బీఎల్ఎఫ్

15:08 - December 7, 2018

నల్లగొండ : టీడీపీ బహిష్కరణకు గురైన మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్యం మరింతగా విషమించింది. దీంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. గత కొంతకాలం నుండి తీవ్ర భావోద్వేగానికి గురవుతున్న క్రమంలో  మోత్కుపల్లి అస్వస్థతకు గురయ్యారు. దీంతో డిసెంబర్ 7న తీవ్ర అస్వస్థతకు గురైన ఆలేరు బీఎల్ఎఫ్ అభ్యర్థి, మాజీ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన సుప్రజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భువనగిరి ఏరియా ఆసుపత్రికి సరైన సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో, కుటుంబీకులు సొంత వాహనంలోనే ఆయన్ను హైదరాబాద్ కు తరలించారు. లో-బీపీతో పాటు ఛాతీలో విపరీతమైన నొప్పి, వాంతులతో మోత్కుపల్లి బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమించటంతో ఆయన అభిమానులు ఆందోళనలకు గురవుతున్నారు.

09:43 - November 30, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై వివిధ రాష్ట్రాల నేతలు దృష్టి సారించారు. జాతీయ నాయకులు తెలంగాణపై వాలిపోతున్నారు. డిసెంబర్ 7వ తేదీన జరిగే పోలింగ్ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు. కేంద్ర మంత్రులు..కాంగ్రెస్ సీనియర్ నేతలు..బీజేపీ సీనియర్ నేతలు..ఇతర పార్టీల కీలక నేతలు రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ కూడా తెలంగాణకు రానున్నారు. డిసెంబర్ 1,2,3 తేదీల్లో బీఎల్‌ఎఫ్‌, సీపీఐ(ఎం) అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ప్రచారం చేయనన్నారు. అందులో భాగంగా శుక్రవారం రాత్రి మాణిక్ సర్కార్ హైదరాబాద్‌కు చేరుకుంటారు. అదే రోజు రాత్రి ఖమ్మంకు బయలుదేరుతారు. డిసెంబర్ 1వ తేదీన ఖమ్మం నుంచి దుమ్ముగూడెం బయలుదేరి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగిస్తారు. సాయంత్రం నాగులవంచలో జరిగే బహిరంగసభకు ముఖ్యఅతిధిగా పాల్గొంటారు. డిసెంబర్ 2వ తేదీన కోదాడలో జరిగే బహిరంగసభలో..హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించనున్నారు. డిసెంబర్ 3వ తేదీన భువనగిరిలో జరిగే సభలో ఆయన ప్రసంగించి 

14:21 - November 3, 2018
కామారెడ్డి : ఓట్ల కోసం రాజకీయ నేతలు పడరాని పాట్లు పడతారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడిగేవారు కొందరైతే.... డప్పు కొట్టి, డ్యాన్స్‌ చేసేవారు ఇంకొందరు. కానీ ’నాకు ఓటు వేయకండి’ అని మైకుపట్టి ప్రచారం చేస్తున్నాడు ఓ అభ్యర్థి. అంతేకాదు ఓటు వేయవద్దని ప్రచార రథానికి సైతం బ్యానర్లు కట్టుకని మరీ గ్రామాల్లో తిరుగుతున్నాడు.
 
కామారెడ్డి జిల్లా జుక్కల్‌ బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి భారత్‌ వాగ్మారే వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు. నాకు ఓట్లు వేయకండి అంటూ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ’ఓటు వేయకండి... కాని ఒక్కసారి నా స్పీచ్ విని నిర్ణయం తీసుకోండి’ అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అంతే కాదు ప్రచార రథానికి సైతం ఓటు వేయవద్దనే బ్యానర్‌ను కట్టుకుని గ్రామాల్లో తిరుగుతున్నారు.
 
