మమ్ముట్టి

15:05 - November 13, 2018

యాంకర్ అనసూయ బుల్లితెరతో పాటు, వెండితెరపై కూడా  సత్తా చాటుతోంది. రంగస్ధలంలో ఆమె చేసిన రంగమ్మత్త పాత్రకి మంచి గుర్తింపు లభించింది. బోలెడన్ని ఆఫర్లు వస్తున్నా, ఏవి పడితే అవి కాకుండా, మంచి క్యారెక్టర్లు అయితేనే చేస్తోంది. సినిమాలు, టీవీలే కాకుండా, సోషల్ మీడియాలోనూ అనసూయ యమ యాక్టివ్‌గా ఉంటుంది. ఇప్పుడామె ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక పిక్, ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపోందుతున్న సినిమా..యాత్ర.. ఆ సినిమా షూటింగ్ స్పాట్‌లో తీసుకున్న ఫోటోని అనసూయ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఫోటోలో ఆమె ముఖం కనబడలేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. యాత్రలో తన క్యారెక్టర్ గురించి యూనిట్ తరపునుండి ఎటువంటి అప్‌డేట్ లేకపోయినా, ఇలా ఫోటో తీసి షేర్ చెయ్యడంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. చీరకట్టులో సాంప్రదాయంగా ఉంది అనసూయ. ఫోటో బ్లాక్ అండ్ వైట్‌లో బాగుంది. ఈ సినిమాలో ఆమె జర్నలిస్ట్ పాత్రలో కనిపించనునందని తెలుస్తుంది. మలయాళ స్టార్ మమ్ముట్టి, వై.ఎస్.గా నటిస్తున్న యాత్ర డిసెంబర్ 21న విడుదల కానుంది..

13:10 - September 14, 2018

బాలీవుడ్..టాలీవుడ్..కోలీవుడ్..ఇలా ఏ వుడ్ అయినా బయోపిక్ ల హావా కొనసాగుతోంది. ఎన్నో చిత్రాలు నిర్మితమై ప్రజాదరణ పొందాయి. కూడా రికార్డులు కూడా సృష్టించాయి. తాజాగా తెలుగులో నాయకుల బయోపిక్ చిత్రాలు నిర్మితమౌతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ‘ఎన్టీఆర్’..వైఎస్ జీవితం ఆధారంగా ‘యాత్ర’ చిత్రాలు రూపొందుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ నటిస్తుండగా వైఎస్ బయోపిక్ లో మమ్ముట్టి నటిస్తున్నాడు. తాజాగా వైఎస్ బయోపిక్ లో మరో హీరో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

జగన్ పాత్రలో ‘విజయ్ దేవరకొండ’ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. మొదట సూర్య...కార్తీ పేర్లు వినిపించాయి. జగన్ పాత్రలో విజయ్ కరెక్టుగా సరిపోతారని..అతను అయితే పాత్రకు న్యాయం జరుగుతుందని చిత్ర యూనిట్ భావిస్తోందంట. దీనికి సంబంధించి విజయ్ తో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరిపిందని టాక్. ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్ రాజకీయ నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ‘నోటా’ మూవీ చేస్తున్నాడు. మరి జగన్ పాత్రలో దేవరకొండ నటిస్తున్నాడా ? లేదా ? అనేది రానున్న రోజుల్లో తేలనుంది. 

13:34 - July 29, 2018
12:04 - January 28, 2017

అవకాశాలు లేక ఖాళీగా ఉన్న హీరోయిన్ 'అంజలి'కి జాక్ పాట్ తగిలింది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతోందనుకున్న 'అంజలి'కి ఇక్కడ అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. ఈ బ్యూటీ తెలుగులో చేసిన సినిమాలు దాదాపు సక్సెస్ లు గా నిలిచాయి. అయిన కూడా ఎందుకో ఈ తెలుగు భామకు మాత్రం విరివిగా అవకాశాలు మాత్రం రాలేదు. గత ఎడాది 'బాలకృష్ణ'కి జోడిగా నటించిన 'డిక్టేటర్' తో పాటు 'సరైనోడు' సినిమాలో 'బన్నీ' తో బ్లాక్ బస్టర్ సాంగ్ లో అలరించింది. ఈ రెండు సినిమాల తరువాత 'అంజలి'కి తెలుగులో మరో అవకాశం రాలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మ చెన్నైకి చెక్కేసింది. కానీ అక్కడ కూడా అంతంత మాత్రంగా వస్తున్న అవకాశాలతో కెరీర్ ని లాగిస్తోంది. అయితే ప్రస్తుతం 'అంజలి'కి మలయాళంలో ఓ గోల్డెన్ ఆఫర్ తగలడం విశేషం.

