భేటీ

08:53 - November 15, 2017

గుంటూరు : తక్కువ బడ్జెట్‌తో తీసే సినిమాలకు పన్నుల రాయితీ ఇచ్చే అంశాన్ని ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. చిత్ర పరిశ్రమ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. విశాఖపట్నం, అమరావతిని చిత్రపరిశ్రమకు అనుకూల ప్రాంతాలుగా మార్చాలని ప్రతిపాదించింది.

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు.  తక్కువ బడ్జెట్‌ సినిమాకు పన్నుల రాయితీ సహా  పలు అంశాలపై చర్చించారు. విశాఖ, అమరావతిలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు చర్చించారు. హైదరాబాద్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ నిలదొక్కుకునేలా మౌలిక సదుపాయాలు కల్పించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. పరిశ్రమలోని ఎక్కువ మంది సొంత రాష్ట్రం తరలివచ్చేందుకు సముఖత వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి విన్నవిస్తున్న అంశాన్ని సీఎం ప్రస్తావించారు. రాష్ట్రంలో చిత్రపరిశ్రమ వేళ్లూనుకునే బాధ్యత తీసుకున్నాని చంద్రబాబు సినీ ప్రముఖుల దృష్టికి తెచ్చారు. విశాఖపట్నం, గోదావరి జిల్లాల్లో గతంలో పలు తెలుగు, తమిళ సినిమాల చిత్రీకరణ జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. విశాఖలో స్టూడియోలో నిర్మించేందుకు కొందరు ప్రముఖులు ముందుకు రావడం సంతోషమన్నారు. విశాఖ, అమరావతిలో ఎక్కడికి తరలివచ్చినా ఇబ్బందిలేదని చిత్ర పరిశ్రమ ప్రముఖల దృష్టికి తెచ్చారు. ప్రకృతి రమణీ దృశ్యాలకు విశాఖ నెలవైతే... అమరావతి భవిష్యత్‌ నగమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్ర చలన చిత్ర, నాటకరంగాభివృద్ధి సంస్థకు తర్వలోనే పాలకవర్గాన్ని నియమిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 
 

13:19 - November 14, 2017

గుంటూరు : ఏపీ సచివాలయంలో ప్రైవేట్ బోటు ఆపరేటర్లుతో మంత్రి అఖిలప్రియ సమావేశమయ్యారు. ఫెర్రీఘాట్‌ పడవ ప్రమాద ఘటన నేపథ్యంలో పర్యాటక శాఖ ఈ సమావేశం నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ బోటు లైసెన్సులు రద్దు చేస్తూ పర్యాటక శాఖ నిర్ణయం తీసుకుంది. కమిటీ సూచన మేరకు కొత్తగా లైసెన్సులు జారీ చేస్తామని ప్రకటించింది. ప్రమాదాల నివారణకు కఠిన చట్టాలు అమలు చేస్తామని పర్యాటక శాఖ చెబుతోంది. 

 

21:46 - November 13, 2017
21:36 - November 8, 2017
22:05 - November 7, 2017

ఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో.. మాజీ ఎంపీ విజయశాంతి భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున ప్రచారం చేస్తానని విజయశాంతి రాహుల్‌కు చెప్పారు. టీఆర్‌ఎస్‌ ఓటమి.. కాంగ్రెస్‌ గెలుపు కోసం గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తానని రాహుల్‌కు చెప్పినట్లు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌ కుంతియా తెలిపారు. ఈ సమావేశంలో విజయశాంతితో పాటు.. కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. 

 

18:56 - November 1, 2017

గగుంటూరు : అమరావతిలో ఏపీ క్యాబినేట్‌ సమావేశం 3 గంటలుగా కొనసాగుతోంది. ఈ భేటీలో పోలవరం నిర్మాణం, అసెంబ్లీ సమావేశాలు, కొత్త పోస్టుల మంజూరు, బాబు విదేశీ పర్యటన వివరాలు, వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల తేదీలపై ఈ మీటింగ్‌లో క్లారిటీ రానుంది.

14:37 - November 1, 2017
15:43 - October 27, 2017

హైదరాబాద్ : చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతల భేటీ ముగిసింది. రేపు మరోసారి విజయవాడలో సమావేశం కావాలని నిర్ణయించారు. రేపు ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. టీ టీడీపీ నేతలంతా ఈ భేటీకి హాజరుకావాలని చంద్రబాబు ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఇప్పుడే ఎవరూ మాట్లాడొద్దన్నారు. రేవంత్‌రెడ్డి పరిణామాలను రమణ చంద్రబాబు దృష్టికి తెచ్చారు. రేవంత్‌ వ్యవహారాన్ని త్వరగా తేల్చాలని మోత్కుపల్లి నర్సింహులు పట్టుబట్టారు. మోత్కుపల్లి నర్సింహులను బాబు వారించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

14:56 - October 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌పై చర్చించేందుకు సమావేశమైన బీఏసీ భేటీ ముగిసింది. 50 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని...శని, ఆదివారాలు సెలవులుగా ప్రకటించింది. రేపు మరోసారి బీఏసీ సమావేశమై..అజెండా, పనిదినాలపై స్పష్టత ఇవ్వనుంది. అయితే 50 రోజులపాటు సమావేశాలు నడుపుదామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేయగా.. మరో నెలరోజులు పొడిగిస్తే బడ్జెట్‌ సమావేశాలూ పూర్తవుతాయని జానారెడ్డి ఎద్దేవా చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

07:42 - October 23, 2017

హైదరాబాద్ : ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ స‌మావేశాల్లో వ్యవహారించాల్సిన వ్యూహాలపై చ‌ర్చించేందుకు ఇవాళ తెలంగాణ మంత్రి వ‌ర్గం భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశమై ప్రతిపక్షాలను ఎదుర్కొనే వ్యూహాలపై సభ్యులకు సూచనలు, సలహాలు చేయనున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ సభ్యులతో ఓ దఫా భేటీ అయిన సీఎం.. ఏ ఏ అంశాలు స‌భ‌ముందుంచాల‌నే అంశంపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో టి-మాస్ ఫోరం, వామపక్షాల యాత్రలు.. మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేపథ్యంలో.. సమావేశంలో ఆచితూచి మాట్లాడాలని సభ్యులకు నిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ వేదిక ద్వారా త‌మ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై మంత్రులు స్పష్టమైన ప్రకటనలు చేయాలని నిర్ణయించారు.

వ్యవసాయంతో ఉపాధి హామీ పనుల అనుసంధానం
పలు కీలక బిల్లులు కూడా ఈ సమావేశాల్లో ఆమోదించుకోవాల‌ని టీఆర్‌ఎస్‌ చూస్తోంది. ఇప్పటికే సభ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన పలు బిల్లులకు సంబంధించి..తిరిగి సభలో చర్చించాలనుకుంటున్నారు. వీటిలో ప్రధానంగా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు, హైకోర్టు విభజన, ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్ల పెంపు, సింగరేణి ఉద్యోగులకు ఆదాయపన్ను మినహాయింపు, వ్యవసాయంతో ఉపాధి హామీ పనుల అనుసంధానం, తెలంగాణలో ఎయిమ్స్ స్థాపనతోపాటు ఇతర అంశాలు ఉన్నాయి. సభా సమరంలో పై చేయి అధికార పార్టీదా, లేక విపక్షాలదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - భేటీ