తాను డబ్బులు, మద్యం పంపిణీ చేయనని భారత్‌ వాగ్మారే చెబుతున్నారు. కాంగ్రెస్‌కు ఓటువేస్తే.. రెడ్డి సీఎం అవుతారని.. టీఆర్‌ఎస్‌కు వేస్తే వెలమ ముఖ్యమంత్రి అవుతారని.. అదే బీఎల్‌ఎఫ్‌కు ఓటు వేస్తే బీసీ సీఎం అవుతారని భారత్‌ వాగ్మారే చెప్పుకొచ్చారు.
 
ఇంతగా చెప్పిన వాగ్మారే.. రాష్ట్రంలో బీఎల్‌ఎఫ్‌ గెలిచే స్థానాలు 20 మాత్రమేనని కుండబద్దలు కొట్టారు. రాష్ట్రంలో హంగ్‌ ప్రభుత్వం వస్తే.. తామే కింగ్‌ మేకర్‌మవుతామని చెప్పుకొచ్చారు. కర్నాటకలో వచ్చిన పరిస్థితి తెలంగాణలోనూ వస్తుందని వాగ్మారే కలలు కంటున్నారు. మొత్తానికి తనకు ఓటు వేయవద్దంటూనే.. భారీ మెజార్టీతో గెలుస్తానని వాగ్మారే చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది. 
09:34 - October 12, 2018

హైదరాబాద్ : ప్రజా గాయకుడు గద్దర్ కాంగ్రెస్‌లో చేరుతారా ? కేవలం ఆ పార్టీకి మద్దతు తెలియచేస్తారా ? అనే సందిగ్ధత నెలకొంది. ఐదు నెలల క్రితం గద్దర్ కుమారుడు కాంగ్రెస్‌లో సూర్యకిరణ్ చేరిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ కంటోన్మెంట్ టికెట్‌ను గద్దర్ కుమారుడు సూర్యం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. టికెట్ ఇప్పించడానికి గద్దర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. గద్దర్ కుటుంబాన్ని ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ గౌడ్ ఢిల్లీకి తీసుకొచ్చారు. 
మహా కూటమితో కాంగ్రెస్ ముందుకెళుతున్న సంగతి తెలిసిందే. ఇంకా పొత్తులు, సీట్ల ఖరారు కాలేదు. అధిష్టానం నియమించిన స్ర్కీనింగ్ కమిటీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో సికింద్రబాద్ కంటోన్మెంట్ నుండి పోటీ చేయాలని సూర్యం ఆశిస్తున్నారు. దీనితో గద్దర్‌ను వాడుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తోంది. గద్దర్ కాంగ్రెస్‌కు ప్లస్ అవుతారని భావిస్తున్న అధిష్టానం పార్టీ తరపున ప్రచారం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. బుల్లెట్ బ్యాలెట్‌ను నమ్ముతుందా ? ..గద్దర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా ? లేదా ? అనేది తెలియనుంది. 

18:23 - August 26, 2018

హైదరాబాద్ : ఎన్నికల్లో రాజకీయ పార్టీలు చేసే ఖర్చుపై నియంత్రణ విధించాలని సోమవారం నాడు జరిగే ఎన్నికల కమిషన్ సమావేశంలో కోరుతామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను అందులో పెట్టాలని అనుకుంటున్నారని, కొన్ని అక్రమాలకు దారి తీసే పరిస్థితులున్నాయని తాము అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ హడావుడి చూస్తుంటే రాష్ట్రంలో ముందదస్తు ఎన్నికలు వచ్చినట్లుగా ఉందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సీపీఎం, బీఎల్ఎఫ్ సిద్ధంగా ఉందని సీపీఎం నేత తమ్మినేని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో 119 స్థానాలకు పోటీ చేయబోతున్నట్లు, అందులో సీపీఎం స్థానాలు ఏమిటీ ? సెప్టెంబర్ 2వ వారంలో జిల్లాల కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. 

