... రతనాలసీమగా చేస్తామన్నారు. విజయనగర చక్రవర్తుల కాలంలోప్రసిద్ధ క్షేత్రంగానూ, ఆర్థిక పట్టణంగానూ విరాజిల్లిన ప్రాంతం లేపాక్షి అన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ... ఆధ్యాత్మికంగా కూడా ఈప్రాంతానికి ప్రాచుర్యం ఉందన్నారు. 108 శైవ క్షేత్రాల్లో లేపాక్షి కూడా ఒకటని బాలకృష్ణ తెలిపారు. ఆధ్యాత్మికం, సాంస్కృతిక మేళవింపుగా రెండురోజులపాటు ఈ ఉత్సవాలు సాగుతాయని చెప్పారు. లేపాక్షిని టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కోట్లాదిరూపాయలతో... లేపాక్షి అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు బాలకృష్ణ. ఉత్సవాలకు ముందు.. లేపాక్షి నంది విగ్రహం నుంచి సభావేదిక వరకు శోభాయాత్ర నిర్వహించారు. అశ్వరథంపై శ్రీకృష్ణుడి వేషధారణలో శోభయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. అలాగే... శివమణితోపాటు పలువురు కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఉత్సవాల వేదికమీద సినీ ప్రముఖులు కె.విశ్వనాథ్‌, కె.రాఘవేంద్రరావు, రాళ్లపల్లితోపాటు పలువురు కళాకారులను సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ సత్కరించారు.

07:08 - March 26, 2018

అనంతపురం : హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైకిల్‌పై సవారీ చేశారు. లేపాక్షి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే సైకిల్‌ ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు పంచాయతీ కొడికొండ చెక్‌పోస్ట్‌ వద్ద ప్రారంభించిన సైకిల్‌ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. సైకిల్‌ తొక్కి అభిమానులను ఉత్సాహపరిచారు. లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా బాలకృష్ణ అధికారులను కోరారు. 

12:54 - February 16, 2018

సినిమా ఇండస్ట్రీలో అందరూ స్టార్ హీరోలు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తో రెడీ అవుతున్నారు. రీసెంట్ సినిమాల హిట్ లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా చక చక సినిమాలు చేస్తున్నారు. తెలుగు లో బయోపిక్స్ రావడం కొంచం రేర్ అనే ఒపీనియన్ ఉన్న ఈ టైం లో ఒక బయో పిక్ తో రెడీ అవుతున్నాడు స్టార్ హీరో.

చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వీరితో పాటు స్టార్ హీరో హోదా ఉన్న హీరో నందమూరి బాలకృష్ణ. బాలయ్య సినిమా అంటే మాస్ లో క్లాస్ లో మంచి క్రేజ్ ఉంటుంది. తన సినిమాల్లో కచ్చితంగా ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు బాలకృష్ణ. తన ప్రీవియస్ సినిమా జై సింహ లో కూడా బాలకృష్ణ చాల పవర్ ఫుల్ రోల్ లో కనిపించాడు. ఈ సినిమా టాక్ పాజిటివ్ గా వచ్చింది.

బాలకృష్ణ ప్రెసెంట్ 'నందమూరి తారకరామారావు' జీవిత కథని ఆధారం చేసుకొని బయోపిక్ తీస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమా కి డైరెక్టర్ తేజ ..ఒక టీజర్ కూడా షూట్ చేసి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు. కానీ ఆ తరువాత ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ మాత్రం ఏమి రాలేదు. చక చక సినిమాలు చేస్తూ ఫామ్ లో ఉన్న బాలయ్య ఈ సినిమాలో ఆ స్పీడ్ ఎందుకు చూపించడం లేదు అనేది ఇండస్ట్రీ వర్గాల డౌట్. తేజ రీ ఎంట్రీ ఇచ్చి 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. 

21:15 - December 29, 2017

అనంతపురం : స్వర్గీయ ఎన్టీఆర్‌ కలను తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నెరవేర్చడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు నందమూరి బాలకృష్ణ. అనంతపురం జిల్లా హిందూపురం నియోజక వర్గంలో 2వ రోజు పర్యటన సందర్భంగా బాలకృష్ణ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 194 కోట్ల నిధులతో ఏర్పాటు చేస్తున్న పైప్‌ లైన్‌ బృహత్తర నీటి పథకం పనులను ఆయన ప్రారంభించారు. 66 కోట్లతో డ్రైనేజీ, రోడ్డు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు బాలకృష్ణ.

21:26 - December 18, 2017
16:00 - November 17, 2017

విశాఖ : తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చేలా చేయడమే సీఎం చంద్రబాబు ధ్యేయమని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. రైతుకు టెక్నాలజీ చేరువ చేసే ప్రయత్నమే అగ్రీ టెక్‌ సమ్మిట్ సమావేశమని ఆయన తెలిపారు. విశాఖలో మూడవ రోజు అగ్రీ టెక్‌ సమ్మిట్‌లో సినీ నటుడు బాలయ్య సందడి చేశారు. సమ్మిట్‌లో రైతులు, ఎగ్జిబిటర్స్‌ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. టెక్నాలజీ ఇన్నోవేషన్స్ రైతుకు చేరువ చేసే ప్రయత్నమే ఇదని అన్నారు. 

