బాలలు

11:16 - October 17, 2018

ఢిల్లీ : ఆకలి లేదా పోషకాహార లోపం వల్ల ప్రతి ఐదు నుంచి పది క్షణాలకు ఒకరు చొప్పున బాలలు మరణిస్తున్నారని ఐక్యరాజ్య సమితి ఆహార విభాగం హెచ్చరించింది.  ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఉత్పత్తి క్రమంలో, వంట గదుల్లో ఎంతో ఆహారం వృథా అవుతున్నదని వివరించింది.  ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా రోమ్‌ నగరంలో జరిగిన కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి ఆహార కార్యక్రమం  అధిపతి డేవిడ్‌  బీలే పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఓ పీడ కల రాబోతున్నదని, ఓ తుపాను మన ముందున్నదని ఆకలిని గూర్చి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని 15.5 కోట్ల మంది బాలలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని చెప్పారు. సూక్ష్మపోషకాల లోపంతో 200 కోట్ల మంది బాధపడుతుండగా, 60 కోట్ల మంది స్థూలకాయులుగా ఉన్నారని తెలిపారు. 

20:25 - November 14, 2017

బాలల దినోత్సవం సందర్భంగా బాలల చలన చిత్రోత్సవాల్లో 'ఎగిసే తారాజువ్వల' చిత్రం ప్రదర్శనకు ఎంపిక చేశారు. నవంబర్ 14 బాలల దినోత్సవాల సందర్భగా చిత్ర యూనిట్ తో ముచ్చటించింది. తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వ పాఠాశాలలను, అక్కడి బోధనాభ్యసన పద్ధతులను, వాస్తవ విధానములను చక్కగా ప్రతిబింబించిన చిత్రమని చెప్పచ్చు. ఈ సినిమాలో సమస్య గురించి బాధ పడడం కన్నా చక్కని సులభపరిష్కారాలు చూపడం జరిగిందని చిత్ర యూనిట్ పేర్కొంటోంది. విద్యార్థులు పాఠ్యాంశాలు పుస్తకాలలో వున్నట్లు మక్కీకి మక్కీ కాకుండా ప్రయోగాత్మకంగా, అనుభవ పూర్వకంగా అవగాహన చేసుకొనే ప్రయత్నాలను చూపినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:55 - November 14, 2017

విజయవాడ : తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి పరిటాల సునీత హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి జవహార్‌ లాల్‌ నెహ్రూ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పిల్లలపై ఒత్తిడి లేకుండా అన్ని రంగాల్లో ప్రోత్సహించాలన్నారు మంత్రి. పిల్లలు ఆరోగ్యకరంగా పుట్టేందుకు గర్భిణీ స్త్రీలకు అన్న అమృత హస్తం ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. 

09:34 - November 14, 2017

బాలలకు రక్షణ కల్పించాలని చైల్డ్‌రైట్స్‌ యాక్టివిస్ట్‌ మురళీ మోహన్‌ అన్నారు. ఈ రోజు బాలల దినోత్సవం సందర్భంగా జనపధం ఈ చర్చను చేపట్టింది. చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు, వారికి రక్షణ కల్పించి, సరైన అవకాశాలు కల్పించినప్పుడే భావి భారతం బాగుంటుంది. మరి ఈ దేశంలో వారికి సరైన రక్షణ ఉందా? వారికి ఉన్న చట్టాలేంటి? వాటి అమలు తీరు ఎలా ఉంది?' అనే అంశాలపై మురళీమోహన్ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:28 - November 11, 2017

ఖమ్మం : బాలోత్సవం.. ఖమ్మంలో ఆనందాన్ని నింపుతోంది. చిన్నారుల ఆటపాటలతో నగరం మార్మోగిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన విద్యార్థులు ఉత్సవాన్ని తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఖమ్మం పట్టణంలోని భక్త రామదాస్ కళక్షేత్రంలో నిర్వహించిన రాష్ట్ర స్ధాయి బాలోత్సవ కార్యక్రమం రెండో రోజు.. విధ్యార్దుల్లో మరింత జోష్ నింపింది. రాష్ట్రంలోని 8 జిల్లాల నుంచి బాలలు వేల సంఖ్యలో తరలి వచ్చారు. పిల్లలతోపాటు పెద్దలు కూడా ఈ వేడుకలకు తరలివచ్చారు. ఆటపాలతో బాలోత్సవం కాస్తా ఆనోదోత్సాహంగా మారింది.

