భూప్రకంపనలు
ఢిల్లీ : హస్తినతోపాటు ఉత్తరాదిలో కొద్ది సేపటి క్రితం భూ ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ రాజధాని ఏరియాతోపాటు పంజాబ్, హర్యాణా, కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో భూ కంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. ఒక్కసారి చోటుచేసుకున్న ప్రకంపనలతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటికి పరుగులు తీశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
కృష్ణా : జిల్లాలోని గన్నవరం పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గన్నవరం మండలం ముస్తాబాద్, ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి, చిన్నఅవుటపల్లిలో భూమి కంపించింది. అటు గన్నవరం ఎయిర్ పోర్ట్‌లోనూ స్వల్పంగా భూమి కంపించింది. దీంతో అధికారులు భయంతో పరుగులు తీశారు. గన్నవరంలో మూడురోజుల్లో భూమి కంపించండం ఇది రెండోసారి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....
నెల్లూరు : జిల్లాలో మళ్లీ భూప్రకంపనలు ప్రజలను వణికించాయి. వింజమూరు మండలం చాకలికొండ, జనార్థనపురం, దుత్తలూరు మండలం నందిపాడు, బండికిందపల్లి గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది...దీంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసి బయటకు వచ్చారు. ఈ సంవత్సరం దాదాపు 25 సార్లు భూమి కంపించింది...ఈ ఏడాది రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 1.8 నుంచి 3.4 లోపు నమోదయ్యింది.
నెల్లూరు : ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భూమి మళ్లీ కంపించింది. ప్రకాశం జిల్లా పామూరు, సీఎస్‌పురం మండలాల్లో, నెల్లూరు జిల్లాలోని వింజమూరు, దుక్కలూరు మండలాల్లో 2 సెకన్ల పాటు కంపించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
నెల్లూరు : జిల్లాలో మళ్లీ భూప్రకంపనలు వచ్చాయి. దుత్తలూరు మండలంలోని పలుగ్రామాల్లో మంగళవారం ఉదయం 9:10 నిమిషాలకు పెద్ద శబ్దంతో భూమి కంపించింది. బోడవారిపల్లి, దుత్తలూరు, నర్రవాడ, లక్ష్మీపురం, కమ్మవారిపాలెం, బండకిండపల్లి తదితర గ్రామాల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించడంతో ఆయా గ్రామాల ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. నెల్లూరు జిల్లాలో గత 3నెలల వ్యవధిలో భూమి కంపించడం ఇది పదోసారి. అయితే కొండ ప్రాంతంలో ఇలాంటి శబ్ధాలు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ : ఉత్తర భారతదేశంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ, పంజాబ్, కాశ్మీర్ లలో స్వల్పంగా భూమి కంపించింది. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. తీవ్ర భయాందోళలనకు గురయ్యారు. రిక్టర్ స్కేల్ పై భూకంప త్రీవత 7.2 గా నమోదు అయింది. తజకిస్తాన్ లో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది.
ఢిల్లీ : ఉత్తర భారతంలో ఇవాళా సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది. శ్రీనగర్, ఢిల్లీ, పంజాబ్ లలో స్వల్పంగా భూ ప్రకంపనాలు చోటుచేసుకున్నాయి. పాకిస్తాన్, ఇస్లామాబాద్, కజకిస్తాన్, ఉత్తర అప్ఘనిస్తాన్ లో కూడా భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదైంది. ఇళ్ల నుంచి జనం భయంతో బయటకు పరుగులు తీశారు.
Don't Miss
