భూపాలపల్లి

12:46 - March 3, 2018
12:41 - March 3, 2018

ఖమ్మం : ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టును పోలీసులు గుర్తించారు. దడబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్ గా గుర్తించారు. ఇతని స్వస్థలం కాజీపేట మండలతం రాంపేట్ అని పోలీసులు నిర్ధారించారు. ప్రభాకర్ ఎన్ టీఎస్ జడ్ సీ సభ్యుడే కాకుండా యాక్షన్ టీం కమాండర్ గా పనిచేశాడు. ప్రస్తుతం ఇతని మృతదేహం భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచారు.

భూపాలపల్లి జిల్లా సరిహద్దు వెంకటాపురం మండలం తడపల గుట్టలు, ఛత్తీస్ గడ్ రాష్ట్ర పూజారి కాంకేడ్ మధ్య కొండపల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఎన్ కౌంటర్ లో మృతి చెందిన 10 మంది నక్సల్స్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇందులో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ తో పాటు సెంట్రల్ కమిటీ సభ్యులున్నారు. 

15:25 - March 2, 2018

భూపాలపల్లి : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భూపాలపల్లి జిల్లా నూగూరు-వెంకటాపురంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మవోయిస్టులు హతమయ్యారు. వీరిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌తోపాటు సెంట్రల్‌ కమిటీ సభ్యులు ఉన్నారు. మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ ముగ్గురు పోలీసుల్లో వికారాబాద్‌కు చెందిన సుశీల్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలంలో రెండు ఏకే 47 తుపాకులు సహా పది ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. 
హరిభూషణ్ ఉమ్మడి వరంగల్‌ జిల్లా వాసి
ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన హరిభూషణ్‌ది ఉమ్మడి వరంగల్‌ జిల్లా. కొత్తగూడ మండలం మడగూడెంకు చెందిన హరిభూషణ్‌ 20 ఏళ్ల క్రితం మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లాడు. పార్టీలో అంచలంచలుగా ఎదిగి తెలంగాణ సెంట్రల్‌ కమిటీలో పనిచేశాడు. గతంలో పలు ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్న హరిభూషణ్‌... తాజా ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. హరిభూషణ్‌ భార్య జజ్జరి అలియాస్‌ సమ్మక్క, అలియాస్‌ స్వర్ణక్క మావోయిస్టు ఉద్యమంలో పని చేశారు. అనారోగ్య కారణంలో 2009లో పోలీసులకు లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కొనసాగుతున్నారు. 
 

13:45 - March 2, 2018
13:44 - March 2, 2018

భూపాలపల్లి : జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని కోర్టు విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం అనంతరం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సంఘం తరపు న్యాయవాది టెన్ టివితో మాట్లాడారు. బూటకపు ఎన్ కౌంటర్ అని పేర్కొన్నారు. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు న్యాయ నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:17 - March 2, 2018

ఖమ్మం : తెలంగాణ - ఛత్తీస్ గడ్ రాష్ట్రాల సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ లో వికారాబాద్ జిల్లాలోని మేకవనంపల్లికి చెందిన గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ సుశీల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మొత్తం 12 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిదే. మరో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ తో పాటు అతని భార్య సమ్మక్క, సెంట్రల్ కమిటీ సభ్యులున్నారు.

భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం తడపలగుట్ట - పూజారి కాంకేడు సరిహద్దులో తెలంగాణ, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలకు చెందిన గ్రే హౌండ్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

10:14 - March 2, 2018

ఖమ్మం : భూపాలపల్లిలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య పెరుగుతోంది. మృతి చెందిన వారిలో మావోయిస్టు అగ్రనేత హరికిషన్ తో పాటు పలువురు సెంట్రల్ కమిటీ సభ్యులున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల మృతదేహాలను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. పోలీసులు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయడం లేదు. ఆసుపత్రికి మొత్తం మృతదేహాలను తరలించిన అనంతరం విలేకరుల సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించనున్నట్లు సమాచారం.

భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం తడపలగుట్ట - పూజారి కాంకేడు సరిహద్దులో మావోయిస్టులు సమావేశమయ్యారని పోలీసులకు పక్కా సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీనితో తెలంగాణ - ఛత్తీస్ గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసులను చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. వెంటనే పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. కాల్పులతో అడవి దద్ధరిల్లింది. మరోసారి ఎన్ కౌంటర్ చోటు చేసుకుందని..ఎక్కువ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారని తెలుసుకున్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు. ఘటనా స్థలంలో మావోయిస్టుల నుండి ఏకే 47 ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 

09:11 - March 2, 2018

ఖమ్మం : మళ్లీ అడవిలో అలజడి రేగింది. మావోయిస్టుల ప్రాధాన్యత తగ్గిందని భావిస్తున్న పోలీసులకు చుక్కెదురైంది. మావోయిస్టుల కదలిక ఉందని గ్రహించిన పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున తెలంగాణ - ఛత్తీస్ గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా నూగూరు వెంకటాపురంలో మావోయిస్టులు తారపడ్డారు. వెంటనే ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. అశ్వాపురంలో ఇటీవలే ఇద్దరిని కాల్చి చంపిన మావోయిస్టులు ప్రొక్లెయిన్లరను దగ్ధం చేశారు. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను హెలికాప్టర్ల ద్వారా భద్రాచలానికి తరలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

14:51 - February 13, 2018

భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. హిరిప్రియ, సాయికుమార్ అనే ఇద్దరు ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. హరిప్రియ మృతి చెందగా, సాయికుమార్ పరిస్థితి విషమంగా ఉంది. వీరిని హన్మకొండ హంటర్ రోడ్డు వాస్తవ్యులుగా పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

10:30 - February 5, 2018

భూపాలపల్లి : జిల్లా వెంకటాపూరం మండలం ఎదిరలో బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ను మావోయిస్టులు పేల్చేశారు. తెలంగాణ బంద్ ను విజయవంత చేయాలని వారు పోస్టర్లు అతికించారు. అటు చత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లా కిరండోల్ లో ప్రొక్లయినర్ తో పాటు వాహనాలకు నిప్పు పెట్టారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Pages

Don't Miss

Subscribe to RSS - భూపాలపల్లి