మల్లన్న సాగర్

17:33 - October 17, 2017

సంగారెడ్డి : మల్లన్నసాగర్‌ ముంపు గ్రామం వేముల ఘాట్‌లో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు చేపడుతున్న రిలే నిరాహారదీక్షలు నేటికి 500 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రొ. కోదండరాంలు పాల్గొన్నారు. ప్రజలకు అండగా ఉండి... చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని, మల్లన్నల సాగర్ ప్రాజెక్టులో నీళ్లు ఇస్తామంటే అడ్డుకుంటున్నారంటూ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని కోదండరాం విమర్శించారు. వాస్తవానికి నీళ్లు ఎవరూ వద్దనడం లేదని..సరియైన పద్ధతిలో నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. 

19:22 - February 2, 2017

హైదరాబాద్ : సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడు గంటల పాటు కొనసాగిన సమావేశంలో బడ్జెట్ రూపకల్పనతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా పలు ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

  • కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద 7800 కోట్లతో గంధమల్ల, మల్లన్న సాగర్, కొండపాక, బస్వాపూర్ ప్రాజెక్టు లకు రివైజ్డ్ అనుమతులు.
  • దేవాదుల లిప్ట్‌ ఇరిగేషన్‌ సామర్థ్యాన్ని 38 టీఎంసీల నుంచి 60 టీఎంసీలకు పెంచడం. దేవాదుల కింద వరంగల్‌ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం మల్కాపూర్‌లో 10 టిఎంసిలతో ఓ రిజర్వాయర్‌ నిర్మాణానికి ఆమోదం.
  • తుపాకులగూడెం వద్ద 2 వేల 121 కోట్లతో బ్యారేజీ నిర్మాణానికి ఆమోదం
  • 2487 లాంగ్వేజ్ పండిట్స్‌ను 1047 పిఈటిలను స్కూల్ అసిస్టెంట్స్‌గా అప్ గ్రేడ్.
  • 25 పిహెచ్‌సిలలో 60 ఖాళీ పోస్టుల భర్తికి గ్రీన్ సిగ్నల్.
  • మహబూబ్‌నగర మెడికల్ కళాశాలలో 260 పోస్టుల భర్తికి కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్.
  • రామప్ప రిజర్వాయర్‌కు 1120 కోట్లు కేటాయింపు.
  • మిషన్ భగీరథలో 4800 పోస్టుల భర్తీకి కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్.
  • సబ్ ప్లాన్ అంశం, బడ్జెట్ రూపకల్పన, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, నీతి అయోగ్ ప్రతిపాదనల పై ప్రధానంగా చర్చించారు.
19:38 - January 11, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల పాలకులు.. ప్రాజెక్టుల పేరిట భూములను బలవంతంగా లాగేసుకుంటున్నాయి. మల్లన్నసాగర్‌ నుంచి నిమ్జ్‌వరకు, భోగాపురం నుంచి బందరు పోర్టు వరకు.. రైతుల పొట్టకొడుతూ వారి ఇళ్లూ, ఊళ్లూ ఖాళీ చేయిస్తున్నాయి. రోడ్డున పడ్డ రైతుల వేదన అరణ్య రోదనే అవుతోంది. ప్రత్యేక ఆర్థికమండళ్లు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు.. ఇలా పేరేదైనా.. అన్నదాతలే నిర్వాసితులవుతున్నారు.

మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కోసం బలవంతపు భూసేకరణ

ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తాను అనుకున్న పంథాలోనే ముందుకు సాగుతోంది. మల్లన్నసాగర్‌ కానీ, నిమ్జ్‌ కానీ ప్రాజెక్టు ఏదైనా రైతుల భూములను బలవంతంగా లాక్కుంటోంది. సిద్ధిపేట జిల్లాలో చేపట్టిన మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుకు భూసేకరణ చేస్తున్న తీరుపై సాగునీటి నిపుణులు, ప్రతిపక్షాలు ఆక్షేపణ చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం.. ఏదో ఓ రకంగా రైతుల భూములను లాక్కోవాలని చూస్తోంది. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కోసం 14 గ్రామాలకు చెందిన 16వేల ఎకరాలను సమీకరించాలని నిర్ణయించింది. అయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా, జీవో ద్వారా భూములు లాక్కోవాలని చూసింది కేసీఆర్‌ సర్కారు. నిర్వాసితులు ఏకమై హైకోర్టు గడప తొక్కారు. కేసు విచారించిన న్యాయస్థానం.. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూసేకరణ చేపట్టాలని తెలంగాణ సర్కార్‌కు మొట్టికాయలు వేసింది. దీంతో కాస్త వెనక్కి తగ్గినట్లే తగ్గి.. ఇప్పుడు తన ఆలోచనలకు చట్టరూపాన్నిచ్చే ప్రయత్నం చేస్తోంది కేసీఆర్‌ సర్కారు.

