భట్టి విక్రమార్క

15:27 - October 3, 2017

కరీంనగర్/పెద్దపల్లి : సింగరేణి కార్మికులు భవిష్యత్తు తరాల గురించి ఆలోచించాలని, మోసపూరిత మాటలను నమ్మరాదని కార్మికుల హక్కులను కాపాడి, వారి సంక్షేమం గురించి పాటుపడే ఏఐటీయూసీకి ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క కోరారు. పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం ఓసీపీ-2 ఉపరితల గనిలో సింగరేణి ఎన్నికల ప్రచారంలో మంగళవారం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. వారసత్వ ఉద్యోగాలను కోర్ట్ కెక్కించిన ఘనత జాగృతికి సంబంధించిన వ్యక్తులుదేనని, కారుణ్య నియామకాలు ఇప్పుడు కొత్తగా లేవని ప్రతి సంస్థ లో కారుణ్య నియామకాలు జరుగుతాయని అన్నారు.  

09:41 - September 3, 2017

హైదరాబాద్ : టీ కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కోవర్ట్‌లు ఉన్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌ను రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్న టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోనేందుకు.. మా వ్యూహాలు మాకున్నాయని భట్టి విక్రమార్క అన్నారు. కొందరు టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

 

12:39 - February 14, 2017

హైదరాబాద్: ఎప్పుడూ రాజకీయంగా బిజీ బిజీగా గడుపుతూ... రాజకీయాల్లో బిజీగా టైం స్పెండ్ చేసే టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క దంపతుల తో వాలెంటైన్స్ సందర్భంగా పొలిటికల్ లైఫ్ ను పక్కనబెట్టి పర్సనల్ లైఫ్ లోని మధు జ్ఞాపకాలను '10టివి'తో షేర్ చేసుకున్నారు. హాట్ హాట్ విషయాలు చెప్పిన ఆ దంపతుల పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

16:55 - February 5, 2017

హైదరాబాద్ : బీసీ సబ్‌ప్లాన్‌ను బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడితెస్తామని.. తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలు విగ్రహాల్ని పార్టీపరంగా ఘనంగా జరుపుతామని  ప్రకటించారు. పార్టీలో బీసీలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. గ్రామస్థాయినుంచి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. సామాజిక తెలంగాణ సాధన కాంగ్రెస్‌ ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. 

 

15:46 - January 6, 2017

హైదరాబాద్ : దళితుల అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లీస్తున్నారని ఆరోపించారు. దళితులకు మూడెకరాలు ఇస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందన్నారు. దళితులు మూడెకరాల భూమి కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూడండి. 

 

10:38 - January 6, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో విభేదాలు అసెంబ్లీ సాక్షిగా మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ అంశంపై ప్రభుత్వ వైఖ‌రికి నిర‌స‌న తెలిపే క్రమంలో నాయకుల మధ్య సఖ్యత లేదనే విషయం బయటపడింది. ఎమ్మెల్యే భ‌ట్టి విక్రమార్కకు ముఖ్య నాయ‌కులెవరూ స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం పార్టీలో హాట్ హాట్‌ చర్చకు దారితీసింది.

జానారెడ్డి మాట‌లు నీట‌మూట‌లేనా?
అసెంబ్లీ స‌మావేశాల్లో అధికార‌పార్టీని ఐక్యంగా ఎదుర్కోవాల‌న్న సీఎల్పీ నేత జానారెడ్డి మాట‌లు నీట‌మూట‌ల‌ని తేలిపోయాయి. అంశాల‌వారీగా సీఎల్పీ లీడ‌ర్ వ‌ర్సెస్ ఎమ్మెల్యేల మ‌ధ్య విభేదాలు బ‌ట్టబ‌య‌ల‌వుతున్నాయి. ప‌లు సంద‌ర్భాల్లో సీఎల్పీ లీడ‌ర్ వైఖ‌రిని ఎమ్మెల్యేలు త‌ప్పుబ‌డుతూ మాట్లాడుకోవ‌డం స‌ర్వసాధార‌ణంగా మారింది. అయితే గురువారం జ‌రిగిన స‌మావేశాల్లో మాత్రం రోటీన్‌కు భిన్నంగా జానాకు బ‌దులు భ‌ట్టి విక్రమార్క టార్గెట్ అయ్యారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ తీరును ఎండగట్టిన భట్టి
ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ పై బుధవారం సభలో జరిగిన ఎపిసోడ్‌కు కొన‌సాగింపుగా నిన్నజ‌రిగిన చ‌ర్చలో ప్రభుత్వ వైఖ‌రిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఎండ‌గ‌ట్టారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఇచ్చిన స‌మాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే భ‌ట్టి విక్రమార్క.... ప్రొటెస్ట్ కోసం మైక్ తీసుకున్నారు. ఈ సంద‌ర్భంలో స‌భ‌లో ఆస‌క్తిక‌ర‌మైన అంశం చోటు చేసుకుంది. భ‌ట్టి విక్రమార్క ప్రొటెస్ట్‌ అంశంపై క‌లుగ‌జేసుకున్న శాస‌న‌స‌భ వ్యవ‌హారాల మంత్రి హ‌రీష్ రావు... ఈ ప్రొటెస్ట్ మీ వ్యక్తిగ‌త‌మా..? లేక పార్టీ నిర్ణయ‌మా..? సీఎల్పీ లీడ‌ర్‌ను మార్చారా..? అని అన‌డంతో ఒక్కసారిగా స‌భ‌లో వేడి రాజుకుంది.

