మల్లన్న ముచ్చట్లు

20:50 - February 14, 2018

టెన్ టీవీ దెబ్బకు దయ్యందిగినట్టుంది అశ్వారాపుపేట ఎమ్మెల్యేకు.. నీళ్ల కోసం జనం తన్లాడుతున్నరని మనం జెప్తిమిగదా..? అమ్మో జనం ఎగవడి కొట్టగాళ్ల రేపుపొద్దుగాళ్ల అని భయపడ్డట్టుండు ఎమ్మెల్యేగారు.. ఎంబడే నీళ్లు లేని

అంటెనేమో మా దేవున్ని అన్నడని ఫీలైతరుగని.. వాడు జేస్తున్న చాతలు జూస్తె మరి అనకపోతె ఆగమైతరు జనం.. బాలసాయిబాబనట.. నోట్లెకెళ్లి లింగాలు దీస్తున్నడు.. వారీ బాలసాయి.. నీకు ధమ్ముంటే లింగాలు దీసుడు గాదు.. ఒక గుమ్మడికాయ దీయి సూద్దాం.. అప్పుడు నీకు నిజంగ మహిమలున్నయని మేము గూడ ఒప్పుకుంటం..

నిన్న ముఖేష్ అంబానీ మన చంద్రాలు ఇలాకకొచ్చిండు.. అమరావతిల కనిపించని కట్టడాలు సూశి అహా.. ఎంత అద్భుతం అని కొనియాడి. ఇగ నేను బిజినెసు జేయాల్నంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే కరక్టే.. మీరు కాయిదాలు తయ్యారు జేస్కోండ్రి.. నేను కంపిండ్లు ఏస్కుంట.. ఇగ పేదల భూములు గుంజుకునుడు సుర్వు జేస్తె శుభం అని చెప్పుకొచ్చిండట..

వాస్తవానికి చంద్రబాబుకు గానీ.. జగన్ మోహన్ రెడ్డికి గానీ.. వీళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని లేదు.. కావాల్సిందే అని కొట్లాడుకునెతందుకు మాత్రమే ఈ టాపిక్ అవుసరం బడ్తున్నది.. ప్రత్యేక హోదా.. ప్రజల సెంటిమెంటు ఎటుదిక్కుంటే.. వీళ్లు అటుదిక్కు ఆటాడ్తరు.. ప్రత్యేక హోదా కాయిదాల మూట ఎన్నడో అట్కుమీదికి ఎక్కిచ్చిన మోడీ.. ఈ నాయకుల నాట్కానికి ఓ ఆర్టీస్టు మాత్రమే..

కొమిరెల్లి మల్లన్న జాతర ప్రజల కోసం అయితదో.. పోలీసోళ్ల కోసం అయితదో తెల్వది.. భక్తుల కంటె ఎక్వ ఎగవడి వాళ్లే పరేషాన్ జేస్తున్నరు.. పట్నాలు గీస్తరు గదా..? ముగ్గులు పస్పు బండారు ఏశి.. ఇగ నిన్న పొద్దుమీకంగ పెద్ద పట్నం ఏశిండ్రట.. ఆ పెద్ద పట్నం కాడికి భక్తులు ఎగవడకుంట కావలుండవల్సిన పోలీసోళ్లు ఏం జేశిండ్రో సూడుండ్రి..

నిన్ననేగాదు మనం చెప్పుకున్నది కంట్రోల్ బియ్యం కథ.? ఇగో ఇయ్యాళ ఇంకోటొచ్చింది.. నిన్ననేమో ఏలుముద్రల ఏశంగదా.? ఇయ్యాళ తక్కెడ పంచాది.. ఇర్వై నాల్గు కిలోల బియ్యం అని జోకిస్తున్నడు డీలరు.. వేరేతాన జోకితె ఇర్వై రెండు కిలోలే ఉంటున్నయ్.. మళ్ల ఆ కంట్రోలు దుక్నపాయిన ఎట్ల జోకుతున్నడు.. బాట్లతోని గాదు.. ఉశ్కె మూటలతోని..

