బాలీవుడ్

15:16 - September 19, 2018

సన్ని లియోన్...బాలీవుడ్ అందాలతారల్లో ఈమె ఒకరు. జిస్మ్2తో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ భామ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.  ఆమె కెరీర్ ప్రారంభం రోజుల్లో ఆమె ఫోర్న్ స్టార్ అనే విషయం తెలిసిందే. తన అందచందాలు..నటనతో అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఓ మ్యూజియాన్ని సందర్శించింది. తమ అభిమాన తారను చూడాలని ఎంతో మంది మ్యూజియానికి పోటెత్తారు. దీనితో ఆమెకున్న క్రేజ్ కు పోలీసులు విస్తుపోయారంట. 
మంగళవారం ఢిల్లిలోని టుస్సాడ్స్ మ్యూజియంలో సన్ని లియోన్ మైనపు విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సన్నీ అక్కడకు చేరుకున్నారు. ఆ విగ్రహం ప్రక్కనే సన్నీ నిలిచి ఫోజునిచ్చింది.ఈ  ఫొటోను అభిమానులకు సోషల్ మీడియాలో  షేర్ చేసింది.

12:16 - June 13, 2018

కొందరు హీరోలు కేవలం రీల్ లో మాత్రమే హీరోలు..రియల్ లైఫ్ లో వారు జీరోలే కాదు..విలన్ ల కంటే దారుణంగా ప్రవర్తిస్తుంటారు. సినిమా డైలాగుల్లో సూక్తులు చెబుతుంటారు. నిజజీవితంలో రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటారు అనే దానికి ఈ హీరోనే నిదర్శనం.

ఆర్మాన్ కోహ్లీ అరెస్ట్..
తన భార్య, ఫ్యాషన్ స్టయిలిస్ట్ నీరూ రంధావాను దారుణంగా హింసించిన కేసులో బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారంలో నీరూ ఫిర్యాదు మేరకు అర్మాన్ పై కేసును రిజిస్టర్ చేసిన శాంతాక్రజ్ పోలీసులు, అప్పటి నుంచి ఆయన కోసం గాలిస్తున్నారు.

నీరు తలను నేలకేసి బాదిన కోహ్లీ..
ఈ నెల 3వ తేదీన ఆర్థిక వివాదంలో అర్మాన్, నీరూల మధ్య వాగ్వాదం జరుగగా, నీరూ తలను అర్మాన్ నేలకేసి బలంగా కొట్టాడన్నది ప్రధాన ఆరోపణ. ఈ ఘటనలో నీరూ రంధావాకు బలమైన గాయాలు కాగా, కోకిలాబెన్ దీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స చేశారు. తన తలకు 15 కుట్లు పడ్డాయని, తలపై మచ్చ జీవితాంతం ఉంటుందని డాక్టర్ చెప్పిన మాటలు విని తానెంతో ఆందోళన చెందుతున్నానని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం నీరూ వ్యాఖ్యానించారు. కాగా, నిందితుడు అర్మాన్ ను న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నట్టు శాంతాక్రజ్ పోలీసులు తెలిపారు.

17:33 - April 12, 2018

డిఫెరెంట్ సినిమాలు తెరకెక్కించడం లో బాలీవుడ్ ఎప్పుడు ముందే ఉంటుంది.  వైవిధ్యమైన సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా బాలీవుడ్ లో ఎక్కువే.  ఇప్పుడు అదే ఫార్ములాతో వస్తున్న ఒక ఇంటరెస్టింగ్ సినిమాలో పర్ఫెక్ట్ హీరోయిన్ ని ఫిక్స్ చేసారు..  ఎవరా హీరోయిన్.. ఏంటా.. సినిమా. బాలీవుడ్ లో పెర్ఫార్మన్స్ రోల్స్ తో పాటు కమర్షియల్ హీరోయిన్ రోల్స్ చేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న హీరోయిన్ అలియా భట్. తన అందం తో అభినయం తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటుంది.  “బద్రీనాథ్ క దుల్హనియా” సినిమా లో ఎనర్జిటిక్ యాక్టింగ్ ని ప్రెసెంట్ చేసిన అలియా బట్ ఆ తరువాత సినిమాల్లో కూడా మంచి రోల్స్ తో మెప్పించింది. రెండు ప్రాంతాల మధ్య సాగే ప్రేమకథగా వచ్చిన “టు స్టేట్స్” సినిమా అలియా బట్ లో క్యూట్ యాక్టింగ్ ని స్క్రీన్ మీద చూపించింది.  అలియా భట్ కెరీర్ లో రియాలిటీ కి దగ్గరగా ఉన్న రోల్ చేసింది ఉడ్తా పంజాబ్ సినిమాలో అనే చెప్పవొచ్చు. పంజాబ్ లో జరుగుతున్న డ్రగ్స్ మాఫియా గురించి చెప్పిన ఈ సినిమాలో అలియా రోల్ ఆడియన్స్ ని కంటతడి పెట్టిస్తుంది .అలియా మరో పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ లో కనిపించింది.  అదే 1971 లో ఇండో పాక్ వార్ నేపధ్యంలో రిలీజ్ కాబోతోన్న చిత్రం "రాజి స్పై" గా అలియా భట్ ఇంత వరకు ఇలాంటి ప్రయోగాత్మకమైన పాత్ర చేయలేదు. గ్లామర్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేసిన ఆమెకు ఈ క్యారెక్టర్ పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి.

