మంత్రి ఈటెల రాజేంద్ర

12:42 - March 31, 2017

ఢిల్లీ : కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతామన్నారు తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్‌. జీఎస్టీ అమలుకంటే ముందే తెలంగాణకు రావాల్సిన సీఎస్టీని అమలు చేయాలని, వెనకబడిన 4 జిల్లాల అభివృద్ధి కోసం గతంలో ఇస్తామని చెప్పిన 450 కోట్లు ఇవ్వాలని కేంద్రమంత్రులను కోరుతామని చెప్పారు ఈటెల.

 

10:10 - March 14, 2017

హైదరాబాద్: ప్రతి ఇంటికి సురక్షిత నీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన మిషన్‌ భగీరథ పథకానికి మూడు వేల కోట్లు కేటాయించారు. బడ్జెట్‌ యేతర నిధులతో పూర్తి చేస్తున్న ఈ పథకానికి ... బడ్జెట్‌ సపోర్ట్‌ కింద మూడు వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. పథకం అనుకున్న వేగంతో పూర్తవుతుందని.. డిసెంబర్‌ కల్లా అన్ని గ్రామాల ప్రజలకు నీరందేలా కార్యాచరణ అమలవుతుందని ఈటల తెలిపారు.

పూర్తైన 1,426 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు...

పేదలకు నీడ కల్పించాలన్న గొప్ప లక్ష్యంతో మొదలు పెట్టిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి బడ్జటేతర వనరుల నుంచి నిధుల సమీకరణ జరుగుతుందని ఈటల రాజేందర్‌ చెప్పారు. ఇప్పటికే వేయి 426 గృహాలు పూర్తయ్యాయని ఆయన అన్నారు. ఇంకా 16 వేల 60 ఇళ్ల నిర్మాణం పూర్తి కావల్సి ఉందని... వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం వేగం పుంజుకునే అవకాశం ఉందని మంత్రి అన్నారు. వివిధ పథకాల నిర్మాణంతో ప్రజల అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. అయితే మిషన్ భగీరథకు 3వేల కోట్ల కేటాయింపులపై విపక్షాలు విమర్శలు గుప్పించారు. పథకానికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

18:12 - January 11, 2017

కరీంనగర్‌ : జిల్లాలో జాతీయస్థాయి ఫెన్సింగ్‌ పోటీలకు వేదికైంది. కరీంనగర్‌లోని ఆల్ఫోర్స్ కాలేజీలో ఈ పోటీలను ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. ఈ పోటీల్లో 15 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడలకు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నామని మంత్రి ఈటల అన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

Don't Miss

Subscribe to RSS - మంత్రి ఈటెల రాజేంద్ర