ప్రస్తుత విద్యావ్యవస్థలో చిన్నారులు సృజనాత్మకతను మరిచి పోతున్నారు. కల్చరల్ యాక్టీవిటిలేక మన సంప్రదాయాలను మరిచి పోతున్నారు. అందుకే మన కల్చర్‌గురించి చిన్నారులకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ బాలోత్సవ్‌ ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఉమ్మడిజిల్లా విడిపోయిన తర్వాత తర్వాత మొదటిసారిగా ఖమ్మంలో బాలోత్సవం నిర్వహించడం ఆనందంగా ఉందంటున్నారు. నిద్రలేచింది మొదలు .. స్టడి పేరుతో స్కూల్ ,ఇల్లు, ట్యూషన్లతో బిజిబిజిగా వుండే పిల్లలు ఈ బాలోత్సవ్‌లో పాల్గొని కేరింతలు కొడుతున్నారు. కొత్త ఫ్రెండ్స్‌తో కలిసి ఆటపాటలను ఎంజాయ్‌ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన చిన్నారులు, తల్లిదండ్రులతో ఖమ్మంలో సందడి వాతావరణం నెలకొంది. బాలోత్సవ్‌లాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని విద్యార్థులు కోరుతున్నారు. 

13:23 - September 20, 2017

హైదరాబాద్ : మళ్లీ పాతబస్తీలో అరబ్ షేక్ లు అరెస్టు కావడం కలకలం రేపుతోంది. పేద ముస్లిం కుటుంబాలను పలువురు అరబ్ షేక్ లు టార్గెట్ చేయడం..బాలికలు పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లి చిత్రహింసలకు గురి చేయడం లాంటి సంగతులు చూస్తూనే ఉంటాం. డబ్బులకు ఆశ పడి పలువురు తల్లిదండ్రులు షేక్ లకు ఇచ్చి వివాహం చేస్తుంటారు. ఇందులో కాజీలు కీలక పాత్ర పోషిస్తుంటారు. తాజాగా పాతబస్తీలో అరబ్ షేక్ ల కుట్రలకు సౌత్ జోన్ పోలీసులు చెక్ పెట్టారు. 

ఫలక్ నుమా, చాంద్రాయణగుట్టలో రహస్యంగా బాలికలను వివాహం చేసుకుంటున్నారన్న సమచారం మేరకు సౌత్ జోన్ పోలీసులు దాడులు జరిపారు. 8మంది అరబ్ షేక్ లను వీరితో పాటు 8 మంది మధ్యవర్తులను సౌత్ జోన్ అరెస్టు చేశారు. పాతబస్తీలో ముగ్గురు కాజీలు, ముంబై నుండి వచ్చిన మరొక కాజీని అదుపులోకి తీసుకుని విచారించారు. అంతేగాకుండా నలుగురు లాడ్జ్ ఓనర్లను కూడా అరెస్టు చేసినట్లు సమాచారం. ఇందులో 20 మంది రాకెట్ లో పట్టుబడడం సంచలనం సృష్టిస్తోంది. 