10:32 - August 1, 2018

హైదరాబాద్ : మేకలమండిని ప్రైవేటు పరం చేయవద్దని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదిర్శ, బీఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. పాతబస్తీలోని మేకలమండిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ...ప్రస్తుతం టీఆర్ఎస్, గతంలో కాంగ్రెస్ అన్నం పెట్టేవి కావని..పెద్ద పెద్ద వారికి ప్లేట్లు వేసేవన్నారు. పేద వారి..అట్టడుగు కులాల గవర్నమెంట్ రావాలంటే

బీఎల్ఎఫ్ కు ఓటేయాలన్నారు. మాయమాటలు చెప్పేందుకు మళ్లీ వస్తారని, కబేలాలో ఉన్న వృత్తిదారులు, కార్మికులు చైతనవంతం కావాలని పిలుపునిచ్చారు.వీరు చేస్తున్న న్యాయ పోరాటానికి సీపీఎం, సీఐటీయూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. 

మేకలమండిని ప్రైవేటు పరం చేయవద్దని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదిర్శ, బీఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. పాతబస్తీలోని మేకలమండిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ...ప్రస్తుతం టీఆర్ఎస్, గతంలో కాంగ్రెస్ అన్నం పెట్టేవి కావని..పెద్ద పెద్ద వారికి ప్లేట్లు వేసేవన్నారు. పేద వారి..అట్టడుగు కులాల గవర్నమెంట్ రావాలంటే

బీఎల్ఎఫ్ కు ఓటేయాలన్నారు. మాయమాటలు చెప్పేందుకు మళ్లీ వస్తారని, కబేలాలో ఉన్న వృత్తిదారులు..కార్మికులు చైతనవంతం కావాలని పిలుపునిచ్చారు.వీరు చేస్తున్న న్యాయ పోరాటానికి సీపీఎం, సీఐటీయూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. 

17:51 - July 25, 2018

ఖమ్మం : బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలంటూ సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని సీపీఎం నేతలు విమర్శించారు. ప్రైవేటు వ్యక్తులకు ఫ్యాక్టరీని అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధించేవరకు పోరాటాన్ని ఆపేది లేదని సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ నేతలు హెచ్చరించారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. 

19:09 - July 15, 2018

హైదరాబాద్ : ప్రధాని మోదీ తన విధానాలతో దేశ చరిత్రను మార్చే ప్రయత్నం జరుగుతుందన్నారు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. మోదీ విధానాలకు ప్రత్యామ్నాయం అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఎన్నికల సంస్కరణలు-ఆవశ్యకత అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సీతారాం ఏచూరి ముఖ్య అథితిగా హాజరయ్యారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో 'ఎన్నికల సంస్కరణలు-ఆవశ్యకత' అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు బీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ నల్లాసూర్యప్రకాశ్‌ సభాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ సదస్సులో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రధాన వక్తగా పాల్గొన్నారు. హైదరాబాద్‌ వచ్చిన సీతారాం ఏచూరికి సీపీఎం కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్‌ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మహిళా కార్యకర్తలు బతుకమ్మలతో ఏచూరికి స్వాగతం చెప్పారు.

నాలుగేళ్ల నుండి మోదీ ప్రభుత్వం ఆర్థిక దోపిడి, మతోన్మాతఘర్షణలు, రాజ్యాంగ సంస్ధలపై దాడులు అనే త్రిశూల వ్యూహంతో ముందుకు పోతున్నారని సీతారాం ఏచూరి విమర్శించారు. మోదీ విధానాలు దేశ చరిత్రనే మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మోదీ హయాంలో దేశంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఏచూరి ఆరోపించారు.

దేశంలో పెరుగుతున్న ఆర్థిక దాడులకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ విధానం అవసరమన్నారు సీతారాం ఏచూరి. ఇందు కోసం బీఎల్‌ఎఫ్‌లో కృషి జరుగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా బహుజన బువ్వ కేంద్రాలు ప్రారంభిస్తామన్నా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఎన్నికలకు ముందు తెలంగాణలో ఒక ఆదర్శ బువ్వ కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. తెలంగాణలో బహుజన రాజ్యం ఏర్పడాలంటే మెజారిటీ సీట్లు మైనారిటీ చేతుల్లోకి రావాలన్నారు టీమాస్‌ చైర్మన్‌ కంచ ఐలయ్య. బీసీ ముఖ్యమంత్రి అయినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. లాల్‌..నీల్‌ జెండాల ఐక్యతతో కొత్త అధ్యాయం మొదలవుతుందని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలకు ప్రత్యామ్నాయం అవసరమని వామపక్షనేతలు అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