ఓటమి అనే పదాన్ని ఇంకోమాటల జెప్పాల్నంటే.. రైతు.. జీవితంల ఎన్నడు గెల్పంటె ఎట్లుంటదో తెల్వని ఓటమిసారి ఒక్క రైతే.. దున్నెకాడ ఓడిపోతడు.. నాటేశెకాడ ఓడిపోతడు.. ఎర్వులు కొనెకాడ ఓడిపోతడు.. నీళ్ల కాడ ఓడిపోతడు.. కోతకాడ ఓటమే.. మోత కాడ ఓటమే.. ఆఖరికి అమ్ముకుందామనొచ్చిన మార్కెట్ల గూడ ఓటమే.. ఈ ఓటములకు ఇంకోటి తోడు.. అకాల వర్షాలు.. ఇగ ఎట్ల బత్కుతడు రైతు..?

ముందే శివరాత్రి జనం భక్తి ఎట్లుంటదో మీకు తెల్సిన ముచ్చట.. ఇగ ఈ భక్తిల మున్గిన జనానికి శివుని గుడిలె పాము గనిపిస్తె ఏంది పరిస్థితి..? మొగులు మీదికెళ్లి శంకరుడు దిగొచ్చినట్టు ఫీలైపోతరుగదా..? అగో అంతే పని అయ్యింది నిర్మల్ జిల్లాల.. శివరాత్రి పూజలళ్ల భక్తులుంటే.. ఒక పాము గర్భగుడిలె గనిపిచ్చింది.. ఖతం.. భక్త జనం ఊకుంటరా..?

 

19:57 - February 13, 2018

ఈ శివరాత్రి ఒక్కపొద్దుల ముచ్చట జూస్తె గమ్మతుంటది.. అంటె నిష్టూరంగని.. అసలు ఆ ఒక్కపొద్దులేంటియి..? ఆ కథ ఏంది..? ఆ అభిషేకాలేంటియి.. ఉపాసం పేరుమీద ఒకాయిన తెల్లారంగ పండ్ల పుల్లేశి.. సాయంత్రందాక తోముకుంటనే గూసుంటడు.. సరే ఇవ్వన్ని ముచ్చట్లు గాదుగని.. కుద్దు ఒక పీఠాధిపతే జెప్తున్నడు మీరు అసలైన శివరాత్రి జేస్కుంటలేరని.. గాయిన మాటలన్న ఇనుండ్రి జర..

రెండువేల పందొమ్మిది అసెంబ్లీ ఎన్నికలళ్ల.. కాంగ్రెస్ పార్టీ తర్పున పోటీ జేశెటోళ్లది అర్వైమంది లిస్టు ఇడ్దల జేశిండ్రని సోషల్ మీడియాల రెండు పత్రాలు సంచారం జేస్తున్నది.. సరే అది ఎవ్వడు జేశింది ఏం కథ అనేది తర్వాతగని.. ఆ చేశే చెడ్పుపనిగూడ సక్కగ జేయరాకపాయే.. సచ్చినోనికి గూడ టికెట్టు ఇచ్చేశిండ్రంటే.. వారీ అవద్దంగూడ సరిగ సర్క్యూలేట్ జేయరాకపోతె ఎట్లరా నీకు అంటున్నడు పొంగులేటి..

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిగారు.. ఇంతకు మీరు కన్ఫ్యూజన్ల ఉన్నరా..? లేకపోతె జనమే కన్ఫ్యూజన్లున్నరా అర్థమైతలేదు.. ఒకసారి నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం కెళ్లి ఎమ్మెల్యేగ పోటీ జేస్తాని నీ టికెట్ నువ్వే ప్రకటించుకుంటవ్.. మళ్లొకపారి.. ఈసారి నల్లగొండ పార్లమెంట్ స్థానంల పోటీ జేయవోతున్న అంటవ్..? వారంరోజులళ్లనే ఇంత కన్ఫ్యూజన్లుంటే.. ఏందన్నట్టు..?

