బీజేపీ ఎంపీ

20:05 - April 16, 2018

ఉత్తరప్రదేశ్ : యూపీకి చెందిన బిజెపి ఎంపి, సాధువు సాక్షి మహారాజ్‌ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. లక్నోలో ఓ బార్‌ అండ్‌ నైట్‌ క్లబ్‌ను ప్రారంభించడం వివాదస్పదమైంది. యూపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్రనాథ్‌ పాండే మేనల్లుడు అలీగంజ్‌లో ఏర్పాటు చేసిన నైట్‌క్లబ్‌కు ఉన్నావ్‌ ఎంపి సాక్షి మహారాజ్‌ను ఆహ్వానించారు. సాక్షి మహారాజ్ రిబ్బన్‌ కట్‌ చేసి నైట్‌ క్లబ్‌ను ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు బహూకరించిన గణేషుడి ప్రతిమతో వెనుదిరిగారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ సాధువై ఉండి బార్‌ను ప్రారంభించడమేంటని విమర్శలు వెల్లువెత్తడంతో సాక్షి మహారాజ్‌ స్పందించారు. అది బార్‌ అన్న విషయం తనకు తెలియదని, తప్పుడు సమాచారంతో తనని మోసం చేశారని చెప్పారు. తన గౌరవానికి భంగం కలిగించిన మహేంద్రనాథ్‌ పాండేపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎంపి వెల్లడించారు.  

 

16:38 - April 15, 2018

విజయవాడ : ప్రధాన మంత్రిని వ్యక్తిగతంగా నిందించినా, కేంద్రం రాష్ట్రాన్ని మోసం చేసిందని ఆరోపణలు చేసినా.... కేంద్రం నుండి ఏపీకి వచ్చే ప్రయోజనాలు ఆగిపోవన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు. ఈ మేరకు విజయవాడలో ఏపీకి కేంద్రం సాయం..హరిబాబు బహిరంగ లేఖ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభం అర్థిక లోటు భర్తీ ద్వారా సమకూరుతుందన్నారు. ప్యాకేజీ కాదని హోదా కోరడానికి కారణమేంటో చంద్రబాబు ప్రజలకు వివరించాలన్నారు. 

 

21:03 - December 8, 2017

ముంబై : ప్రధాని నరేంద్ర మోదీకి మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ షాకిచ్చారు. గోండియా పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన నానా పటోల్ తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రధాని మోదీ నిర్ణయాల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు పంపిన రాజీనామా  లేఖలో తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ కూడా తన రాజీనామా నిర్ణయానికి కారణమని నానా పటోల్‌ పేర్కొన్నారు. నానా బీజేపీ పార్టీలో రెబల్‌గా మారారు. గతంలో పటోల్ కాంగ్రెస్ పార్టీలోనూ పనిచేశారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరారు. ఎన్‌సీపీ నేత ప్రఫుల్ పటేల్‌ను నానా పటోల్ ఓడించారు.

Don't Miss

Subscribe to RSS - బీజేపీ ఎంపీ