మల్లన్నముచ్చట్లు

20:34 - July 6, 2018

చంద్రాలును చెండాడుతున్న పవనాలు..టీడీపీ అవినీతిని గల్లావట్టి అడ్గుతడంట, దేశంల మద్దతు ధరలిచ్చింది మనమే..ఏసీ రూంల సుఖేందర్ రెడ్డి అవద్దాలు, ఓట్లు నాయకులు ఏస్తున్న జనాలు..వానలకోసం దేవుని దిక్కు సూపులు, తెల్గురాష్ట్రాలను ఎక్కిరిస్తున్న వానలు..కరీఫ్ పంటలేశి కలవరపడ్తున్నరైతులు, హోంమంత్రి పర్సనల్ సెక్రేటరీ గారి కబ్జా..మందిని ముంచుతున్న ముకుందరెడ్డి, స్థానిక సంస్థల మీద కేసీఆర్ పగవట్టిండు.. పటేల్ పట్వారీ వ్యవస్థకు జీవంబోస్తుండు... ఈ అంశాలను మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

20:43 - July 4, 2018

చంద్రాలు అది నాల్కెనా తాటి మట్టనా..?..గడ్కోపారి ఫ్లెటు ఫిరాయిస్తున్నడుల్లా, ప్రజల మన్షినే అంటవ్ సెక్యూరిటెందుకు?...జగనాలు పాదయాత్ర కాకినాడ దిక్కైతుంది, ఓడ దాటినంక అమ్మగాదు బొమ్మనంట...కేటీఆర్ ఇజ్జత్ వుచ్చుకున్న అన్మంతన్న, నేరేళ్ల దళితుల గోసకు ఇయ్యాళ యాడాది...హామీలిచ్చి అవుతలవడ్డ బుడ్డ కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ లీడర్ కనరువట్టిన మాటలు..ఎన్ఎస్ఐయూ కార్యకర్తను సంపేస్తడట, మూడు ఎక్రాల భూమికి లంచాల తెగులు..శాలిగౌరారం మండలంల టీఆర్ఎస్ ఆటలు... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

22:00 - June 9, 2018

ఇఫ్తార్ దావతు మాలయ ముస్లీంలు..దశాబ్దాలుగా ముస్లింలకు మోసమే, బారాపర్సెంట్ రిజర్వేషనేదంటున్న ఉత్తం..మీరు ఎన్ని సీట్లిచ్చిండ్రయ్యా నాలుగేగా ??, నీరుగారి పోతున్నటీడీపీ నిర్మాణ దీక్షలు..బాబు ప్రసంగాన్ని ఎక్కిరిస్తున్న కుర్చీలు, జనంలకు వోలేకపోతున్న జన సమితి పార్టీ..దూకుడు వెంచకుంటే కష్టమే అంటున్నరు, ఆర్మూరు నియోజకవర్గంలో బీసీల గోస.. ఓట్లు బీసీలయి.. సీట్లు మాత్రం ఓసీలయి, తెల్గు రాష్ట్రాలను పల్కరిస్తున్న తొలకరి.. ఈసారి బాగ వానలు వడ్తయంటున్నరు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

21:39 - June 8, 2018

వెయ్యిరూపాలకు జేరిన కిల చాపలు..మృగశీర కార్తికి విపరీతంగ పెర్గిన ధరలు, అక్కెరొచ్చినప్పుడు ఆర్టీసీ గావాలె..అక్కెర దీరినంక మీరెంతాని బెదిరియ్యాలే, నవనిర్మాణ దీక్షలా విమర్శల దీక్షాలా..?...పద్దతి దప్పి మాట్లాడుతున్న లోకేశం, తూట్ల గుడిశెకు ఐదువందల ఇంటిపన్ను...బంగారు తెలంగాణల బడుగు జీవి కష్టం, ఆదివాసీల గుండెల మీద సింగరేణి బాంబు..కొమురం భీం గడ్డమీద జనం ఆర్థనాదాలు, సర్కారు భూమి పట్టజేస్కున్న వీఆర్యే..టెన్ టీవీ దెబ్బకు సస్పెండ్ జేశ్న ఎమ్మార్వో.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