13:23 - February 28, 2018

వెండి వెన్నెల చినబోయింది.. అందమైన చందమామ మోము నిర్జీవమైంది. వెండితెరవేల్పు, బాలీవుడ్‌ మహిళా సూపర్‌ స్టార్‌, అతిలోక సుందరి శ్రీదేవి పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు భారులు తీరారు. ముంబైలోని సెలబ్రిటీ స్పోర్ట్స్‌ క్లబ్‌లో శ్రీదేవి భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు సందర్శకులను అనుమతి ఇస్తారు. ఆ తర్వాత సంతాప సభ నిర్వహిస్తారు. దేశంలోని అన్ని ప్రాంతాల చిత్రప్రముఖులు సంతాప సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు ఆరు కి.మీ. మేర సాగే అంతిమయాత్రలో పలువురు చిత్ర ప్రముఖలు పాల్గొంటారు. విలే పార్లే సేవా సమాజ్‌లోని హిందూ స్మశానవాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. 

12:16 - February 28, 2018
09:12 - February 28, 2018

ముంబై : అందాల తార శ్రీదేవి భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు భారీగా అభిమానులు పోటెత్తుతున్నారు. ముంబైలోని లోఖండ్ వాలా, గ్రీన్ ఏకర్స్ లో ఆమె పార్థీవ దేహాన్ని ఉంచారు. రజనీకాంత్, కమలహాసన్, వెంకటేష్, షారూఖ్‌ ఖాన్, ఆయన భార్య గౌరీఖాన్, దీపిక పదుకొనే, రణ్‌వీర్‌ సింగ్, టబు, రేఖ, ఫరాఖాన్, జావేద్‌ అఖ్తర్, షబానా ఆజ్మీ, రాణిముఖర్జీ తదితర వందలాది మంది నటీనటులు ఆమె నివాసానికి చేరుకుంటున్నారు. శ్రీదేవి ఇంటి ప్రాంగణమంతా జనాలతో కిక్కిరిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

కాసేపట్లో శ్రీదేవి భౌతికకాయాన్ని సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్ కు తరలించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహం అక్కడనే ఉండనుంది. అనంతరం అంతిమయాత్ర ప్రారంభం కానుంది.

భర్త బోనీకపూర్ సోదరి కుమారుడి వివాహం కోసం దుబాయ్‌ వెళ్లిన శ్రీదేవి ఎమిరేట్స్ టవర్స్‌ హోటల్‌లో బాత్రూంలో శనివారం రాత్రి 11గంటలకు కుప్పకూలిపోయయిన సంగతి తెలిసిందే. ఆమెను వెంటనే రషీద్ ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె కన్నుమూశారు. శ్రీదేవి హఠాన్మరణంతో బాలీవుడ్‌ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. అనంతరం తీవ్ర ఉత్కంఠ పరిణామాల నేపథ్యంలతో మంగళవారం రాత్రి శ్రీదేవి పార్థీవదేహం ముంబైకి చేరుకుంది. 

