మణిపూర్

21:02 - May 17, 2018

ఢిల్లీ : కర్ణాటక గవర్నర్‌ తీసుకున్న నిర్ణయంతో గోవా, బిహార్‌లో ప్రభుత్వ ఏర్పాటు అంశాలను కాంగ్రెస్‌, ఆర్జేడి తెరపైకి తెచ్చాయి. గోవా, బిహార్‌లలో అతిపెద్ద పార్టీగా నిలిచిన తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌, ఆర్జేడి డిమాండ్‌ చేశాయి. దీనిపై తాము రేపు గవర్నర్‌ను కలిసి డిమాండ్‌ చేస్తామని ఆర్జేడి నేత తేజస్వి యాదవ్‌ తెలిపారు. 81 స్థానాలతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్‌ 17 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం నాలుగు స్థానాల దూరంలో నిలిచింది. 14 స్థానాలు గెలిచిన బిజెపి జిఎఫ్‌పి, ఎంజిపి, ముగ్గురు ఇండిపెండెంట్ల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గోవా గవర్నర్ మృదుల సిన్హా కూడా కర్ణాటక గవర్నర్ బాటలోనే నడవాలని గోవా కాంగ్రెస్ చీఫ్‌ చంద్రకాంత్ కవ్లేకర్ అన్నారు. మణిపూర్‌, మేఘాలయలో కూడా ఇదే పద్ధతి అనుసరించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

15:40 - December 27, 2017

హైదరాబాద్ : ఓయూలో నిర్వహించాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను మణిపూర్ కు తరలించారు. సైన్స్ కాంగ్రెస్ నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా 7 యూనిర్శిటీలు పోటీ పడుతున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

14:38 - May 29, 2017

ఇంఫాల్ : మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ కుమారుడు అజయ్ మీతాయికి ట్రయల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 2011లో రోడ్డు రేసు కేసులో కోర్టు ఆయనకు ఈ శిక్ష విధించింది. అజయ్ వాహనాన్ని తన కారతో ఓవర్ టేక్ చేసిన ఇరోమ్ రోజర్ ను గన్ తో అజయ్ మీతాయి కాల్చేశాడు. 

16:55 - March 20, 2017

హైదరాబాద్: మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ విశ్వాసపరీక్షలో నెగ్గారు. 60 మంది శాసనసభ్యులున్న మణిపూర్‌ అసెంబ్లీలో ముఖ్యమంత్రికి 32 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. మణిపూర్‌ ఎన్నికల్లో 28 స్థానాలు గెలిచి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బిజెపికి కేవలం 21 స్థానాలు మాత్రమే వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్‌ ఫిగర్‌ 31. ఈ నెల 15న మణిపూర్‌ ముఖ్యమంత్రిగా బీరేన్‌సింగ్‌, డిప్యూటి సిఎంగా ఎన్‌పిపికి చెందిన జయకుమార్‌ సింగ్‌ ప్రమాణం చేశారు. పీపుల్స్‌ ఫ్రంట్‌కు చెందిన నలుగురు, ఎన్‌పిపికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, లోక్‌ జనశక్తి ఎమ్మెల్యేల మద్దతుతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలని కాంగ్రెస్‌ చేసిన విజ్ఞప్తిని గవర్నర్‌ నజ్మాహెప్తుల్లా తోసిపుచ్చారు. మణిపూర్‌లో తొలిసారిగా బిజెపి అధికారంలోకి వచ్చింది.