20:25 - June 7, 2018

నిద్రలు బంజేశి తిర్గుతున్న బాబులు..అధికారం కోసం చంద్రాలు, జగనాలు, జగన్ పాదయాత్ర మీద తేనీగెల దాడి.. కట్ చీఫ్లకు పనిజెప్పిన సెక్యూరిటోళ్లు, పార్టీ మారబోను అంటున్న గల్ల అరుణ..మారుమని చెప్పినోళ్లు ఎవ్వలమ్మా..?, కాళేశ్వరం కాల్వకు భూములు ఇయ్యం..భూమికి భూమిస్తెనే ఒప్పుకుంటం, పోడురైతులకు రైతు బంధు ఎందుకియ్యరు?..అడ్విదేవుల పల్లి కాడ జూలకంటి ధర్నా, సిరిసిల్లల కాడ మళ్ల ఇసుక అక్రమ రవాణ.. ఆగింది ఎన్నడుల్లా మళ్ల సుర్వైతందుకు..? ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

 

20:28 - June 5, 2018

రైతు బీమా పత్కం ఎన్క కొన్ని నిజాలు..అక్కెరకొస్తదా..? జీవి దీస్తదా తెల్వదాయే, తెలంగాణ కాంగ్రెస్ల పుట్టిన రెడ్ల పంచాది..పదవుల కోసం మళ్లొక డ్రామాలెక్కుంది, పవన్ కళ్యాణ్ ఎందుకు తిడ్తుండో తెల్వది..తిట్టకపోతె మెచ్చుకుంటరా చంద్రాలు నిన్ను, ఆర్టీసీ సమ్మె అసలైన న్యాయం కోసమేనా?..టీఆర్ఎస్ సంఘం మీద కొందరి అనుమానం, అంబేద్కర్ను అవమానించిన చౌదరి గారు..అరెస్టు జేయాలని బహుజనుల డిమాండ్, ఐటీఐ సద్విండు తుపాకి తయ్యారు జేశిండు.. టెస్టు జేశిండని పోలీసోళ్లు అరెస్టు జేశిండ్రు..ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

21:00 - May 26, 2018

అవద్దాల మోడీ పాలనకు నాల్గేండ్లు పూర్తి...విజయాలు జెప్పుకుంటే పదేండ్లు వడ్తది, ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం పవన్ దీక్ష..ట్విట్టర్ల చమత్కరిస్తున్న చంద్రాలు సారు, ఖమ్మం మున్సిపాలిటీల పుట్టిన కయ్యం..ముప్పై ఆరుమంది కార్పొరేటర్ల తిర్గుబాటు, ముక్కునాలకు రాస్తాంటున్న మోత్కుపల్లి...చంద్రబాబు మీద ఫైరైన ఆశావాహ గవర్నర్, పోలీసోళ్లను జూస్తె జనం భయపడాల్నంట... హోమంత్రినాయిని నర్సన్న చమక్కులు, రైతుబంధు పథకం రోడ్డెక్కింది..రైతుల ఆందోళన, పగిలిన మిషన్ భగీరథ పైపులు, బిచ్చగాన్ని లంచం అడ్గిండట గూడి ఈవో..జగిత్యాల జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు...ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం..

 

20:54 - May 24, 2018

నాకు ఏపదవొద్దంటున్న కోమటిరెడ్డి...పదవొద్దన్నంక రాజకీయాలెందుకు..?, రెవెన్యూ రికార్డుల శుద్ది ఆగమాగం.. లక్షల రికార్డులకు కొత్త సమస్యలు, మున్సిపల్ చెర్మన్ కొడ్కును తిట్టిన జేసీ..ఎందుకో సారుకు  బీసీలంటే అంతకశి, ఊర్లపొంటి కొనసాగుతున్నదాడులు..సుట్టాలను కొట్టి సంపుతున్నజనాలు, రాజకీయ రంగుగ మారిన టీటీడీ పంచాది.. వైసీపీ, టీడీపీల నడ్మ రాజుకున్నది, సాకలోళ్లకు ఇస్తీరి మంగలోళ్లకు కత్తెర్లు.. మరి అగ్రవర్ణాల పనిముట్లేవి సారు..? ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