2013 చట్టాన్ని అమలు చేయాలంటున్న భూ నిర్వాసితులు....

భూసేకరణ చట్టానికి చేసిన సవరణలను ఉపసంహరించుకుని... 2013 చట్టాన్ని అమలు చేయాలని భూ నిర్వాసితులు కోరుతున్నారు. వేములఘాట్‌ వంటి గ్రామాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా గత 220 రోజులుగా ఇంకా రైతుల దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక సంగారెడ్డి జిల్లాలో నేషనల్‌ ఇన్వెస్టిమెంట్‌ మాన్యూఫాక్చరింగ్‌ జోన్‌ పేరిట వేల ఎకరాల భూసేకరణ యధేచ్చగా సాగుతోంది. రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. స్థానికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనబాట పట్టారు. వారిని పోలీస్‌లతో బెదిరిస్తూ భూములను లాక్కునేందుకే ప్రభుత్వం డిసైడ్‌ అయ్యింది. ఇక్కడ మార్కెట్‌ రేటుకు.. ప్రభుత్వం ఇచ్చిన ధరకు మధ్య సుమారు పదహారు వందల కోట్ల రూపాయల మేర అంతరం ఉంది. అంటే ఆమేరకు రైతులు, స్థానికులు నష్టపోయారని భూనిర్వాసితుల సంఘాలు చెబుతున్నాయి.

ఏపీలోనూ బలవంతపు భూసేకరణ

అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ ప్రభుత్వం రైతుల నుంచి బలవంతపు భూసేకరణకు పాల్పడుతోంది. విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతంలో విమానాశ్రయం కోసం 5వేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విమానాశ్రయం పేరుతో పెద్దపెద్ద సంపన్నులకు తమ భూములు అప్పగించేందుకు ప్రభుత్వం పూనుకుంటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను సైతం స్థానికులు అడ్డుకున్నారు. తమ భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. బందరు పోర్టుకు భూసేకరణ అంశమూ వివాదాస్పందంగానే ఉంది.

. ఇలా ప్రభుత్వాలు బలవంతపు భూసేకరణకు దిగుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

12:19 - January 5, 2017

హైదరాబాద్ : 123 జీవోతో భూసేకరణపై హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ జారీ చేసింది. ఈ అంశంపై మల్లన్న సాగర్ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పు పట్ల మల్లన్న ప్రాంత వాసి..ఉద్యమ కారుడు అయిన హయత్ మాట్లాడుతు..తమకు అండగా వున్న 10టీవీకి ధన్యవాదాలు తెలిపారు. తన సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి తమకు నిరంతరం అండగా వున్నవారందరికీ ఈ సందర్భంగా హయత్ ధన్యవాదాలు తెలిపారు. భూమి కోసం న్యాయబద్దంగా పోరాడిన తమకు న్యాయం జరిగిందనీ..ఈ విషయంలో ఇప్పటికైనా సీఎం తన వైఖరి మార్చుకోవాల్సిన అవుసరముందని హయత్ పేర్కొన్నారు. 

21:46 - November 3, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులకు ఈ నెలాఖరులోగా టెండర్లు పిలవాలని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులకు ఆదేశించారు. ఈ నెల 10న మల్లన్నసాగర్ పై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. ఇక చారిత్రక కాళేశ్వరం ప్రాజెక్టును ఏడాదిలోపు పూర్తి చేసి ఆసియాలోనే సరికొత్త రికార్డు నమోదు చేసుకోవాలని సూచించారు.

జలసౌధలో నీటి ప్రాజెక్టులపై మంత్రి హరీష్‌రావు సమీక్షా సమావేశం
జల సౌధలో తెలంగాణ నీటి ప్రాజెక్టులపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 2017 డిసెంబర్ కల్లా గోదావరి జలాలు తెలంగాణ పొలాలకు తరలించవలసి ఉందన్నారు. ఇందుకోసం ఇరిగేషన్, రెవిన్యూ, అటవీ, విద్యుత్‌, గనులకు సంబంధించిన ప్రభుత్వ శాఖలు, కాంట్రాక్టు సంస్థలు సమన్వయంతో సమష్టిగా పనిచేసి గడువులోగా పనులు పూర్తిచేయాలని మంత్రి సూచించారు. భూసేకరణ పనులను మరింత వేగవంతం చేసి ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగేలా చూడాలని ఆయన కోరారు.

