భారత బలగాలు

12:00 - December 9, 2018

జమ్మూ కాశ్మీర్ : మరోసారి ఉగ్రవాదుల కలకలం రేగింది. భారత బలగాలకు..ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 8వ తేదీ నుండి ఈ కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందగా ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
భారత బలగాల సెర్చ్ ఆపరేషన్...
డిసెంబర్ 8వ తేదీ సాయంత్రం ఉగ్రవాదులు నక్కారనే సమాచారం మేరకు భారత బలగాలు ముజ్గుంద్ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఉగ్రవాదులు కాల్పులు జరపగా వీటిని భారత బలగాలు తిప్పికొట్టారు. రాత్రి కాల్పులకు బ్రేక్ ఇచ్చిన ఉగ్రవాదులు డిసెంబర్ 9వ తేదీ తెల్లవారుజామున మళ్లీ కాల్పులకు తెగబడుతున్నారు. ఇదిలా ఉంటే కాశ్మీర్‌లో మిలటరీ వాహనాలపై రాళ్లు రువ్వడం...శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని పేర్కొంటూ శ్రీనగర్‌లో ఇంటర్ నెట్ సేవలను నిలిపివేశారు. బందిపోరా..శ్రీనగర్ మార్గంగుండా ఉగ్రవాదులు పారిపోకుండా అదనపు బలగాలు మోహరించాయి. 

07:04 - October 1, 2018

ఢిల్లీ : భారతదేశ శాంతికి విఘాతం కలిగించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే... వారికి సైనికులు ధీటైన సమాధానం చెబుతారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పాకిస్థాన్ పేరును నేరుగా ప్రస్తావించకుండా వార్నింగ్ ఇచ్చారు. శాంతిని బలంగా నమ్మే దేశం ఇండియా అన్న ఆయన దేశ సార్వభౌమాధికారం, ఆత్మగౌరవం విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ప్రధాని స్పష్టం చేశారు. మన్ కీ బాత్  రేడియో షో 48వ ఎడిషన్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ మాట్లాడారు. శాంతికి మనం కట్టుబడి ఉన్నామని.... అదే విధానంతో ముందుకు వెళ్తామన్నారు. భారత ఆర్మీ ప్రత్యేక బలగాలు జరిపిన సర్జికల్ దాడులను ప్రధాని గుర్తుచేస్తూ, మన సైనికులు 2016లో ఉగ్రవాదానికి గట్టి గుణపాఠం చెప్పారన్నారు. 

09:31 - August 4, 2018

ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ లో గవర్నర్ పాలన వచ్చిన అనంతరం రంజాన్ మాసం తరువాత ఉగ్రవాదుల చొచ్చుక వచ్చారనే సమాచారం మేరకు భారత బలగాలు ఆయా ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఆయా సమయాల్లో ఉగ్రవాదులకు..జవాన్ల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా షోపియాన్, బారాముల్లా జిల్లాల్లో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. షోపియాన్ జిల్లా కిల్లోరా ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు, బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుపెట్టాయి. శుక్రవారం రాత్రి నుండి ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదుల నుండి ఏకె 47 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. మృతి చెందిన ఉగ్రవాదులు రియాజ్ అహ్మద్ దర్, కుర్షీద్ అహ్మద్ మాలిక్ లుగా గుర్తించారు. కానీ బారాముల్లా జిల్లాలో జరిగిన కాల్పుల్లో జవాన్ సావర్ విజయ్ కుమార్ వీరమరణం పొందారు. 

13:33 - April 1, 2018

జమ్మూ కాశ్మీర్ : వరుసగా జరిగిన ఎన్ కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులు హతం కాగా ఇద్దరు భారత జవాన్లకు గాయాలయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. షోపియాన్ జిల్లాలో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న భారత బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీనితో భారత సైన్యం ధీటుగా స్పందించింది. ఎదురు కాల్పులు జరపడంతో ఏడుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. అనంతనాగ్ జిల్లాలోని ఓ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఆయా ఘటనా ప్రదేశాల నుండి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రీ, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే షోపియాన్ లోని కచ్ దూర్ లో స్థానికులను బందీలుగా చేసుకుని ఉగ్రవాదులు నక్కినట్లు తెలుస్తోంది.

