బోయపాటి శ్రీను

రంగస్థలం సినిమాతో తన కెరీర్ లోను అత్యధిక రికార్డులు సాధించిన జోష్ లో వున్న చరణ్ నెక్ట్స్ మూవీ టైటిల్ పై కసరత్తు జరుగుతోంది. తన కెరీర్ లో మగధీర తరువాత చరణ్ కు అంతటి హిట్ రాలేదు. కానీ మగధీరను మించిన ఉత్సాహంతో చేసిన ఈ సినిమా ఆల్ టైమ్ రిక్డార్డ్ సాధించిన చరణ్ బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తి చేశారు. త్వరలోనే రెండవ షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. ఈ షెడ్యూల్ నుంచి చరణ్ షూటింగులో జాయిన్ కానున్నాడు. ఈ నేపథ్యంలో కథకి తగినట్టుగా ఈ సినిమాకి 'రాజవంశస్థుడు' అనే టైటిల్ అయితే బాగుంటుందని బోయపాటి భావిస్తున్నాడట. ఈ టైటిల్ కి మంచి రెస్పాన్స్ వస్తే, అదే టైటిల్ ను చరణ్ వాళ్లు ఓకే చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. మరి ఇదే టైటిల్ ఖరారవుతుందో .. మరో కొత్త టైటిల్ తెరపైకి వస్తుందో చూడాలి.

దర్శకుడు బోయపాటి హీరోలకు సమానంగా రెమ్యూనేషన్ తీసుకుంటున్నారు. తాజాగా రామ్ చరణ్ తో ఆయన ఓ చిత్రాన్ని తీస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తైంది. రెండవ షెడ్యూల్ ను ఈ నెల 6నుంచి ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ కోసం బోయపాటి శ్రీను రూ.15 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఇంతకు ముందు ఆయన పారితోషికం రూ.10గా ఉండేది.

అల్లు అర్జున్ యాక్షన్ ఎంటర్టైనర్ 'సరైనోడు'. బోయపాటి శ్రీను సినిమాలంటేనే పోరాట సన్నివేశాలకు కొదవుండదని ముందే అర్థం చేసుకోవాలి. అటువంటి దర్శకుడు, ఎనర్జీ ఉన్న హీరో బన్ని కలిస్తే ఎలా ఉంటుందో 'సరైనోడు'లో చూపించ బోతున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను గత నెల 26న విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఈనెల 18న ఈ చిత్రం టీజర్‌ను ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా, కేథరిల్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ బాణీలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు 'సరైనోడు' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. 'జులాయి' సినిమా నుంచి అల్లు అర్జున్ సినిమాల మార్కెట్ క్రేజ్ భారీగా పెరిగింది. అందుకే బన్ని సినిమాలకి విడుదలకు ముందే భారీ రేటుకు అన్ని ఏరియాల రైట్స్ అమ్ముడుపోతుంటాయి. అదే విధంగానే తాజాగా 'సరైనోడు' సీడెడ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఎన్వి ప్రసాద్ ఈ సినిమా సీడెడ్ రైట్స్‌ని సుమారు 8 కోట్లకి పైనే ఖర్చు పెట్టి కొనుగోలు చేసినట్లు సమాచారం. అప్పట్లో 'సత్యమూర్తి' సీడెడ్‌లో సుమారు 7 కోట్లకి అమ్ముడయింది. అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో విలన్‌గా ఆది పినిశెట్టి, ఓ ముఖ్య పాత్రలో శ్రీకాంత్ కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
Don't Miss