తవురో రామన్న.. పేదోళ్ల ఉసురు దల్గి.. పోతవురో రామన్న.. మా బిడ్డల ఉసురు తలిగి.. పశిగుడ్డుల ఉసురుతలిగి.. పేదోళ్ల పొట్టగొట్టినోడు ఎవ్వడు పొడ్గుగాడు.. పుర్గులవడి సచ్చిపోతడు.. ఈ ముచ్చట బోజగుట్ట పేదల ఎంటవడ్డ దొంగ సర్కారు నాయకులదన్నట్టు.. పాపం నిండు గర్భిణి అని గూడ సూడకుంట నూకేశి ఇల్లు గూలగొట్టిండ్రంటే.. ఇంత దుర్మార్ఘమా..?

మీకెందుకు మీ పాతిండ్లన్ని కూలగొట్టుండ్రి.. తెల్లారే ముగ్గువోశి అద్భుతమైన.. ప్రపంచం నివ్వెర పోయే డబుల్ బెడ్రూం ఇండ్లు గట్టిస్తమని పాపం దళితుల ఇండ్లను కూలగొట్టిచ్చిండ్రు.. మన బంగారు తెలంగాణ సర్కారోళ్లు.. చెర్లున్నోన్ని బాయిలేశినట్టు.. పాపం పాతిండ్లళ్ల బత్కుతున్న జనాన్ని రోడ్ల మీదేశి.. పత్తలేకుంట వారిపోయిండ్రు..

బహుజనుల వీరుడు.. మారోజు వీరన్నకు జన్మనిచ్చిన జాతి అది.. తెలంగాణ కోసం రాజీలేని పోరాటం జేశిన జయశంకర్ సారుకు జన్మనిచ్చిన కులం అది.. మలిదశ ఉద్యమంల తొలి ఆత్మార్పణ జేశిన శ్రీకాంత చారిని కన్న జాతి అది.. ఎప్పుడు త్యాగాలకే పరిమిత మైన విశ్వబ్రాహ్మణ బిడ్డలు.. ఇప్పుడు ఒక్కటైతున్నరు.. త్యాగాలు మాయి బోగాలు మీయా అని ప్రశ్నిస్తున్నరు..

నీయక లేని ఇకమాతుల వడ్తున్నది ఈ తెలంగాణ సర్కారు.. ఇచ్చేదే ఒక్కటి రెండు సర్కులంటే.. అవ్విటికి మళ్ల ఏలుముద్రలు వెట్టాల్నంట.. రాషను దుక్నంల కథ జెప్తున్ననమ్మా..? పాపం కూలినాలి బంజేస్కోని తిర్గుతున్నం.. మా ముద్రలు కలుస్తలేవని బియ్యమిస్తలేరు అని జనం బాధపడ్తున్నరు.. సూడుండ్రి వాళ్ల గోస..

నిజాంబాదు జిల్లా నవీపేట మండలం జనాన్ని కొన్నిరోజుల సంది చుచ్చువోపిస్తున్న చిర్తపులి మొత్తం మీద జీవిడ్సింది.. గొర్లను మ్యాకలను.. సంపుకుంట సంచరిస్తున్నఈ పులి జెయ్యంగ జనం పాణాలు చేతుల వట్కోని బత్కిండ్రు.. ఎప్పుడు ఊర్లెకొస్తదో ఏం జేస్తదో అని భయపడ్డరు.. మొత్తం మీద మరి ఏబండి తాకిందో జీవిడ్సింది..

20:02 - February 9, 2018
20:17 - February 8, 2018
20:19 - February 2, 2018
20:32 - January 27, 2018

'మల్లన్న ముచ్చట్లు' టెన్ టివి కార్యక్రమంలో ప్రసారమవుతూ వస్తోంది. ప్రజల కష్టాలు..వారి బాధలు..వారి సమస్యలను బాహ్య ప్రపంచానికి తెలియచెప్పే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా బడుగు..బలహీన వర్గాలకు జరిగే అన్యాయాన్ని టెన్ టివి ఎలుగెత్తి చాటెత్తుతోంది. అందులో ప్రధానంగా 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో ఎన్నో సమస్యలను 'మల్లన్న' వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడా రాజీ పడకుండా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై ప్రజల అభిప్రాయం తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. మరి ప్రజలు ఏమి చెప్పారు ? తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:59 - January 19, 2018
20:17 - January 18, 2018

అత్యంత విశ్వనీస సమాచారం మనకు తెల్సిపోయింది.. కోదండరాం సారు కొత్త పార్టీ వెడ్తున్నడా..? లేదా..? ఏ గాయినెందుకు వెడ్తడు..? ఆయనకు రాజకీయమంటెనే ఇష్టంలేదని కొందరు.. ప్రశ్నించుడు కాడనే ఉంటడు సారు.. పరిపాలనదాక వోడు అని కొందరు.. ఇట్ల ఎవ్వలి మాట వాళ్లు మాట్లాడుకుంటున్నరు.. కని మనం జేఏసీల కీలకమైన నేతతోని మాట్లాడినం.. సారు పార్టీ వెడ్తున్నడా లేదా సూడుండ్రిగ..