20:38 - November 10, 2016
12:29 - October 27, 2016

విజయవాడ : నిధులున్నాయా..? ఎక్కడైనా దొరికాయా..? తవ్వకాలతో పురాతన సంపద కనుమరుగవుతుందే కాని నిధులు మాత్రం దొరకడం లేదు.. ఫలానా చోట నిధులున్నాయని తెలిస్తే చాలు.. రాత్రి రాత్రి కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.. మూఢనమ్మకాలు.. విశ్వాసాలతో ఎందరో నిధుల వేట కొనసాగిస్తున్నారు.. చారిత్రాత్మక భవనాలను..ఆలయాలను నామరూపాల్లేకుండా చేస్తున్నారు..తాజాగా వెలుగుచూసింది పిల్లల కిడ్నాప్..అనాథ పిల్లలను తీసుకెళ్లి పూజలు చేస్తున్నారు...నిధుల కోసం అరచేతిలో అంజనం వేస్తున్నారు..కన్పించలేదంటే వదిలేస్తున్నారు..అనుమానం వస్తే బలిచ్చేస్తారు...ఇలాంటి దుర్మార్గపు ముఠా బెజవాడ దొరకడం కలకలం రేపుతోంది...
నిధుల కోసం చిన్నారుల కిడ్నాప్..ఆలస్యంగా వెలుగుచూసిన ఘోరం..
గుప్త నిధులు..వీటి కోసం కొన్ని ముఠాల అన్వేషణ రెండు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది..అయినా నిధులు దొరుకుతాయన్న అపనమ్మకాలను పెంచి పోషించేవారి వల్ల వేట కొనసాగుతూనే ఉంది..ఒక్కోక్కరూ ఒక్కోరకంగా నిధుల కోసం పాకులాడుతూనే ఉన్నారు.. తాజాగా గుప్త నిధుల కోసం ఓ ముఠా బెజవాడలో సంచరిస్తుందని తేలింది...వీరి స్టైల్‌ మాత్రం వేరు...
ఎదురు కాళ్లతో జన్మించిన పిల్లలతో అంజనాలు ..
ఇలాంటి ప్లాన్‌ చేసుకున్న ఓ నలుగురు వ్యక్తులు గల గ్యాంగ్‌ ముఠాగా ఏర్పడింది..వీరికి నిధులు ఉన్నాయో లేదో చెప్పేది శివస్వామి.. తానే శివుడికి స్వరూపమని నమ్మించి పిల్లలను తీసుకురమ్మని ఆజ్ఞవేస్తాడు..ఆ చిన్నారులు కూడా ఎదురుకాళ్లతో జన్మించినవారైతేనే నిధులు దొరుకుతాయంటూ చెప్పాడు..అంతే ఆ రోజు నుంచి ముఠా గురి అనాథ పిల్లలపై పడింది... వీరితో అయితే ఎలాంటి సమస్యలుండవు..వారు చేసే దుర్మార్గం బయటకు రాదు..ఇదే ఆలోచనతో బెజవాడపై పడ్డ ముఠా అనాథ చిన్నారుల కోసం అన్వేషిస్తోంది...
గతంలో ఇద్దరు చిన్నారులు కిడ్నాప్..
ఎదురుకాళ్లతో జన్మించిన పిల్లలయితే వారి అరచేతిలో అంజనం వేసి పసరుపోస్తే నిధులు ఎక్కడున్నాయో కన్పిస్తాయన్న శివస్వామి చెప్పిన కథలతో ముఠా చిన్నారులను కిడ్నాప్ చేసిన సందర్భాలున్నాయి...తాజాగా మరో చిన్నారిని ఎత్తుకెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది..ఎట్టకేలకు దీన్ని చేధించిన బెజవాడ సత్యనారాయణపురం పోలీసులు ముఠాను అదుపులోకి తీసుకోవడంతో ఒళ్లు జలదరించే..కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగులోకి వచ్చాయి...

ఎవరీ శివస్వామి?
అసలు ఎవరీ శివస్వామి..ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు..ఎందుకిలా చేస్తున్నాడు...వీటన్నింటిపై పోలీసులు ఆరా తీస్తే తెలిసిన వాస్తవాలు నివ్వెరపోయేలా చేస్తున్నాయి...తానే శివుడికి స్వరూపమని రెండేళ్లుగా చేస్తున్న అరాచకాలు ఎన్నో...కాస్త లేటయినా...ఎలాంటి ప్రాణనష్టం జరగకున్నా దుర్మార్గుల జాతకాలు బయటపడ్డాయి...ఇంతకీ ఎవరీ శివస్వామి...
అసలు పేరు శ్రీనివాస్...కృష్ణాజిల్లా వాత్సాయికి చెందిన శ్రీనివాస్
ఇలాంటి మాటలు చెప్పిన శ్రీనివాస్‌ అంబరు పేటకు చెందిన రాజా, బుజ్జిలతో పాటు మరో ఇద్దరిని తనవైపు తిప్పుకున్నాడు... గుప్తనిధులు కావాలంటే తాను చెప్పింది చేయాలని ఆజ్ఙాపించాడు...
12 ఏళ్ళ లోపు వయస్సున్న పిల్లలు..ముందుకాళ్లతో జన్మించి ఉండాలి..
ఇలా చిన్నారులు ఎదురుకాళ్లతో జన్మించారో..లేక తల మొదలుతోనే బయటకు వచ్చారో తెలియదు కదా..అందుకే వారిలో ఎవరిపైనా అనుమానం వచ్చినా తీసుకువస్తే అరచేతిలో పసరువేస్తానంటూ చెప్పాడు..దాంతోనే విషయం తెలిసిపోతుందని నమ్మించాడు..
అనాథ శరణాలయాలే టార్గెట్ ...
దొంగ స్వామి చెప్పిన మాటలు నమ్మిన ముఠా సభ్యులు బెజవాడపై పడ్డారు..వీరి టార్గెట్‌ అనాథ శరణాలయాలే...రోడ్డుపై కన్పించే అనాథ పిల్లలే..వీరిని ఎత్తుకెళ్లి స్వామి ముందు హాజరుపరిస్తే నిధుల జాడ తెలిసిపోతుందని నగరంలో పిల్లల కిడ్నాప్‌లు చేస్తున్నారు..తాజాగా ఓ బాలుడిని ఎత్తుకెళ్లడంతో వీరి దుర్మార్గం వెలుగుచూసింది...
బాలభవన్ చుట్టు రెక్కీ...
విజయవాడ బావాజి పేటలోని బాల భవన్ నుండి ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేసి వాత్సాయి కి తీసుకువెళ్ళారు. మూడురోజులు రకరకాల పూజలు చేశారు...ఆ పిల్లల చేతిలో పసరు పూసి నిధులు కనబడుతున్నాయని చూశారు...కాని స్వామికి కన్పించలేదంట..అంటే వారు ముందుకాళ్లతో జన్మించినవారు కాదని వదిలేశారు...