మమ్ముట్టితో...
తెలుగులో పూర్తిగా ఛాన్స్ లు తగ్గిన 'అంజలి' ఇతర ఇండస్ట్రీస్ పై ఫోకస్ చేస్తోంది. చెన్నయ్ కి మకాం మార్చి, మొదట్లో తనను ఆదరించిన కోలీవుడ్ మీద దృష్టి పెట్టింది. కానీ అక్కడ కూడా 'అంజలి'కి అరకొర అవకాశాలే వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో తాజాగా ఈ ముద్దుగుమ్మకి ఓ భారీ ఆఫర్ వచ్చింది. మలయాళ బిగ్ స్టార్ 'మమ్ముట్టి'తో నటించే గోల్డెన్ చాన్స్ 'అంజలి'ని వరించింది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహిత రామ్ దర్శకత్వం వహిస్తుండడం మరో విశేషం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరి తమిళం, తెలుగులో అవకాశాలు లేక డల్ అయిన 'అంజలి' కెరీర్ ని మలయాళ ఇండస్ట్రీ అందుకుంటుందో చూడాలి.

09:15 - July 27, 2016

మమ్ముట్టి..మలయాళ సూపర్ స్టార్. త్రిపాత్రాభినయం ఆయనకు కొత్తేమీ కాదు. ఎన్నో చిత్రాల్లో ఆయన ఈ పాత్రలు వేసి ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవలే రంజిత్ దర్శకత్వంలో వచ్చిన 'పాలెరి మణిక్యమ్' సినిమాలో మమ్ముట్టి మూడు పాత్రలు పోషించారు. తాజాగా అన్వర్ రషీద్ దర్శకత్వంలో కూడా త్రిపాత్రాభినయం చేయనున్నారు. గతంలో అన్వర్ తో కలిసి 'రాజమాణిక్యమ్', 'అన్నన్ తంబి' చిత్రాల్లో మమ్ముట్టి హీరోగా నటించారు. ముచ్చటగా మూడోసారి వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందుతోంది. బెన్నీ పి నాయరం బాలమ్ అందించిన కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం మమ్ముట్టి 'వైట్', 'తప్పిల్ జొప్పన్' చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాల అనంతరం ఈ చిత్రం ప్రారంభం కానుందని తెలుస్తోంది. మూడు పాత్రల్లో మమ్ముట్టి ఎలా మెరిపించారో తెలుసుకోవాలంటే ఇంకా కొద్ది రోజులు వేచి ఉండాలి.

11:27 - January 14, 2016

'పులి' ఘోర పరాజయం తర్వాత తమిళ అగ్ర నటుడు విజయ్‌ సినిమాలు చేసే విషయంలో దూకుడు పెంచారు. ఇప్పటికే తన 59వ చిత్రంగా 'థెరి' చిత్రంలో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రం దాదాపు పూర్తి కావచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఉండగానే తదుపరి ప్రాజెక్ట్ (60వ సినిమా)కి సంబంధించిన పనుల్ని విజయ్‌ వేగవంతం చేశారు. మ్యూజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి భరతన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు ఏకధాటిగా జరుగుతున్నాయి. విజయ్‌ 60వ చిత్రానికి సంబంధించి రెగ్యులర్‌ షూటింగ్‌ కార్యక్రమాలు ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి నటించే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉంటే, 'తుపాకి' చిత్రానికి సీక్వెల్‌గా 'తుపాకి2' చిత్రాన్ని విజయ్‌తోనే రూపొందించేందుకు దర్శకుడు ఏ.ఆర్‌.మురుగదాస్‌ రంగం సిద్ధం చేస్తున్నారు. 'తుపాకి2' చిత్రకథను మురుగదాస్‌ ఇప్పటికే విజయ్‌కి నెరేట్‌ చేశారని తెలుస్తోంది. విజయ్‌ సినిమాల్ని అంగీకరిస్తున్న తీరు చూస్తుంటే సూపర్‌డూపర్‌ హిట్‌ కొట్టాలనే కసితో ఉన్నారనిపిస్తోంది.

16:01 - September 22, 2015

ప్రముఖ మలయాళ సినీ నటుడు 'మమ్ముట్టి'ని 'సోప్' కోర్టుకు ఈడ్చడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా ? అవును ఇది నిజం. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఏ వుడ్ లోనైనా సరే ప్రముఖ సినీ తారలు పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనీ ద్వారానే వారు ఎక్కువ సంపాదిస్తున్నారనే విమర్శలున్నాయి. తాజాగా 'మమ్ముట్టి' ఓ యాడ్ లో నటించి కష్టాల్లో పడ్డారు. తెల్లని ముఖం కోసం 'ఇందులేఖ' వైట్ సోప్ వాడండి..అంటూ ఆ కంపెకి తరపున 'మమ్ముట్టి' ప్రచారకర్తగా వ్యవహరించాడు. ఈ సోప్ ను కేరళకు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. కానీ ఎంతకూ ప్రయోజనం లేకపోవడంతో అతనికి ఆగ్రహం కలిగించింది. వెంటనే సదరు కంపెనీపై..హీరో 'మమ్ముట్టి'పై కేసు వేశాడు. తమకు నోటీసులు అందలేదని కొంత సమయం కావాలని 'మమ్ముట్టి' తరపు లాయర్ కోరడంతో విచారణ అక్టోబర్ 12కి వాయిదా పడింది. ఈ యాడ్ విషయంలోనైనా ఇతర నటులు జాగ్రత్త పడుతారా చూడాలి.

Don't Miss

Subscribe to RSS - మమ్ముట్టి