అసెంబ్లీలో భ‌ట్టి విక్రమార్క వ‌ర్సెస్ జానారెడ్డి
మంత్రి హ‌రీష్ వ్యంగ్యంగా భ‌ట్టి విక్రమార్కను ఉద్దేశించి మాట్లాడినా... కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవ‌రూ స్పందించ‌క‌పోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది. అటు సీఎల్పీ లీడ‌ర్ జానారెడ్డిగానీ, పీసీసీ చీఫ్‌ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిగాని నోరుమెద‌ప‌క‌పోవ‌డంతో భ‌ట్టి విక్రమార్క సభలో ఒంట‌ర‌య్యారు. దీన్ని గ‌మ‌నించిన సీనియ‌ర్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి జానారెడ్డి లేవాల‌ని ఒత్తిడి తీసుకురావడంతో అనాస‌క్తిగానే లేచిన జానా... భ‌ట్టి విక్రమార్క ప్రొటెస్ట్ చెబుతార‌ని ప్రకటించారు. దీంతో భట్టి వెంట‌నే ప్రొటెస్ట్ చెప్పి స‌భ నుంచి వాకౌట్ చేశారు.

అసెంబ్లీ సాక్షిగా బయటపడ్డ నేతల విబేధాలు
అధికార‌ప‌క్షం స‌భ‌ను బుల్డోజ్ చేస్తోంద‌ని మీడియా ముందు ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు... త‌మ‌లో తాము ఐక్యత ప్రద‌ర్శించి స‌భ‌లో అధికార పార్టీని ఎదుర్కోవ‌డంలో బిన్న వైఖ‌రి ప్రద‌ర్శిస్తున్నార‌నే చ‌ర్చ హాట్ టాఫిక్‌గా మారింది.

15:41 - June 5, 2016

హైదరాబాద్ : టి పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి నాయకత్వ అసమర్థత వల్లే ఖమ్మం జిల్లాలో వలసలు ఊపందుకున్నాయని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ విమర్శించారు. అవినీతికి మారుపేరైన భట్టికి సీఎం కేసీఆర్‌ను విమర్శించే స్థాయిలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చీకటి వ్యాపారాలతో పబ్బం గడుపుకునే భట్టి..టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేసేముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. 

16:54 - October 27, 2015

హైదరాబాద్ : రైతుల భవిష్యత్తును విత్తన తయారీ సంస్థలకు తాకట్టుపెట్టొద్దని టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా మార్చడం కాదు.. విత్తన వైఫల్యం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విత్తన తయారీ సంస్థలపై నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా బిల్లును తెలంగాణ ప్రభుత్వానికి పంపుతున్నట్లు తెలిపారు. ఎలాంటి ఆంక్షలు విధించాలో కూడా అందులో పేర్కొన్నట్లు చెప్పారు.

07:01 - September 25, 2015

హైదరాబాద్ : ఇప్పటికే టీస‌ర్కార్‌ విధానాల‌పై కాలుదువ్వుతున్న కాంగ్రెస్‌ .. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లోనూ అదే దూకుడును ప్రద‌ర్శించాల‌ని డిసైడ్ అయ్యింది. ప్రభుత్వం అమ‌లు చేస్తున్న విధానాల‌లోని లోపాల‌ను ఎత్తి చూపి... స‌భా సాక్షిగా ప్రభుత్వాన్ని దోషిగా నిలిపేందుకు ప‌క్కా ప్రణాళిక‌ల‌ను రూపొందిస్తోంది. ఈ నెల 29న రైతుల ఆత్మహ‌త్యల‌పై స‌భ‌లో పూర్తి స్థాయి చ‌ర్చ ప్రారంభంకానుండ‌టంతో... ఇక ప్రభుత్వాన్ని ఇరుకున బెట్టేందుకు ప్రత్యేక కార్యాచ‌ర‌ణ‌తో రంగంలోకి దిగుతోంది కాంగ్రెస్.