19:32 - March 17, 2017

ఢిల్లీ : గోవాలో బిజెపి ప్రభుత్వ ఏర్పాటును నిరసిస్తూ రాజ్యసభలో కాంగ్రెస్‌ చర్చకు పట్టుబట్టింది. అతిపెద్ద పార్టీగా అవతరించిన పార్టీకి కాకుండా బిజెపిని అనుమతించలేమని స్వయంగా గవర్నర్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న విషయాన్ని కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ గుర్తు చేశారు. అలాంటిది కేంద్ర మంత్రికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ ఎలా అనుమతిస్తారని ఆజాద్‌ ప్రశ్నించారు. ఈ అంశంపై చర్చించాలని కాంగ్రెస్‌ కోరగా... ముందు నోటీస్‌ ఇవ్వాలని అనంతరం నిర్ణయం తీసుకుంటామని రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ కురియన్‌ అన్నారు. దీనిపై కాంగ్రెస్‌ సభ్యులు నిరసనకు దిగడంతో గందరగోళం మధ్య సభను కురియన్ 12 గంటలకు వాయిదా వేశారు.

12:30 - March 16, 2017

ఢిల్లీ : గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలపై కూడా దృష్టి సారించింది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఎంపిక చేసేందుకు మల్లగుల్లాలు పడుతోంది. అందులో భాగంగా కేంద్రమంత్రివర్గం గురువారం సమావేశమైంది. కాసేపటి క్రితం ఈ సమావేశం ముగిసింది. ప్రధాని మోడీ, ఎల్ కే అద్వానీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల కీలక ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. యూపీ, ఉత్తరాఖండ్ లో అనుసరించాల్సిన వ్యూహం..ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు.

06:43 - March 16, 2017

ఢిల్లీ : మణిపూర్‌ నూతన ముఖ్యమంత్రిగా బిజెపికి చెందిన బీరేన్‌ సింగ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ నజ్మా హెప్తుల్లా బీరేన్‌సింగ్‌తో ప్రమాణం చేయించారు. డిప్యూటి సిఎంగా ఎన్‌పిపికి చెందిన వై.జయ్‌ కుమార్‌ సింగ్‌తో పాటు ఏడుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్‌లో తొలిసారిగా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్‌లో కాంగ్రెస్‌ 28 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. బిజెపి 21 స్థానాల్లో గెలిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్‌ ఫిగర్‌ 31. పీపుల్స్‌ ఫ్రంట్‌కు చెందిన నలుగురు, ఎన్‌పిపికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, లోక్‌ జనశక్తి ఎమ్మెల్యేతో కలిపి 31 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బిజెపి గవర్నర్‌కు జాబితాను అందజేసింది. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలని కాంగ్రెస్‌ చేసిన విజ్ఞప్తిని గవర్నర్‌ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.

18:17 - March 14, 2017

మణిపూర్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలని బీజేపీకి గవర్నర్ నజ్మా హెప్తుల్లా ఆహ్వానం పలికారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా బీరేన్ సింగ్ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈయన రేపు ఇంఫాల్ లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ సూచన మేరకు ముఖ్యమంత్రి పదవికి ఇబోబిసింగ్ రాజీనామా చేశారు. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ 28 స్థానాలు, బీజేపీ 21 స్థానాలు, ఇతర పార్టీలు 11 స్థానాల్లో విజయం సాధించాయి. పీపుల్స్ ఫ్రంట్ కు చెందిన నలుగురు, ఎన్సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు లోక్ జనశక్తి ఎమ్మెల్యే మద్దతు పలుకుతున్నారని, మ్యాజిక్ ఫిగర్ 31 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్ కు ఇదివరకే బీజేపీ తెలియచేసింది. అతి పెద్ద పార్టీగా ఉన్న తమకు ప్రభుత్వ ఏర్పాటు చేసే విధంగా ఆహ్వానించాలని ఇబోబిసింగ్ చేసిన ప్రతిపాదనను గవర్నర్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.

10:06 - March 14, 2017

హైదరాబాద్: గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో అధికారం కోసం కాంగ్రెస్‌, బిజెపిల మధ్య వార్‌ మొదలైంది. గోవాలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం కాగా...మణిపూర్‌లో కూడా తమకే అవకాశం ఇవ్వాలని దూకుడు ప్రదర్శిస్తోంది. రెండు రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకపోవడంపై కాంగ్రెస్‌ మండిపడుతోంది. గోవాలో పారికర్ ప్రమాణ స్వీకారం నిలిపివేయాలంటూ సుప్రీంలో పిటిషన్ వేసింది. మరోవైపు మణిపూర్‌లో గవర్నర్‌ సూచన మేరకు సిఎం పదవికి ఇబోబి సింగ్‌ రాజీనామా చేయనున్నారు. బిజెపి శాసనసభాపక్ష నేతగా బీరేన్‌సింగ్‌ ఎంపికయ్యారు.