10:50 - November 12, 2017

ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మహా ధర్నా చేపట్టడం ఏంటీ ? అధికారం పక్షం నుండి ఎన్నికై ధర్నా చేపట్టడం ఏంటీ ? అని ఆలోచిస్తున్నారా ? అయితే ఇదేమి నిజం కాదు...కేవలం షూటింగ్ నిమిత్తం ధర్నా చేపట్టారు. వందో చిత్రం అనంతరం బాలయ్య వరుస సినిమాలకు సైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. 102వ సినిమా కె.ఎస్.రవి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్నారు. బాలయ్య సరసన నయనతార, నాటాషా జోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు 'జై సింహ' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

చిత్ర షూటింగ్ ప్రారంభం కూడా అయ్యింది. షరవేగంగా జరుపుకొంటున్న ఈ షూటింగ్ ఇటీవలే విశాఖ బీచ్ రోడ్డులో చేశారు. సినిమాలో ఓ సన్నివేశం కోసం బీచ్‌ రోడ్డులో ఐదు వేల మంది జూనియర్‌ ఆర్టిస్టులు, 110 బస్సులతో మహాధర్నా చేశారు. అంతేగాకుండా బాలయ్య..నయన్ లపై ఓ సాంగ్ కూడా చిత్రీకరించారు. అరకు..బీచ్ లో హరిప్రియపై రొమాంటిక్ గీతాన్ని కూడా షూట్ చేశారు. మొత్తానికి వైజాగ్ లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
త్వరలో మరో షెడ్యూల్‌కి సన్నద్ధమవుతోందని నిర్మాత కళ్యాణ్‌ పేర్కొన్నారు. యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌గా రూపొందుతోంది. 

12:00 - September 10, 2017

నందమూరి 'బాలకృష్ణ' ఫిలిం మేకింగ్ లో స్పీడ్ పెంచాడు. తన ఎనర్జీ లెవెల్స్ తో డైలాగ్స్ అదరగొడుతూ హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. 'పైసా వసూల్' సినిమా రిలీజ్ అయింది రిజల్ట్స్ ఎలా ఉనా 'బాలయ్య' మరో సినిమా చేయబోతున్నాడు. 'పైసా వసూల్’ రిజల్ట్ చూశాక అందరూ నందమూరి బాలకృష్ణ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఈ సినిమా ఓ మాదిరిగా ఆడుతోందని టాక్. క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' హిస్టీరికల్ సినిమాగా నిలిచింది. వరల్డ్ వైడ్ హిట్ టాక్ తో నడిచింది. ఆ తరువాత పూరి తో 'పైసా వసూల్' లో నటించాడు బాలయ్య.

‘పైసా వసూల్’ విషయంలోనే బాలయ్య తప్పటడుగు వేశాడనుకుంటుంటే.. ఈ సినిమా ఫలితం చూశాక కూడా బాలయ్య పూరితో ఇంకో సినిమా చేయడానికి రెడీ అవడం చూసి మరింత ఆశ్చర్యపోతున్నారు. ‘పైసా వసూల్’ విడుదలకు ముందు బాలయ్య-పూరి కాంబినేషన్లో ఇంకో సినిమా ఉంటుందని.. అదో పొలిటికల్ డ్రామా అని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. స్వయంగా పూరినే బాలయ్యతో తాను మరో సినిమా చేయబోతున్నట్లు కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. 

11:11 - September 5, 2017

టాలీవుడ్ లో అగ్ర హీరోల్లో ఒకరైన 'బాలకృష్ణ' సినిమాల జోరు పెంచారు. వందో చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఘన విజయం అనంతరం వరుసగా సినిమాలకు సైన్ చేసేస్తున్నారు. తాజాగా 101 సినిమాగా వచ్చిన 'పైసా వసూల్' మంచి టాక్ నే తెచ్చుకుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సరికొత్త బాలయ్యను చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం వెంటనే మరోసినిమా మొదలెట్టేశారు. ఇప్పటికే పూజలు చేసిన ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుకొంటోంది.
కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో 'బాలయ్య' సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు టాక్. అందులో ఒకరు 'నయనతార' కాగా ఇక రెండో హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకోవాలని చిత్ర దర్శక..నిర్మాతలు యోచించినట్లు టాక్. అందులో భాగంగా 'నటాషా దోషి'ని తీసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయ. మలయాళంలో 'హైడ్ అండ్ సీక్', ‘నయన', 'కాల్' వంటి చిత్రాల్లో నటించింది. మూడో హీరోయిన్ ను ఫిక్స్ చేయాలని భావిస్తున్నారంట. కె.ఎస్‌ రవికుమార్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాను 2018 సంక్రాంతికి రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. బాలయ్య నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 

Pages

Don't Miss

Subscribe to RSS - బాలయ్య