అబ్బా ఎన్టీరామారావు సారు స్వర్గానికి వొయ్యి ఇర్వై రెండేండ్లైందిగని.. ఆయన ఆత్మకు శాంతి ఎట్లగల్గుతదని.. అటు నందమూరి ఫ్యామిలీ పరందామయ్యలు కనుక్కోలేకపోయిండ్రు.. ఆయన ప్రియమైన అల్లుడు చంద్రాలు గూడ తెల్సుకోలేకపోయిండ్రు.. కాబోయే కళల గవర్నర్.. గౌరవ శ్రీ మోత్కుపల్లి నర్సింహులు గారు మాత్రమే రామారావు ఆత్మకు శాంతి మార్గం గనిపెట్టిండు..

మనుండంగ మంచినీళ్లు వొయ్యనోళ్లు.. సావుకు మాత్రం ముందుగాళ్ల నిలవడ్డరట.. ఎన్టీరామారావు ముచ్చట్ల నందమూరి ఫ్యామిలీ డ్రామాలు జూస్తుంటె అట్లనే అనిపిస్తున్నది.. ఒకల్ని వట్టక ఒకలు ఎగవడి ఎగవడి పూలు జల్లి సమాధికి సన్మానాలు జేస్తున్నరు.. పాపం ఎన్టీరామారావు సారు ఎంత గోసెళ్ల వోశిండు.. ఆఖరికి గడియలళ్ల.. ఆయనను గోసవెట్టినోళ్లే ఇయ్యాళ ఆనందబాష్పాలు గార్చి.. బైటగూడ నటిస్తున్నరు..

అడుక్క తినెటోనికి హక్కులెందుకు చెప్పుండ్రి..? వానికి హక్కులు ఉంటేంది...? లేకుంటేంది..? వాని బత్కే అడుక్కతినుడాయే.. ఇంత పెద్ద మాట ఎందుకంటె..? చేతులు గాలినంక ఆకులు వట్కున్నట్టు.. సింగరేణి కార్మికులు ఇప్పుడు లొల్లికి దిగుతున్నరు.ఎన్నిలప్పుడు మాకిచ్చిన హామీలు నెరవేర్చుతాన్నముఖ్యమంత్రిగారు ఏమాయే అంటున్నరు.. ఈ సోయి ఎన్నికలప్పుడే ఉంటే ఎంత బాగుండే..?అనేది ముచ్చట..?
సకల జనుల సమగ్ర కుటుంబ సర్వేలెక్క.. సకల నేరస్తుల సర్వే జేపిస్తడట తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిగారు.. ఆ దొంగలకు జియో ట్యాగింగు వెట్టి.. వాళ్లు ఏడ తిర్గుతున్నరు..? ఏం జేస్తున్నరు..? అనేది ఎప్పటికప్పుడు తెల్సుకుంటరట.. తెల్సుకోవాల్సిందే నేరాల నివారణ కోసంగని.. మరి డీజీపీ గారు మేము గూడ కొన్ని సూచనలు జేస్తం పనికొస్తె పరిగణలోకి దీస్కోండ్రి..

ఏ ప్రభుత్వ అధికారన్న లంచం అడ్గితె చెప్పుతోని గొట్టుమని తెలంగాణ ముఖ్యమంత్రి జెప్పిండుగదా..? అది అమలైతున్నదో లేదో తెల్వదిగని.. నేను మాత్రం ఒక్క ముచ్చట జెప్తున్న..ఎవ్వడన్న మీడియా పేరు జెప్పి.. డబ్బులు అడ్గిండే అనుకో ఆడనే తోలు చెప్పుదీస్కోని కొట్టుండ్రి.. ఏంగాదు..? మీ అక్రమాలు బైటవెట్టొద్దంటే మాకు పైసలియ్యాలే అంటరా..? ఇదేనా జర్నలిజం అంటే..?