ఆ పిల్లలకు కుదరకపోతే మరొకరిని ఎత్తుకు వస్తాడు..
ఎత్తుకెళ్లే పిల్లల చేత మూడు రోజుల పాటు పూజలు చేస్తూ ఆ సమయంలో కనీసం తిండికూడ పెట్టేవారు కాదు..వారి చేతికి ఓం నమశివాయని అని గోరింటాకు పెట్టి పూజలు చేసి, ఆ చేతిలో ఆకుపసర పూసి అందులో.మూడుచుక్కలు నూనె పోసి గుప్తనిధులు అందులో కనబడుతున్నాయని.. అవి ఎక్కడనున్నాయో చూడమని పిల్లల్ని అడిగేవాడు.... చెప్పకపోతే బెదిరించేవాడు. అయినా కన్పించలేదని చెబితే వదిలేసి బయట చెబితే విషం కక్కుకొని చచ్చిపోతావని చెప్పి బయపెట్టేవాడు....

బాలవభవన్‌ నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం
తాజాగా ఈ బాలుడు కాలేషాను ఎత్తుకెళ్లింది ముఠా...అంతకు ముందే సుభానీని కిడ్నాప్ చేసి వదిలేశారు..ఈ విషయం తెలుసుకున్న బాలవభవన్‌ నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు..కాలేషా కన్పించడం లేదనేసరికి సుభానీ ద్వారా వివరాలు తెలుసుకుని వాత్సవాయి గ్రామానికి చేరారు..అక్కడ ముఠాను గుర్తించి బాలుడిని సురక్షితంగా భవన్ చేర్చారు..ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు...అరెస్ట్ చేసినప్పటికి శ్రీనివాస్ మాత్రం అప్పటికితాను శివ స్వరూపాన్నె అని చెప్పడంతో పోలీసులు శ్రీనివాస్ ను ఏం చేయాలో తెలియక తలలుపట్టుకున్నారు...

ముఠా దుర్మార్గం కలకలం
బెజవాడ నగరంలో బయటపడ్డ ముఠా దుర్మార్గం కలకలం రేపుతోంది...నిధుల కోసం అనాథపిల్లలను టార్గెట్ చేసిన ముఠా తీరుపై భయం నెలకొంది..చిన్నారులను బలిచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు వణుకుపుట్టించాయి..మూఢత్వంతో దుర్మార్గులు చేస్తున్న అకృత్యాలకు పసివాళ్లను పావులు చేస్తున్నారని ఈ ఘటనతో తేలింది...

06:44 - July 11, 2016

అంగన్ వాడీ కార్యకర్తలు మరోసారి పోరుబాట పట్టారు. ఇవాళ దేశవ్యాప్తంగా బ్లాక్ డేగా పాటించబోతున్నారు. ఢిల్లీలో సిఎం కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించబోతున్నారు. మధ్యప్రదేశ్ లో సమ్మె, చత్తీస్ గఢ్ లో రిలే నిరాహారదీక్షలు చేపట్టబోతున్నారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో నల్లదుస్తులు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీలు నిర్వహించబోతున్నారు. ఇంతకీ అంగన్ వాడీలు ఇవాళ దేశవ్యాప్తంగా బ్లాక్ డే గా పాటించడానికి కారణం ఏమిటి? కేంద్ర ప్రభుత్వం ముందు వీరు పెడుతున్న డిమాండ్స్ ఏమిటి? దేశంలో ఐసిడిఎస్ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలేమిటి ? సవాళ్లేమిటి ? ఈ అంశాలపై టెన్ టివీ జనపథంలో అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేత జయలక్ష్మి విశ్లేషించారు. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