15:41 - July 15, 2018

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా బహుజన బువ్వ కేంద్రాలు ప్రారంభిస్తుందని ఆ పార్టీ నాయతక్వం ప్రకటించింది. హైదరాబాద్‌ ఎస్వీకేలో జరిగిన బహుజన ఎఫ్ట్‌ ఫ్రంట్ సమావేశంలో ఆ పార్టీ కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం ఈ విషయం చెప్పారు. ఎన్నికలకు ముందు తెలంగాణలో ఒక ఆదర్శ బువ్వ కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. ఏదైనా గ్రామాన్ని ఎంచుకుని అయ్యని..అమ్మని దానం చేయాలని..అడిగి...దీనికంతటికి రూ. 50 లక్షలు కావాల్సి ఉంటుందని..ఇలా.ఒక సంవత్సరం మొత్తం పెట్టి మోడల్ తెలంగాణ గ్రామంగా మారుస్తామన్నారు. బువ్వ కేంద్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సిగ్గుందా ? అధికారంలో లేకున్నా పెట్టిన్నమనే బోర్డు పెడుతామన్నారు. 

14:22 - July 15, 2018

హైదరాబాద్ : 'బహుజన బువ్వ' పథకం ఎంతో గొప్పదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, బీఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఎన్నికల సంస్కరణలు..అవశ్యకత అంశంపై ఎస్వీకేలో బీఎల్ఎఫ్ రాష్ట్ర సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎర్రజెండాల మధ్య పోరు ఉండకూడదని బీఎల్ఎఫ్ ప్రతిపాదించడం జరిగిందని, ఎర్రజెండాల ఐక్యతకు బీఎల్ఎఫ్ కట్టుబడి ఉంటుందన్నారు. టీ మాస్ చర్చించి కొన్ని పథకాలు రూపొందించడం జరిగిందని..బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని బీఎల్ఎఫ్ చెప్పిందని..సామాజిక ప్రతిపాదికలు మాత్రమే కాదు..ఆర్థిక రంగంలో కూడా పథకాలు ప్రతిపాదించారన్నారు. ఈ పథకాల్లో అత్యంత గొప్ప పథకం 'బహుజన బువ్వ' పథకమని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ఈ పథకం అమలు జరుపుతామని..ఆచరణ సాధ్యమయ్యే పథకమని నొక్కి చెప్పారు. 14వేల పంచాయతీలు..3కోట్ల పైచిలుకుగా ఉన్న ప్రజలున్న రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క నిధులు సరిపోతాయా ? అనే సందేహం వ్యక్తమవుతోందన్నారు.

ప్రభుత్వం భోజన పథకంలో రూ. 20 సబ్సిడీ ఇస్తోందని..నెలకు రూ. 600 కోట్లు...సంవత్సరానికి రూ. 7,200 కోట్లు...కేవలం భోజనం సబ్సిడీ మాత్రమే ఇస్తోందన్నారు. ఇక్కడ భోజన కేంద్రంలో పది మంది ఉద్యోగులుంటారని..లక్ష మంది ఉద్యోగాలు కల్పించే పథకమని..సుప్రీంకోర్టు నిర్ణయించినట్లు వీరికి కనీస వేతనం...రూ. 18వేలు ఇచ్చే పథకమని, మొత్తంగా ఇది రూ. 11వేల కోట్ల పథకమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వ్యవసాయ పెట్టుబడి కింద రూ. 12వేల కోట్లు...ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ. 25వేల కోట్లు ప్రకటించారని...రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టారని..ధనికుల కోసం ఖర్చు పెడుతున్నారన్నారు. వేల కోట్ల రూపాయల ఆస్తులను ఫార్మా కంపెనీలకు ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని తెలిపారు. ఏది ఏమైనా ప్రభుత్వం వస్తే ఈ పథకం ప్రవేశ పెడుతామన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - బీఎల్ఎఫ్