బాహుబలి

19:59 - January 13, 2018

'ప్రభాకర్ గౌడ్' తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా విలన్, క్యారెక్టర్ పాత్రల్లో నటించాడు. 'బాహుబలి' సినిమాతో 'కాలకేయుడి' పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 'గబ్బర్ సింగ్’, 'దూసుకెళ్తా’, 'దూకుడు’, 'కృష్ణం వందే జగద్గురుం’, 'దొంగాట' ఇలా కొన్ని చిత్రాలు గుర్తింపు తెచ్చాయి. తనదైన స్టైల్ లో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న నటుడు. ‘కాళకేయ' ప్రభాకర్ గా గుర్తింపు పొందిన ఈ నటుడు తాజాగా 'బాలకృష్ణ' నటించిన 'జై సింహ'లో కూడా వృద్ధ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. సంక్రాంతి సందర్భంగా ఆయనతో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన పలు విశేషాలు తెలియచేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:40 - December 22, 2017

ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద విజయాలు దక్కాయని చెప్పవచ్చు. ఐఎండీబీ ప్రతి ఏటా ఇండియన్ టాప్-10 సినిమాల లిస్ట్ తయారు చేస్తుంది. యూజర్ల ఆధారంగా ఈ ర్యాకింగ్ ఉంటుంది. ఇలా తయారు చేసిన టాప్-10 ఇండియన్ చిత్రాల్లో తెలుగు నుంచి 3 మూవీస్ చోటు సంపాదించుకున్నాయి. ఇండియన్ బిగ్గెస్ట్ మూవీగా నిలిచిన బాహుబలి 2 ఐఎండీబీ లిస్ట్ లో టాప్ 2 లో ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం అర్జున్ రెడ్డి చిన్న సినిమా అయిన ఐఎండీబీ లిస్ట్ లో టాప్ 3 నిలిచి సంచలనం సృష్టించింది. తెలుగు సినిమాగా రూపొంది తమిళ్, తెలుగు విడుదలైన సినిమా ఘాజీ టాప్ 6లో నిలిచింది.

ఐఎండీబీ టాప్ 10 మూవీస్

1. విక్రమ్ వేద

2. బాహుబలి ది కంక్లూజన్

3. అర్జున్ రెడ్డి

4. సీక్రెట్ సూపర్ స్టార్

5. హిందీ మీడియం

6. ఘాజీ

7. టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ

8. జాలీ ఎల్ఎల్ బీ 2

9. మెర్శల్

10. ది గ్రేట్ ఫాదర్ 

09:05 - November 8, 2017

శేఖర్ కమ్ముల...బాలీవుడ్ బాహుబలి 'రానా' హీరోగా వచ్చిన 'లీడర్' సినిమా మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా 'రానా'కు మొదటి సినిమా. 2010లో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే 'శేఖర్ కమ్ముల' దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' ఘన విజయం సాధించింది. దీనితో ఇతర చిత్రాలపై ఆయన దృష్టి సారించారు.

రాజకీయాలపై చిత్రం తీయాలని..శేఖర్ కమ్ముల భావిస్తున్నట్లు ఇందుకు స్ర్కిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నారని టాలీవుడ్ టాక్. ఇందుకు 'లీడర్' కు సీక్వెల్ తీయాలని..అదీ 'రానా'తోనే తీస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ అనుకున్నట్టు అన్నీ జరిగితే త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం రానా '1945' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 

11:49 - September 23, 2017

చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకట్లేదు అనుకునే వారు పెద్ద సినిమాలు లేని టైం లో జాగర్తగా చిన్న సినిమాలని రిలీజ్ చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు హిట్ ట్రాక్ లోనే ఉన్నాయ్ కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన కొన్ని సినిమాలు మాత్రం ఆడియన్స్ కి రీచ్ అవ్వలేకపోయాయి.

రీసెంట్ టైం లో తెలుగు లో 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో ‘ఉంగరాల రాంబాబు’ పరిస్థితి మేలు. 'సునీల్' ట్రాక్ రికార్డు ఎలా ఉన్నప్పటికీ దీనికి తొలి రోజు ఉదయం ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఈ చిత్రానికి దారుణమైన టాక్ రావడంతో సాయంత్రానికే పరిస్థితి మారిపోయింది. కలెక్షన్లు పడిపోయాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన అత్యంత పేలవమైన సినిమాల్లో ఇది ఒకటనిపించుకుంది అని ఇండస్ట్రీ టాక్. ఇక ఏమాత్రం హైప్ లేకుండా రిలీజైన ‘కథలో రాజకుమారి’ పరిస్థితి దయనీయం. ఈ సినిమాపై ముందే ఆశలు పోయాయో ఏమో.. ప్రమోషన్ కూడా పెద్దగా చేయలేదు. నామమాత్రంగా సినిమాను రిలీజ్ చేశారు. టాక్ కూడా నెగెటివ్ గానే ఉండటంతో కలెక్షన్ల గురించి చెప్పాల్సిన పని లేకుండా పోయింది. ఇక ‘బాహుబలి’ రైటర్ ‘శ్రీవల్లీ’ గురించి మాట్లాడేవాళ్లే లేరు. దీనికి కూడా ఏమాత్రం హైప్ లేదు. సినిమా చూసిన వాళ్లు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు అట.

