భయం

17:33 - November 18, 2017

టిబెట్‌ : అరుణాచల్‌ప్రదేశ్‌ సమీపంలోని టిబెట్‌లో ఉదయం భూకంపం సంభవించింది.  భారత్‌-చైనా సరిహద్దులో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 6.9గా నమోదైంది. ఉదయం ఆరున్నరకు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయని చైనా భూకంప నెట్‌వర్క్‌ సెంటర్‌ తెలిపింది. ఆ తర్వాత మరో రెండు గంటలకు అదే ప్రాంతంలో 5 తీవ్రతతో కూడిన ప్రకంపనలు సంభవించినట్లు చెప్పింది. భూ ప్రకంపనలతో ప్రజలు భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు.

07:49 - October 16, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌, టీ జేఏసీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ఎత్తిచూపుతున్న టీ జాక్‌ చైర్మన్‌ కోదండరామ్‌పై గులాబీ పార్టీ నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లిన టీజాక్.. ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను అదే స్థాయిలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం పగ్గాలు చేదపట్టిన రెండేళ్ల వరకు సైలెంటాగానే ఉన్న టీజాక్ అండ్‌ టీమ్‌.... ఆ తర్వాత నుంచి తమ ప్రణాళికలను అమలు చేయడం మొదలు పెట్టింది. ఇటీవలే తమ కార్యక్రమాలకు మరింత పదును పెట్టడం ప్రారంభించింది. ప్రతిపక్షాల దీటుగా టీజాక్ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది

కోదండరాంకు అడుగడుగునా ఆటంకాలు
టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ చేస్తున్న అమరలు స్ఫూర్తి యాత్ర మరోసారి వివాదాస్పదమవుతోంది. గతంలో మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలె అమరలు స్ఫూర్తి యాత్రలో వివాదం చోటు చేసుకోగా... తాజాగా వరంగల్ జిల్లా యాత్రలో అంతకంటే ఎక్కువగానే దూమారం రేపుతోంది. వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన రోజే టీజాక్ చైర్మన్ కోదండరామ్‌ కూడా అమరులు స్ఫూర్తి యాత్ర తలపెట్టడంతో పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించి బ్రేకులు వేశారు. పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదం కావడంతో కేసీఆర్‌ ప్రభుత్వంపై టీజాక్ నేతలు మండి పడుతున్నారు. ప్రభుత్వం బలహీన పడుతోండటం వల్లే అరెస్టులతో అణచివేత ధోరణి అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పాలకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే పనిలో పడ్డారని కోదండరామ్‌ కన్నెర్ర చేశారు. ఈ పరిణామాలను బేరీజు వేసుకుంటున్న గులాబీ పార్టీ నేతలు టీజాక్ వ్యూహాలకు చెక్‌ పెట్టడంపై దృష్టి కేంద్రీకరించారు. 

21:54 - October 11, 2017

హైదరాబాద్ : వర్షాలు ప్రజలను భయపెడుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాయలసీమలోనూ వర్షాలు భారీగా కురవడంతో ఇళ్లలోకి నీళ్లు చేరాయి... పంటలు నీట మునిగాయి. ఇన్‌ ఫ్లో పెరగడంతో... శ్రీశైలం ప్రాజెక్ట్ నిండటంతో.. గురువారం ఉదయం నీటిని విడుదల చేయనున్నారు.  

కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం బెంబేలెత్తుతుంది. నాలాలు, డ్రైనేజిలు పొంగిపొర్లతుండడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కాలనీలన్నీ జలమయమవుతున్నాయి. ఉదయం కురిసిన భారీ వర్షానికి మళ్లీ నగరంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు, అపార్ట్‌మెంట్లలోకి నీళ్లు చేరాయి. రోడ్లపై భారీగా నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

మరోవైపు రామాంతపూర్‌ చెరువు పొంగిపొర్లడంతో 10 రోజులుగా కాలనీలు నీటమునిగాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక అదేవిధంగా గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలోని ఇసుక వాగు పొంగిపొర్లింది. గ్రామంలోకి ఒక్కసారిగా నీళ్లు రావడంతో.. పలు ఇళ్లలోని సామాగ్రితో పాటు.. పశువులు కొట్టుకుపోయాయి. ప్రజలంతా నిరాశ్రయులయ్యారు. ఇక కొత్తూరు కాజ్‌వై పై నుండి వరద నీరు ప్రవహిస్తుండడంతో 19 పోలవరం ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఎన్నో ఏళ్లుగా నిండని ప్రాజెక్టులు ఈసారి జలకళను సంతరించుకుంటున్నాయి. 

అనంతపురం జిల్లాలో యోగి వేమన రిజర్వాయర్‌ నిండుకుండను తలపిస్తోంది. దీంతో అధికారులు ఎనిమిది గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేశారు. పెదపప్పూరు మండలంలోని చాగల్లు-పెండెకల్లు రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు రావడంతో గండి పడింది. దిగువ ప్రాంతాలకు నీళ్లు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు ప్రజలను ఖాళీ చేయించారు. ఇక తాడిపత్రిలోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్‌ వీరపాండ్యన్‌ పర్యటించారు. కాలువలు, చెరువలకు పడిన గండ్లను పరిశీలించారు. నష్టపోయిన పంటలను పరిశీలించి.. తాత్కాలిక నివేదికలు పంపాలని అధికారులను ఆదేశించారు. 

కర్నూలు జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. మూడు రోజులుగా ఎడతెరిపిలేని వర్షంతో ప్రముఖ శైవక్షేత్రం యాగంటి ఆలయంలోకి వర్షపునీరు చేరింది. దీంతో భక్తుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

అనంతపురం జిల్లాలో స్వర్ణముఖీ నదీ జలాల విషయంలో.. మరోసారి ఆంధ్రా, కర్ణాటక రైతుల మధ్య వివాదం చెలరేగింది. కోతకు గురైన వంకకు ఏపీకి చెందిన రైతులు మరమ్మతులు చేసేందుకు వెళ్లగా కర్ణాటక రైతులు అడ్డుకున్నారు. దీంతో ఇరు రాష్ట్రాల రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా పులివెందులలో అరటి, వేరుశనగ, పత్తి, ఉల్లి పంటలు పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరతున్నారు. 

వరుస వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్ట్‌ నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్ట్‌ మొత్తం నీటి సామర్ధ్యం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్‌లోకి లక్షా 50 వేల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా... 88 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. మొత్తానికి గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తుండగా... అకాల వర్షాలతో పంటలు నష్టపోయామని రైతులు వాపోతున్నారు. 

21:46 - September 23, 2017

ఒకటి కాదు రెండు కాదు ఏడేళ్లుగా వణుకుతున్నారు. వారిలో భయనకి కారణం ఒక్కడే ఆ ఒక్కడి పేరు వింటేనే నిద్రకూడా పట్టడం లేదు ఆ జ్ఞాకలు వారిని వేధిస్తున్నాయి. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రాణ భయంతో బిక్కచంచ్చిపోతున్నారు. ఎప్పుడు ఏ వైపు మృత్యువు రూపంలో వచ్చి ప్రాణాలు తీస్తుడో అని భయపడుతున్నారు. ఏడేళ్లు క్షణం క్షణం భయంతో గడిపిన ప్రజలు ఇప్పుడు ప్రశాతంగా ఉన్నారు. ఇది కథ కాదు ఏ రియల్ స్టోరీ పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

17:32 - September 10, 2017

శ్రీకాకుళం : శ్రీకాకుళం ఎంపీ స్థానం పోటీకీ అభ్యర్థులు కరువవుతున్నారు. ఒకప్పుడు ఈ స్థానం నుండి గెలుపొందిన దివంగత నేతలు బొడ్డేపల్లి రాజగోపాలరావు, కింజారపు ఎర్రంనాయుడులు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు. ఎర్రం నాయుడుతో పాటు.. మాజీ ఎంపీ కిల్లీ కృపారాణి కేంద్రమంత్రులుగా కూడా పని చేశారు. అయితే 2019కి టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీల నుండి ఇక్కడ ఎంపీ అభ్యర్థులు కరువయ్యారు.

