మరుగుదొడ్డి

20:40 - April 16, 2018

సంగారెడ్డి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన మగ శిశువును బాత్‌రూంలో వదిలి వెళ్లారు. ఆసుపత్రి సిబ్బంది చూసి సూపరింటెండెంట్‌ పద్మజకు తెలిపారు. అప్పటికే శిశువు మరణించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రామచంద్రాపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

19:12 - December 17, 2017

చిత్తూరు : మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఇసుకను తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరుగుదొడ్లను నిర్మించుకోవాలని ప్రభుత్వం పేర్కొంటున్న సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మండలంలోని ఓ కుటుంబం మరుగుదొడ్డి నిర్మాణం కోసం ఇసుకను తీసుకొచ్చేందుకు వెదళ్ల చెరువుకు వెళ్లారు. జ్యోతి, కిష్టప్ప, జ్యోతిలు 50 అడుగుల లోతులో ఉన్న గొయ్యిలోకి దిగారు. ఇసుకను లోడ్ చేసిన అనంతరం ట్రాక్టర్ ను డ్రైవర్ నడిపించాడు. కానీ ట్రాక్టర్ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. మొదళ్లతో సహా చెట్టు నేల కూలడం..ఇసుక దిబ్బలు ఒక్కసారిగా కూలిపోయాయి. కింద ఉన్న వారిపై ఇసుక దిబ్బలు పడడంతో దుర్మరణం చెందారు. యదేచ్చగా ఇసుకను తరలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈఘటనపై జిల్లా అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. 

17:19 - July 8, 2016

ఇటీవలే వివాహం చేసుకుంది. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెట్టింది. కొద్దిసేపటికి నిప్పులాంటి నిజం తెలుసుకుంది. ఏదో ఊహించుకోకండి. అసలు సంగతి తెలిస్తే కరెక్టే కదా అని అనుకుంటారు. దీని గురించి తెలుసుకోవాలంటే చదవండి..

బీహార్ లోని కొత్తా గ్రామంలో నివాసం ఉండే బబ్లూ కుమార్ కు మే నెలలో ఓ మహిళతో వివాహం జరిగింది. అత్తవారింట మరుగుదొడ్డి లేకపోవడం గ్రహించింది. ఆరు బయటకు వెళ్లేందుకు ఆమె నిరాకరించింది. టాయిలెట్ నిర్మించాలని భర్తకు చెప్పింది. బబ్లూ ఆమె మాటలను పెడచెవిన పెట్టాడు. ఇంట్లో వారిని కట్టివ్వాలని కోరాలని బబ్లూ చెప్పాడంట. దీనితో ఆగ్రహానికి గురైన మహిళ గ్రామ పంచాయతీకి వెళ్లి సమస్యను వెలువరించింది. చివరకు బబ్లూకు విడాకులిచ్చేసింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఎంతో మందికి మరుగుదొడ్లు లేవని వార్తలు వస్తున్నాయి.

11:29 - June 26, 2016

స్వచ్ఛ భారత్.. కేంద్రం పలు కార్యక్రమాలు చేపడుతోంది. పలు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు పలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఈ ఆదేశాలు కొన్ని విస్తుగొల్పుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని నర్మద జిల్లాలో స్వచ్ఛ భారత్ అవగాహన కోసం టీచర్లకు పలు ఆదేశాలు అందాయంట. హాజరు సమయంలో ఎస్ టీచర్..అని కాకుండా మరుగుదొడ్డి ఉందా ? లేదా విద్యార్థులు చెప్పాల్సి ఉంటుందంట. లేదు అని ఏదైనా విద్యార్థి చెబితే ఆ టీచర్ ర్యాలీగా తీసుకుని వెళ్లాలంట. ఎక్కడ టాయిలెట్ లేదో వారికి టీచర్ అవగాహన కల్పించాలంట. ఇక రాజస్థాన్ లో..ఓ గ్రామంలో ఉన్న టీచర్లకు కెమెరాలు ఇచ్చారు. బహిరంగంగా మలవిసర్జన చేస్తుంటే ఫొటోలు తీసి వాట్సాప్ లో ఉన్నతాధికారులకు పంపించాలంట. అదండి విషయం..

Don't Miss

Subscribe to RSS - మరుగుదొడ్డి