మరణ శిక్ష

16:07 - July 11, 2018

నిర్భయ కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు మరణ శిక్ష విధించింది. కింద కోర్టు విధించిన తీర్పును సుప్రీంకోర్టు ఖరారు చేసింది. రివ్యూ పిటిషన్ ను కొట్టివేస్తూ తుది తీర్పును వెలువరించడం పట్ల హర్షాతిరేకలు వ్యక్తమౌతున్నాయి. నిర్భయ ఘటన అనంతరం దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు...ఆందోళనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. 2012 సంవత్సరంలో జరిగిన ఈ ఘటనపై 2018 జూలైలో సుప్రీం తీర్పును వెలువరించింది. ఈ అంశంపై న్యాయ సమస్యలు..సందేహాలను మానవి ' మై రైట్ ' కార్యక్రమంలో లాయర్ పార్వతి నివృత్తి చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:09 - May 18, 2017

హైదరాబాద్: మాజీ నేవీ అధికారి కుల్‌ భూషణ్‌ జాదవ్‌ కు పాకిస్థాన్ ఆర్మీ కోర్టు విధించిన మరణ శిక్షణ ను అంతర్జాతీయ న్యాయస్థానంలో స్టే విధించింది. అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానంలో ఈ రోజు మధ్యంతర తీర్పు వెలువ‌డింది. 'ది హేగ్' ‌నగరంలోని అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానంలో ఈ తీర్పును 11 మంది న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం వెల్ల‌డించింది. కుల్‌భూష‌ణ్ జాద‌వ్ కేసు అంశంపై పాకిస్థాన్ చేస్తోన్న వాదనలు సరికావని అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడు రోన్నే అన్నారు. వియన్నా ఒప్పందం ప్రకారం కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌ను క‌లిసే హ‌క్కు భార‌త్‌కు ఉంద‌ని తెలిపారు. వియన్నా ఒప్పందంపై భారత్, పాకిస్థాన్ భాగస్వాములని ఆయన గుర్తు చేశారు. ఈ కేసు అంతర్జాతీయ న్యాయస్థానం పరిధిలోకి రాదన్న పాకిస్థాన్ వాదనను తాము తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ లో జాదవ్ ను కలుసుకునేందుకు భారత దౌత్య అధికారులకు అనుమతి ఇవ్వాలని తెలిపారు. తమ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని చెప్పారు.

21:35 - May 10, 2017

దిహెగ్ : గూఢచర్యం కేసులో పాకిస్తాన్‌ ఆర్మీ కోర్టు మరణశిక్ష విధించిన భారత నేవీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ను కాపాడేందుకు భారత్‌ అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది. నేవీ నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటున్న జాదవ్‌ను కిడ్నాప్‌ చేశారని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ కోర్టుకు భారత్‌ సోమవారం అప్పీలు చేసింది. దీంతో జాదవ్‌కు పాకిస్థాన్‌ విధించిన ఉరిశిక్షపై అంతర్జాతీయ కోర్టు స్టే విధించింది. జాదవ్‌ తరపున సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదించనున్నారు. ఈ కేసు మే 15న విచారణకు రానుంది. ఈ కేసులో భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లడం ద్వారా పాకిస్తాన్‌తో పాటు ప్రతిఒక్కరూ ఆశ్చర్యానికి గురి చేసింది. భారత్ విజ్ఞప్తిపై ఇంటర్నేషనల్‌ కోర్టు ఆఫ్‌ జస్టిస్‌ తక్షణం స్పందించడమే కాకుండా జాదవ్‌ ఉరిశిక్షపై స్టే ఇస్తూ ఆదేశించింది. దీంతో మే 19కి ముందు జాదవ్‌కు ఉరిశిక్ష ను అమలు చేయడం పాకిస్తాన్‌కు అసాధ్యంగా మారింది. కోర్టు నిర్ణయం జాదవ్‌తో పాటు భారత్‌కు కొంత ఊరటనిచ్చింది. ఇరుదేశాలు కుదుర్చుకున్న వియన్నా ఒప్పందాన్ని పాకిస్తాన్‌ ఉల్లంఘించిందన్న కారణంతో భారత్‌ అంతర్జాతీయ కోర్టుకు వెళ్లింది.

సుష్మాస్వరాజ్‌ హర్షం...
అంతర్జాతీయ కోర్టు తీర్పుపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ హర్షం వ్యక్తం చేశారు. కోర్టు నిర్ణయాన్ని కులభూషణ్‌ జాదవ్‌ తల్లికి చెప్పినట్లు ఆమె ట్వీట్‌ చేశారు.గూఢచర్యం, విద్రోహచర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో జాదవ్‌కు పాకిస్తాన్‌ ప్రభుత్వం ఇటీవల మరణశిక్ష విధించింది. గతేడాది మార్చిలో జాదవ్‌ను బలూచిస్థాన్‌లో అరెస్టు చేసినట్లు పాక్‌ చెబుతోంది. ఇరాక్‌లో వ్యాపారం చేసుకుంటున్న జాదవ్‌ను కిడ్నాప్‌ చేసి, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పాకిస్తాన్‌పై భారత్‌ మండిపడింది. జాదవ్‌కు మరణశిక్ష అమలు చేస్తే పథకం ప్రకారం చేసిన హత్యగా భావించాల్సి వస్తుందని పాకిస్థాన్‌ను హెచ్చరించింది. జాదవ్‌ గూఢచర్యానికి పాల్పడ్డట్లు తమవద్ద ఆధారాలున్నాయని పాకిస్తాన్‌ తన చర్యలను సమర్థించుకుంటోంది.

 

21:50 - April 13, 2017

ఢిల్లీ : భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్‌ ఆర్మీకోర్టు మరణ శిక్ష విధించడంపై స్పందించేందుకు ఐక్యరాజ్య సమితి నిరాకరించింది. కుల్‌భూషణ్ జాదవ్‌కు మరణ శిక్ష విధించడంపై భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కేసులో తీర్పు చెప్పే స్థితిలో తాము లేమని యుఎన్‌ఓ పేర్కొంది. భారతదేశం, పాకిస్థాన్ మధ్య సంబంధాల విషయంలో ఉభయ దేశాలు చర్చల ద్వారా శాంతియుత పరిష్కారాలను కనుగొనాలని ఐక్యరాజ్యసమితి సూచించింది. గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో పాకిస్తాన్‌ ఆర్మీ కోర్టు జాదవ్‌కు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీనిపై అప్పీలు చేసుకోవడానికి పాక్‌ 6 నెలల గడువిచ్చింది. 

 

Don't Miss

Subscribe to RSS - మరణ శిక్ష