20:42 - February 26, 2018

శ్రీదేవి హఠాన్మరణంతో బాలీవుడ్‌ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. భర్త బోనీకపూర్ సోదరి కుమారుడి వివాహం కోసం దుబాయ్‌ వెళ్లిన శ్రీదేవి ఎమిరేట్స్ టవర్స్‌ హోటల్‌లో బాత్రూంలో శనివారం రాత్రి 11గంటలకు కుప్పకూలిపోయారని సమాచారం. ఆమెను వెంటనే రషీద్ ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె కన్నుమూశారు. ఆమె జీవితం ఎలా ఉంది ? తదితర విషయాలపై టెన్ టివి పసుపులేటి రామారావు (సీనియర్ జర్నలిస్టు) ముచ్చటించింది. మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:14 - February 26, 2018

ముంబై : అందాల నటి శ్రీదేవి మరణం సహజ మరణమేనని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. భర్త బోనీకపూర్ సోదరి కుమారుడి వివాహం కోసం దుబాయ్‌ వెళ్లిన శ్రీదేవి ఎమిరేట్స్ టవర్స్‌ హోటల్‌లో బాత్రూంలో శనివారం రాత్రి 11గంటలకు కుప్పకూలిపోయారని సమాచారం. ఆమె గుండెపోటుతోనే మృతి చెందారని, మృతిలో ఎలాంటి కుట్రలు లేవని ఫోరెన్సిక్ నిపుణులు నివేదికలో వెల్లడించారు. ఈ నివేదికను శ్రీదేవి కుటుంబసభ్యులకు అందచేశారు. శ్రీదేవి హఠాన్మరణం నేపథ్యంలో దుబాయి ప్రతిక ప్రచురించిన కథనాలతో ఉత్కంఠ ఏర్పడింది. నివేదికలో వైద్యులు పేర్కొన్న అంశాలతో అనుమానాలు పటాపంచలయ్యాయి. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:36 - December 23, 2017

హైదరాబాద్ : ఇంటర్నెట్‌ మూవీ డేటా బేస్‌లో పది భారతీయ సినిమాలు సత్తాచాటాయి. కోలీవుడ్‌ మూవీస్‌ విక్రమ్‌ వేధ' తొలిస్థానంలోనిలవగా రెండు, మూడు స్థానాల్లో 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌', 'అర్జున్‌రెడ్డి' చిత్రాలు నిలిచాయి. ఐఎండీబీ- 2017జాబితాలో 10 భారతీయ సినిమాలు టాప్‌ ప్లేస్‌లో నిలిచాయి. కోలీవుడ్‌ మూవీ 'విక్రమ్‌ వేధ' అరుదైన ఘనత సాధించింది. విజయ్‌ సేతుపతి, మాధవన్‌ ప్రధాన తారాగణంగా నటించిన 'విక్రమ్‌ వేధ' తొలిస్థానంలో నిలిచింది. ఇక రెండు, మూడు స్థానాల్లో 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌', 'అర్జున్‌రెడ్డి' చిత్రాలు ఉన్నాయి. తొలి మూడు స్థానాల్లో దక్షిణభారత చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాలు ఉండటం ఈసారి విశేషం. 2017లో ప్రజలకు బాగా చేరువైన టాప్‌ 10 భారత సినిమాల జాబితాను ఐఎండీబీ ప్రకటించింది.

ఇక టాప్‌ టెన్‌లో ఇతర మూవీలు.. 4వస్థానంలో సీక్రెట్‌ సూపర్‌స్టార్‌, 5 హిందీ మీడియం, 6వస్థానంలో ఘాజీ మూవీ నిలవగా , సెవెన్త్‌ ప్లేస్‌లో టాయిలెట్‌ ఏక్‌ప్రేమ్‌కథ, 8 జాలీ ఎల్‌.ఎల్‌.బి, 9వ ప్లేస్‌లో మెర్సల్‌.. ఇక పదవ స్థానంలో ది గ్రేట్‌ ఫాదర్ మూవీస్‌ నిలిచాయి. ఇక నటుల విషయానికి వస్తే .. మొదటి రెండు స్థానాల్లో సల్మాన్‌ఖాన్‌, షారుక్‌ఖాన్‌ నిలిచారు. ఇటు దక్షిణభారత చిత్రపరిశ్రమ నుంచి తమన్నా, ప్రభాస్‌, అనుష్క.. వరుసగా 4,6,8 స్థానాల్లో చోటు దక్కించుకున్నారు. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఈ సినిమాలకు స్థానాల్ని నిర్ణయించించినట్టు ఐఎండీబీ ప్రకటించింది. 

19:49 - December 4, 2017

ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు శశికపూర్ కన్నుమూశారు. శశికపూర్ కోల్ కత్తాలో 1938 లో జన్మించారు. ఆయన 2011లో పద్మభూషణ్, 2015లో దాదాసహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఆయన హీరోగా 61 సినిమాల్లో నటించారు. మొత్తంగా 116 సనిమాల్లో శశికపూర్ నటించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - బాలీవుడ్