21:53 - May 10, 2018

అమ్మయ్య మొత్తం మీద కర్ణాటక ఎన్నికల కూతలు ఆగిపోయినయ్ ఇయ్యాళటితోని.. దేశప్రధానిని అన్న ముచ్చట మర్శిపోయి మోడీ ఓ ఇర్వైమాట్ల.. రాహుల్ గాంధో ఇర్వైమాట్ల జనం చెవ్వులళ్ల కెళ్లి రక్తాలెల్లెతట్టు లొల్లి వెట్టిండ్రు.. మొత్తం మీద ఇయ్యాళటితోని ప్రచారం కథ ఒడ్సిపోయింది.. ఇగ మిగిలింది మందు.. పైకం బంచుడే.. 

తెలంగాణ రైతులకు ఇయ్యాళటి సంది చెక్కులు ఇచ్చే కార్యం సుర్వు జేశింది తెలంగాణ ప్రభుత్వం.. ఎక్రానికి నాల్గువేల లెక్క ఇస్తున్నరు.. పదిర్వై రోజుల దాక ఇచ్చుడు కార్యం నడుస్తదట.. ఇయ్యాళ తెల్లారంగనే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కాడ బహిరంగ సభ వెట్టి శాంపిల్ కింద ఇద్దరు ముగ్గురికి చెక్కిలిచ్చి కార్యం సుర్వు జేశిండు సారు.. 

అవద్దం జెప్పినా అత్కినట్టుండాలే అంటరు.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారు మీకు గానీ మీ తబలా మద్దెలలకు గానీ.. అవద్దంగూడ సక్కగ జెప్పరాదేంది సారు..? మీరు ఏమంటున్నరు బహిరంగ సభల పొంట కోటి ఎకరాలకు నీళ్లిచ్చి తీర్తమంటున్నరు.. మరి తెలంగాణల కోటి ఎక్రాల భూమి ఉన్నదా లేదా అన్న సోయి మీ బ్యాచుకు ఎందుకు లేదు మీ అంతల మీరే బైటవెట్టిండ్రు మీ అవద్దాలను సూడుండ్రి..

ఓ కొడ్కగదరా ఇది సంసారమా గడ్డామురో.. నిన్ననే అంతగనం మొత్తుకుంటే ఇర్వైవేల మంది ఇండ్లులేని పేదల పొట్టగొట్టి ఇపరీతంగ అడ్వటైజ్ మెంట్లు ఇస్తున్నడు.. ఇంకో నాల్గొద్దులైతె తెలంగాణ రాష్ట్రాన్ని ఏడనన్నకుదవెట్టవల్సొస్తదని.. ఇగో మళ్ల ఇయ్యాళ ఎన్ని అడ్వటైజ్ మెంట్లు జూడుండ్రి.. సరే తెలంగాణలంటే డబ్బాగొట్టెంతుకు ఇచ్చిండనుకుందాం.. గా రాజస్థాన్ పత్రికకు తెలంగాణ పథకానికి ఏం సంబంధమయ్యా..? 

దిష్టిబొమ్మలు గూడ రకరకాలు తయ్యారు జేస్తున్నరుగదా..? మీరు ఆర్డరిస్తె ఎన్నడ్గుల దిష్టిబొమ్మగావాలే ఏ సైజుల గావాలే.. అని తయ్యారు జేశే సంస్థ ఉన్నట్టుంది యాడనో.. మోడీ దిష్టిబొమ్మను ప్రత్యేక హోదా పాత్రల అహూతి జేస్తందుకు కర్నూలు కాడ ఎంత పెద్ద బొమ్మగాలవెట్టిండ్రో సూడుండ్రి అక్కడి ఎమ్మెల్యే మోహన్ రెడ్డి..