21:10 - February 12, 2018

ఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లోని సంజ్వాన్‌లో ఆర్మీ ఆపరేషన్‌ ముగిసిందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆర్మీ ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని మంత్రి వెల్లడించారు. ఉగ్రవాద దాడుల వెనక పాకిస్తాన్‌కు చెందిన జైష్‌ -ఎ-మహ్మద్‌ హస్తం ఉందని మంత్రి పేర్కొన్నారు. పాకిస్తాన్‌ ప్రోత్సాహంతోనే ఉగ్రదాడులు జరుగుతున్నాయని... ఉగ్రవాద నేత మసూద్‌ అజహర్‌ కశ్మీర్‌కు టెర్రరిస్టులను స్పాన్సర్‌ చేస్తున్నారని సీతారామన్‌ స్పష్టం చేశారు. త్వరలో ఎన్‌ఐఏ ఆధారాలను సేకరిస్తోందని మంత్రి చెప్పారు. ఉగ్రవాదుల దాడులను భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పి కొడుతున్నాయన్నారు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో రక్షణమంత్రి జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. 

14:45 - November 21, 2017

జమ్మూ కాశ్మీర్ : కుప్వారా జిల్లాలోని ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుపెట్టాయి. నిఘా వర్గాల సమాచారం మేరకు భారత భద్రత బలగాలు హంద్వారాలో మంగళవారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భారత బలగాలు ఎదురు కాల్పులు చేసింది. దీనితో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి నుండి ఈ తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 190 ఉగ్రవాదులు హతమయ్యారు. 

12:22 - October 8, 2016

ఢిల్లీ : భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘింస్తూనే ఉంది.  పాక్ సైనికులు మరోసారి తెగబడ్డారు. పూంచ్‌ సెక్టార్‌ వద్ద భారత జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక జవానుకు గాయాలయ్యాయి. మోటార్‌ షెల్లార్స్‌తో పాక్‌ రేంజర్లు కాల్పులు జరుపుతున్నారు. పాకిస్తాన్‌ 10 రోజుల్లో 26 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

10:12 - September 18, 2016

ఢిల్లీ : ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. గత కొన్ని రోజులుగా కాశ్మీర్ లో దాడులకు తెగబడుతున్నారు. తాజాగా యూరి సెక్టార్ లోని ఆర్మీ బేస్ట్ క్యాంపుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు సైనికులు వీరమరణం పొందారు. 16 మంది సైనికులకు తీవ్రగాయాలయైనట్లు సమాచారం. గాయాలైన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. పటాన్ కోట్ తరహాలో ఉగ్రవాదులు ఈ దాడులకు పూనుకున్నారు. జారాముల్లా జిల్లాలోని యూరీ సెక్టార్ లో 12వ ఆర్మీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఆదివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ లోకి చొచ్చుకొని వచ్చారు. అనంతరం క్యాంపు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో వెళ్లి భారత బలగాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే తేరుకున్న భారత బలగాలు ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపారు. మొత్తం నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరివద్ద భారీగా మందుగుండు సామాగ్రీ, మారణాయుధాలు ఉన్నట్లు సమాచారం. వీరిని ఏరివేసేందుకు మరికొన్ని బలగాలు చేరుకోనున్నాయి.

రాజ్ నాథ్ పర్యటన వాయిదా..
విషయం తెలుసుకున్న కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ రష్యా..యూఎస్ పర్యటన వాయిదా వేసుకున్నారు. అనంతరం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు గోవా నుండి రక్షణ శాఖ మంత్రి పారికర్ ఢిల్లీకి చేరుకోనున్నారు. కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితిపై చర్చించనున్నారు. పాక్ నుండి ఉగ్రవాదులు వచ్చినట్లు రక్షణ శాఖ భావిస్తోంది. 

Don't Miss

Subscribe to RSS - భారత బలగాలు