2014లో ఎంపీగా ఎన్నికైన రామ్మోహన్‌ నాయుడు.. ఎందుకో తన రూట్ మార్చుకున్నారు. రాబోయే 2019 ఎన్నికల్లో నరసన్న పేట నుండి అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలన్న ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న టీడీపీ నేతల్లో ఎవ్వరూ ఎంపీగా పోటీ చేయాలన్న ఉత్సాహం చూపడం లేదు. అందుకు కొత్తగా అభ్యర్థిని రంగంలోకి దింపాలని చూస్తున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యే పోటీకి రెడ్డి శాంతి
ప్రధాన ప్రతిపక్షం వైసీపీలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వైసీపీలో ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న రెడ్డి శాంతి.. 2014లో ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. వైసీపీ పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకట రమణ.. టీడీపీలోకి వెళ్లడంతో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెడ్డి శాంతి సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే 2019లో వైసీపీ నుంచి కొత్త అభ్యర్థిని పోటీలో నిలపాల్సి ఉంటుంది. ఇక కాంగ్రెస్‌ నుండి ఎంపీ స్థానానికి పోటీ చేసిన మాజీ కేంద్రమంత్రి కిల్లీ కృపారాణి.. త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకొని టెక్కలి ఎమ్మెల్యేగా అచ్చెంనాయుడిపై పోటీ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. దీంతో కాంగ్రెస్‌ తరపున అభ్యర్థి ఎవరనేది ప్రశ్నార్థకం.

చర్చనీయాంశంగా
ఇక మిగిలిన పార్టీలకు గట్టి అభ్యర్థులే లేని పరిస్థితుల్లో ఎంపీ స్థానంపై పోటీకి.. ప్రధాన పార్టీల నేతలు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. సిట్టింగ్ ఎంపీ అభ్యర్థులే కాదు. వివిధ పార్టీలకు చెందిన సీనియర్లు కూడా పార్లమెంట్ వైపు చూడటం లేదు. టీడీపీలో గౌతుశ్యామ సుందర శివాజీ, గుండ అప్పల సూర్యనారాయణ లాంటి వారితో పాటు.. వైసీపీలో ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలాంటి వారు ఎంపీ అభ్యర్థిత్వంపై వెనక్కి తగ్గుతున్నారు. మరి ఎన్నికల సమయానికైనా నేతల్లో ఒక క్లారిటీ వస్తుందేమో చూడాలి.  

11:56 - August 29, 2017

డాన్సర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి, నటుడిగా, ఇప్పుడు దర్శకుడిగా ఎదిగిన హీరో కం డైరెక్టర్ కొత్త సినిమా రెడీ చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఆల్రెడీ తాను చేసిన హారర్ సినిమాలు హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ ని టచ్ చేసాయి. అదే ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూ మరో హారర్ కామెడీకి తెరతీయబోతున్నాడు ఈ డైరెక్టర్.

ఒకప్పుడు డ్యాన్స్ మాస్టర్ గా ఎంత పేరు సంపాదించాడో.. దర్శకుడిగా హార్రర్ కామెడీ సినిమాలతో అదే స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు 'రాఘవ లారెన్స్’. అతను తీసిన కాంచన.. గంగ సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో తెలిసిందే. ‘ముని’తో మొదలుపెట్టి ఈ సిరీస్ లో మూడు సినిమాలు తీసిన లారెన్స్.. త్వరలోనే ఈ కోవలో మరో సినిమా చేయబోతున్నాడు. ‘గంగ’ బ్లాక్ బస్టర్ అయినప్పుడే ఈ సిరీస్ లో మరో సినిమా చేస్తానని ప్రకటించిన లారెన్స్.. గత రెండేళ్లలో ఆ దిశగా ప్రయత్నాలేమీ చేయలేదు.