కమలనాథులకు అధికార దాహం...

ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో భారీ విజయం దక్కడంతో కమలనాథులకు అధికార దాహం పట్టుకుంది. గోవా, మణిపూర్‌లో తమకు మెజారిటీ దక్కకున్నా అధికారమే లక్ష్యంగా చిన్న చితక పార్టీల సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బిజెపి తహతహలాడుతోంది. ఇప్పటికే గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.

గోవాలో మొత్తం 40 స్థానాలుండగా...

గోవాలో మొత్తం 40 స్థానాలుండగా...17 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మేజిక్‌ ఫిగర్‌కు 4 స్థానాలు మాత్రమే తక్కువగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కేవలం 13 సీట్లనే గెలుచుకున్న బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. మహారాష్ట్ర వాదీ గోమంతక్‌ పార్టీ(ఎంజీపీ), గోవా ఫార్వర్డ్‌ పార్టీ(జీఎఫ్‌పీ), నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ), ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు గవర్నర్‌ మృదులా సిన్హా కాంగ్రెస్‌కు ఆహ్వానించకుండా పారీకర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. గోవా ముఖ్యమంత్రిగా మనోహర్‌ పారికర్‌ మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 15 రోజుల్లోగా అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి పదవికి మనోహర్‌ పారికర్‌ రాజీనామా చేశారు.

మణిపూర్‌లో కూడా ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యత లభించలేదు..

మణిపూర్‌లో కూడా ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యత లభించలేదు. మొత్తం 60 స్థానాలున్న మణిపూర్‌లో అసెంబ్లీలో కాంగ్రెస్‌ 28 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. బిజెపి 21 స్థానాల్లో గెలిచింది. 11 స్థానాలను చిన్నా చితకా పార్టీలు గెలుచుకున్నాయి.తమకు మెజారిటీ లేకపోయినా 31 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశమివ్వాలని బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ గవర్నర్‌ను కోరారు. పీపుల్స్‌ ఫ్రంట్‌కు చెందిన నలుగురు, ఎన్‌పిపికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, లోక్‌ జనశక్తి ఎమ్మెల్యేతో కలిపి మేజిక్‌ ఫిగర్‌ 31 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకుందని బిజెపి గవర్నర్‌కు జాబితాను అందజేసింది.

అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌కు...

మరోవైపు అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలని గవర్నర్‌ నజ్మాహెప్తుల్లాకు ముఖ్యమంత్రి ఇబోబిసింగ్‌ విజ్ఞప్తి చేశారు. ఎన్‌పిపికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమకు మద్దతిస్తున్నారని తెలిపారు. మణిపూర్‌లో గవర్నర్‌ ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమిస్తారన్నది వేచి చూడాలి. గోవా, మణిపూర్‌లో సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది.

21:22 - March 12, 2017

మణిపూర్‌ : ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ వీడడం లేదు. అధికారం కోసం అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ పోటాపోటీగా వ్యూహం రచిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఇబోబిసింగ్‌ అధికారం ఏర్పాటు దిశగా మంతనాలు జరుపుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గవర్నర్‌ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని విజ్ఞప్తి చేయాలని యోచిస్తున్నారు. రేపు ఆయన గవర్నర్‌ను కలిసే అవకాశముంది. మరోవైపు బీజేపీ కూడా అదే ప్రయత్నాలు చేస్తుండడంతో ఎవరికి అధికారం దక్కుతుందన్న ఉత్కంట నెలకొంది.

Pages

Don't Miss

Subscribe to RSS - మణిపూర్