మంటలు

13:55 - June 23, 2017

వికారాబాద్ : శంషాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డుపై అంబులెన్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే అంబులెన్స్‌ను మంటలు చుట్టుముట్టాయి. హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి అంబులెన్స్‌లో మృతదేహం తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అంబులెన్స్‌లో మంటలు చెలరేగడంతో మృతదేహం సగానికి పైగా కాలిపోయింది. అయితే డ్రైవర్‌ అప్రమత్తతో.. అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న వారు వాహనం నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. కొత్వాల్‌ గూడ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. 

18:22 - June 21, 2017

మల్కాజ్‌గిరి : ఘట్‌కేసర్‌లో ప్రమాదం జరిగింది. డీజిల్‌ ట్యాంకర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అవి భారీగా ఎగసిపడ్డాయి. టెర్మినల్‌ ముందే ప్రమాదం జరగడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 

09:24 - June 14, 2017

రంగారెడ్డి : జిల్లా శంషాబాద్ లోని అనుమప లాడ్జిలో తెల్లవారుజామున 5గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఎనిమిది అంతస్తుల భవనంలో మొదటి రెండంతస్తుల్లో మంటలు చెలరేగాయి. లాడ్జిలో సమారు 50 మంది చిక్కుకున్నట్టు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలార్పుతున్నారు. దాదాపు మంటుల అదుపులోకి వచ్చాయని, లాడ్జి వెనక నిచ్చెన వేసి మందిని బయటకు పంపిస్తున్నారు. శంషాబాద్ నుంచి ఎయిర్ పోర్ట్ వెళ్లె దారిలో ఈ లాడ్జి ఉంది. స్టోర్ రూంలో షాట్ సర్క్యూట్ జగడంతో మంటలు అంటుకునట్టు తెలుస్తోంది. మొత్తనికి పెద్ద ప్రమాదం దప్పింది. 5గంటల నుంచి 7 గంటల వరకు మంటలు కొనసాగాయి. ఈ ప్రమాదంలో భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. 

10:33 - June 6, 2017

నిజామాబాద్‌ : జిల్లా నవీపేట మండలం సిరంపల్లిలో ట్రాక్టర్‌ బోల్తా పడి, మంటలు చెలరేగిన ఘటనలో డ్రైవర్‌ ఆంజనేయులు సజీవదహనమయ్యాడు. మలుపు వద్ద ట్రాక్టర్‌ అదుపుతప్పి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. సిరంపల్లి గ్రామంలో వ్యవసపాయ ఉపకరణాలు దింపి తిరిగివస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

16:28 - June 5, 2017

చిత్తూరు : తిరుమల అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ధర్మగిరి వేద పాఠశాల సమీపంలోని అటవీ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది..మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

18:50 - May 23, 2017

కడప : మండిబజారులో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో సజీవదహనమైంది. కటిక వీధిలోని ఓ ఇంటిపై నివాసం ఉంటున్న ఫరీదా బేగం మంటల్లో కాలిపోగా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలకు ఇంటి పైకప్పు ధ్వంసమైంది. ఫరీదాకు 7 నెలల క్రితమే పెళ్లైనట్లు తెలుస్తోంది. బయట నుంచి వచ్చి స్విచ్ వేయగానే షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిందని ఆమె భర్త చెబుతున్నాడు. అయితే ఫరీదా మంటల్లో సజీవ దహనం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

16:37 - May 19, 2017

భద్రాద్రి : మంటలు అంటుకొని స్కూటర్‌ దగ్ధమైంది.. కృష్ణా జిల్లా బండిపాలెంకు చెందిన దంపతులు వివాహంకోసం భద్రాద్రి జిల్లా పాల్వంచకు వస్తున్నారు.. జూలూరుపాడు వచ్చాక ఎండ వేడికి స్కూటర్‌కు మంటలు అంటుకున్నాయి.. ఈ విషయం గమనించిన దంపతులు బండి దిగారు.. అంతలోనే మంటలు వేగంగా వ్యాపించి స్కూటర్‌ డిక్కీలోఉన్న 6వేల రూపాయలు కాలిబూడిదయ్యాయి.. 

16:35 - May 19, 2017

కర్నూలు : జిల్లాలోన ఓ కారులో మంటలు అంటుకున్నాయి.. నందనవనం దగ్గర ఎండవేడికి కారులో మంటలు చెలరేగాయి. మంటల్ని గమనించిన ప్రయాణికులు వెంటనే కారులో నుంచి కిందకు దిగారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది కారులో మంటల్ని అర్పేశారు. అప్పటికే కారు కాలిబూడిదైంది. ప్రయాణికులు మంత్రాలయం నుంచి ఎమ్మిగనూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 

10:16 - May 13, 2017

హైదరాబాద్‌ : నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుల్తాన్‌షాహీలోని ఇంజినీరింగ్‌ వర్క్‌షాప్‌లో మంటలు భారీగా చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్‌ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని పోలీసులు చెబుతున్నారు. అగ్నిప్రమాదం కారణంగా అఫ్జల్‌గంజ్‌లో ట్రాఫిక్‌ జాం అయ్యింది. పోలీసులు వాహనాలను ఇతర రూట్లలో మళ్లిస్తూ ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు. 

18:51 - May 1, 2017

కృష్ణా : జిల్లాలోని ఇబ్రహీంపట్నం నిమ్రా ఇంజనీరింగ్‌ కాలేజీ సమీపంలోని ఇండిక్యాష్‌ ఏటీఎం లో మంటలంటుకున్నాయి.. మంటలు చెలరేగి పొగలు రావడంతో స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.. ఫైరింజన్‌ సహాయంతో సిబ్బంది మంటలు ఆర్పేశారు..

Pages

Don't Miss

Subscribe to RSS - మంటలు