వారంలో అన్నారం పంపు హౌస్‌ పనులు ప్రారంభించాలని ఆదేశించిన మంత్రి
మేడిగడ్డ బ్యారేజీ పనుల టెండర్లు రెండు వారాల్లో ప్రారంభించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. అన్నారం, సందిళ్ళ బ్యారేజీల పనులు నవంబర్ 15న ప్రారంభించాలని ఆదేశించారు. ఈ మూడు బ్యారేజీలతో పాటు పంప్ హౌజ్ ల పనులను కూడా ఏక కాలంలో, సమీకృతంగా చేపట్టాలని హరీశ్ రావు సూచించారు. అయితే కన్నెపల్లి పండ్ హౌజ్ పనులు ప్రారంభించేందుకు, కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైనట్టు ఇరిగేషన్ అధికారులు మంత్రికి తెలిపారు. మరో వారంలో అన్నారం పంపు హౌజ్‌ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సుందిళ్ళ పనులకు నవంబర్ 15 డెడ్ లైన్‌గా మంత్రి ఖరారు చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో... అధికారులు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని, అపుడే తెలంగాణలో ప్రాజెక్టుల కల సాకారమవుతుందని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు అన్నారు. 

15:15 - October 19, 2016

మెదక్ : మల్లన్న సాగర్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గతకొన్ని నెలలుగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం అంశంలో ఆ పరిసర ప్రాంతంలోని గ్రామస్థులకు ప్రభుత్వానికి మధ్య భూసేకరణ విషయంలో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజా మల్లన్న సాగర్ ముంపు గ్రామంలో ఒకటైన వేములఘాట్ లో ఉద్రిక్తత నెలకొంది. ఆ ప్రాంతంలో భూములను సర్వే చేసేందుకు వెళ్లిన తహశీల్దార్ , నీటిపారుదల శాఖ ఏఈని గ్రామస్థులు అడ్డుకున్నారు. కేసు కోర్టు కొనసాగుతుండగా సర్వే చేయటంతో అధికారులను అడ్డుకున్నారు. దాదాపు 135 రోజులుగా నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాగానీ ఏ అధికారలు వచ్చి సమస్యలను విచారించని నేపథ్యంలో తాజాగా తహశీల్దార్ దేశీనాయక్ వచ్చి సర్వే చేపటంపై గ్రామస్థులు మండిపడుతున్నారు. అనంతరం అధికారులను గ్రామస్థులంతా మూకుమ్మడిగా అడ్డుకుంటున్నారు. దీంతో గ్రామస్థులకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. కాగా కేసు కోర్టులో కొనసాగతుండగా తహశీల్దార్ పై తాము కోర్టుకు వెళతామని గ్రామస్థులు పేర్కొంటున్నారు. కాగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి చేస్తున్న భూసేకరణ విషయంలో గ్రామస్థులకు జరుగునతున్న అన్యాయాన్ని ఖండిస్తు సీపీఎం పార్టీ గ్రామస్థులకు అండగా వున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలుపార్టీలు, మేధావులు, ప్రజాసంఘాలు గ్రామస్థులకు అండగా నిలబడి అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేసారు. 

21:51 - September 21, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్‌ నిర్వాసితుల సమస్యలపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రాజెక్ట్‌ వల్ల భూములు నష్టపోతున్న కుల, చేతి వృత్తుల వారికి పునరావాసంపై స్పష్టత ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం తరపున ఏజీ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. పునరావాసం విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌పై గురువారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. దసరా తర్వాత తీర్పును వెలువరించనున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. 

21:20 - September 14, 2016

ఢిల్లీ : మల్లన్నసాగర్‌ భూసేకరణలో ప్రభుత్వం 123 జీవోతో అక్రమంగా భూ సేకరణ చేస్తోందన్నారు టి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. మల్లన్నసాగర్‌ అక్రమ భూసేకరణ, అక్కడి రైతులపై కొనసాగుతున్న నిర్భంద కాండపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి టి కాంగ్రెస్‌ నేతల బృందం కలిసి ఫిర్యాదు చేసింది. రాష్ట్రపతిని కలిసిన బృందంలో భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీ, దామోదర్‌ రాజనర్సింహ తదితరులు ఉన్నారు. పార్లమెంట్‌ చేసిన 2013 భూ సేకరణ చట్టాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం ఉల్లంఘించి 123 జీవోతో రైతుల భూముల్ని లాక్కొంటుందని రాష్ట్రపతికి వివరించామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 

19:21 - September 14, 2016
17:33 - September 12, 2016

కరీంనగర్ / మెదక్ : సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఎవరు అడ్డువచ్చినా వాటిని కట్టితీరుతామని మంత్రి హరీశ్ రావు అన్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రాజెక్టులను నిర్మిస్తుంటే మరోపక్క కాంగ్రెస్ పార్టీ రాద్దాంతం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

మల్లన్న సాగర్..వంద రోజులు...
మెదక్ : మల్లన్నసాగర్‌ ముంపు గ్రామంలో రిలే నిరాహార దీక్షలు వంద రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా గజ్వేల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సుకు ముంపు గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో కదిలారు. నల్ల చొక్కాలు ధరించి.. నిరసన ర్యాలీతో గజ్వేల్‌లకు బయలుదేరారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - మల్లన్న సాగర్