ఇక పరభాషా నటుడు సచిన్ జోషి సినిమా ‘వీడెవడు' రిలీజ్ అయిన పెద్దగా టాక్ లేని పరిస్థితి. పబ్లిసిటీ బాగానే ఉన్నా కానీ సినిమా ఓపెనింగ్స్ లేవు అని తెలుస్తుంది. అలానే తమిళ్ హీరో 'శింబు' మూవీ ‘సరసుడు’ గురించి అసలు డిస్కషనే లేదు. మొత్తంగా ఈ వీకెండ్లో బాక్సాఫీస్ మరీ డల్లయిపోయింది. ఇలా అన్ని సినిమాలు ఆడియన్స్ ని రీచ్ అయ్యకుండానే పోయాయి. కొత్తదనం లేక ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు అని అనుకుంటున్నారు ఫిలిం నగర్ వాసులు.

10:31 - September 20, 2017

విజయవాడ : 'ఏమీ అవలేదు...ఏమీ జరగలేదు' అని ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి పేర్కొన్నారు. విజయవాడలోని ఉండవల్లికి చేరుకున్న అనంతరం ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం వచ్చిన ఆయన్ను మీడియా ప్రశ్నించింది. భేటీకి సంబంధించిన వివరాలపై స్పందించలేదు. తనకు ఇక్కడకు రావడానికి ఆలస్యం అయ్యిందని..మాట్లాడే అవకాశం దొరకలేదని..మధ్యాహ్నం కలిసిన అనంతరం వివరాలను మీడియాకు చెబుతానని పేర్కొన్నారు.

అమరావతి రాజధాని, ఏపీ హైకోర్టుకు సంబంధించిన డిజైన్ల విషయంలో రాజమౌళి సలహాలు..సూచనలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా ఇటీవలే మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులు రాజమౌళితో భేటీ అయ్యి చర్చించారు. అందులో భాగంగా సీఎం చంద్రబాబుతో రాజమౌళి భేటీ అయ్యారు. రాజమౌళిని లండన్ కు కూడ పంపాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు సమాచారం. 

13:26 - September 9, 2017

సినిమా వాళ్ళు వ్యాపారం లోకి దిగటం కొత్తేమి కాదు. రియల్ ఎస్టేట్, హోటల్స్ పబ్స్, ఇలా ప్రతి బిసినెస్ లో రాణిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా హిట్ ట్రాక్ లో దూసుకెళ్తున్న హీరో కొత్తగా బిజినెస్ మీద ఫోకస్ పెట్టాడు. మరి ఆ హీరో ఎవరు ? 'ప్రభాస్' అంటే ఒకప్పుడు లోకల్ యాక్టర్ ఇప్పుడు ఇంటెర్నేషన్స్ స్టార్ లో ఒకడయ్యాడు. ఒకప్పుడు తెలుగు స్క్రీన్ కి మాత్రమే పరిమితమయిన నటుడు. తెలుగు సినిమా రుచిని గ్రాండ్ గా ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా 'బాహుబలి'. ఈ సినిమాతో అందరికి ఒక్క సరిగా ఇంటర్నేషనల్ లెవెల్ రికగ్నైజేషన్ వచ్చింది. మరి ఆ గుర్తింపును క్యాష్ చేసుకుంటున్నాడు మన అమరేంద్ర బాహుబలి. కలక్షన్స్ పరంగానే కాకుండా టెక్నీకల్ గా కూడా సూపర్బ్ అనిపించుకుంది ఈ బాహుబలి సినిమా.

'బాహుబలి' తర్వాత ప్రభాస్ కెరీర్లోనే అత్యంత బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'సాహో' సినిమాకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. 'సాహో' సినిమా గ్రాఫిక్స్ లో కూడా ఏ మాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు ఫిలిం యూనిట్. ఇదిలా ఉంటె 'ప్రభాస్' బిజినెస్ లోకి అడుగు పెట్టాడు. తాజాగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో భారీ ఎత్తున థియేటర్లను నిర్మిస్తున్నారు. ఈ థియేటర్ల క్యాంపస్ ను 'బాహుబలి' థియేటర్లుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం రూ.40 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్న బాహుబలి థియేటర్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం శరవేగంగా నిర్మిస్తున్న ఈ థియేటర్ ను 2018లో ప్రారంభించనున్నారు