రైతే రాక్షసుడు అయిపోయిండు తెలంగాణల సర్కారు దృష్టిల.. ఆ పెట్టుబడి ఇంట్ల పీనుగెళ్ల అది కల్పుగూళ్లకు గూడ సరిపోని పైకం.. దాంతోని సోకు జేస్తున్నరుగని.. అసలు రైతు బత్కాల్నంటే పండించిన పంట అమ్ముకోవాలె.. మద్దతు ధర సంపాయించుకుంటే బత్కుతడు రైతు.. అంతేనా..? అయితే పంటగొని పైకం ఇస్తలేరట అధికారులు.. వాళ్లను గుంజుకొచ్చిలోపటేశి తాళమేశిండ్రు ఒకతాన..

అందరు కార్మికుల ఐక్యత వర్దిల్లాలె అంటరు.. కని కార్మికుని కష్టాన్ని మాత్రం గుర్తించరు.. పాపం రైసు మిల్లుల పొంట పనిజేసె కార్మికులు ఓ యాళ్ల ఉండది పాళ్ల ఉండది.. ఎప్పుడువడ్తె అప్పుడే పనిజేయాలే.. ఇగ వాళ్లకు జీతాలు గూడ అంతంత మాత్రమే.. వరికోతల సీజనొస్తె వాళ్ల కష్టం వర్ణనాతీతం.. అసొంటోళ్లు మాకు గూడ మంచి జీతాలు గావాలె ఎన్నొద్దులు జేయాలే ఈ ఎట్టి కష్టమంటున్నరు.. 

నాంగు బాము నడ్ముమీద గొడ్తె దానికి దెబ్బదాకింది.. పామును సంపుదామని సూశిండు ఒకాయిన.. అదే పామును ఎట్లన్న జేశి కాపాడాలే అని ఇంకొకాయిన ఇద్దరు నడ్మ కథల.. పాము పశువైద్యశాలకు జేరింది.. మన్సులకు ఆప్రిషన్లు జేసుడే గాదు పాముకు గూడ ఆప్రీషన్ జేశి దాన్ని రక్షిస్తమని డాక్టర్ రామకోటేశ్వర్ రావు రెడీ అయ్యిండట పాండ్రి పాము ఆప్రేషన్ జూద్దాం..

20:32 - May 9, 2018

కాకుల గొట్టి గద్దలకు వెట్టినట్టే ఉన్నది రైతు బందు పత్క కథ గూడ.. ఎవ్వన్ని ఉద్దరిచ్చెతందుకు ఇస్తున్నరు సారు ఈ నాల్గు నాల్గువేల రూపాల పెట్టుబడి సాయం.. అసలైన రైతులకు మొండిచేయి.. ఎవుసం జేయనోని చేతికి చెక్కులా..? ప్రజలారా నిజంగ కేసీఆర్కు గన్క రైతుల మీద ప్రేముంటె ఏం జేయాలే ఎవ్వలైతె ఎవుసం జేస్తున్నరో వాళ్లకు ఇయ్యాలే.. అంతేనా... ఇది భూస్వాములకు దోశిపెట్టె పథకం తప్ప ఇంకోటిగాదు..

నేను రైతు బందు సాయాన్ని స్వచ్చందంగ ఒదులుకుంటున్న అని.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వర్సవెట్టి ప్రకటనలు జేస్తున్నరు.. మా త్యాగం జూడుండ్రి మా గొప్పతనం జూడుండ్రి అన్నట్టు.. అయితె రైతు బందు చెక్కులను వదులుకుంటున్నరు సరేగని.. మీ భూముల లెక్కల సంగతేంది సార్లూ..? ఒక్క సారి ఆధారాలు వట్కొచ్చిన సూపెడ్త సూడుండ్రి ఈ నాయకుల నాటకం.. 