మొన్న మరదలిని ఇద్దరు బావలు గల్చి బొర్లిచ్చి కొట్టిండ్రు.. ఇయ్యాళ తిరుపతి దిక్కు సాటి మహిళ అని సూడకుంట.. పెయ్యిమీది బట్టలన్ని గుంజేశి.. నడి బాజట్ల గొట్టిండ్రంటే.. అయ్యో ఎంతైనా మన అసొంటి మహిళనే గదా... బరివాతల జేశి కొడ్తె ఇజ్జత్ మానం బోతదన్న శిగ్గుండొద్దా..? మన్సుల వాళ్లు పశువులా మీరే జెప్పాలె ఇగ..

యావత్ క్రికెట్ అభిమానులారా..? దక్షిణాఫ్రికాతోని కిర్ కెట్ మ్యాచ్ ఆడుతున్న ఇండియా పోరగాళ్ల ఆట సరిగలేదుగదా..? పొయ్యినోడు పొయ్యినట్టే ఔటైతున్నడు వస్తున్నడు.. ఇండియా ఇజ్జత్ కచ్రా జేశిండ్రు అని బాధపడ్తున్నరా..? ఇద్వర్ సంది ఇగ మీకు అసొంటి బాధలుండయ్.. నల్గురు ఆణిముత్యాలసొంటి క్రికెట్ ఆటగాళ్లు మన హైద్రావాద్ ఎల్బీస్టేడియంల కసరత్తు జేస్తున్నరు పాండ్రి పరిచయం జేస్త..

20:35 - January 16, 2018

రెండువేల ఇర్వై ఆరు దాక తెలంగాణ, ఆంధ్రల నియోజకవర్గాల పెంపు ముచ్చటనే ఉండది అని మొన్నటిదాక కేంద్రమోళ్లు మొత్తుకున్నరు.. ఈడ రాష్ట్రాధిపతులు మాత్రం.. పెంపు ఖాయం.. త్వరలో పెంపు అని చెరికల కార్యాన్ని సజావుగ నడ్పుకున్నరు... ఇంతకు అసెంబ్లీ నియోజకవర్గాలు పెర్గుతయా.. లేదా.?. ఇయ్యాళ బీజేపీ మన్సుల ఏమున్నది..? ఒక్కపారి జూద్దాం..

ఒక ముచ్చట రైతులను చాల కన్ఫ్యూజ్ జేస్తున్నది.. తెలంగాణ సర్కారేమో.. మార్చి పదకొండు తారీఖు సంది రైతులకు కొత్త పాసుపుస్తకాలిస్తమంటున్నది.. ఇచ్చుడు అయ్యేపనేనా..? అనేది అనుమానం.. ఎందుకంటె సర్కారు పాత పాస్ బుక్కులను రద్దు జేశి కొత్తయి ఇస్తమంటే బ్యాంకులు ఒప్పుకుంటయా..? బ్యాంకులకు పాసుబుక్కులకు సంబంధం ఏందో సూడుండ్రి ముందు..

మోసం, దగా, కుట్ర, నయవంచనా.. అవినీతి.. అక్రమాలు.. ఇన్నిగల్పితె తెలంగాణ సర్కారట.. అవినీతి అనే పదాన్ని అద్దంముంగట వెడ్తె..అండ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం గనిపిస్తదట.. అంత ఆగమున్నదట తెలంగాణల పరిపాలన.. రైతులు మోసపోయిండ్రు, నిరుద్యోగులు మోసపోయిండ్రు.. డ్వాక్రా మహిళలు మోసపోయిండ్రు.. లాభపడ్డది ఒక్క కేసీఆర్ ఫ్యామిలేనట..