రెండేళ్లకు పైగా దర్శకత్వం పక్కన పెట్టేసి హీరోగా మొట్ట శివ కెట్ట శివ.. శివలింగ లాంటి సినిమాలు చేసిన లారెన్స్.. మళ్లీ కొత్త కథపై దృష్టిపెట్టాడు.హారర్ కామెడీ తో అదే తరహా కధని ఎంచుకుని సినిమా రెడీ చేయబోతున్నట్లు చెప్పాడట. మరి లారెన్స్ ఇలా దొరికిందే డొంక ర అని ఒకే కథని అటు తిప్పి ఇటు తిప్పి మాడిపోయిన మసాలా దోసల సినిమాలు తీస్తే ఆడియన్స్ ఇంటికి పంపిస్తారు అని ఫిలిం నగర్ వాసులు అనుకుంటున్నారట. కథలు పాతవా కొత్తవా అనేది పక్కన పెడితే లారెన్స్ మాత్రం కలక్షన్స్ బాగానే రాబడుతున్నాడు.

13:21 - August 7, 2017
21:51 - August 6, 2017

కర్నూలు : నంద్యాలలో జగన్‌కి వస్తున్న ప్రజాధరణ చూసీ టీడీపీకి భయం పట్టుకుందని వైసీపీ నేతలు అంటున్నారు. సీఎం చంద్రబాబుపై జగన్‌ విమర్శలను టీడీపీ నేతలు భూతద్దంలోచూస్తున్నారని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్‌ రెడ్డి విమర్శించారు. 

15:04 - July 18, 2017

హైదరాబాద్‌ : 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. హుస్సేన్‌ సాగర్‌ నిండు కుండను తలపిస్తోంది. ఇంకా వర్షాలు కురుస్తుండటంతో.. 350 నుంచి 400 క్యూసెక్కుల నీటిని హుస్సేన్‌ సాగర్‌ నుంచి బయటకు వదులుతున్నారు. దీనిపై మరిన్ని మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

09:47 - May 24, 2017

టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి ఇటీవలే బాలీవుడ్ కు చెక్కేసిన అందలా భామ 'తాప్సీ' మళ్లీ తెలుగు ప్రేక్షకులకు కనిపించబోతోంది. బాలీవుడ్ లో వైవిధ్యమైన సినిమా కథలను ఎంచుకుంటున్న ఈ ముద్దుగుమ్మ నటనపై విమర్శకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. 'నేనే షబానా' అంటూ 'నామ్‌ షబానా' తెలుగు డబ్బింగ్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన తాప్సీ, 'ఘాజీ' అనే స్ట్రెయిట్‌ సినిమాలోనూ నటించినా, అందులో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు చిత్రంలో నటించబోతోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చిత్ర టైటిల్ ను రివర్స్ లో పెట్టి..భయానికి నవ్వంటే భయం అనే ట్యాగ్ లైన్ పెట్టి రిలీజ్ చేశారు. టైటిల్ ను రివర్స్ లో పెట్టినా అది 'ఆనందో బ్రహ్మ' అనే టైటిల్ ను ప్రేక్షకులు గుర్తు పట్టేశారు. తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా చేయబోతున్నాననీ, చాలా ఆనందంగా వుందనీ, ఈ ప్రీ లుక్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తాప్సీ వ్యాఖ్యానించింది. మరి ఈ చిత్రంతో 'తాప్సీ' ఎలా కనిపించబోతోందో ? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా ? లేదా అనేది చూడాలి.

Pages

Don't Miss

Subscribe to RSS - భయం