12:34 - August 28, 2017

'నెం.1 యారి' ప్రోగ్రామ్ తో బిజీగా వున్న రానా బాలీవుడ్‌కి వెళ్తున్నాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బాహుబలి సినిమా తర్వాత 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో మరో హిట్ టాక్ అందుకున్నాడు. .పూర్తి వివరాల్లోకి వెళితే... ఇటీవల ఓ ఛానల్‌.. రానా ఇక తెలుగు సినిమాల్లో నటించరంటూ ప్రసారం చేసింది. దాంతో రానా అభిమాని ఒకరు ‘అన్నా ఇది నిజమేనా’ అంటూ ఏడుస్తున్న ఇమోజీలను జతచేస్తూ ట్వీట్‌ పెట్టారు. దీనిపై రానా స్పందిస్తూ.. ‘ఎవరు చెప్పారమ్మా నీకు. నేను తెలుగు సినిమాలతోనే హిందీకి, తమిళ్‌కి వెళ్తా. నేను నటించిన ‘ఘాజి’, ‘బాహుబలి’ తెలుగు సినిమాలు కావా?’ అని ట్వీట్‌ చేశారు. రానా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం రానా.. ‘నెంబర్‌ 1 యారి’ అనే టీవీ షోతో బిజీగా ఉన్నారు. త్వరలో ఆయన ‘హిరణ్య కశ్యప’ అనే చిత్రంలో నటించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

11:57 - August 16, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 'కాటమరాయుడు' సినిమా డిజాస్టర్ అనంతరం 'పవన్' నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. 'పవన్' ఈ సినిమాలో ఇంజినీర్ గా కనిపించనున్నాడని టాక్. సినిమాకు సంబంధించిన టైటిల్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదనే విషయం తెలిసిందే. పవన్ సరసన కీర్తి సురేష్..అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తేదీని ఖరారు చేసినట్లు టాక్. చిత్ర ఫస్ట్ లుక్ ను సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక చిత్రం విడుదలకాకముందే రూ. 150 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. విడుదలకు ముందు ఇన్ని కోట్లు రాబట్టిన తొలి తెలుగు చిత్రం 'బాహుబలి' రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తరువాత రికార్డు పవన్ కళ్యాణ్ దేనని టాలీవుడ్ టాక్. ఈ సినిమాకు సంబంధించిన తదితర వివరాలు చిత్ర బృందం త్వరలోనే తెలియచేయనున్నట్లు తెలుస్తోంది. 

17:30 - August 14, 2017

టాలీవుడ్ క్రేజీ హీరో 'బాహుబలి' తరువాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్‌లోనూ 'బాహుబలి', 'బాహుబలి-2' సూపర్ హిట్ కావడంతో ప్రభాస్ నటించబోయే కొత్త సినిమాలపై కూడా అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న 'సాహో' సినిమాను 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ పూర్తి కాకుండానేఆన్ లైన్ హక్కులను కొనుగోలు చేసేందుకు నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 50 కోట్ల రూపాయలను ఆఫర్ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో నిర్మిస్తున్న నేపథ్యంలో రికార్డు స్థాయిలో 4 మిలియన్ యూఎస్ డాలర్లు పెట్టి నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ ఆన్ లైన్ రైట్స్ సొంతం చేసుకుందనే వార్త ప్రభాస్ ఫ్యాన్స్‌ను పండగ చేసుకునేలా చేసింది. ఈ డీల్‌కు సంబంధించి త్వరలో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని సమాచారం..

09:23 - August 11, 2017

'బాహుబలి', 'బాహుబలి-2' చిత్రంతో జాతీయస్థాయిలో పేరొందిన నటుడు 'ప్రభాస్' తాజా చిత్రంతో బిజీ బిజీగా మారిపోయాడు. దాదాపు కొన్ని సంవత్సరాల వరకు ఒక్క సినిమాకే పని చేసిన ఆయన మరో చిత్రంలో నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

సుజీత్ సింగ్ దర్శకత్వంలో 'సాహో' సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ మొదలు కాకుండానే టీజర్ ను ముందుగా రిలీజ్ చేసి ఆసక్తిని రేకేత్తించారు. చాలా ఏళ్ల తర్వాత 'ప్రభాస్‌' తెర మీద మోడరన్‌ గెటప్‌తో కనిపించనుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈసినిమా వివరాలు మాత్రం ఏ మాత్రం బయటకు పొక్కడం లేదు. తాజాగా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న మది తమిళ మీడియాతో మాట్లాడినట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 7 రోజుల షూటింగ్‌ ముగిసిందని ఇంకా 180 రోజుల పాటు షూటింగ్‌ జరగాల్సి ఉందని అన్నారు. హీరోయిన్‌ ఎవరనేది దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తారని అన్నారు. రానున్న రోజుల్లో వివరాలు తెలిసే అవకాశాలున్నాయి. 

Pages

Don't Miss

Subscribe to RSS - బాహుబలి