16:37 - June 18, 2016

బాలల ఎదుగుదల విషయంలో భారత్ కొన్ని సబ్‌ సహారన్ దేశాలకన్నా చాలా వెనుకబడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎదుగుదల లోపాలను ఎదుర్కొంటున్న బాలల్లో భారత్‌లోనే మూడోవంతు మంది ఉన్నారు. దేశంలోని 38.7 శాతం మంది బాలలు ఎదుగుదల లోపాలను ఎదుర్కొంటున్నట్టు ఓ తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 23.8 శాతం మంది బాలలు పోషకాహార లోపంతో ఎదగలేకపోతున్నారని గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ (జీఎన్‌ఆర్) వెల్లడించింది. బాలల్లో ఎదుగుదల లోపాలపై 132 దేశాల్లో అధ్యయనం నిర్వహించగా, భారత్ 114వ స్థానంలో ఉంది. అయితే భారత్‌లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు తీసుకుంటున్న చర్యల మూలంగా 2030 నాటిని ఘనా లేదా టోగో, 2055 నాటికి చైనాను చేరుకోగలదని ఆ నివేదిక తెలిపింది. బాలల ఎదుగుదల లోపానికి సంబంధించి ఘనా 52వ స్థానంలో, టోగో 80వ స్థానంలో ఉండగా, చైనా 26వ స్థానంలో ఉంది. గత పదేండ్ల కాలంలో భారత్ బాలల ఎదుగుదల లోపాల సమస్యను రెండు రెట్లు తగ్గించగలిగిందని ఆ నివేదిక పేర్కొంది.

స్నూకర్ చాంపియన్ షిప్ లో అమీ కామని మొదటి స్థానంలో నిలిచింది. స్నూకర్ లో కొత్త ఆశలు కలిగిస్తోంది. జాతీయస్థాయి మహిళల స్నూకర్‌ చాంపియన్‌షిప్‌ ర్యాంకింగ్స్‌లో అమీ కామని మొదటి స్థానంలో నిలిచింది. మాదాపూర్‌లోని బల్క్‌లైన్‌ క్యూస్పోర్ట్స్‌ అకాడమీ వేదికగా బుధవారం ముగిసిన టోర్నీలో విద్యాపిళ్ళే, వర్ష సంజీవ్‌ రెండు, మూడు స్థానాలను సాధించారు. ఇక అరాంట్‌క్సా శాంచెజ్‌, చిత్ర, నీతా సంఘ్వి, ఇందిర గౌడ వరుసగా తరువాత స్థానాలు నెగ్గారు. కాగా 6 రెడ్‌ స్నూకర్‌ టోర్నీలోనూ కామని ముందంజ వేసింది. బుధవారం ప్రారంభమైన ఈ టోర్నీలో కామని 3-0తో వర్ష సంజీవ్‌ను చిత్తు చేసింది. మరో మ్యాచ్‌లో చిత్ర 3-2తో విద్యా పిళ్ళేపై విజయం సాధించింది.

ఒలింపిక్స్ సమీపిస్తున్న తరుణంలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ స్పూర్తిదాయక ప్రదర్శన చేసింది. అగ్రశ్రేణి క్రీడాకారిణుల్ని మట్టికరిపిస్తూ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచింది. ఆదివారం సిడ్నీలో హోరాహోరీగా సాగిన ఫైనల్లో సైనా చైనా క్రీడాకారుణి సున్, యును ఓడించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను రెండుసార్లు కైవసం చేసుకున్న తొలి క్రీడాకారిణి సైనానే.

ఎస్ బీ బీ ఛైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య మరో పురస్కారానికి ఎంపికైంది. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సేవల విభాగంలో అరుంధతీ భట్టాచార్యకు ప్రత్యేక అవార్డు లభించింది. అలాగే పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన స్వాతి పిరమాల్ ఇంకా రాజశ్రీ బిర్లాకు ఈ కార్యక్రమంలో జీవితకాల సాఫల్య అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం సతీమణి అమృతా ఫడ్నవీస్‌తోపాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహీంద్రా, నీరజ్ బజాజ్ కూడా హాజరయ్యారు.

Pages

Don't Miss

Subscribe to RSS - బాలలు