మోడీ ఎట్ల ఆడిస్తుంటే కేసీఆర్ అట్లనే ఆడుతున్నడట.. ఢిల్లీ మోడీ.. తెలంగాణ కేడీ ఇద్దరు గల్సి ప్రతిపక్షాల నాయకులను ఇర్కులళ్ల వడేశి మళ్ల రాజకీయ పబ్బంగడ్పుకునెతందుకు ప్లాన్ ఏశిండ్రట.. ఆ ప్లాన్ల భాగమే ఏసీబీ కేసులు ముంగటేస్కున్నడని తిడ్తున్నడు కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి.. మోడీకి కేసీఆర్కు లోపట లోపట దోస్తానా ఉన్నదా ఏంది అనిపిస్తున్నది ఈసారు మాటలింటుంటే.. ఉండొచ్చు ఎవ్వలికెర్క..

పావుల పనికి బారాణ ప్రచారం.. ఇప్పటిదాక తెలంగాణ ప్రభుత్వం జనానికి ఎల్గవెట్టింది పావల మందం గూడ లేదు కని ప్రచారం మాత్రం బారాణ మందం జేస్కున్నరు.. మంది సొమ్ము మంగళారం అన్నట్టు ఏం అడ్వటైజ్ మెంట్లు అవ్వి ఏం కథ..? కేసీఆర్ సర్కారు టీవీలకు పేపర్లకు ఎంత పైకం అడ్వటైజ్ మెంట్ల కోసం ఇచ్చిందో తెల్సా... సూడుండ్రి లెక్కలు..

దయగల మొగడు తల్పులు దగ్గరేశి కొట్టినట్టు.. మోడీ, కేసీఆర్, చంద్రబాబు జనాన్ని గూడ ఈ తరీఖలనే గొడ్తున్నరు పిట్రోలు డిజీలు ముచ్చట్ల..  డెబ్బై తొమ్మిది రూపాలకు లీటరు పిట్రోలా..? వాస్తవానికి అది మనకు ఎంతకు రావాల్నో తెల్సా.. నల్పై రూపాలకు లీటరు రావాలే అటీటు.. కని మన మోడీ పన్నులు మన చంద్రుళ్ల పన్నులు గల్పి ఎన్బై రూపాలకొస్తున్నది.. 

ఈ పార్థీ గ్యాంగేడంగ మోపైందిరో.. రాత్రి పూట ఒక గ్యాంగు తిర్గుతున్నదట.. వాళ్ల చేతుల కత్తులు కటార్లు.. వాళ్లంత నరరూప రాక్షసులు లేరట.. వాళ్లకు సంపుడంటే గిచ్చినంత అల్కపనట.. జనం పాణాలు చేతుల వెట్కోని కట్టెలు చేతుల వట్కోని బత్కుతున్నరు అనంతపురం జిల్లాల.. నిన్న రాత్రి ఎంత కథ అయ్యిందో సూడుండ్రి..

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల కాడ రైతులు రోడ్డెక్కిండ్రు.. మీ ఒడ్లు గొనాల్నంటే అవ్వి మంచిగ ఎండి గలగల అనాలే అప్పుడు గొంటమని మార్కెటోడు మెల్కె వెట్టిండట.. సరే అని ఎండవోశిండ్రు జనం... అయింత వానొచ్చి ఉన్న ఒడ్లన్ని నీళ్లల్ల తడ్సిపోయినయ్.. ఇప్పుడు మేమేం జేయాలే అంటున్నరు పాపం రైతులు..

దేశం దివాల దిశగ శరవేగంగ దూస్కపోతున్నదని చెప్పెతందుకు మన రూపాయికి ఉన్న విల్వ తెల్సుకుంటె సరిపోతది ఇప్పుడు.. ఒకప్పుడు మన రూపాయికి ఇంత ఇజ్జతుంటుండే.. బైటిదేశం బోతె మనం అర్వై రూపాలిస్తె ఒక డాలరన్నొచ్చేది.. ఇప్పుడు అర్వై ఏడు రూపాలిస్తె ఒక్క డాలారొస్తున్నది.. అంటే మన రూపాయికి దినదినం ఇజ్జత్ తక్వైతున్నదన్నట్టు..

Pages

Don't Miss

Subscribe to RSS - మల్లన్నముచ్చట్లు