ఆత్మహ‌త్యల‌కు ప్రభుత్వ విధానాలే కార‌ణం....

రైతుల ఆత్మహ‌త్యల‌కు ప్రభుత్వ విధానాలే కార‌ణ‌మ‌ని ఆరోపిస్తున్న కాంగ్రెస్... ఇప్పటికే దీనిపై అనేక రూపాల్లో నిర‌స‌న‌లు తెలిపింది. ఈ విష‌యంలో మిగ‌తా అన్ని పార్టీలు ఎవ‌రికి వారు ఇదే వాయిస్‌ను వినిపిస్తూ వ‌స్తున్నాయి. దీన్నిస‌భ‌లో అనుకూలంగా మ‌లుచుకోవ‌డంపై కాంగ్రెస్‌ దృష్టిపెట్టింది. స‌భ‌లో ఫ్లోర్ కోఆర్డినేష‌న్‌తో పార్టీల‌ను ఏకం చేయాల‌ని నిర్ణయించింది. దీని కోసం స‌భ ప్రారంభానికి ముందే... ఫ్లోర్‌ కోఆర్డినేష‌న్ కోసం స‌మావేశం ఏర్పాటుకు ప్రయ‌త్నాలు చేస్తోంది. ప్రజా స‌మ‌స్యల‌పై అంద‌రినీ ఏకం చేసి ప్రభుత్వంపై ముప్పేట దాడి చేయాల‌న్నది కాంగ్రెస్

 వాట‌ర్‌గ్రిడ్, మిష‌న్ కాక‌తీయలో కోట్ల రూపాయ‌ల అవినీతి....

అంతేకాకుండా వాట‌ర్‌గ్రిడ్, మిష‌న్ కాక‌తీయలో కోట్ల రూపాయ‌ల అవినీతి జ‌రుగుతుంద‌ని ఆరోపిస్తున్న కాంగ్రెస్.... స‌భలో దీనిపై ప్రభుత్వాన్ని నిల‌దీయాల‌ని భావిస్తోంది. మ‌రోవైపు ప్రాజెక్ట్‌ల రీడిజైన్లపై .. సీఎం స‌భ‌లో ప‌వ‌ర్‌ పాయింట్‌ ప్రజెంటేష‌న్‌కు సిద్దమ‌వుతున్నార‌న్నది దృష్టిలో పెట్టుకున్న హ‌స్తం పార్టీ... అంతే ధీటుగా స‌మాధానం చేప్పేందుకు ప్రిపేర్ అవుతోంది. ఈ అంశంపై కూడా ప్రతిపక్షాల‌న్నీ ఒకే వాదనలో ఉన్నాయి. దీనితో పాటు ఎస్సీ, ఎస్టీ స‌బ్‌ ప్లాన్‌ అమ‌లు, పలు ప్రజా సమస్యలపై స‌భ‌లో ప్రతిప‌క్షాల‌కు పెద్దన్న పాత్ర వ‌హించి ప్రభుత్వ తీరును ఎండ‌గ‌డ‌తామంటోంది కాంగ్రెస్. రైతు ఆత్మహ‌త్యలు, వాట‌ర్ గ్రిడ్ , మిష‌న్ కాకతీయ , ప్రాజెక్ట్‌ల డిజైన్‌ల మార్పులు, పలు ప్రజా సమస్యలపై సభ బ‌య‌ట క‌త్తులు నూరుతున్న అన్నీ పార్టీలను ఏకం చేసి సభలో ప్రభుత్వంతో అమీ తుమీకి రెడీ అవుతోంది కాంగ్రెస్. 

16:33 - August 1, 2015

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన ఉస్మానియా ఆసుపత్రిని కూల్చొద్దని టీ.కాంగ్రెస్‌ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పార్టీ సీనియర్‌ నేతలు భట్టి విక్రమార్క, వీ.హనుమంతరావులు ఉస్మానియా ఆసుపత్రిని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండ్‌తో మాట్లాడారు. చారిత్రాత్మక ఆసుపత్రిని కూల్చకుండా...ఆసుపత్రిలో 10 ఎకరాల ఖాళీ స్థలం ఉందని అందులో కొత్త ఆసుపత్రిని నిర్మించవచ్చని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క అన్నారు. ఉస్మానియాను కూల్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే నిరాహార దీక్షలకు దిగుతామని రాజ్యసభ సభ్యులు వీహెచ్‌ హెచ్చరించారు.

 

 

Don't Miss

Subscribe to RSS - భట్టి విక్రమార్క