మంత్రివర్గ ఉపసంఘం

21:08 - July 11, 2018

హైదరాబాద్ : పంచాయితీల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో రిజర్వేషన్లు 50 శాతం క‌న్నా మించ‌వ‌ద్దని ఇటీవ‌ల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన భేటీ అయిన మంత్రివ‌ర్గ ఉప సంఘం కూలంకుశంగా చ‌ర్చించింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీసీ రిజ‌ర్వేష‌న్లను 34 శాతం క‌న్నా త‌గ్గకుండా చూడాల‌ని మంత్రుల సబ్ కమిటీ తీర్మానించింది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును యాథాతథంగా అమలు చేయాలని కోరేందుకు సిద్ధమవుతున్నారు. ఇక అగస్టు ఒకటితో పంచాయితీల కాలపరిమితి ముగుస్తుండటంతో స్పెషల్ అఫీసర్లను వేసే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని మంత్రి వర్గఉప సంఘం అభిప్రాయపడింది.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీసీ రిజ‌ర్వేష‌న్లను 34 శాతం క‌న్నా త‌గ్గకుండా చూడాల‌ని మంత్రుల సబ్‌ కమిటీ తీర్మానించింది. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో రిజర్వేషన్లు 50 శాతం క‌న్నా మించ‌వ‌ద్దని ఇటీవ‌ల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన సెక్రటేరియట్‌లో భేటీ అయిన మంత్రివ‌ర్గ ఉప సంఘం కూలంకుశంగా చ‌ర్చించింది.

ఈ నెలాఖ‌రుతో పాల‌క‌వ‌ర్గాల ప‌ద‌వీకాలం ముగియ‌నున్న నేప‌థ్యంలో ఈలోపు ఎన్నిక‌లు నిర్వహించ‌లేని ప‌రిస్థితుల్లో తీసుకోవాల్సిన చ‌ర్యల‌పై కూడా సబ్‌కమిటీ చ‌ర్చించింది. గ‌త‌ పంచాయ‌తీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా 61 శాతం రిజ‌ర్వేష‌న్లను క‌ల్పించుకునే వెసులుబాటు సుప్రీంకోర్టు ఇచ్చింద‌ని...ఈ సారి కూడా 50 శాతం రిజ‌ర్వేష‌న్లను మించ‌కూడదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాల‌ని నిర్ణయించిన‌ట్లు మంత్రి ఈటల రాజేంద‌ర్ తెలిపారు. బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను రానున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకుండా చూడ‌టానికి సుప్రీం కోర్టును ఆశ్రయించాల‌ని నిర్ణయించిన‌ట్లు ఈటల తెలిపారు.

జూలై 31 తో సర్పంచ్‌ల పదవీకాలం ముగుస్తుంద‌ని...ఆ తర్వాత స్పెషల్ ఆఫీసర్లకు బాధ్యత‌లు అప్పగించాలా లేక పాల‌క‌వ‌ర్గం పదవీకాలం పొడిగించాలా అన్నదానిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. దీనితో పాటు బీసీ గ‌ణ‌న విష‌యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాల‌న్నది కూడా కేబినెట్లో చ‌ర్చించి నిర్ణయం తీసుకుంటామ‌ని తెలిపారు. రిజర్వేషన్ అంశంపై రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామ‌ని, దీనిపై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేయాల‌ని స‌బ్ క‌మిటీ నిర్ణయించిన‌ట్లు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తెలిపారు.

ఇక బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం సుప్రీం కోర్టులో తమ వాదనలు గట్టిగా వినిపించాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్టయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 50 శాతం రిజర్వేషన్లనేవి విద్యా, ఉద్యోగాలపై మాత్రమేనని.. రాజకీయాలకు సంబంధం లేదని ప్రభుత్వం అంటోంది. ఇక తమిళనాడు 69 శాతం ఉన్నపుడు ఒక్కో రాష్ట్రంలో ఒక్కక్క విధంగా ఎందుకు ఉండాలనే వాదనను సుప్రీం కోర్టులో వినిపిస్తామని చేప్తోంది.

14:59 - June 10, 2018

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. నిన్న జరిగిన చర్చలలో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో.. మరోసారి కార్మిక సంఘాల నేతలు మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వం నుంచి సరైన నిర్ణయం రాకపోతే సమ్మె చేస్తామని కార్మిక సంఘ నేతలంటున్నారు. ప్రభుత్వం నిర్ణయంపై కార్మిక సంఘాల సమ్మె నిర్ణయం ఆధారపడి ఉంది. నిన్న అర్ధరాత్రి వరకు కేబినెట్‌ సబ్‌కమిటీతో ఆర్టీసీ కార్మిక సంఘాలు చర్చలు జరిపారు. ప్రభుత్వం వేతనాల పెంపుపై ఎటూ తేల్చలేదు. కార్మిక సంఘాల ప్రతిపాదనలను మంత్రులు కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇవాళ మరోసారి మంత్రివర్గ ఉపసంఘం కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరుపుతున్నారు. 25% ఐఆర్‌ ఇస్తే రూ.900 కోట్లు భారమని మంత్రులు అంటున్నారు. ఆర్టీసీపై పన్నులు ఎత్తివేస్తే పన్నుల నుంచి గట్టెక్కుతామని టీఎంయూ నేతలు అంటున్నారు. పన్నుల రద్దుపై మంత్రులు స్పందించలేదు. మ.ఒంటిగంట వరకు ప్రభుత్వానికి టీఎంయూ డెడ్‌లైన్‌ విధించింది. ఇవాళ ప్రభుత్వం ఇచ్చే క్లారిటీ ప్రకారం సమ్మెపై నిర్ణయం ప్రకటిస్తామని కార్మిక సంఘాలు
అంటున్నాయి. 

06:34 - May 14, 2018

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, వారి ఇబ్బందులన్నీ విన్నామని... రెండు రోజుల్లో వారి సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘం టీఎమ్‌యూ నేతలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపింది. ఈ చర్చలకు మంత్రివర్గ ఉపసంఘంతో పాటు ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ హాజరయ్యారు. ఇక గుర్తింపు సంఘం టీఎమ్‌యూ తరుపున అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డితో పాటు 21 మంది సభ్యులు చర్చల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మిక వేతన సవరణపై ఎందుకు జాప్యం చేస్తున్నారని కార్మిక సంఘం సభ్యులు మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రశ్నించారు. సమ్మె నోటీసు ఇచ్చే వరకు తాత్సారం చేయడం సరికాదని కార్మిక సంఘం స్పష్టం చేసింది.

 

15:41 - March 4, 2017

హైదరాబాద్ : గృహనిర్మాణశాఖ మంత్రివర్గ ఉపసంఘంపై తాను చేసిన అవినీతి ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని తెలంగాణ వర్కింగ్ ప్రెసెడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈటల రాజేందర్ రెడ్డి శాఖ అయిన సివిల్ సప్లయ్ లో భారీగా అవినీతి జరిగిందని ఆ శాఖ అధికారి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని తెలిపారు. దీంతో ఆ శాఖ నుంచి ఈటలను తీసివేసే పరిస్థితులు వచ్చాయని రేవంత్ తెలిపారు. అలాంటి ఈటల చంద్రబాబు, టీడీపీ నేతల గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు.  

 

Don't Miss

Subscribe to RSS - మంత్రివర్గ ఉపసంఘం