మంజూరు

22:03 - May 9, 2018

జార్ఖండ్ : దాణా స్కాం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కోర్టు 5 రోజుల పెరోల్‌ మంజూరు చేసింది.  మే 12న తన కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ వివాహాని హాజరయ్యేందుకని 5 రోజుల పెరోల్ మంజూరు చేయాలని లాలు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పెళ్లికి హాజరయ్యేందుకు లాలూకు పెరోల్‌ ఇచ్చినట్లు న్యాయస్థానం వెల్లడించింది. దీంతో లాలు 5 రోజుల పెరోల్‌పై జైలు నుంచి బయటకు రానున్నారు. బిహార్‌కు చెందిన మంత్రి చంద్రిక రాయ్‌ కుమార్తె ఐశ్వర్య రాయ్‌ను తేజ్‌ ప్రతాప్‌ పెళ్లాడబోతున్నారు. ఇటీవల వీరిద్దరి నిశ్చితార్థ  వేడుకకు లాలూ హాజరుకాలేకపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లాలూ ప్రస్తుతం ఝార్ఖండ్‌ రాజధాని రాంచిలోని రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

20:56 - December 8, 2017

ఢిల్లీ : పాకిస్తాన్‌ జైలులో మగ్గుతున్న కులభూషణ్‌ జాదవ్‌ను కలిసేందుకు పాక్‌ ప్రభుత్వం ఆయన తల్లికి, భార్యకు వీసా మంజూరు చేసింది. డిసెంబర్‌ 25 క్రిస్టమస్‌ రోజున జాదవ్‌ను భార్య, తల్లి కలిసేందుకు తాము అంగీకరిస్తున్నట్లు పాక్‌ విదేశాంగ కార్యాలయం అధికారిక ప్రతినిధి మహ్మద్‌ ఫైజల్‌ చెప్పారు. ఆ రోజు భారత హైకమిషన్‌కు చెందిన స్టాఫ్‌ మెంబర్‌ కూడా వారితోపాటు ఉండనున్నారని తెలిపారు. పాక్ పర్యటన సందర్భంగా జాదవ్‌ తల్లి, భార్యను ప్రశ్నలతో విసిగించొద్దని భారత విదేశాంగ శాఖ పాకిస్తాన్‌కు విజ్ఞప్తి చేసింది. పాకిస్తాన్‌లో గూఢచర్యం, ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో జాదవ్‌ను ఏప్రిల్‌లో అరెస్టు చేసి ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఇటీవల జాదవ్‌ను కలిసేందుకు ఆయన భార్యకు తల్లికి అవకాశం ఇవ్వాలని భారత్‌ పాకిస్తాన్‌ను కోరింది. 

 

10:58 - November 30, 2017

గుంటూరు : రైల్వే గేట్స్, క్రాసింగ్ ల వద్ద రద్దీని బట్టి ఆర్ వోబీల కోసం కమిటీ నివేదిక ఇస్తే ఆర్ వోబీ నిర్మాణం కోసం ప్రతిపాదనలు తయారు చేయడం జరుగుతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు అన్నారు. బ్రిడ్జీ నిర్మాణాకికి అయ్యే ఖర్చులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 50 శాతం కేంద్రప్రభుత్వం నిధులతో పూర్తి చేయాల్సివుంటుందని తెలిపారు. భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని చెప్పారు. రాష్ట్రంలో 122 ఆర్ వోబీలు మంజూరు అయ్యాయని అన్నారు. వీటిలో 58 ఆర్ వోబీలను పూర్తి చేశామని తెలిపారు. 21 ఆర్ వోబీలు పని పురోగతిలో ఉన్నాయని... 43 ఆర్ వోబీలు అలైన్  మెంట్, డిజైన్లు, ఎస్టిమేట్స్ దశలో ఉన్నాయని తెలిపారు. అలైన్ మెంట్, డిజైన్లు, ఎస్టిమేట్స్ పూర్తి అయిన తర్వాత కేంద్రప్రభుత్వ రైల్వే బోర్టుకు పంపించాల్పిన అవసరముందన్నారు.  21 ఆర్ వోబీలను త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. 
 

 

19:16 - November 13, 2017

హైదరాబాద్ : ఎస్సీ కార్పొరేషన్‌ కింద లబ్దిదారుల్ని ఎంపిక చేసినా వారికి నిధులు ఎందుకు కేటాయించలేదని అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందుకు మంత్రి జగదీశ్వరరెడ్డి సమాధానం చెప్పారు. గడిచిన రెండు సంవత్సరాల్లో 77 వేల 114మంది ఎస్సీ యువకులని లబ్దిదారులగా ఎంపిక చేయడమే కాకుండా వారికి 774 కోట్ల 76 లక్షల నిధులు ప్రభుత్వం తరపున మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. 

 

19:27 - October 30, 2017

విజయవాడ : టీడీపీ ప్రభుత్వం అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేయడంలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబురావు ఆరోపించారు. ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు ప్రజలను మోసం చేయడానికి పూనుకున్నారన్నారు. ఇళ్ల మంజూరు విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని, వెంటనే దీనిపై సీఎం దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. 
 

18:16 - August 19, 2017

హైదరాబాద్ : కాల్పుల కేసులో యువజన కాంగ్రెస్‌ నేత విక్రమ్‌గౌడ్‌కు బెయిల్‌ మంజూరైంది. నాంపల్లి కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రతీ ఆదివారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. విక్రమ్‌గౌడ్‌ను ఈనెల 3న కాల్పుల కేసు ఘటనలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోర్టులో హజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో బెయిల్‌ కోసం విక్రమ్‌గౌడ్‌ పిటిషన్‌ వేయగా.. నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

 

18:59 - August 2, 2017

కరీంనగర్ : నేరెళ్ల బాధితులకు కరీంనగర్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కాసేపట్లో 8 మంది నిందితులు బయటకు రానున్నారు. 22 రోజుల పాటు శిక్ష అనుభవించిన నిందితులకు.. కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేయడంతో.. ఇవాళ విడుదలవుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:48 - February 23, 2017

తిరుపతి : హిందూ ధర్మ ప్రచారం పేరుతో ఓ ప్రైవేటు సంస్థకు ఏటా టిటిడి కోట్లాది నిధుల్ని మంజూరు చేయడం అన్యాయమన్నారు సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.  టిటిడికి సొంతంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్‌  ఉండగా..ప్రైవేటు సంస్థకు హిందూధర్మం పేరుతో నిధులు ఎలా కేటాయిస్తారని తిరుపతిలో ప్రశ్నించారు. 

 

21:31 - January 11, 2017

నిర్మల్ : సదర్ మట్ ప్రాజెక్టు నిర్మాణానికి 516 కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని రాష్ట్ర మంత్రి హరీష్‌రావు తెలిపారు. సదర్ మట్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల 26 గ్రామాలకు తాగునీరు..17 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్ ఎన్నికల హమీలను నెరవేర్చుతూ ఇచ్చిన మాట నిలెబట్టుకుంటున్నాడని హరీష్‌రావు కొనియాడారు. ఖానాపూర్ మండల కేంద్రోలని వ్యవసాయ మార్కెట్ గోదాంను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.

17:32 - November 8, 2016

గుంటూరు : మెడికో సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిందితురాలైన ప్రొ.లక్ష్మికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదించారు. బెయిల్ పిటిషన్‌పై గుంటూరు జిల్లా కోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రేపటికి వాయిదావేశారు.

Pages

Don't Miss

Subscribe to RSS - మంజూరు