మింగ మెత్కులేదు మీసాలకు సంపెంగ నూనే అన్నట్టు.. మన తెలంగాణ ప్రభుత్వం ఏతులెట్లుంటయ్.?? ఓ మొగులు మీదికెళ్లి తెప్పలు దించి.. చెర్లు నింపుతున్నట్టు ముచ్చట్లు జెప్తరు.. తెప్పలుండయ్ లొట్టపీసుండది.. అన్ని ఏతులే.. ఎందుకోమరి ఈ తీర్గ పొంకనాలు గొడ్తది.. తాగెనీళ్లు లేని తండాలు గూడాలను జూశినంక గూడ మనమే నంబర్ వన్ అంటే.. నవ్వాల్నా ఏడ్వాల్నా సార్లూ..

ఏదివా ఓ బాతాల మోడీ..? అచ్చే దిన్ అచ్చేదిన్ అంటివి.. నీ అచ్చెదిన్ నోట్లు దుబ్బ.. సచ్చెదినమొచ్చింది జనం.. ఉప్పునిర్పకాయ ఇడ్సిపెట్టకపోతివి.. గాసం ధరలు వెర్గే.. పిట్రోల్, డీజీల్ ధరలు.. దేశం బుట్టిన సంది ఇప్పటిదాక ఇంత రికార్డు స్థాయిల వెర్గుడేనా అచ్చేదిన్ అంటే..? బొంబాయి దిక్కు అటీటు ఎన్బై రూపాలకు లీటరు పిట్రోలా..? బత్కాల్నా జనం సావాల్నా అయ్యా నీ ఉద్దార్కానికి..

జనవరి నెల వడ్డదంటే సాలూ.. ఇగ ఊర్లపొంటి జాతర్లు సుర్వైనట్టే.. మల్లన్న జాతర.. పోశమ్మ జాతర.. ఐలేని జాతర.. ఇవ్విటికి తోడు రెండేండ్ల కోపారొచ్చె సమ్మక్క సారక్క జాతర.. అటు నాగోబా జాతర.. తెలంగాణ అంతట ఇది జాతర్ల గడియలన్కోరాదుండ్రి.. ఆదిలాబాద్ జిల్లా కెళ్లి వరంగల్ జిల్లాదాక ఏడేడ ఏం జాతరైతున్నది కలెదిర్గొద్దాం పాండ్రి..

నెల్లూరు జిల్లాల ఒక పండుగ గమ్మతున్నది.. సంకురాత్రి పండుగలనే భాగమైనప్పటికీ.. అది జర్రంత వెరైటీగనిపిస్తున్నది..అంటె తెలంగాణల ముఖ్యమంత్రి హైద్రావాదుల దీవులనాడు అయితది ఇసొంటిదే.. సేమ్ అట్లాంటిదే నెల్లూరు కాడ సంకురాత్రి నాడైంది.. సమాధులళ్ల గూసోని తినె పండుగను జూశిండ్రా మీరెన్నడన్న సూపెడ్త రాండ్రి..

 

20:09 - January 13, 2018

తెల్గు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ రథ సారధుల కథ గమ్మతున్నది.. ఆంధ్ర పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి.. తెలంగాణ హ్యాండ్ బాస్.. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మీద పెద్దపెద్ద బ్రేకింగ్ ప్లేట్లేశి వార్తలేశిండ్రు ఏంది దీని మత్లావు..? కోడి పందాలు.. ఈ ముచ్చట లేకుంటే ఆంధ్రల సంకురాత్రి పండుగనే ఉండది.. ఈ తెలంగాణ రాష్ట్రంల ప్రజలది గాని సంపద ఏదున్నా అది ప్రభుత్వానిదే అంతేనా..? భూములైనా.? సిరిసిల్లా దిక్కు నిన్న మబ్బుల సందే సుర్వైనట్టుందిగదా..? సంకురాత్రి.. నందమూరి బాలికాకయ్య ఇగ ఊకోకపోయినవే.. నీ సీన్మలు సల్లగుండ..మన్సులను వోలిన మన్సులు ఏడ్గురుంటరంటరు.. ఆ ఏడుగుర్ని ఎవ్వడు సూడవొయ్యిండో ఏమో నాకు తెల్వదిగని..కోళ్లకు కోపమొస్తె.. ఎట్లుంటదో ఆంధ్రల ఒకతాన సూపెట్టింది.

Pages

Don't Miss

Subscribe to RSS - మల్లన్న ముచ్చట్లు